ఏకమవనీ..

నాకు ఎవరూ, ఏదీ నచ్చట్లేదు
చివరికి నీవు కూడా నచ్చట్లేదు
నీజ్ఞాపకాలు, నీమాటలే నీకన్నా బాగున్నట్లు
అందులో నేను తడిసి ముద్ద అవుతున్నట్లు...
బాధే అయినా అవే బాగున్నాయ్
ఎందుకిలా నన్ను కలవరపెడుతున్నావ్
అని నీపై అరిచి గోలచేసి ఛీవాట్లు పెట్టి
ఇరువురమన్న భ్రమలో అందరిలో పోట్లాడి...
నీవు మౌనంగా ఉంటే నిన్ను రక్కి
నీకు గాయమైతే నేను గగ్గోల పెట్టి
నీవు నలుగురిలో ఎదుటపడని భావలని
మన ఏకాంతంలో నీతో పలికింపజేయాలని...
అలుగరాదనుకుని నీపై అలిగికూర్చుంటే
ఇదే గాయమంటూ నన్ను వాటేసుకుంటే
నీ ఎదపైవాలి నేను నీలో కలిసిపోవాలని
అన్నీ మరచి నీ ప్రేమలో కనుమూయాలని!!!

71 comments:

  1. బాగుంది భావం కవితలో చెప్పిన తీరు. బొమ్మలో చేతికి గాయమూ పెట్టారు సింబాలిక్ గా...

    ReplyDelete
    Replies
    1. @ కళాదృష్టితో గాయాన్ని గమనించిన చిన్ని ఆశ గారికి
      రంగులద్ది నా బొమ్మలకి భాష నేర్పమననా చేతులెత్తి మొక్కి.....

      Delete
  2. ఈ గాయం తియ్యగా ఉంది పద్మర్పిత గారు.

    ReplyDelete
    Replies
    1. @ నమస్తే:-మీరు మెచిన తియ్యని గాయనికి మందేదైనా వేయండి జయగారు....

      Delete
  3. bagundi andi padmarpita garu, nijanga chinni krishna garu cheppinatlu picture lo symbolic ga gaayam kuda undi... its nice.

    ReplyDelete
    Replies
    1. @శృతిరుద్రాక్ష్ కూడా గాంచెను చేతిగాయాన్ని,
      మదిగాయాన్ని చదవడం మీకు సులువేను...
      అందుకోండి నా మనఃపూర్వక వందనాన్ని...

      Delete
  4. చాలా బాగుంది పద్మార్పిత గారు :)

    ReplyDelete
    Replies
    1. @ కావ్యాంజలి పొగిడెను...నా మది మురిసెను...

      Delete
  5. చివరికి నీవు కూడా నచ్చలేదంటూ దూరంగానెట్టి మళ్ళీ దగ్గరకు తీసుకోవడం, తిట్టినా కొట్టినా నీవే అనేలా మలచుకోవడం.....వావ్ సూపర్:) ఆ నేర్పు మీ ప్రతికవితలో చూస్తూనే ఉంటాము....తలమీద మొదట మొట్టి తరువాత తలదువ్వడం మీకే సాధ్యం:)
    పెయింటింగ్ అదిరిందండి.....క్లాప్స్

    ReplyDelete
    Replies
    1. @ ఈ అనానిమస్ ఎవరో కాస్త పేరు చెప్పి తిడితే బాగుండును...
      తిడుతూనే పొగిడి చప్పట్లు కొట్టెను అవి నా హృదిన నిలిచెను...

      Delete
  6. చాన్నాళ్ళకి మీదైనరీతిలో ప్రేమని కురిపించారు కవితలో, కంగ్రాట్స్ మేడం మరిన్ని రాయాలని కోరుతూ...బొమ్మలోనే భావం చెప్పే మీ కళాతృష్ణకి జోహార్లు.

    ReplyDelete
    Replies
    1. @ యోహంత్ రాసే ప్రతి అక్షరంలోను రంగుల్ని చూసి మెచ్చే మీ అభిమానం నన్ను ఇలా రాయించును...

