లేచిపోనా???

ముందో వెనుకో కాదు నాతో నడచి
భారమైన దూరంలో నాకు నీవుచేరువై
నా కనుల భాషలో కానని భావాలని
మదితెలిపే కధగా నీకు వినిపిస్తుంటే...
వణికేపెదవులు కొరికి తడిపేసుకుంటూ
చెప్పనా వద్దాన్న సంశయంలో నేను
మెరిసేపెదవులపై పుప్పొడద్దాలని నీవు,
నడుమ గాలిదూరి గిలిగింతపెడుతుంటే...
నువ్వే నా ప్రాణమైనావన్న ఎదసడులు
చెప్పకనే చెప్పిన ఊసులై నీ చెవినిచేరగా
అది విన్న నీవు పరవశాన్న ఉప్పెనై పొంగి
ఎల్లలెరుగని అనురాగానికి ఏ హద్దుల్లేవంటే...
ఒకవైపు అంగీకరించే మనసుకు రెక్కలువచ్చి
సుధూర స్వప్నసౌంద్యర్యలోకానికి ఎగురబోవ
ఆలోచించంటూ తీరని భాధ్యతలు వెనక్కులాగ
మేలిముసుగులో అపరిచితురాలినై నిలుచుంటే...
నా నిస్సహాయతని నీవు మోసగత్తెగా అభివర్ణించ
సంఘం బరితెగించిన బ్రతుకంటూ గుసగుసలాడగా

బంధించే ఈ
భాధ్యతలేలని తెంచుకుని లేచిపోనా???
కోరివస్తే కాదని కట్టుబాట్లచెరసాలలో బంధీనై మిగలనా?

55 comments:

  1. Replies
    1. మనసులోని ప్రేమావేశాన్ని చలం మైదానం నవలలోని నాయికిలా నిర్భయంగా స్త్రీ త్యాగానికి ఆయత్తపడితే ధీరుడైన పురుషుడు ఆ త్యాగ లాభాన్ని స్వీకరించగలడా అని ప్రశ్నిస్తుంది..
      కవిత ఆసాంతం స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించారు...
      ఇలా పద్మార్పితనే రాయగలదు...
      అభినందనలతో...

      Delete
    2. వర్మగారు అన్నీ తెలిసిన మీరే ఏం కంక్లూజన్ ఇవ్వకుండా అభినంధిస్తే ఎలా....:-)

      Delete
    3. బావన్ని బందీగా చేయకుండా చెప్పిన విదానం మనస్సుకు హత్తుకుంది

      Delete
    4. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉందండి.

      Delete
  2. మాడం మీరు రోజు రోజుకి అందనంత ఎత్తుకి ఎదిగిపోతున్నారు మీ అలోచనలతో అందరినీ ప్రశ్నిస్తూ....only you have these guts to write or question, KUDOS:)

    ReplyDelete
    Replies
    1. ఎదుగుట విరుగుటకేనేమో....భయమేస్తుంది,
      అయినా ఎక్కడికి పోతాను చెప్పండి.:-)

      Delete
  3. పద్మార్పిత గారు .. మీరు ఏ అంశం తీసుకుని కవిత్వం వ్రాసినా బాగానే ఉంటుంది.
    చాలా కాలంగా మీ కవిత్వం కొన్ని అంశాలకే పరిమితం అయిపోతుంది.

    ప్రేమ,విరహం,మోసం,నిరీక్షణ ,తెంపరితనం ఇవే అంశాలు. ఈ అంశాలు జీవితంలో భాగాలే! కాని వస్తువైవిధ్యం ఉంటె చదవాలనిపిస్తుంది. ఓ.. కవితా ప్రేమిగా నేను ఈ విషయం చెప్పదలచుకున్నాను.

    సామాజిక సృహ కల్గిన కవిత్వం వ్రాయండి ప్లీజ్!! నా బ్లాగ్ నా ఇష్టం నాకు ఇష్టం అయినదే వ్రాసుకుంటాను అనుకుంటే.. అలాగే కానివ్వండి. చొరవ తీసుకుని ఈ మాట చెపుతున్నాను. మిమ్మల్ని నొప్పించినట్లు ఉన్నా నిజమే చెప్పాను.
    మంచి భావ వ్యక్తీకరణ చేయగల్గిన మీ టాలెంట్ కొన్ని అంశాలకే పరిమితం కాకూడదనే నా బాధ.నా భావన కూడా.

