తీరం.....

అద్దమా.....నీవూ నా మనసులాగే
నా మనసుని విరిచి నవ్వమని నన్ను
పగిలిన నిన్ను పనికిరావని పారవేసారు!

ప్రేమా.....వారి అవసరానికి నీ పేరు పెట్టి
నవ్వేపెదవులతో తీయని మాటలెన్నో చెప్పి
దాహం తీర్చిన ముంతని వలదని విసిరేస్తారు!

దుఃఖమా.....నాడు నిన్ను కాలితో తన్నితే
నేడు  పరామర్శించడానికి వచ్చావు నన్ను
కంటనీరింకితే చెక్కిళ్ళపై చారలేం చూడగలరు!

నేస్తమా.....నా మౌనం నిన్ను కలవర పెట్టి
నీ ఎదతడపని కన్నీరు హృదయాన్ని ముంచి
కనపడని గాయమైతే మందేం వేయమంటారు!

ఆనందమా.....నాది కాని నీకై వెదికి అలసిపోతే
చేతిగీతలు చూసి నుదుటి రాతలో లేని నన్ను
గేలిచేస్తూ గోల చేయకే వెర్రిదానా అని నవ్వేస్తారు!

జీవితమా.....ప్రేమలో అంధుడివైన నావికుడిలాగే
నా ఆవేదనంతా దిక్సూచిగా చేసి ఎగురవేసినా
తూఫాను అలజడిలో నౌకను తీరం చేర్చలేరు!

54 comments:

  1. చాలా అద్భుతంగా అద్దం, ప్రేమ, దుఃఖం, నేస్తం, ఆనందం, జీవితం కి మీ కవితలో అద్దం పట్టారు. అద్దంలో ప్రతిబింబమంత స్పష్టమైన భావన...

    ReplyDelete
    Replies
    1. నా భావ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూసి మెచ్చిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  2. నా మౌనం నిన్ను కలవర పెట్టి
    నీ ఎదతడపని కన్నీరు హృదయాన్ని ముంచి
    కనపడని గాయమైతే మందేం వేయమంటారు ???.........
    woww...beutiful expression padmagaru...
    "uss fiza me bhi jalte rahe hai hum kisi ke liye,
    jahan chirag bhi taraste the roshni ke liye".....!!!

    ReplyDelete
    Replies
    1. మిమ్మల్ని మెప్పించినందుకు ఆనందమాయె మనసు:-)
      Thanks for your compliments dr.malleshji...
      Hawaonke bina fiza mei surur na hota,
      Chandni ko bhi chand ke bina gurur na hota,
      Aap jaise dilwale na hote to chiraag mei roshini na hota...:-)

      Delete
  3. మీ మనస్సునద్దంగా పరిస్తే, ప్రపంచం తన అందాలకు మెరుగులు దిద్దుకోవడం ప్రారంభిస్తుందేమో....

    ReplyDelete
    Replies
    1. అంత లేదండీ......ఇది నన్ను నేను మెరుగులు పెట్టుకోవాలన్న ఆరాటమం అనుకోండి....

      Delete
  4. చాలా చాలా..బాగుందండి.

    ReplyDelete
  5. చాలా బాగుందండి.

    ReplyDelete
  6. madam day by day you are rocking,highly matured poetry......congratulations

    ReplyDelete
    Replies
    1. thanks for your inspiring comments:-)

      Delete
  7. సాగి పొతున్న పడవని తీరాన్ని కుర్చుని తదెకం గా చూస్తున్న బావన కలిగెలా ఉందండి మీ అక్షరూపం ....చాలా చాలా బాగుందండి..

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి స్వాగతం. మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  8. chaalaa bagundhi padmagaaru.....kanta neeru inkuthundhi ane word nenu naa next post lo raasaanu....:)

    ReplyDelete
    Replies
    1. thank q.....words use cheyandi kaani...kanta neeru inka neeyadamo, raanivvadamo maatram cheyakandi nestam:-)

      Delete
  9. entandi ilaa kavitalu vraasestunnaru meeru...
    vepaaku tinaga tinaga tiyyaga maarutundi antaa... adi nammaledu andi... kai mimmalni choosakaa.. tappadu... andi...

    yela unnaru meeru naaku ye reply ivvavaddu adi naaku nachadu malli chepputunnaa... oknaaa...

    idi naa request kaadu naa command

    ReplyDelete
  10. ప్రేమా.....వారి అవసరానికి నీ పేరు పెట్టి
    నవ్వేపెదవులతో తీయని మాటలెన్నో చెప్పి
    దాహం తీర్చిన ముంతని వలదని విసిరేస్తారు!

