ప్రేమ ఇష్క్ లవ్

"ప్రేమ" ఇది శతాబ్దాల వినికిడి
ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ
ఒక్కో కొత్త అర్థాన్ని చెబుతూ
పర్యాయపదం కోసం వెతుకుతూ
ప్రేమకి ప్రేమే, వేరే పదం లేదంది!

"ఇష్క్" ప్రతికాలం ఇదో అలజడి
ఋతువుతో వైఖరిని మారుస్తూ
ఉఛ్వాస నిఛ్వాసలుగా నడుస్తూ
అదెలా కలుగునో అని చర్చిస్తూ
ఇది తెలిసినవారు ఇలలో లేరంది!

"లవ్" అంతుచిక్కని ఎదసవ్వడి
పేద గొప్ప అనే భేధమే లేదంటూ
కులం జాతకం అనేవి వంకలంటూ
ప్రేమపొందని జీవితం ఎందుకంటూ
ప్రేమను పంచు తత్వాన్నెంచకంది!

13 comments:

  1. I think this is Padmarpita's lovely love philosopy:)

    ReplyDelete
  2. ఏ భాష లో ఏ పదం ఎలా అర్ధం చెప్పినా హృదయ భాష ఒక్కటే. అది పొందిన హృదయాలన్నీ ధన్యమే!
    మీ శైలిలో చెప్పిన భావాలూ బాగున్నాయి.
    బొమ్మ?
    ఈసారి గ్రాఫిక్స్ లోకెళ్ళిపోయారు :(

    ReplyDelete
  3. బాగుంది పద్మార్పిత....మీ ప్రేమతత్వం!

    ReplyDelete

  4. మీ కావ్యాలో భావ కవిత వాఖ్యలు superga ఉన్నాయి అండీ.Ninnane nenu mee blog ki parichayam ayyanu.Ishq Vishq love ante edo cinema gurinchi cheptunnaru ani anukunna..Prema ki ishq, vishq paryapadhalu laga..mee bhavalu annitiki enno enno varnalu oke andalalga chupincharu...
    Nicely written...

    ReplyDelete
  5. పద్మర్పిత గారు....నిజంగా అసలు ఉహించాలేదండి, ఇద్దరం సెం టాపిక్..బాగుందండి

    ReplyDelete
  6. చాలా బాగుంది పద్మార్పిత....మీ ప్రేమ ఇష్క్ లవ్ మూడు ఒకటే సూపర్.. సంక్రాంతి శుభాకాంక్షలు..

    ReplyDelete
  7. బాగుంది अच्छा Good:-)
    .
    .

    Keep smiling.
    .
    .
    wish U Happy ' Sankranthi`

    ReplyDelete
  8. పద్మార్పిత గారు బాగుంది మీ ప్రేమ తత్వం..and మీకు, మీ కుటుంబానికి "సంక్రాంతి శుభాకాంక్షలు".

    ReplyDelete
  9. అవునండీ ఎద సవ్వడికి,
    అలజడికి,
    అలికిడికీ ఏ భాషలోనైనా ఒకే ఒక్క అర్థం..

    అదే తత్వం..

    అది అర్థమయ్యీ అర్థం కానట్టే వుంటుంది..

    తప్పొప్పుల మధ్య ఊగిసలాడే మనసు మంచు తెర కప్ప జూసినా
    అది దేహత్మల కలయికగానే చిరకాలంగా దివ్యత్వాన్ని పొందుతోంది...

    మీ ప్రేమ తాత్వికత అద్భుతం పద్మార్పిత గారూ...

    అభినందనలతో...

    ReplyDelete
  10. బావుంది.. ఎదలో జలదండోరా.......

    ReplyDelete
  11. స్పందించిన ప్రతి హృదయానికి నమస్సుమాంజలి...

    ReplyDelete
  12. ప్రేమ గురించి ఎవరు, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.ఎప్పుడూ కొత్తగా ఉండీ ఇంకా చదవొచ్చు అనుకునేలా.మీ ప్రేమతత్వం అలరించింది

    ReplyDelete