    ReplyDelete
    Replies
    1. వనజవనమాలిగారు....నేను ఇక్కడ ఇలా ప్రస్తావించానని అన్యధా భావించకండి, నాకు తెలిసి ప్రేమ, విరహం, మోసం, జీవితం అనే అంశాలలో సామాజిక సృహ ఉండదంటారా? డైరెక్ట్ గా ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడంకన్నా ఇలా ప్రశ్నిస్తే వాటి జవాబులకోసం అన్వేషించడంలో కనీసం ఆలోచిస్తున్నమేమో...ఇదికూడా ఒక రకమైన సృహేనేమో అని నా భావం.

      Delete
    2. వనజవనమాలిగారు..మీకు నా పై ఉన్న అభిమానం అలా నన్ను రాయమని ప్రేరేపిస్తుందే కానీ.....సామాజిక సృహను తెచ్చే అంశాలు రాసేంత జ్ఞానం నాకెక్కడిదండి.
      మీరంతా నా రాతల్ని ఆస్వాధిస్తూ (మనసులో తిట్టుకుంటూ;-) విసిగిస్తున్నా సహిస్తున్న మీ ఈ అభిమానంతో తప్పక రాసే ప్రయత్నం చేస్తానండి. సదా మీ సలహాలని, స్పందనలని కోరుతూ....

      Delete
    3. నో! వాఆఆఆఆఆ. మీలాంటి వాళ్ళు కూడా తాజ్ మహల్ కి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, ఎవరు, ఎవరు అంటే మేము ఏమైపోవాలి?
      మొదలే అంతంత మాత్రంగా చుట్టం చూపుగా ఈ బ్లాగు చూసే నాలాంటి వాళ్ళు ఆ రావటం గూడా మానేస్తారని మనవి చేసుకుంటున్నాము. ;)

      Delete
    4. మరీ అంత భయంకరంగా చెపుతానని భయమా:-)

      Delete
  4. చాలా బాగుంది..:)
    ఇలా చెప్తే సరిపోదని నాకు తెలుసు..:)
    మీకు తెలుసు ఇంతకంటే చెప్పలేనని..:)

    ReplyDelete
    Replies
    1. ధాత్రి అనే రెండక్షరాల పేరు ఆ రాధాకృష్ణుల పిక్ తో...:)
      ఇలా చెప్పలేనంటూనే ఎన్నెన్నో ఊసులు చెప్పేస్తుంటారుగా నాతో :-)

      Delete
  5. పద్మార్పితగారు....నాకు మీరు ఎప్పుడూ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ గానే కనిపిస్తారు. ఇలా ఆలోచించే స్త్రీలు చాలా అరుదు, ఉన్నా అందరిలో ఎక్స్పోజ్ అయి నిజాలని నిరభ్యరంతంగా ఒప్పుకోడానికి ఇష్టపడరు, అందుకే మీరంటే ప్రత్యేకమైన అభిమానం. మీ పంధాలో మీరు ప్రశ్నిస్తూ సాగిపొండి.

    ReplyDelete
    Replies
    1. అనికేత్ నా భావాలకి అనుగుణంగా ఆలోచించి అభిమానిస్తూ స్పందలని జోడించి ప్రోత్సహిస్తున్నందుకు...ధన్యవాదాలు.

      Delete
  6. నేను మారాను. బహుషా ఈ కవిత పై స్పందించిన వారు ఖచ్చితంగా మారే ఉంటారు. ఈ కవితను చదివిన వారు ఇకపై చదివే వారు మారే అవకాశమూ లేకపోలేదు. అందరూ ఎప్పుడో ఒకసారి మారక తప్పదు. కనిక మీరు లేచిపోనవసరం లేదు. బంధీ వవ్వనవసరమూ లేదు.