    దుఃఖమా.....నాడు నిన్ను కాలితో తన్నితే
    నేడు పరామర్శించడానికి వచ్చావు నన్ను
    కంటనీరింకితే చెక్కిళ్ళపై చారలేం చూడగలరు!

    ఇలా ఎలా రాయగలిగారండీ...
    చదువుతుంటే కన్నీరింకని హృదయం ద్రవిస్తూంది...
    ఈ వేదనకు తోడుగా ఆ చిత్రం ఎదురుగా ఖాళీ పడవతో...
    కవితకు తగ్గ చిత్రాన్ని ఎంపిక చేసే మీ కళా హృదయానికి సుమాంజలులు పద్మార్పిత గారు...

    ReplyDelete
    Replies
    1. స్పందించే హృదయం సున్నితమైతే, మీ వ్యాఖ్యలా ఉంటుందే
      ఆ చిత్రానికే మాటలు వస్తే, మీతో ఎన్నో ఊసులు చెప్పేదే
      మీ కమెంట్స్ కి ఆనందంగా నా మనసు ఎగిరి గంతేయగా
      ఇలా గబ్బర్ సింగ్ లోని పాట ట్యూన్ లో నేను రిప్లై ఇవ్వగా
      మీరు మన్నించి నవ్వేయాలి ఇలా:-) హోలా....హోలా
      మీ సుమాంజులులకు వందనాలు చాలా:-)
      (Just for fun, please dont take it as serious)

      Delete
    2. ఆకాశం వంగి మీ నుదుట ముద్దిడి
      సూరీడే సింధూరమై మెరవగా
      చెక్కిలిపై జాబిలి సంతకం కాగా
      ఎదలో కావ్య పద్మాలు వికసించగా
      నవ్వుల జలపాతంలా వడి వడిగా
      ఆనంద తీరం చేరాలని.....:-)

      Delete
    3. థ్యాంక్సని చెపితే మీరు రాసిన వాక్యాలు చిన్నబోతాయేమో!

      Delete
  11. ఇంత భాధగా మనసును కరిగించేలా చెప్పడం మీకే చెల్లు. వేదనకూడా మీ పదాల్లో అందంగానే ఉంటుందండి.

    ReplyDelete
    Replies
    1. భాధను చూసి భయపడితే ఇంకా భాధ పెడుతుంది,
      దాన్ని నవ్వుతో కప్పిపుచ్చితే, కుక్కినపేనులా పడుంటుంది.
      కొత్త థియరీ...:-)

      Delete
  12. abbabba em sepparu em sepparu ....

    ReplyDelete
  13. Meee Kavitalu Chustuntte Mimmalanu Chusinatte Vundandi ...

    ReplyDelete
    Replies
    1. మోము చూడాలన్న కాంక్ష ఎందుకు?
      భావం తెలుసుకుని సాగిపో ముందుకు!
      Thanks for your comments.

      Delete
  14. జీవితమా.....ప్రేమలో అంధుడివైన నావికుడిలాగే
    నా ఆవేదనంతా దిక్సూచిగా చేసి ఎగురవేసినా
    తూఫాను అలజడిలో నౌకను తీరం చేర్చలేరు!
    ఈ చివరి లైన్లు చాలా చాలా నచ్చాయండి...
    గుడ్డివాడికి దిక్సూచి
    చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ...
    చక్కగా చెప్పారు...అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. అభినందించిన మీకు అభివందనములు.

      Delete
  15. "ఆనందమా.....నాది కాని నీకై వెదికి అలసిపోతే
    చేతిగీతలు చూసి నుదుటి రాతలో లేని నన్ను
    గేలిచేస్తూ గోల చేయకే వెర్రిదానా అని నవ్వేస్తారు!" జీవితపు ఫిలాసఫీనంతటినీ ఒక వాక్యంలో చెప్పేయగల్గటం మీ పరిణతిని సూచిస్తోంది...నచ్చిన వాక్యాలివి

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య.....మీకు నచ్చినట్లుగా రాసేసానుగా, భలే ఆనందంగా ఉంది మీ ప్రసంశ:-)
      పరిణితి చెందినట్లురాసాననడం నాకు నచ్చింది. థ్యాంక్యూ!

