పరిగెల పులుసంటే పిచ్చ పసందని
పిత్తపరిగెల కోసం బెస్తపల్లెకు పోయొస్తే
నీ పరువముండగ పరిగలెందుకన్నాడు!
బొమ్మిడాయల వేపుడంటే భలేమోజని
బొంగరంలా బజారంతా గాలమేసి గాలిస్తే
నీముందు బోడి బొమ్మిడాయిలెంతన్నాడు!
బొచ్చెచేపలో ముల్లెక్కువుంటాయని
కారుచవకగా ఇస్తానన్నా కాదనివస్తే
నీ రెండు మీనాక్షి చూపులే చాలన్నాడు!
సందువా చేపను చేపగా వండాలని
సన్నని సందులన్నీ వెతికి నేనట్టుకొస్తే
నా నడుముసన్నలలో ఒదిగిపోతానన్నాడు!
వాలగ/జెల్ల చేపకైతే వంక పెట్టబోడని
పెద్దజెల్లని జామురేతిరి జాగ్రత్తగా జేరేస్తే
జెల్లంటూ జామంత నీవు జారిపోకన్నాడు!
వంజరం వండి వయ్యారంగా వడ్డించాలని
వద్దని వారించినా వినకుండా వండి వడ్డిస్తే
నా వజ్రాలగనివంటూ గట్టిగా వాటేసుకున్నాడు!
పిత్తపరిగెల కోసం బెస్తపల్లెకు పోయొస్తే
నీ పరువముండగ పరిగలెందుకన్నాడు!
బొమ్మిడాయల వేపుడంటే భలేమోజని
బొంగరంలా బజారంతా గాలమేసి గాలిస్తే
నీముందు బోడి బొమ్మిడాయిలెంతన్నాడు!
బొచ్చెచేపలో ముల్లెక్కువుంటాయని
కారుచవకగా ఇస్తానన్నా కాదనివస్తే
నీ రెండు మీనాక్షి చూపులే చాలన్నాడు!
సందువా చేపను చేపగా వండాలని
సన్నని సందులన్నీ వెతికి నేనట్టుకొస్తే
నా నడుముసన్నలలో ఒదిగిపోతానన్నాడు!
వాలగ/జెల్ల చేపకైతే వంక పెట్టబోడని
పెద్దజెల్లని జామురేతిరి జాగ్రత్తగా జేరేస్తే
జెల్లంటూ జామంత నీవు జారిపోకన్నాడు!
వంజరం వండి వయ్యారంగా వడ్డించాలని
వద్దని వారించినా వినకుండా వండి వడ్డిస్తే
నా వజ్రాలగనివంటూ గట్టిగా వాటేసుకున్నాడు!
నా రంగూన్ రాజాని నీచువాసనైనా నాన్ వెజ్ తో
నీటుగా మురిపించి మైమరపించాలని అనుకుంటే
కలువభామ చెంతనుండ జలపుష్పాలే వద్దన్నాడు!
నీటుగా మురిపించి మైమరపించాలని అనుకుంటే
కలువభామ చెంతనుండ జలపుష్పాలే వద్దన్నాడు!
ఊహూ, నాకెక్కడా వెజిటేరియన్ కనిపించలా!!! అబ్బో, చాలా రకాల జలపుష్పాలే ఉన్నాయి. మొత్తానికి అదర:, అద్భుత:
ReplyDeleteజలపుష్పాల జోలికే పోలేదంటేడంటే అది వెజిటేరియన్ కాదాండి!!!:-)
Deletemanchi kotala rayude aite
ReplyDeleteayyo....alaa ante yela:-)
Deleteకలువ బాలా?...'కమల' కోమలా?...:-)...ఏమిటో!...ఒక్కటైనా ఎప్పుదిఅనా తిన్తేగా రుచి తెలిసేది???ప్చ్....సరదాగా ఉంది పద్మ గారూ!...@శ్రీ
ReplyDeleteప్రేమని కోరేవారు.....రుచులు కోరరంట:-)
Deleteకేక! విజిల్స్ పద్మ గారు :D
ReplyDeleteనేను విజిలేస్తుంటే మీలా సౌండ్ రాకుండా గాలొస్తుందండి:-)
DeleteI am pure vegetarian Bengolee:)ఇలా నోరూరిస్తే ఎలాగండి.
