వ్రాయాలనుకున్నా అందరిని మెప్పించి
నన్ను నేనుగా ఎవరో ఏమిటో వివరించి
హృదయపుద్వారాలని తెరచి విడమరచి
గుండె లోతుల్ని, ప్రతి మూలని పరికించి
పలకని పదాలని వెతికి వాటికి జీవంపోసి
పాతగాయాల జ్ఞాపకాలకి కొత్తలేపనంపూసి
అంతర్గత లావాలవంటి భావాలని వెలికితీసి
ఒక సందేశాత్మక పోస్ట్ వీరలెవెల్ లో రాసి...
నాకు నేనే మురిసిపోవాలనుకున్నా చూసి...
అంతలో ఆగమని వెలుగురేకొకటి ఉదయించి
ఓనమాలు దిద్దు అర్పితా అంటూ ఉపదేశించి
అలవికాని వాటికై ఆలోచనలేలని మందలించి
పద్మవై ప్రకృతిలో పరవశించి అన్నీ ఆస్వాధించి
ప్రేమామృతజ్వాలై ఎగసి మంచుమాయలో తడిసి
పెరిగిన పదాలపట్టుకొమ్మల్లోని పదపుష్పాలని కోసి
సహజ సరళ వాఖ్యాలకి కొత్త ఆలోచనలని జతచేసి
ఎడారి జీవికి దప్పిక తీర్చి హాయిగా ఆనందింపజేసి
ఆగ్రహాన్నైనా అనునయంతో అనురాగంగా మార్చేసి...
నన్ను నేనుగా ఎవరో ఏమిటో వివరించి
హృదయపుద్వారాలని తెరచి విడమరచి
గుండె లోతుల్ని, ప్రతి మూలని పరికించి
పలకని పదాలని వెతికి వాటికి జీవంపోసి
పాతగాయాల జ్ఞాపకాలకి కొత్తలేపనంపూసి
అంతర్గత లావాలవంటి భావాలని వెలికితీసి
ఒక సందేశాత్మక పోస్ట్ వీరలెవెల్ లో రాసి...
నాకు నేనే మురిసిపోవాలనుకున్నా చూసి...
అంతలో ఆగమని వెలుగురేకొకటి ఉదయించి
ఓనమాలు దిద్దు అర్పితా అంటూ ఉపదేశించి
అలవికాని వాటికై ఆలోచనలేలని మందలించి
పద్మవై ప్రకృతిలో పరవశించి అన్నీ ఆస్వాధించి
ప్రేమామృతజ్వాలై ఎగసి మంచుమాయలో తడిసి
పెరిగిన పదాలపట్టుకొమ్మల్లోని పదపుష్పాలని కోసి
సహజ సరళ వాఖ్యాలకి కొత్త ఆలోచనలని జతచేసి
ఎడారి జీవికి దప్పిక తీర్చి హాయిగా ఆనందింపజేసి
ఆగ్రహాన్నైనా అనునయంతో అనురాగంగా మార్చేసి...
వ్రాయమన, అణిచేసుకున్నా నా ఆవేశాలకి కళ్ళెంవేసి!
ఆహా. నా గురించి ఇంత మంచి కవిత వ్రాసినందుకు చాలా థాంక్స్ అండి ;) నాకసలే పొగడ్తలు గిట్టవు. ఏదో మీ అభిమానం.
ReplyDeleteఏమీ రాయలేదనే కదా నా పై ఈ అభియోగం:-)
Deleteఅయినా మెచ్చేసుకున్నారంటే అదేనేమో స్నేహబంధం!
పద్మ గారూ!మంచుమాయలో తడిసి
ReplyDeleteపెరిగిన పదాలపట్టుకొమ్మల్లోని పదపుష్పాలని కోసి
సహజ సరళ వాఖ్యాలకి కొత్త ఆలోచనలని జతచేసి...మంచి పదాల మేలు కలయిక...మీ భావ సుమం...@శ్రీ
నా పదాల ప్రయోగం మీరు మెచ్చడం ఆనందదాయకం.
Deleteచాలా బాగుందండి.మీ కవితలానే మీ చిత్రం కూడాను
ReplyDelete:-) థ్యాంక్సండి...బహుకాలానికి
Deletechala bagundi... paintings kuda meeru vesinavena...just in love with both the writings and paintings...
ReplyDeletewelcome to my blog & thanks for your compliments.
Deletebaga meppincharu
ReplyDeleteMechchina meeku thanks;-)
Deletechaalaa baavundi andi
ReplyDeletethank U.
Deleteమీరిలా వ్రాయాలని రాసి అదరగొట్టేస్తుంటే....మేమేం రాసి మెప్పించగలం మీ ఫ్యాన్స్ ని
ReplyDeleteమీకు నేను నేర్పాలా:-) తెలుగుదనాల తెలుగమ్మాయిగారు.
Deleteమెప్పించే పదాలన్నీ మీ గూటి పక్షులు, మీరు కవిత రాస్తే అవి వాలిపోతాయి.
ReplyDeleteమీకు నేను నేర్పాలా:-) తెలుగుదనాల తెలుగమ్మాయిగారు.
Deleteనిన్ను నిన్నుగా చూడక , నీ కవితావేశానికి కళ్ళెం వేయమని చెప్పే '' వెలుగు రేఖ '' ఎక్కడిది ?
