నేను రాసేవి కవితలంటే కవితా హృదయం నన్ను గేలిచేస్తుంది
రాయకపోతే మీకు దూరమై నా ఒంటరితనం నన్ను వేధిస్తుంది
రాయకపోతే మీకు దూరమై నా ఒంటరితనం నన్ను వేధిస్తుంది
నా రాతల్లోనిది కవిత్వమే కాదు కల్పన కూడా అందులో లేదు
గుండె యొక్క స్వరానికి తర్జుమాయే కానీ పదాల అల్లిక కాదు
అప్పుడప్పుడు గుండెలయలే ఊసులై పదమాలికలై పెనవేసాయి
కొన్నిసార్లు కన్నీళ్ళే నా కవితలకి కారణమై ఉప్పొంగి పారాయి
శాంతి కరుణ శృంగార శౌర్య భయ రౌద్ర అద్భుత హాస్య భీభత్సం
ఈ నవరసాలు మేళవించిన జీవిత సత్యాలే నా రాతలకు కారణం
ప్రేమికుల అనురాగమే అలవోకాక్షరాలై అల్లుకున్న కవితలుకొన్ని
మధురసంగీత సప్తస్వరాలు అందించిన ఆనందపు వీచికలింకొన్ని
చావుబ్రతుకుల సారమెరుగని నాకు సాహిత్య సారాంశమేమెరుక
సాదాగాబ్రతికే నేను సంఘసంస్కరణ చేయ ఏపాటిదాననుగనుక
నే రాసే ఈ రాతలు నలుగురి నవ్వుకి కారణమైతే అదే ఆనందం
నా ఈ బ్లాగ్ రాతలు ఎవరినీ నొప్పించి ఉండవనేదే నా నమ్మకం!!
టాటా...బై...ఇంక చాలు ఈ 2012లో మిమ్మల్ని హింసించింది:-)
మరి మీరంతా రెడీనా!!.....2013 లో నా సుత్తిని భరించడానికి:-)
మరి మీరంతా రెడీనా!!.....2013 లో నా సుత్తిని భరించడానికి:-)
చాలా బాగుంది, 2,3 బాగా నచ్చాయ్,..మన కవిత్వం మనకి తృప్తినిస్తే అది మంచి కవిత్వమే,....నూతన సంవత్సర శుభాకాంక్షలు,...
ReplyDeleteమనకి నచ్చింది నలుగురు మెచ్చితే మహదానందం:-) మెచ్చిన మీకు ధన్యవాదాలు.
Deleteఈ కవితకి ప్రకాశ్ బాబు గారి పెయింటింగ్ ఎంత బాగా కుదిరిందో !! ఆయన పెయింటింగ్స్ మీద ఉండే అభిమానంతో కళ్ళు అక్కడే చాలా సేపు నిలిచిపోయాయి
ReplyDeleteఎవ్వరినీ నొప్పించలేదు పద్మార్పిత గారూ, మెప్పు పొందుతూనే ఉన్నారుగా :) మీరు విచ్చలవిడిగా వ్రాసేయండి, నేను రెడీ :)
చూపుని పెయింటింగ్ నుండి తిప్పి ఇటు రాసింది చదివి విచ్చలవిడిగా వ్రాసేయమన్న మీకు అభివందనం.:-)
Deleteపద్మ గారూ!...మనం అలా వ్రాయడం మానేస్తే...జనం సుఖపడిపోరూ!...:-)....అంచేత ఎవరు ఏమైనా ఏమనుకున్నా...అక్షరాలూ గుప్పెచ్చేద్దాం...బ్లాగ్ లో మన పుటలని భావాలతో నింపెద్దాం...ఏమంటారు?...@శ్రీ
ReplyDeleteఓహో.....నా పార్టీయే మీరుకూడాను, ఇంకేం కుమ్మేద్దాం:-)
Deleteమీ పదాలా మద్య కామాలు పెట్టి కవిత అనుకోమంటే ఎలా పద్మ
ReplyDeleteకాసుకోండి వచ్చే సంవత్సరం కూడా అంటే తప్పించుకోవడం ఎలా చెప్మా?
మీరు రాయడం మానేస్తా అంటే చేసుకోస్తా ఉప్మా
మనసులో భావాల్ని కక్కి చస్తా , మీ అంతు చూస్తా అంటే మాత్రం
మీ కవితల ఫోటోలు చూసి బతికేస్తా .