ReplyDeletefor you pure non-veg on sunday:-)
Deletehahhaa..:)))bhale undi.
ReplyDelete:-)))thank you..
Deleteవెజిటేరియన్స్ ఓన్లీ అన్నారని చూద్దామని వస్తే కోతలరాయుని చూపించారే :)
ReplyDeleteకోరిన కోమలి కోసం నాన్ వెజ్ వద్దన్నవాడిని కోతలరాయుడంటే పచ్చి వెజిటేబుల్స్ అన్నీ తినేస్తాడంట:-)
Deleteఇంకా కొన్ని మిగిలిపోయినట్లున్నాయి, మరోమారు చేసిపెడతారా?
ReplyDeleteభలే కనిపెట్టాసారే:-)
Deletekeeeeeeeeeeeeeka..!!!!
ReplyDelete:-)))))))))))))))))..!!!!
Deletehahaha.. very nice..
ReplyDelete:-):-) thank Q!
Deleteమన దేశంలో శాఖాహారుల వర్ణాలు
ReplyDelete౧. చేప మాంసం కానీ గుడ్డు మాంసం కాదు అనేవారు
౨. చేప మరియు గుడ్డు మాంసం కాదు అనేవారు
౩. చేప గుడ్డు మాంసం అనేవారు
౪. వండినవి శాఖాహారం కాదు అనేవారు.
ఇంతకీ మీరు ఏ కోవలోకి చెందిన శాఖాహారులకు మాత్రమో తెలుపలేదు
పాలవాసన గిట్టక....దాన్ని కూడా మాంసాహారం కోవలోకి చేర్చిన దాన్ని:-)
DeleteWelcome to my blog.
బాగుంది...గుడ్ ఫర్ హెల్త్ :-)
ReplyDeleteమీరు చెప్పారంటే...అది ఖచ్చితంగా హెల్త్ టిప్:-)
Delete2013 మొదటి పోస్ట్ లో వెజిటేరియన్ అని చెప్పి నాన్ వెజ్ మత్తెక్కించారు:)
ReplyDeleteమీనాల మత్తులో మమ్మల్ని మరువకండి:-)
Deleteవెజిటేరియన్స్ కూడా లోట్టలేసేలా, మా లాంటి రసికులు(కోతల రాయులు) గర్వపడేలా ఉంది మీ కవిత.
ReplyDeleteఓహో.....అస్వాధించారన్నమాట :-)
DeleteSorry Nenu Fishes tinanu :/
ReplyDeleteNenu veg. tintanu ;)
anduke no comment...!!!!
(apudapudu Chicken tintuntanule :D :p)
అయితే మీరు ప్యూర్ వెజ్ అన్నట్లే:-)
Deleteఈసారి నా నెలరాజుకి ఇవ్వన్నీ చేసిపెడతాను....ఏ ఊసుచెప్పినా మీతో పంచుకుంటానుగా:-)
ReplyDeleteమీ నెలరాజు ఊసులే చెబుతాడో లేక మీ ఊసులేవింటాడో వేచి చూస్తాం:-)
Deleteనేనూరుకుంటానేటి...:-)
Deleteఇలాగే అంటారు..అలా ఐస్ అయిపోతారు:-)
Deletewow super padma:-)) chaala chaal bagundi.. chaapallO inni rakaalu untaayani naaku teliyadandi... ee new year lo chaala saradaagundi. image ni chusaake kavita raasara? Qte:-))
ReplyDeleteమీకు తెలియని విషయం తెలియజెప్పానని ఆనందంగా ఉందండి:-) ఇలాగే మీ అందరితో ఈ ఏడాది సరదాగా సాగాలని కోరుకుంటున్నాను. అవునండి బొమ్మ చూసి కవితరాసాను:-)
Deletenenu vegetariane andi...