    ReplyDelete
    Replies
    1. కర్ర విరగనులేదు...
      పాము చావనులేదు:-)

      Delete
  7. మది పలికే భావాల్లో సమాధానం లేక వినిపించే చిక్కుప్రశ్నలెన్నో...
    భావాల ఈ కవిత ఆలోచన కలిగించేదే ఎవరికైనా!

    ReplyDelete
    Replies
    1. ఆలోచిస్తూ నాతో చిక్కని తిట్టుకోకండి:-)

      Delete
  8. మీరు వేసే ప్రశ్నలకి జవాబులు దొరక్క నేను వంటకి చేయకుండా ఎగ్గొట్టలంటే మీ కవిత వినిపించి మావారికి జవాబు చెప్పమని....నేను మీ బ్లాగ్ పోస్ట్ లు చూస్తూ ఎంజాయింగ్:-) అందుకే మీరు ఇలా అడుగుతూ రాసేయండి పద్మార్పితగారు...

    ReplyDelete
    Replies
    1. మీరు వంట ఎగ్గొట్టడానికి నేను కారణమని ఇంకో అభియోగమన్నమాట:-)

      Delete
  9. ఓ మై గాడ్ చాలా చాలా బాగుందండి, ఇలాంటి ప్రత్యేకమైన కవితలు రాయడం నీకుమాత్రమే సాద్యం సుమి. కోరివస్తే కాదని కట్టుబాట్లచెరసాలలో బంధీనై మిగలనా? లేక బంధించే ఈ భాధ్యతలేలని తెంచుకుని లేచిపోనా??? అని అడిగారుగా, వెళ్ళిపొతే కొన్నిరోజులు మాత్రమే కొపంగా ఉంటారు పెద్దవాళ్ళు ఆ తర్వాత కొన్నాళ్ళకు అంతా ఒకటైపొవచ్చు. కాని కట్టుబాట్ల పేరిట ఒక్కసారి విడిపొయామంటే జీవితాంతాం విడిపొయినట్టె... ఇమేజ్ సూపర్

    ReplyDelete
    Replies
    1. శృతిగారూ అంతేనా! అలా లేచిపొమ్మంటారా:-)

      Delete

  10. పోదురూ, మరీ బడాయి, చెప్పి వెళితే లేచి పొయినట్లవుతుందా ? చెప్పా పెట్ట కుండా ఉడాయించాలి కాని!


    చీర్స్

    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. ఆ మీకేం చెప్పడం సులభమే.....లేచిపోవడమంటే మాటలా అనిపిస్తుంది :-)

      Delete
  11. మొత్తం కవిత లో నాకు చాలా నచ్చింది - చిత్రం.....
    మీ మొత్తం బ్లాగ్ పిక్స్ లో ఈ చిత్రం చాలాఅందంగా ఉంది..
    మీరు మరింత creativity గా చేసారు..
    I am ❤'ing it :D

    ReplyDelete
    Replies
    1. ఓ....మీ ప్రొఫైల్ పిక్ కూడా భలే క్యూట్ గా ఉంది.
      మొదటిసారి తెలుగులో కమెంట్ పెట్టినందుకు కంగ్రాట్స్:-)

      Delete
  12. ఈరోజుల్లో ఎవరండి కట్టుబాట్లు, భాధ్యతలు అంటూ బంధీలై బ్రతుకుతున్నవారు. ఎవరి స్వార్థం వారిది.

    ReplyDelete
    Replies
    1. అలా ఉన్నవారు ఉన్నారండోయ్..

      Delete
  13. మీతో నడచి మీకు తోడుండేవాడుంటే....లేచిపోవడంలో తప్పులేదేమో!

    ReplyDelete
  14. మనసులో లేచిపోయి

    వాస్తవం లో మరిచిపోయి

    భాద్యతల వలయం లో నలిగిపోయి

    వుహల పల్లకిలో ప్రేమలో సొలసిపోయి

    ప్రియుడి యెదలో మోస పోయి

    సమాజం దృష్టిలో పతిత గా రాలిపోయి

    భర్త పాదాలలో వాలిపోయి

    సోలిపోవాలి చివరకు .

