జ్ఞాపకాల నీడ

జ్ఞాపకాల కొమ్మను వీడిన
ఆకొకటి ధూళితో దరి చేర
చూసిన మది విలవిలలాడె..

పాతస్మృతులను ఆత్రుతతో
గాంచిన కనులు చెమ్మగిల్ల
మనసు సుడిగుండమాయె..

ఆనాటి తీపి గుర్తులను తలచి
ఆ అర్హత ఏదంటూ నిలువలేని
బాసలు తామరాకుపై నీరై జారె..

విడివడినా కనబడని బంధమేదో
హృదయాన్ని కోసే భాధగామారి
నలుగురిలో నన్ను ఒంటరిని చేసె..

అంతుచిక్కని ప్రశ్నలెన్నో వేధించగా
గుండెలోకిక్కిర్సిన గుర్తులే జవాబులై
నీడలా ఉంటూ నన్ను నడిపించసాగె..


41 comments:

 1. అంతుచిక్కని ప్రశ్నలెన్నో వేధించగా
  గుండెలోకిక్కిర్సిన గుర్తులే జవాబులై
  నీడలా ఉంటూ నన్ను నడిపించసాగె..
  చాలా హృద్యంగా వుంది పద్మార్పిత గారూ.. జ్ఞాపకాల వంతెనకిందే మన జీవన యానం కదా.. చిత్రం ఎంపికలో మీకెవరూ సాటి రారు...అబినందనలతో...

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి అభివందనములు.

   Delete
 2. పాతస్మృతులను ఆత్రుతతో
  గాంచిన కనులు చెమ్మగిల్ల
  మనసు సుడిగుండమాయె.......

  ఈ సుడిగుండం లో కొట్టుకు పోవడం హాయిగా ఉంటుంది.....ఙాపకాలు వెంటాడుతుంటే వాటిని ఆస్వాదిస్తూ ప్రయాణించడం అంత కష్టం ఏమి కాదు కాని అక్కడక్కడా వచ్చే చిన్న చిన్న చేదు గిళికలు మెలిపెట్టేస్తాయి.

  ReplyDelete
  Replies
  1. సుడిగుండంలో హాయిగా ఏముంటాం చెప్పండి. ఏదో కొట్టుకుపోతాం కానీ:-)

   Delete
 3. మీ జ్ఞాపకాలతోపాటు భావలజడిలో కూడా తడుస్తున్నా....అభినందనలు

  ReplyDelete
  Replies
  1. మరీ తడిస్తే జలుబు చేస్తుందేమో జాగ్రత్త:-)

   Delete
 4. జ్ఞాపకాలు తీపి చేదుల మేలుకలయికై మనిషిని నడిపిస్తాయి విచిత్రం తీపైనా చేదైనా కంటి వెంట నీరే తెప్పిస్తాయి . చాలా హృద్యంగా ఉంది మీ జ్ఞాపకాల నీడ

  ReplyDelete
  Replies
  1. నిజమే మీరన్నది....థ్యాంక్యూ

   Delete
 5. చేసుకోండి ,మీ హృదయాన్ని మరింత '' విశాలం ''
  నవ్యానుభూతులు కూడా మధురం, అపారం , !
  కిక్కిరిసి పొతే, తొంగి చూస్తుంది, విషాదం !
  ఎందుకండీ, మీరు ఒంటరి అవడం ?
  మీలో ఉంది కదా , ఇంతటి కవితామృత భాండం !

  ReplyDelete
  Replies
  1. ఈ కవితామృత భాండానికి కారణం......
   జ్ఞాపకాలలోని దాగిన ఆనందం/విషాదం:-)

   Delete
 6. చాల బాగుంది

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ...

   Delete
 7. మనిషికి మనసుని శాపంగా ఇచ్చిన దేవుడు జ్ఞాపకాలని వరం గా ఇచ్చాడేమో!
  మీ కవిత చదువుతుంటే ఆర్ద్రంగా అనిపించింది.
  కవితకు తగ్గ బొమ్మ వేశారు, చాలా బాగున్నాయి బొమ్మా, కవితా రెండూనూ!

  ReplyDelete
  Replies
  1. వరాలు కూడా అప్పుడప్పుడూ శాపాలుగా మారతాయేమో:-)

   Delete
 8. చాల చాల నచ్చింది అంది.. మీ creative ఫీలింగ్స్ & వాటికి మీరు చేసిన framing method.. they are realy good n ur simply superb andi..

  ReplyDelete
 9. అద్భుతమైన జ్ఞాపకాలకి అతికినట్టుంది ఆ బొమ్మ..అభినందనల కన్నా మిన్నమైన పదం ఏదో అతికించండి.:-)

  ReplyDelete
  Replies
  1. నన్నే వెతుక్కోమంటే ఎలాగండి.:-)

   Delete
 10. పద్మ గారూ!
  బాసలు తామరాకుపై నీరై జారె..
  విడివడినా కనబడని బంధమేదో
  హృదయాన్ని కోసే భాధగామారి
  నలుగురిలో నన్ను ఒంటరిని చేసె....
  అందరిలో ఉన్నా ఒంటరితనం వియోగంలో విరహంలో ఈ భావన పరాకాష్ట కదూ!
  సరళమైన పదాల చక్కని భావం...@శ్రీ

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పాక కాదంటానా:-) థ్యాంక్యూ.

