హృదయతృష్ణ

ప్రేమకావ్యం కాని సందేశాన్ని నీకు అందించాలని  
నీ తలపులతో నేను పోరాడి గాయాలతో గెలిచానని
తెలిపే పదాలకూర్పుకై వెతికా ఆశల నిఘంటువుని
వాటినే రాశులుగా పేర్చి ప్రయత్నించా రాయాలని!

తెలుసు నాకు సహనంతో నీవు వాటిని చదవవని
చేసిన బాసలు, చిలిపి చేష్టలు కొన్నేకదా అనుకుని
రాయబోయి చిట్టాల చాంతాడులో చిక్కుకున్నానని!

అలిగితే అది తీర్చ దరిలేని నిన్ను ఊహించుకుని
గడచిన స్మృతులలో కలిసున్నవి కొన్ని ఎంచుకుని
చేసాను ప్రయత్నం పలువిధాలా నీకు పంపాలని!

కానీ......నా నిదురలేని కళ్ళు నీపై నిందవేయాలని
ఊగిసలాడే మదిని రెచ్చగొట్టి నిన్ను కంటపడమని
లేకపోతే నా ఊపిరిలో కలిసిన నిన్ను వేరు చేస్తానని
తెలిపిన బెదిరింపుని బాధగా గొంతులో అణచి వేసుకుని
కన్నీటి కెరటాల్లో కడిగేయ ప్రయత్నించా నీ జ్ఞాపకాలని!


చివరికి వ్యధై రగిలి హృదిజ్వాలై రక్తాన్ని ఆవిరిగా మార్చి
అల్లంత దూరాన్న అందని ఆకాశమలే ఉన్న నిన్ను చేరి
మేఘమై వర్షించి తృష్ణను తీర్చి ఊపిరిపోయ రమ్మంది!!!

41 comments:

  1. గత కాలపు వ్యధను పెంచే జ్ఞాపకాలను మరువలేని అందాల జాబిల్లి అనుభవిస్తున్న హృదయత్రుష్ణ ఇలా కవితారూపంలో మనసు హత్తుకునేలా రాసిన మీకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. ఓ....చాలా కాలానికి కమెంట్, అభినందించిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  2. కానీ......నా నిదురలేని కళ్ళు నీపై నిందవేయాలని
    ఊగిసలాడే మదిని రెచ్చగొట్టి నిన్ను కంటపడమని...

    చివరికి వ్యధై రగిలి హృదిజ్వాలై రక్తాన్ని ఆవిరిగా మార్చి
    అల్లంత దూరాన్న అందని ఆకాశమలే ఉన్న నిన్ను చేరి
    మేఘమై వర్షించి తృష్ణను తీర్చి ఊపిరిపోయ రమ్మంది!!!

    మనసులోని తీరని ఆవేదన పరాకాష్టకు చేరిన తీరును యింతలా కవిత్వీకరించి అక్షరాల దారాలతో ముడివేయడం మీకే సాధ్యం పద్మార్పిత గారు.. జన్మదిన హార్థిక శుభాకాంక్షలతో..

    ReplyDelete
    Replies
    1. వర్మగారు.....పదాలతో అష్టాచమ్మా ఆడుకునే మీరు అందించే ఈ ప్రోత్సాహపు వాక్యాలు మరో కవితకు ఊపిరిపోస్తున్నాయి. ధన్యవాదాలండి.

      Delete
  3. ఉదయం మీ ఈ కవిత చదివిన తరువాత కామెంట్ పెట్టలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు, ప్రతిగంటకు ఒక సారి చూస్తూనే గడిచింది ఆఫీస్లో, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు.
    కవితకు కమెంట్ అందరిలా అందంగా చెప్పలేని నా భావాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను.
    అద్భుతంగా రాసారండి.

    ReplyDelete
    Replies
    1. అవునండి ఎందుకు అలా ఇబ్బంది పెట్టిందో తెలీదు.:-(
      ఏమీ చెప్పలేను అంటూ అందంగా అన్నీ చెప్పే మీకు ధన్యవాదాలు.

      Delete
  4. పద్మార్పితా ఈ మధ్య మీ కవితల్లో భావం పరాకాష్టపు అంచుల్ని తాకి మనసుని మెలిపెడుతున్నట్లుంటున్నాయి.....అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానపు స్పందనకు నెనర్లు.

      Delete
  5. Mee kavithanu chadivi abburapadi, aanamdinchi maatalu raaka yemi cheppakundaane veluthunnaa Padma gaaru... !

    ReplyDelete
    Replies
    1. Mee ee aatmeeya prasamsa bhale anandanni ichchindandi, thanks a lot.

      Delete
  6. Entha baga Rasarandi manasunu athukone vidam ga vundi my dear friend... E kavitha athanu chusina taravata nee chentha cherakunda vunttada!!!

    ReplyDelete
    Replies
    1. Kavitha dani bhavam nachina meeku dhanyavaadalu.

