ఈ శిక్ష

చల్లని వెన్నెలరేయిలో నీవు గుర్తొస్తే
మనసులేచి చంద్రుడ్ని జోకొడుతూ
మన్మధుడ్ని తిడుతూ నిన్నుకోరింది!

మంచుకురిసేవేళలో నేను ముద్దైతే
రెపరెపలాడే నా కనురెప్పలు రేయిని
పగలుగా మార్చమని తూర్పునడిగింది!

సూర్యకిరణాలు సూటిగా నన్ను చూస్తుంటే
ఎర్రబడిన నా నయనాలు నిర్దోషిని నేనంటూ
నీపై అపవాదుని నాపై మోపి శిక్షించమంది!

కఠినంగా దండించలేని  జీవితం కరుణచూపితే
బింకానికి
పోయిన భావాన్నీ బెట్టు చూపుతూ
వెక్కిరించే విధితో ఈ ఎదురీత అవసరంలేదంది!

36 comments:

  1. మంచుకురిసేవేళలో నేను ముద్దైతే
    రెపరెపలాడే నా కనురెప్పలు రేయిని
    పగలుగా మార్చమని తూర్పునడిగింది!

    అద్భుత భావావిష్కరణ పద్మార్పిత గారు.. మీ కవితా హృదయానికి నీరాజనాలు...

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన భావస్పందనకు వందనాలు....

      Delete
  2. చల్లని వెన్నెలరేయిలో నీవు గుర్తొస్తే
    మనసులేచి చంద్రుడ్ని జోకొడుతూ
    మన్మధుడ్ని తిడుతూ నిన్నుకోరింది!
    చాలా నచ్చింది,ఎంతైనా మీరు చాలా తెలివైనవారు:)

    ReplyDelete
    Replies
    1. నచ్చినందుకు నెనర్లండి...ఎంతైనా మీ స్నేహితురాలినికదా:-)

      Delete
  3. పెయింటింగ్ మీపదాలకి అనుగుణంగా అమిరిందండి పద్మార్పితగారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రేరణగారు.

      Delete
  4. ఇంత చక్కటి భావ కవిత్వం రాస్తూ
    '' Nothing Important/ special for the world '' అని మీ గురించి ఎట్లా రాసుకున్నారండీ ?!!!
    మీరు చాలా మోడె స్ట్ అనుకోవాల్సి ఉంటుంది పద్మార్పిత గారూ !

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి స్వాగతం సుధాకర్ గారు.
      అంతా మీ అభిమానం అంతే:-)
      ధన్యవాదాలండి.

      Delete
  5. మీ భావాల జడి ఝరై, మమ్ములను ముద్దచేస్తూ మంత్రముగ్దుల్ని చేస్తూ కళ(ల)ల సాగారానికిలా సాగిపోనీ...

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానజడిలో నన్ను ఉప్పొంగనీయండి:-) థాంక్యూ!

      Delete
  6. రాసేకొద్దీ మీ కవితలు పదునెక్కుతున్నాయనిపిస్తుంది. భావాన్ని గొప్పగా పదాల్లోనూ బొమ్మల్లోనూ ఆవిష్కరిస్తున్నారు.
    బొమ్మలో కళా నైపుణ్యం కనిపిస్తుంది.
    భింకానికి లో 'భి' అచ్చుతప్పేమో...

    ReplyDelete
    Replies
    1. ఆస్వాదించి అభిమానంతో స్పందించే మీ ఈ మాటలే నాకు ప్రేరణలు, ధన్యవాదాలండి.
      నిజమే గమనించలేదండి, ఇప్పుడు సరిచేసాను. థ్యాంక్యూ వెరీమచ్!

      Delete
  7. అమ్మో....ఏమిటీ భావఒరవడి, పరిపూర్ణ పక్వత చెందిన పదజాలంలో బంధించావు:-) భేష్!

    ReplyDelete
    Replies
    1. సృజనగారు....బంధించానని తిట్టుకుంటూ మెచ్చుకునే మీ అభిమానానికి ధన్యవాదాలండి.