      Delete
  7. చాలా బాగుంది పెయింటింగ్ సూపర్:)

    ReplyDelete
    Replies
    1. బహుకాలానికి సూపరన్న మీకు :-)
      కృతజ్ఞతలు తెలుపుచున్నాను...

      Delete
  8. నచ్చనట్లు నచ్చినట్లు చేయకూడదనుకంటూ చేసేస్తూ ఇదే అచ్చమైన ప్రేమ అందంగా చెప్పారు పద్మార్పిత మీకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. @ వెన్నెల లహరి.....
      నా మనసు గ్రహించి అభినందించిన నన్ను అలరించిరి....
      మీరు నా ప్రతి నమస్కారము అందుకొనుము...



      Delete
  9. మీ ఈ ప్రేమ కవితలే నాకు ప్రేరణలండి. చాలా నచ్చాయి చిత్రం/కవిత రెండూ.

    ReplyDelete
    Replies
    1. తెలుగుదనా చిలుకా...
      ప్రేరణ చెంది నీవు పలుక...
      బహు ఆనందమాయె నీ వ్యాఖ్య!

      Delete
  10. మీ ఈ కవితలో ప్రేమైక్యతాభావం పెల్లుబికింది.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రేరణ నాన్ను పరవశింపజేసెను...

      Delete
  11. ఏది నచ్చట్లేదు అని మొదలు పెట్టి మాకు నచ్చేట్టు రాసేసారండి...

    ReplyDelete
    Replies
    1. నాకు నచ్చని వాటిని కూడా మీరు మెచ్చి..
      బాగున్నవంటూ నన్ను ఉత్సాహపరచి..
      నడిపిస్తున్న మీకు వందనం చేతులుజాచి!

      Delete
  12. ఈ రోజే చూస్తున్నా మీ బ్లాగు , చాలా బాగుంది పద్మార్పిత గారూ , బొమ్మలు కూడా మీరే వేస్తున్నారా ? మీ రచనలతో మీ రేఖలు పోటీ పడుతున్నాయి !

    ReplyDelete
    Replies
    1. మొదటిసారి అడుగి నా రేఖల్ని రాతల్ని అభినందించిన మీకు వందనము.

      Delete
  13. "నీజ్ఞాపకాలు, నీమాటలే నీకన్నా బాగున్నట్లు
    అందులో నేను తడిసి ముద్ద అవుతున్నట్లు..."
    extraordinary feel...

    ప్రేమను ప్రతి పదంలో రంగరించి దానికి యిలా రంగులనద్ది రేఖా చిత్రంగా ఆవిష్కరించడం అద్భుతం...
    ప్రేమాభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. extraordinary feel...////

      Kadha andi;)

      Delete
    2. అందంగా భావం పలుకుతుంది మీ కవితలోని ఒకో అక్షరం
      నా పదాలజడిలో తడిచాను అనడం ఈ కవితకి అదొక వరం
      అందుకోండి వర్మగారూ......నా మనఃపూర్వక అభివందనం

      Delete
  14. ప్రేమ కవితా చాన్నాళ్ళకి, చక్కని ఫీల్ ఉంది.

    ReplyDelete
    Replies
    1. నా భావాల ఉరవడి కావాలి మీ స్మృతుల సవ్వడి.....
      మీ ఉత్తేజపు మాటలకి అందుకోండి సుమాంజలుల కావడి!

      Delete
  15. very good feelings andi .chala chala bagundi

    ReplyDelete
    Replies
    1. మీ ఈ ప్రసంశలు సదా కోరుతూ....ప్రణామములు!

      Delete
  16. ఏమిటో ! నన్ను నేను చూసుకున్నట్టు ఉంది

    పద్మార్పిత కే ఇలా వ్రాయడం సాధ్యం.!!

    ReplyDelete
    Replies
    1. నా కవిత అయినదా మీకు అద్దం
      ఆనందంతో చెట్టెక్కి పడడం తధ్యం
      అయిననూ ఈ ప్రసంశ ఒక ముత్యం
      చిరునవ్వుతో అంటున్నా ధన్యవాదం!