రవిగారు..మీ రిప్లై ఇంత సాప్ట్ గా ఉప్మాలా ఉందేంటి చెప్మా?
Deleteతప్పదు మీరు ఫోటోలను చూస్తూ ఫాలో కావలసిందే:-)
మంచి భావుకతతో 2012 కి టాటా చెప్పారు.
ReplyDeleteఅందమైన కవితా బొమ్మతో 2013 కి స్వాగతం ఎలా చెప్తారా అని వేచి ఉన్నాం.
ఎప్పటిలానే మీ "పద"నిసలు చలా బాగున్నాయి.
బొమ్మా మీరేశారేమో అనుకున్నాం, బ్యూటిఫుల్!
నా భావుకత్వం నచ్చినందుకు నెనర్లండి.
Deleteఆ పిక్ PRAKASH గారిదండి.....
మీలా ఊహించి అందమైన బొమ్మలు వేసేయలేను కదండి:-(
Love reading your posts.. and yeah..keep writing.. :)
ReplyDelete-- Ananth
thanks for your affectionate compliment:-)
Deleteమీరాసేవి కవితలు కావంటూనే మార్కులు కొట్టేస్తారు:)
ReplyDeleteమీరు కాదన్నంతమాత్రాన్న కాకుండా పోతాయేంటి:)
మార్కులు వేసి పాస్ చేసి ప్రేరేపించేది మీరంతానే కదండి:-)
Deleteఆ టైటిల్ చూసి కించిత్ భయపడ్డా.. ఆ తర్వాత భావం చూసి శాంతించా.... ఏది రాసినా భలే నచ్చేట్టు రాసేస్తారు అదేంటో మరి...
ReplyDeleteమీరేమో సుత్తి అంటారు కాని వాటికే మిమ్మల్ని స్తుతించాలని అనిపిస్తుంది....
టాటా అన్నానంటే టపాకట్టేసాననుకున్నారా:-) అంత సులువుగా పోతానేంటి....ఇంకా ఎంతో స్తుతించేలా రాసేయాలి కదండి:-) మీ అభిమానానికి ధన్యవాదాలండి.
Deleteనవ రసాలు పలికించే మీ హృదయాంతరాళంలోని భావోద్వేగానికి సుమాంజలులండీ.. చిత్రం మీ అంత అందంగా లేదనిపించింది.. నూతన సం.లో ఓ అందమైన చిత్రంతో సరికొత్త భావావేశంతో బ్లాగిల్లు అలంకరిస్తారని ఆశిస్తూ... అభినందనలతో...
ReplyDeleteనా భావోద్వేగాలకి మీరందించే అభిమాన స్పందనలకు వందనాలు. ఇక ముందు మీ కళ్ళకింపైన చిత్రాలతో రంజింపజేసే ప్రయత్నం చేస్తానండి.
Deleteచాల్లే సంబరం.....అలా రాయలేను ఇలా రాయలేనంటే మేము ఒప్పుకుంటామేంటి:-) 2013 అలా అనకుండా అదరకొట్టేయండి అందమైన కవితలతో దానికి తగిన చిత్రాలతో.
ReplyDeleteఅలాగే.....భరిస్తానని భరోసా ఇస్తే:-)
Deleteటాటా 2012 కదా మాకు కాదు కదా
ReplyDeleteహమ్మయ్య శీర్హిక చూసి భయమేసింది.:)
నుతన సంవత్సరంలో
మరిన్ని హృదయా'ర్పిత పద్మా'లను అందుకోవడానికి మేము సిద్ధం.
పూయించేయండి ఇక భావాల నీరుపోసి...:)
Yappie Yappie New Year..:)
నా భావాల నీటితో పాటు మీ అభిమానపు స్పందనల గాలి తోడైతేనే పద్మ మరిన్ని పుష్పాలని అర్పించగలదండి.Thank you:-)
Deleteరెడీ...
ReplyDeleteసైసై...