      Delete
  7. మీకు జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. హాయ్ పద్మార్పిత గారు. చాలా చాలా బాగుందండి. మీ పుట్టినరోజు అని నాకు తెలియదు సారి. ఎనివే సుపర్..

    ReplyDelete
    Replies
    1. Thanks for everything శృతిరుద్రాక్ష్:-)

      Delete
  9. Padmarpita gaaru.. Happy Birthday To you! Many many more Happy returns of the Day.

    Ilaage Ilaage.. spandinche kavitalu vraastoo.. nindu noorellu ananda jeevanam konasaaginchaali ani Deevistoo.. God bless you !!

    ReplyDelete
    Replies
    1. Thanks for your wishes & blessings Vanajagaru.

      Delete
  10. Sorry andi.. ee vela mee puttina rojani theliyadhu naaku. Anyway.. wish you many more happy returns of the day! Cake kosam waiting :P ;)

    ReplyDelete
    Replies
    1. sorry enduku ippudu wish chesaruga, mee share seperate ga pettanuga....andukondi birthday cake:-)

      Delete
  11. :(
    ఆవేదనంతా అక్షరాలలో నిక్షిప్తం చెసేసారు.
    మౌనమే నా స్పందన..కవిత పై వ్యాఖ్యానించదానికి నాకు బాష సరిపొవట్లెదు..
    పుట్టినరోజు శుభకాంక్షలండి..:)

    ReplyDelete
    Replies
    1. భాష ఎందుకండి....మీ భావస్పందనే చాలు.
      ధన్యవాదాలు మీ సహృదయ మౌనభావస్పందనకు.:-)

      Delete
  12. వేదనని ఇంత అందంగా చెప్పడం మీకే సాధ్యం
    వర్మగారు చెప్పిన మాటలకు నేను సై...సై

    ReplyDelete
    Replies
    1. సై అంటూ వంతపాడి స్పందించిన మీకు థ్యాంక్స్:-)

      Delete
  13. ప్రతి లైన్లోనూ భావాన్ని పద విన్యాసంతో అద్భుతంగా పలికించారు.
    బొమ్మ ఆఖరి మూడు లైన్లకూ అనుగుణంగా గీసినట్టుగా ఉంది. బొమ్మా కవితా రెండూ చాలా గొప్పగా ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. అంతగా మెచ్చి అభివర్ణించిన మీ ఆత్మీయ స్పందనకు నెనర్లండి.

      Delete
  14. ప్రేమలోని తాత్వికత్వాన్ని తెలుసుకుని రాసిన మీకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. తర్కంతో కాక అభిమానంతో నా బ్లాగ్ కి విచ్చేసి అభినందించిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  15. పద్మార్పిత గారు, పుట్టినరోజు శుభాకాంక్షలండి,.

    ReplyDelete
  16. మీ కవితలు వాటిలోని భావాల గూర్చి నా మనస్సునెప్పుడూ ఆలోచింపజేయలేదు., వైవిధ్యంగా ఆలోచించే మీ మనస్సు గురించి తప్ప.

    27 వ జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. నా మనసులోని ఆలోచనలకు ప్రతిరూపమే బ్లాగ్ లోని భావాలు కదండి.
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి.....

      Delete
  17. Roses are red, violets are blue, lotuses are for offering as poetry, today is your birthday.
    Wishing you all the great things in life & may your heart's desires fulfilled.
    Expected a more happy one than this one today;)

    ReplyDelete
    Replies
    1. thanks for your birthday wishes....
      In every post of mine you see only happiness my dear friend:-)
      Once again thanks to you.

      Delete
  18. అల్లంత దూరాన్న అందని ఆకాశమలే ఉన్న నిన్ను చేరి
    మేఘమై వర్షించి తృష్ణను తీర్చి ఊపిరిపోయ రమ్మంది!!!...నైస్ ...బాగుంది పద్మ గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. నా భావాలని ఆనందంగా ఆస్వాధించి, అభిమానంతో ఆదరించే మీకు అభివందనాలండి.



      Delete
  19. ఒక ప్రేమించే హృదయానిది ఇది నిజమైన వేదనైతే దాన్ని అనుభవించే వారికన్నా పొందలేనివాడే దురదృష్టవంతుడు.





    ReplyDelete
    Replies
    1. అదేంకాదు....ఇద్దరూ దురదృష్టవంతులే.:-)

      Delete
  20. కన్నీటి తెరల మాటున ఇన్నాళ్లూ నిద్దుర పోయిన నా స్వప్నం లేచి ఆశ్రమ గీతం పాడుతున్నట్టు అనిపించింది..!! నైస్‌ ఎక్స్‌ప్రెషన్‌!!!!!

    ReplyDelete
    Replies
    1. స్వాగతమండి....నా బ్లాగ్ కి విచ్చేసి స్పందించిన మీకు ధన్యవాదాలండి!

      Delete
  21. ఎప్పటిలాగే చాలా బాగుంది.

    ReplyDelete