ReplyDeletevegetarian tho non veg chadivinchaanugaa:-)
Deleteఏ రసాన్నైనా అవలీలగా పలికించే మీ కలం కుంచెలకు సాటిలేదు పద్మార్పిత గారూ. కొత్త సం. మొదటి పోస్ట్ అదిరింది.. అభినందనలతో....
ReplyDeleteఅన్ని రసాల్ని ఆస్వాదించిన మీ నుండి అందుకున్న ఈ అభినందనలు ఆనందంతో పాటు రాయాలన్న ప్రోత్సాహాన్ని కూడా అందించిందండి. థ్యాంక్యూ.
Deleteఅన్ని చేపలు కలిపి భలే వండారండీ! కాక్ టెయిల్‌లా!!
ReplyDeleteకాక్ టెయిల్ టేస్ట్ నచ్చినందుకు నెనర్లండి.
Deleteఅందం ముందన్నమెందుకనుకున్నాడేమో ?!
ReplyDeleteపెళ్ళయినప్పటినుండి రాజా వారు అసలు భొంచేసినట్లు కనపడ్డం లేదే.
భోంచేయకుండా అందాన్నేం అస్వాధిస్తాడండి!
Deleteఅన్నీ తెలిసిన మీరు ఇలా అనడమేంటి:-)
కవిత వ్రాసారా లేక పాట వ్రాసారా? ఫాట అయితే సిరివెన్నెల గారు ఎప్పుడో వ్రాసారుగా? ;)
ReplyDelete"కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య" చిత్రం : ధర్మక్షేత్రం
పాటలు వ్రాసేంత పాండిత్యం మాకెక్కడిది చెప్పండి...
Deleteఏదో అక్కడో చేప ఇక్కడో చేపట్టుకొచ్చి ఇలా మీతో:-)
అబ్బాబ్బా , ఏం చెప్పారండి. బొచ్చులు, సందువాలు , పిత్త పరిగేలు, బొమ్మిడాయలు, వంజరం, ఇవన్ని చదువుతుంటే ఛీ వెధవ జీవితం అని అనిపిస్తుంది, అర్జెంటు గా ఇంటికెళ్ళి వండిన్చుకుని తినాలనిపిస్తుంది.
ReplyDeleteనెత్తల్లు , రొయ్యలు, పీతలు ఇవి కూడా కలిపి ఇంకో మంచి కవిత రాయండి.బెంగాలీలు, ఒరిస్సా వాళ్ళు చేపల రుచి తెలుసుకుని అది లేకపోతే జీవితం వ్యర్ధం అనుకుని, దాన్ని వెజిటేరియన్ ని చేసేసారు.
పాపం మన వాళ్ళే ఇంకా ఆలోచిస్తున్నారు.మీ కవిత లో కథానాయకుడికి చేపల కన్నా కథానాయిక మీద ఇష్టమేక్కువ అనుకుంట. అతను ఇప్పటి దాకా మంచి చేపల పులుసు రుచి ఎలా ఉంటుందో చూడలేదనుకుంట, చుస్తే కనుక చేపలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. నేనైతే అదే చేస్తాను. చేపల పులుసు ఎదురుగా పెట్టుకుని , వేరే దిక్కులు చూడటం ఏంటో హ్మ్ .......
నా బ్లాగ్ కు సుస్వాగతమండి.
Deleteఔనండి రంగూన్ రాజా కూసింత భోజనప్రియుడైతే బాగుండేది.
ఆవురావురుమంటూ ఇంటిపట్టునే ఉండేవాడు:-)ప్చ్.....ఏంచేద్దాం!