      Delete
  17. చాలా బాగుంది
    ఎప్పటిలాగే మీ భావవిన్యాసం పద్మ గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. పదవిన్యాసంలో మీరు బహుదిట్ట...
      భావవిన్యాసమని మీరు వ్యాక్యెట్ట...
      చేతులుజోడించి మీకు వందనమెట్ట!

      Delete
  18. you expressed my feelings wit a nice poetric words. keep it up :-)

    ReplyDelete
    Replies
    1. మీ ఈ వాఖ్యని సదా గుర్తుంచుకుందును....

      Delete
  19. Extra Ordinary Feelings tho vunna Extra Ordinary LOVE :)

    ReplyDelete
    Replies
    1. ఇంతగా మెచ్చిన మిమ్ము ఇంకనూ మెప్పించవలెనని ఆశ:-)

      Delete
  20. aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa parla

    ReplyDelete
    Replies
    1. దీని భావమేమి నేస్తమాఆఆఆఆఆ????

      Delete
    2. merenti ee madhyam grandhika bhasha vaduthunnara gulebhakhavali movie emanna choosaara sarey mee bhashalone

      nesthama neeve likhinchichinadhi shumaaruga nunnadi marikontha prayathnichanayedala meeru bhahu chakkaga rasedarani maa okka vishwasamu

      Delete
    3. సరళమైన సలహాతో సంతోషపరచిన స్నేహశీలి.....
      కడుప్రయత్నంతో మిమ్ము మెప్పించ ప్రయత్నించెదను!:-)


      Delete
    4. idantha naa daridram

      Delete
  21. ప్రేమ హింసని కోరుతుందా? ;)

    ReplyDelete
    Replies
    1. ప్రేమతో హింసించాలనుకున్నా సాధ్యమా
      హింసిస్తే అది ప్రేమెందుకౌను ఓ!నేస్తమా
      ప్రేమలో అమె నిస్సహాయతని చూడుమా

      Delete
  22. నా ప్రతి రాతలోని పద్మాలు వికసించని పసిడిమొగ్గలు
    వాటిని వికసింప చేసేవే మీ అమూల్య ఈ స్పందనలు
    అందుకే మీ అందరికీ చేస్తున్నా శతకోటిఅభివందనాలు
    తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పిస్తే నా క్షమార్పణలు!

    ReplyDelete
  23. అందరూ ప్రేమ కవిత అంటే నేను వెరైటీగా పద్మ కవిత అనమంటారాండి:)
    లేట్ గా వచ్చాను కదా మాడం అందుకే మార్కులు కొట్టేద్దామని కాదండి:)

    ReplyDelete
    Replies
    1. లేట్ గా వచ్చి నీట్ గా కమెంట్ పెట్టారండి:-)
      మనసుతో మెచ్చితే మార్కులేమివ్వనండి:-)

      Delete
  24. కామెంట్స్ కూడా చక్కని కవితలుగా చెప్పారు.. టప కన్నా కామెంట్స్ చాల ఇంట్రస్టింగా ఉన్నాయ్

    ReplyDelete
    Replies
    1. కవితలే కాకుండా కమెంట్స్ తో కూడా కొందరు పడుతుంటే ఇబ్బంది!
      మీ ఈ వ్యాఖ్య నాకు స్ఫూర్తిదాయకమై ముందుకు సాగమంటున్నది!

      Delete
  25. మాలిక వ్యాఖ్యల సెక్షన్ నిండా శంకరాభరణం, మీ బ్లాగులోని వ్యాఖ్యలతో ఈ రోజు 90% నిండి పోయింది. దీనివలన ఇతర బ్లాగులోని వ్యాఖ్యలను చదవటం మిస్ అవుతున్నాము. Try to control number of comments.

    ReplyDelete
    Replies
    1. బ్లాగు అన్నది స్వేచ్చగా రాసుకోవడానికి.. స్పందించిన వారికి థాంక్స్ చెప్పడం నెటిజన్ గా బాధ్యతగా ఫీలవుతాం.. బ్లాగర్స్ అంతా జవాబులిస్తుండగా పద్మార్పితగారి దగ్గరే మీకభ్యంతరమెందుకు... కొన్ని బ్లాగులలో చాటింగ్ లా కామెంటులిస్తున్నారు గమనించారా?

