అలుగకు....క, కా, కి, కీ, కు, కూ:-)

చాలించు నీవింక అలు, పగలేరేయిగా కానీయ""

ఎందుకింత నీకు అలుకా, చెంతలేనని నేను కిను"కా"

కునుకు రానీయి కంటికి, అలుక సరిపడదు ఒంటి"కి"

వీడను నిన్ను ముమ్మాటికీ, నీవే నా చెలి జన్మజన్మల"కీ"

చెలియా! నాపై అలుగకు, నవ్వుని దూరం చేయ"కు"

నా మది తెలుసు నీకూ, అయినా అలిగావెందు"కూ"

నీవలిగితే నేను(పదాలే కరువైనట్లు భావించాలి) "క్రు","క్రూ"

అలుకమాని సొంతముకావే నాకె, వెన్నెలవిరయు నీనవ్వు"కె"

యుగమైగడిచె నీ క్షణం అలుకకే, నీవింక అలుగ"కే"

వేచి ఉంటా నీ ప్రేమకై, ఎదురు చూస్తున్నా ప్రేమతో నీ"కై"

నన్ను నీ కంటిపాపలా కాచుకొ, నామనసున నీవే చూసు"కొ"

అలిగి నీవలుసెందుకో, నీడైనా నిన్ను వీడిపొతుంది తెలుసు"కో"

అలుగక కౌగిలిలో గిలి నాకిస్తే మిగిలేది "కౌ"

అది నా మదిని మీటెడి తీయని తమ"కం"

పదమొకటి చెప్పవే దాని ఆది-అంత్యము "కః"

39 comments:

  1. అద్భుతం పద్మా...

    ReplyDelete
  2. అయ్య బాబోయ్ గుణింతాలతో కూడా కవిత్వమా బావుందండీ...బొమ్మ కూడా చాలా అమాయకంగా అందంగా ఉంది పద్మార్పిత గారూ...

    ReplyDelete
  3. బాగుందండీ క గుణింతంతో అలుక కవిత్వం.

    ReplyDelete
  4. My eyes are filled with tears....

    oh!..Padma, really you are greate!!

    ReplyDelete
  5. hey padma chaal chaala bagundi

    ReplyDelete
  6. మంచిప్రయత్నం బాగుందండీ.. :-)

    ReplyDelete
  7. క భాషలో కవిత్వం.. అదుర్స్. :)

    ReplyDelete
  8. @జ్యోతిగారు...అద్భుతం అన్న ప్రసంశతో నా మది కోలాహలం, థ్యాంక్యూ!
    @జ్యోతిర్మయిగారు....కవితకు కాదేదీ అనర్హం...నచ్చినందుకు ధన్యవాదాలు.
    @కృష్ణప్రియగారు....చప్పట్లు వినసొంపుగా ఉన్నాయి...వందనాలు!
    @బులుసు సుబ్రహ్మణ్యం.....మెచ్చినందుకు నెనర్లు.
    @తృష్ణగారు...Its my pleasure, Thank Q!

    ReplyDelete
  9. @ సత్యగారు....I think tears may be with happiness:-) thanks a lot!

    @ కెక్యూబ్ వర్మగారు....________ thanks for claps:-)

    @ శృతిగారు...Thank you very much!

    ReplyDelete
  10. @ వేణూ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు...
    @ గిరీష్ గారు... కవిత్వం అదుర్స్ అన్నమీకు నా థ్యాంక్స్ థ్యాంక్స్!

    ReplyDelete
  11. భలే బావుందండి. మరి మిగతా గుణింతాలు ఎప్పుడు నేర్పిస్తారు. నేను మిమ్మల్ని కాపీ కొట్టబోతున్నానోచ్:)

    ReplyDelete
  12. పద్మార్పిత గారు,

    కనుక్కోండి చూద్దాం. ఇదీ మీదేనేమో !