నాకు ఒక డౌట్, అసలు మీరు పద్మా లేక పద్మనభుడా? ఆడవారిని వారికే తెలీనంత అందంగానూ.. మగవారికి మాత్రమే సాధ్యమని నమ్మె (నా లాంటి వారు) వర్ణనను, మాంసాహారులకు వండేవారికి మాత్రమే తెలిసె నామాలు (మీరు శాఖాహారుల అనుకుంటా)... ఇవన్నీ ఎలా సాధ్యం? గ్రాంధిక, సామజిక పదాలతో రకరకాలుగా బలే ఆడుకుంటారే ... కానియండి. perfect & Good one, hope to see the same flavors rest of the year.
ReplyDeleteఅమ్మో..... ఈ అడకత్తెరలో పోకచెక్కలాంటి డౌట్ మీకూ వచ్చిందా:-) అయితే మీరు నా పాత పోస్ట్ ల కమెంట్లకి రిప్లై చదవక తప్పదులెండి. ఈ శిక్షకు నన్ను తిట్టుకోకండి:-)
Deleteకవిత్వంతో కడుపు నింపే మీరు ఇలా నా వెజ్ తో కవ్విస్తే ఎలా:-)
ReplyDeleteఏదోలెండి.....రాక రాక వస్తున్న రాజాకి అలా:-)
Deleteఏరి కోరి నేను కొరమీను పట్టి తెచ్చి
ReplyDeleteఉప్పు కారం కూరి ఎర్రంగ కాలిస్తే
నీ కవురులే చాలు ఇక కూరేలనన్నాడు!
మీ కవిత చదివాకా సరదాగా వ్రాయాలనిపించింది. చాలా బాగా వ్రాశారు
పద్మాంజలి గారు.
భలే బాగుందిగా...చిట్టి సరదా కవితతో కవ్వించారుగా:-)
DeleteThank You.
సూపర్ పద్మగారు... చదువుతుంటేనే నోరూరిపోతోంది.... :)
ReplyDeleteఅసలు ఇంత బాగా ఎలా రాయగలుగుతారు మీరు... సో స్వీట్.....
మరింకేం......ఆరగించండి:-)
Deleteఅంతా మీ అభిమానమేనండి!
అక్కోలక్కా.. అందుకే బావ నీ వెంట పడ్డాడా...
ReplyDeleteపుల్లా బెల్లమేసి వఱగా బొమ్మిడాల పులుసు రుసి సూపిత్తాలే అప్పుడేటంతాడో సూత్తా...
ఓలమ్మో ఓలమ్మో.....ఇలా పోటీకొస్తే ఎలాగమ్మో:-)
Deleteఫర్లేదు ఏది ఎంచుకోవాలో తెలిసిన సరసుడే...
ReplyDeleteకొద్దికి ఆశపడితే మహత్తు ముందుగానే జారిపోయేదని గ్రహించాడే
పూర్ణప్రజ్ఞాభారతి
pragnabharathy.blogspot.in
Welcome & thanks for visiting my blog. రంగూన్ రాజానా మజాకా:-)
Deletesuperb
ReplyDelete:-) thank Q!
Deleteమంచి నాన్ వెజ్ పోస్ట్ తో ఓపెనింగ్ ఇచ్చారుగా:)
ReplyDeleteఅయితే మీకూ నచ్చిందన్న మాటేగా:-) థ్యాంక్యూ
Deletekavitha lo chepadam ye na, vanta chesi piliche udesham leda padma garu??
ReplyDeletelast time 100 blog follows get together apudu maadi poendi ani escape iyaru..
ee sari opukonu andi..
;)
Chala baga vandarandi Kaluvabhamama vundaga jalapushpalu ndukani ...nice
Deleteపరువంతో పులుసు..
ReplyDeleteవయ్యారంతో వేపుడు..
యవ్వనంతో ఇగురు..
ఇవన్నీ వడ్డిస్తే ఇక ఆగేదెట్టా పద్మా జీ😊