ReplyDeleteనన్ను నన్నుగా అభిమానించరేమో అనే అనుమానపు రేఖే అలా వెలుగై హెచ్చరించింది:-)
Deleteఆహా పదాలతో ఏం ఆడుకుంటున్నారండి.. చాలా చాలా బాగుందండి. కవితలో మీ పేరు జతచేయడం ఇంకా ఇంకా బాగుంది..మీ కవితల్లో మిమ్మల్ని ఊహించుకుంటున్నమండి మేము...
ReplyDeleteఊహల్లో అందంగా ఊహించుకోండి:-)thank you.
Deleteక్షమించాలి నాకు మీ కవిత అర్థం కాలేదు.
ReplyDeleteకవిత ఏమీ వ్రాయలేదు కదా...అందుకే అర్థం కాలేదేమో:-(
Deleteఎలాగెలాగా??
ReplyDelete'వ్రాయాలని' ఇక్కడికి రమ్మని,
వ్రాయలేనని చెప్పి,
పదాల ఇంద్రజాలన్ని మాపై ప్రయోగిస్తారా??
మేము ఒప్ప్పుకోం..
జాటర్ ఢమాల్ అంతే
పద్మగారూ,వ్రాయాలని చాలా బాగుందండి ,పాత జ్నాపకాలను సమాది చేసెసారు మంచిదే కానీ నాదో
Deleteచిన్న విన్నపం ,ఏమీ అనుకోనంతేనే సుమా ,ఆవేశాన్ని మరీ అంతగా అణిచి బేయకండి ,అప్పుడప్పుడు
ఆవేశం కూడా మీలో సృజ్నాత్మకతని చూపిస్తుంది ,అనీ హొవ్ వెరీ గుడ్ ,
నేను ఇంద్ర మహేంద్రజాలాల్ని వేసినంతమాత్రాన్న ఒప్పుకునేంత అమాయకులేంకారులే ధాత్రిగారు:-)
Deleterohiniగారు నా బ్లాగ్ కి స్వాగతం. ఏదో అప్పుడప్పుడూ ఆవేశాన్ని అణచుకున్నా అవి వాటి దారిలో పయనిస్తూనే ఉంటాయండి:-) మీ అభిమాన స్పందనకు నెనర్లు.
Deleteas usual nice pic and very nice poetry padmarpitha mark
ReplyDeleteచాన్నాళ్ళైంది...మీదైన స్టైల్ కవిత ఇటువంటిది చదివి.పిక్ అదిరింది:-)
ReplyDeleteమీ ఆదరాభిమానాలే నాకు స్ఫూర్తి. ధన్యవాదాలు.
Deleteపద్మార్పిత గారు.. మీలో కవిత్వం ని నేను చూడలేను. కవిత్వంలోనే నేను మిమ్మల్ని చూడగలను.
ReplyDeleteమిమ్ము మిమ్ముగా అభిమానించే రోజు కొరకు వెలుగు రేఖ అయి వేచి ఉంటాను.
సృష్టిని మార్చలేము.దృష్టిని మార్చుకోగలం కదా! ఈ చెప్పడం .. కూడా అభిమానం తోనే !
మీ అభిమానాన్ని సదా కోరుతూ....మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేస్తానండి. ధన్యవాదములు.
Deleteఎడారి జీవికి దప్పిక తీర్చి హాయిగా ఆనందింపజేసి
ReplyDeleteఆగ్రహాన్నైనా అనునయంతో అనురాగంగా మార్చేసి...
బాగుందండీ...ఈ హామీ చాలదా ఆ ఎడారి జీవికి...:-)
అభినందనలతో...
అంతగా నచ్చకపోయినా ఆగ్రహాన్ని అణుచుకుని అనునయంగా కమెంట్ పెట్టినట్లున్నారు వర్మగారు:-)
Deleteagraham yemi ledandi.. chaalaa nachche comment raasaa padmaaji..
Delete:-) oh...aithe ok
Deleteకళ్ళెం వేసి ఆపినా ఆగని కవితా వాహిక, సూపర్...
ReplyDeleteపెయింటింగ్ కూడా బ్యూటిఫుల్...
మీ అభిమానానికి కృతజ్ఞతలండి.
Deleteఏమీ రాయకుండా ఉండడానికి ఇంత ఆలోఅచన అవసరమా?
ReplyDeleteపెయింటింగ్ నాకు చాలానచ్చింది. మీ ప్రతిబింబంలా ఉంది:)
అవసరమేనండి...లేకపోతే మీ తర్కాన్ని తట్టుకోలేనుకదండి:-)
Deleteబాగుంది పద్మగారు.
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteసహజ సరళ వాఖ్యాలకి కొత్త ఆలోచనలని జతచేసి.....రాస్తూ మైమరపిస్తున్నారుగా:-)
ReplyDeleteమైమరపించాలనే తాపత్రయం:-)
Deleteఓనమాలు దిద్దు అర్పితా అంటూ ఉపదేశించి
ReplyDeleteఅలవికాని వాటికై ఆలోచనలేలని మందలించి
పద్మవై ప్రకృతిలో పరవశించి అన్నీ ఆస్వాధించి
this is your mark madam....
thank you aniketh.
Deleteచాల బాగుంది
ReplyDelete