    ReplyDelete
    Replies
    1. మొత్తం నెట్ రిజల్ట్స్ చప్పేసారుగా..:-)

      Delete
  15. Padmarpita garu, Kavita really good and looks like you stick with what you believe in, that’s what important for life and you used perfect wording with right meaning in “కోరివస్తే కాదని కట్టుబాట్లచెరసాలలో బంధీనై మిగలనా” and I no need to go thru rest of the above…you got excellent talent.

    ReplyDelete
    Replies
    1. Oh...welcome and thanks for your compliments:-)

      Delete
  16. చిరు దివ్వెలా వెలగనీ జీవితాన్ని !
    మరు భూమి లో మధురానుభూతులను నిక్షిప్తం చేయడం ఎందుకు ? !
    'బంధనాల ముసుగు 'లో అందాలను బంధిచడం ఎందుకు ?
    కట్టు బాట్ల చెరలో లో పంజర జీవితం ఎందుకు ?
    స్వేచ్చా పావురమై ఎగిరి పో ముందుకు !
    మరో పావురం తో జత కట్టేందుకు !
    మరుల గోపురం లో కాపురం చేసేందుకు !

    ReplyDelete
    Replies
    1. చిన్ని కవితలో మీ జవాబుని మీదైన రీతిలో చక్కగా తెలిపారు. ధన్యవాదాలు.

      Delete
  17. కవిత పరంగా బాగుందండి లేచిపోయే బంధనాలని తెంచుకోనక్కర్లేదు అలాగని బంధీలైనవారంతా భాధ్యతలనేమీ నిర్వర్తించేయడంలేదు. అయినా అడిగి చెప్పి లేచిపోతారేంటి?

    ReplyDelete
    Replies
    1. ఇలా ఉన్నారు లేరు అనే మీమాంసలో ఏం లేచిపోను చెప్పండి:-)

      Delete
  18. bagundi bahu bagundi padmarpita garu....

    ReplyDelete
  19. lechipodamaaaa hahahahahahahahahahaha

    ReplyDelete
  20. alasyam cheyakandi.. rekkalu thodukooni egirpondi....

    ReplyDelete
    Replies
    1. egiripothe entabaaguntundi....ani paadukuntunnaa:-)

      Delete
  21. బంధం కావాలో......భంది అవుతారో త్వరగా నిర్ణయం చేసుకోండి, అసలే ఆలస్యం అమృతం విషం అన్నారంట ఎవరో పెద్దలు......!!!!!!

    ReplyDelete
    Replies
    1. నిదానమే ప్రధానం అని కూడా ఆ పెద్దలే అన్నారండి.:-)

      Delete
  22. శృతి గారు చెప్పింది అక్షర సత్యం పద్మ గారు........

    ReplyDelete
    Replies
    1. అవును అంతేనండి...

      Delete
  23. లేచి ఎక్కడికి పోతారు. ఇక్కడే ఎక్కడో వాలుతారు. అందుకని అక్కడే ఉంటూ, గుసగుసల బంధనాల గొలుసులు తెగేలా, గుసగుసలాడు వారు ముక్కున వేలు వేస్కునేలా, నోళ్ళు అలాగే తెరిచి ఉంచేలా, ఆ గుసగుసలు వినే వారి చెవుల్లో ధిక్కారపు ఘీంకారాలాను వినిపిస్తూ మీ సహజమైన రీతిలో ఆడుతూ, పాడుతూ ఉండండి.

    మరీ బోర్ కొడితే అప్పుడప్పుడూ లేచి పొండి, మీరలా పక్షి లా లేచి వస్తుంటే నేను మధ్యలో ఎక్కడైనా కనిపిస్తానేమో.. ఒక్క చూపు చూసి పొండి.

    ReplyDelete
  24. ఓహో.....ఇదేదో వెరైటీగా ఉండి నాకు నచ్చేసింది:-) అలా అప్పుడప్పుడూ ఎగిరిపోతా!

    ReplyDelete
  25. నేనూ వేదం సినిమా వచ్చిన మొదట్లో ఇలాగే పాడుకునేవాన్ని.. ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..అని..

    ReplyDelete