   Delete
 11. అక్షమక్షరంలో ఆర్దత నిండుకుంది.
  ఆకు వీడిన కొమ్మ కొత్త చివురులు తొడగాలి.

  ReplyDelete
  Replies
  1. మీరు ఆశీర్వదించారుగా:-) థ్యాంక్యూ.

   Delete
 12. రమేష్ గారు చెప్పినట్టు నిజంగా జ్ఞాపకాలు తీపి చేదుల మేలుకలయికై మనిషిని నడిపిస్తాయి విచిత్రం తీపైనా చేదైనా కంటి వెంట నీరే తెప్పిస్తాయి . చాలా చాలా హృద్యంగా ఉంది మీ జ్ఞాపకాల నీడ.. ఈమేజ్ సూపర్..

  ReplyDelete
  Replies
  1. మీకూ నచ్చిందిగా....థ్యాంక్యూ.

   Delete
 13. అవును. కొన్ని ప్రశ్నలకు వాటి తాలూకు జ్ఞాపకాలే సమాధానాలు. మీ శైలి బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. మీరు డైరెక్ట్ గా ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది:-)....థ్యాంక్యూ.

   Delete
 14. ఆ జ్ఞాపకాలతో ముందుకు సాగిపో పర్వాలేదు, కానీ వాటినే తలచుకుంటూ ఏడిస్తేనే కష్టం.

  ReplyDelete
  Replies
  1. ఓదార్చే వారుంటే....ఏడిస్తే కూడా బాగుంటుందండి (మరక మంచిదైతే లా:-)

   Delete
 15. ఒకోసారి అన్నీ తెలిసినట్లుంటారు...అంతలోనే జ్ఞాపకాలతో మనసుని తడిచేస్తారు.

  ReplyDelete
  Replies
  1. అభియోగమా....అభిమానమా:-)

   Delete
 16. mee జ్ఞాపకాల నీడలో తడిసిపోయి వెనక్కి పరుగు తీసిన మనసు మీ పాట తో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చింది
  బాగుంది చాలా

  ReplyDelete
  Replies
  1. పరిగెట్టి పారిపోకుండా.......పాటవినడానికైనా రండి:-)welcome to my blog.

   Delete
 17. '..నడిపించసాగె..' I wish that was with a smile on your lips.. :)
  Good post!

  ReplyDelete
  Replies
  1. I am always :-) thanks for visiting my blog.

   Delete
 18. ఆ చిత్రం కళ్ళనిండా జ్ఞాపకాల పచ్చదనమే......ఎంతబాగుందో( మీకు తెలుసుగా నేను పచ్చదనమంటే పడి చస్తానని:-) మీ బొమ్మలన్నీ దోచెసుకుంటాను చూడండి:-)

  ReplyDelete
  Replies
  1. దోచేసుకోవడమెందుకు.....మీ కళ్ళలో దాచేసుకొండి:-)

   Delete
 19. పద్మార్పిత గారూ!
  నిశాంత శాఖకు పూస్తూన్న పుష్పాలు,
  ఆహా! రమ్యమౌ కుంచె విదిలింపులు
  సమ్మోదభరితములు; కలల కళా లోకములు
  మీ దృక్కుల నుండి ఆకర్షణీయంగా వెలువరిస్తుంటాయి!
  ఇంత మంచి బొమ్మలను
  ఎలా మీ బ్లాగుకు అందించగలుగుతున్నారు?
  ప్లీజ్! నా "శ్రీమతి కోణమానిని"కి సలహాలను,
  వివరములనూ ఇవ్వండి!
  please!!!!!!!!!

  నా ఫోన్: 958182- 1746:
  ;
  - kadambari (pen name)

  ReplyDelete
 20. నా బ్లాగ్ కు స్వాగతం........మీ అభిమాన ఆత్మీయ స్పందనకు నెనర్లు.
  చిత్రలేఖనము పై ఉన్న అమితమైన ఇష్టమే...... ఇలా నా కళ్ళని ఎప్పుడూ రగ్గులద్దే కుంచెకు, వాటికి జీవం పోసిన కళాకారుల చిత్రాలన్వేషణలతో కట్టిపడేస్తాయి.

  ReplyDelete
 21. పెయింటింగ్ చూస్తూ మీ జ్ఞాపకాల నీడను గురించి ఏమి రాయాలో తెలియడం లేదండి. సారీ ఈసారికిలా....;)

  ReplyDelete
 22. 2012 naaku soonyame migilsindi 2013 ayinaa karunistundaa ani eduru choostu untaanu mee pilupukai nestam...

  ReplyDelete