      Delete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. మీదా!
      సున్నితమైన హృదయమా?
      కాదు.....కానేకాదుగా
      *
      *
      *
      అతిసున్నితమైనది
      అందుకే స్పందించదుగా
      చంచలిస్తుంది మిత్రమా:-)

      Delete
  17. పద్మా గారు ....మీ బ్లాగ్ కి స్వాగతం చెప్పినందుకు చాలా ఆనందం గా ఉందండి ..

    ReplyDelete
  18. పద్మగారు...మీ అద్దంలాంటి మనసు చెప్పే తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమే:-)

    ReplyDelete
    Replies
    1. అవునా..... ఈసారి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తానుగా:-)

      Delete
  19. కవిత చాలా సార్లు చదివాను. ఎందుకో అసంపూర్తిగా అనిపించింది. కొన్నిచోట్ల అడుగుతున్నారో చెబుతున్నారో అర్ధంకాలేదు. ;(
    మీరు అద్దమా అని మొదలు పెట్టారు. మనసా అని మొదలు పెట్టి ఉంటే బాగుండేదేమో?
    కవితకి బొమ్మ సరిగ్గా సరిపొయింది ఈసారి మాత్రం. ;)

    ReplyDelete
    Replies
    1. బహుశా అది నన్ను నేను ప్రశ్నించుకోవడంలో జరిగిన పొరపాటై ఉండవచ్చు......అందుకే అన్నిసార్లు చదవాల్సి వచ్చిందేమో!
      మనసులాగే అద్దమా నిన్ను కూడా పగిలాక పడేసారు అని చెప్పాలన్నదే నా భావమండి.
      భావప్రకటనలో లోపాన్ని సరిచేసుకుని మెప్పించే ప్రయత్నం చేస్తానండి.
      మీ కమెంట్స్ ని సదా ఆశిస్తూ.....ధన్యవాదాలండి

      Delete
    2. కవిత మొదట్లో మీ భావం అర్ధమయినది. నేను ప్రాస గురించి వంక పెట్టానంతే. ;)
      అద్దం, ప్రేమ, దుఃఖం, నేస్తం, ఆనందం, జీవితం వరస పంక్తి కంటే, మనసు, ప్రేమ, దుఃఖం, నేస్తం, ఆనందం, జీవితం వరస బాగా వుంటుందిగదా అని నా కవి హృదయ ఘోష ! ;)

      Delete
    3. వంక పెట్టారు అంటే వందసార్లు చదివి ఉంటారు కదా! అది చాలు:-).
      నిజమే మీరన్నట్లు 'మనసు' అని పెట్టినా బాగుంది. అయినా అలా పెడితే మీరు ఇన్నిసార్లు చదివి వంక పెట్టరుగా:-)థ్యాంక్యూ!

      Delete
  20. .ప్రేమలో అంధుడివైన నావికుడిలాగే
    నా ఆవేదనంతా దిక్సూచిగా చేసి ఎగురవేసినా
    తూఫాను అలజడిలో నౌకను తీరం చేర్చలేరు!
    చక్కని ముగింపు...చక్కని భావాలకు...
    అభినందనలు పద్మ గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి శ్రీగారు.

      Delete
  21. ప్రేమా.....వారి అవసరానికి నీ పేరు పెట్టి
    నవ్వేపెదవులతో తీయని మాటలెన్నో చెప్పి
    దాహం తీర్చిన ముంతని వలదని విసిరేస్తారు!
    చాలా నచ్చింది

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి ప్రేరణగారు.

      Delete
  22. Chala bavundi Padmarpitha garu :)
    Me recent poem paina comment veyalekapotunna...
    Meeku facebook lo request pettanu...Meeku ishtam unte add cheskondi :)

    ReplyDelete
    Replies
    1. thanksandi Valli gar.....aunu edo problem comments pettalekapotunnam ani kundaru mitrulu mail pamparu. ippudu autunnayandi. Facebook add chesukuntanandi.

      Delete
  23. అంతేనమ్మా పద్దమ్మా... మనం ఎంత ఇదిగా ఆశ పడ్డా ఆశలేవీ తీరం సేరవు... మా బాగా సెప్పినావు... ఆడదాని మనసు ఆడదానికే ఎరుకంతారు... ఏటో ఈ కైత సదివినాక మనసంతా ఏటో ఐపోనాది అమ్మీ... నువ్వంటే మా గొప్ప ఇష్టమైపోనాది...

    ReplyDelete
    Replies
    1. ఇలా ఏటేటో ఐపోనాది అమ్మీ అంటే నేనేం అనగలనే ఓలమ్మీ....నువ్వేటంటే నానదే:-) మాఇదిగా మెచ్చేసినావుగందా!!

      Delete