Deleteటాటా బై బై అంటే ఢిల్లీ అమ్మాయి గురించి రాసారేమో అనుకున్నానండి......అది విషాదకరమే అయినా అందరూ పుంఖాను పుంఖలుగా పోస్ట్ లు రాయడానికే కాని ఎంతవరకు ఆమె ఆత్మకు శాంతి చేకూరి, మనుషుల్లో మార్పు వచ్చిందో తెలీదు....ఇది ఇక్కడ అప్రస్తుతమే అయినా ఎందుకో రాయాలనిపించింది:(
ReplyDeleteమీరు రాసేవి మన్సుకు కాస్త ఉపసమనాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి.....2013 లో రెచ్చిపొండి:-)
తప్పకుండా ప్రయత్నిస్తాను...ఉల్లాసంగా ఉత్తేజపరచడానికి:-)
Deletenice one andi. wish u good luck in 2013 also. Wish u happy new year...
ReplyDeleteThank you& wish you the same.
Deleteబాగుందండీ... ;)
ReplyDeleteమీకూ మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ఇంకో మాట... మీ బ్లాగ్ టెంప్లేట్, రాగానే ప్లే అయ్యే సాంగ్,దానికి తగ్గ మీ పోస్ట్ కాంబినేషన్ సూఊఊఊఊపర్...
టాంకుల కొద్ది థ్యాంక్సండి.:-)
Deleteమీరు రాయకపోతేనే లైఫ్ సుత్తిలా అనిపిస్తుంది:)
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు..Rock on
Thank you and wish you the same.
Deleteబాగుంది
ReplyDeleteధన్యవాదాలు.
Deleteఅధ్బుత కవితా ప్రపంచం మీది. ఇంకా చదవాలనిపించే మీ పదాల కలయిక వర్ణించలేనివి.
ReplyDeleteమీ అభిమాన స్పందనలకు ధన్యవాదములు.
DeleteHappy New Year 2013
ReplyDelete; కోణమానిని
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.
Deleteచాలా బాగుందండీ. మీ కవితలన్నీ బాగుంటాయి.అలవోకాక్షరాలని సంధి చేయకుండా ఉంటే బాగుండేది.అలవోకగా అక్షరాలై అన్నా హాయిగానే ఉంటుంది.కవితలతో పాటు మీరు పెట్టే ఫొటోలు కూడా మమ్మల్ని అలరిస్తున్నాయి..
ReplyDeleteచాన్నాళ్ళకి ఇటువైపు మీ చూపు. నిజమే మీరన్నట్లు విడిగానే బాగుంది. సదా మీ అభిప్రాయాలని, అభిమానాన్ని ఆశిస్తూ....ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteహహహ మీరు కూడా బ్రేక్ తీస్కుంటున్నారా ఓ నిముషం భయపడ్డానండీ :-)
ReplyDeleteచాలా చక్కగా రాశారు. మేము సిద్దమే మీ సుత్తి భరించడానికి కాదండోయ్... మీ అందమైన ఊహలను మరింత అందంగా ప్రజంట్ చేసే మీ కవితలను మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి :-)
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చింతవలదు...ఎలాగో భరించక తప్పదు....:-)
ReplyDeleteధన్యవాదాలండి.
ఈ తవికేదో నేను కవయిత్రిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయుచ్చుకుని కొడతా అన్నట్లు వున్నది. ;)
ReplyDeleteనవరసాలవరకు వోకే! సామాజిక సౄహ గట్రా అంటూ దశమరసం జోలికి వెల్లకండి. ప్లీస్.
నవ్వు నాలుగు విధాలా చేటు అని ఊరికే అన్నరా పెద్దలు. ఆ నాపచేను పండాలా వద్దా అనేది మీ చేతుల్లొనే వుంది. ;)
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నా తవికని కవితనుకుని తిట్టారో పొగిడారో తెలీదు...అందుకే :-) :-)
Deleteథ్యాంక్యూ, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
wish u a very very happy new year padmarpita gaar.....
ReplyDeleteThank Q....wish you the same.
Deleteఆ చిత్తరువులలోని చిత్రాలు మీవేనా?
ReplyDeleteమీరు మిమ్మల్ని చిత్రించుకున్నారా?
పెన్సిల్ స్కెచెస్ చాలా అందంగా ఉన్నాయి.
క్రిష్ణవేణీ అలల తరంగాల్లా ఆ కురుల చిత్రీకరణ బాగుంది.
చిరుగాలి తెమ్మెరల్లా,
చిన్నపిల్లల అల్లరిలా
మీ మీ గీతికలు, పదాల అల్లికలు చాలా బాగున్నాయి.
నాకెందుకో ఇది చదవగానే ఒక చిన్నపాప చేసే అల్లరిలా అనిపించింది.
మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Welcome to my blog.
Deleteమీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.