      Delete
  8. జీవితమేదో కరుణ చూపించింది.....ఇంకా ఈ బింకాలెందుకో ఏమో నాకు అర్థం కాలేదండి:-)

    ReplyDelete
    Replies
    1. అందరూ మీలా అడ్జస్ట్ కాలేరుకదండి అందుకేనేమో....ధన్యవాదాలండి!

      Delete
  9. "Saying Something About This Can Definitely Not Express My Feelings.."
    అదే మరి మీ కవితల్లోని గొప్పదనం..విన్నాక నాలాంటి పదజ్ఞానం లేనివారు
    స్పందించగలరు కానీ వ్యాఖ్యానించలేరు. :):)

    ReplyDelete
    Replies
    1. "without expressing anything itself expresses every feeling"
      ఇదే మీరు అందించిన అభిమానం.....ఏ పదాలు పంచలేని ఆనందం:-) థ్యాంక్సండి!

      Delete
  10. బావుందండీ ఎక్స్‌ప్రెషన్‌!!

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి నచ్చి మెచ్చిన మీకు!

      Delete
  11. మీరు ఇలా అద్భుతమైన భావాలతో రాసేస్తుంటే నేను కమెంట్లు పెట్టడం రాక ఏదో రాసి మీకు కోపం తెప్పిస్తానో అని భయ్యంగా ఉంది బాబోయ్:-)

    ReplyDelete
  12. కోపమనే పదానికి భావమే తెలియని నా బ్లాగ్ అంటే భయమెందుకే భామా:-)

    ReplyDelete
  13. /సూర్యకిరణాలు సూటిగా నన్ను చూస్తుంటే
    ఎర్రబడిన నా నయనాలు నిర్దోషిని నేనంటూ
    నీపై అపవాదుని నాపై మోపి శిక్షించమంది!/

    హమ్మమ్మమ్మా! అర్థం లేకున్నా, అద్భుతంగా వుంది మీ కవితవేశం. :P :))

    ReplyDelete
    Replies
    1. అమ్మమ్మా...ఏదో అర్థంకాలేదని మీరంటే మాత్రం అభినందించిన మీకు థ్యాంక్స్ చెప్పనా ఏంటి!:-) thank Q.

      Delete
  14. చాలా బాగుంది పద్మర్పిత గారు :)

    ReplyDelete
  15. చాలా చాలా బాగుంది పద్మర్పిత గారు. పెయింటింగ్ చాలా అందంగా ఉందండి...:)

    ReplyDelete
    Replies
    1. శృతిగారు నచ్చి మెచ్చిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  16. "మంచుకురిసేవేళలో నేను ముద్దైతే
    రెపరెపలాడే నా కనురెప్పలు రేయిని
    పగలుగా మార్చమని తూర్పునడిగింది" Nice feeeling Padma gaaru...

    ReplyDelete
    Replies
    1. శోభగారు వెల్ కం టు మై బ్లాగ్....మెచ్చి కామెంటిడిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  17. చల్లని వెన్నెలరేయిలో నీవు గుర్తొస్తే
    మనసులేచి చంద్రుడ్ని జోకొడుతూ
    మన్మధుడ్ని తిడుతూ నిన్నుకోరింది!.....బాగుంది పద్మర్పిత గారు.

    ReplyDelete
    Replies
    1. ఆ లైన్స్ నచ్చాయంటు వ్యాఖ్యిడిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  18. అంతా బాగుంది, కానీ ఎక్కడో ఏదో కొరత....అదే బొమ్మ ముఖంలో కూడా కనబడుతుంది.(నా ఫీల్ మాత్రమేనండి)

    ReplyDelete
    Replies
    1. ఏదో ఉండే ఉంటుంది లేకపోతే మీకు అలా అనిపించదు కదా....ఏదో ఆలోచించి చెప్పండి:-) థ్యాంక్యూ.

      Delete
  19. చాలా బాగున్నాయి మీ భావాలు పద్మ గారూ!...ముఖపుస్తాకపు మీట్ హడావిడిలో o పది పదిహేను రోజుల్నించి బ్లాగ్స్ చూడలేకపోయాను...అభినందనలు...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా అభినందనలు. మీట్ చాలా బాగా జరిగింది కదా!

      Delete