    చాలించు ఎందుకింత కునుకు ?
    నిను వీడను చెలియా,
    నీవలిగితే నా మది
    అలుక యుగమాయె
    వేచి ఉంటా
    నన్ను అలిగి అలుగక
    నా మదిని మీటవే ఆది-అంత్యము !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  13. కాస్త ఆలస్యంగా చప్పట్లు,కేకలు,ఈలలు.

    ReplyDelete
  14. very nice poem.. style is different and the emotion and subject is universal.. kudos to u padmarpita

    ReplyDelete
  15. @ జయగారు....కాఫీ కొట్టడం ఏమిటీ, మొదలుపెట్టండి మిగతాగుణింతాలు నేనే మీ మొదటి శిష్యురాలిని:-)
    @ జిలేబీగారు.... కనుక్కోవడం నాతరమా మీతరమా!! అలమాకండి అలా అన్నానని:-)
    @ చిలమకూరు విజయమోహన్ గారు...ఆలస్యంగా అయినా ఆనందంగా ఉన్నాయి మీ చప్పట్లు,కేకలు, ఈలలు వింటుంటే.:-)

    ReplyDelete
  16. @ harikrishna mamidi...thanks a lot.
    @ Kamal...Happy to hear:-)Thank Q.
    @ మాలా కుమార్ గారు.....ధన్యవాదాలండి!

    ReplyDelete
  17. పద్మా.... అమ్మో! గుణింతాలు కూడా నేర్పించేసావా నేను కాస్త ఆలస్యంగా వస్తే? నేను అలిగాను;(

    ReplyDelete
  18. ఈ మధ్య..భలే భలే ప్రయత్నాలు చేస్తున్నారు..
    చాల బాగుంది :)

    ReplyDelete
  19. Hello Padmarpita garu,

    This is simply awesome!!!



    Regards,
    Pravs

    ReplyDelete
  20. Padmarpitha garu....me kavitvam lo chala creativity undi....ala rayadam naku telisi antha suluvu kadu..:)

    ReplyDelete
  21. క గుణింతం ఆద్యంతం మీ కవితలో ఒదిగిపోయి.. సరికొత్తగా, వినూత్నంగా ఉంది. నిజంగా కవిత చాలా బాగుంది పద్మగారూ... అభినందనలు..

    ReplyDelete
  22. @ సృజనగారూ....అలగకండి ప్లీజ్,,,,ప్లీజ్
    @ kiran...ఏదో ఇలా:-)thank Q.
    @ pravallika...thanks a lot

    ReplyDelete
  23. ☂☆ Vållῐ ★♬....creativity kashtamainaa mee andari ishtamundu adentani...thank you.

    శోభగారు...నా విన్నూతన ప్రయత్నం మెచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  24. భలే రాశారండీ :)

    ReplyDelete
  25. నేను కొట్టిన కాపీ మీరు పట్టుకోవటంలేదు:)

    ReplyDelete
  26. manchi prayathnam
    ravisekhar oddula
    www.ravisekharo.blogspot.com

    ReplyDelete
  27. అర్భుతం ని దాటి అత్యర్బుతాన్ని తోసేసి ఎక్కడికో ఎగిరిపోతోంది ....అంత బాగుంది మీ కవిత

    ReplyDelete
  28. మీ ఈ ప్రయత్నం అద్భుతం పద్మాజీ. అనుకున్నంత సులభం కాదు ఈ రచన. భాషపై అధికారం, మమకారం ఉంటేనే కాని ఇంత అందంగా రాయలేం

    ReplyDelete
  29. ప్రేరణగారు,country fellowగారికి,శేషుగారికి ధన్యవాధాలండి

    ReplyDelete
  30. @ oddula ravisekhar garu thank you.

    @ సీతగారు పొగడమాకండి అతిగా:-)థ్యాంక్సండి.

    @ వాసుదేవ్ గారు మీ ప్రశంస స్పూర్తిదాయకం!థ్యాంక్సండి

    ReplyDelete