      Delete
    2. బహుశా మీరు నా పాతపోస్ట్ లు వాటి కమెంట్స్ చూసి ఉండరు. నెమలికన్ను, మరువం, పరిమళం, జాజిపూలు ఇలా ఎన్నో మంచి బ్లాగ్స్ ఇన్స్ఫిరేషనే నా బ్లాగ్ కి....అలాగని నేను అంతగొప్పగా రాసానని కాదు, అప్పట్లో ఎంతో సరదాగా సాగేవి చర్చలైనా కమెంట్స్ అయినా, అలాగే సాగించాలన్న అభిలాషే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదు. క్రితంలో ప్రతికమెంట్ క్రింద Reply అనే Option ఉండేది కాదు. ఈ మధ్య ఇలా వచ్చేసరికి అందరూ అలాగే జవాబిస్తున్నారని, ఇది మిత్రులతో మాటల్ని పంచుకునే వారధిగా తలంచి ఇలా ఇస్తున్నాను. ఆయినా ఇప్పటివరకు నేను "మాలిక" చూడలేదు. ఈరోజు మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టింది ఏమిటా అని చూసాను.

      Delete
    3. ఓరి నాయనోయ్...
      అదేంటో మీ ప్రొఫైల్ ఫోటో చూశాక మీరన్న దాంతో ఏకీభవించాలనిపిస్తోంది. :) :P

      Delete
  26. పద్మార్పిత గారు బ్లాగ్మిత్రుల స్పందనలకు మీ చురుకైన ప్రత్యుత్తరాలను వీలయినంత త్వర త్వరగా యిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చేమో కదా...ప్రయత్నించండి...ఈ అపవాదును అధిగమించ...

    ReplyDelete
    Replies
    1. ఇది అపవాదో లేక అభిమానమో తెలీదుకాని ఆడిపోసుకోనంటే అలాగే ప్రయత్నిస్తానండి:-)

      Delete
  27. "బ్లాగర్స్ అంతా జవాబులిస్తుండగా పద్మార్పితగారి దగ్గరే మీకభ్యంతరమెందుకు... "

    చెప్పాం కదా కారణం. ఉదయం, మాలిక వ్యాఖ్యల సెక్షన్ "కుడి వైపున" 90% పైన మీ రెండు బ్లాగుల వ్యాఖ్యలే ఉన్నాయని. మిగతా బ్లాగులలో వచ్చే వ్యాఖ్యలు మిస్ అవుతున్నామని. అంతకు మించి ఎమీ కారణం లేదు. మీబ్లాగు పేరు ప్రఖ్యాతులను చూసి అసూయతో ఇలా రాస్తున్నాని అనుకోవద్దు. I am not a writer. I do not have any blog.

    ReplyDelete
    Replies
    1. Its ok......I think you may understand even our feelings too!
      Just cheer up and have a smile please:-)

      Delete
    2. అవునా..అయితే ఓర్నాయినో..తమరు వ్యాక్యలు సదువుతారా?? పోస్టులు సదువుతారా బావ్... కాసింత ఎరిక పరుస్తావా?? మాలిక బావ్ పోస్ట్ లే సూపుతున్నాడు గందా! మరి వ్యాక్యల పేజీ ఎక్కడ బావ్?? అయినా మాలికొక్కటే సూత్తారా యింకా కూడలి, బ్లాగిల్లు ఇలా సానా వున్నాయంతా..నాకూ కొత్తే బావ్...ఏ బ్లాగూ నేకపోతే మీకొచ్చిన కట్టమేటో నాకైతే ఎరుకపడనేదు... ఈ అమ్మి మరీ మొగమాటపడి పోయి మీకు బతిమాలేత్తుంటే తమరు మరీ యిదయిపోయి సెలవిచ్చేత్తున్నారు..ఏటో యిదంతా ఎక్కడా కాసింత తీరుబడిగా రాసుకోనివ్వరా??

      Delete
    3. ఓలమ్మో లమ్మో.....అంటూ అలా ఎగిరెగిరి పడమాక, చెప్పాల్సిందేదో సూటిగా చెప్పేసి, మీరు రాయవలసినవి రాసుకోండి, నచ్చితే చదివి మెచ్చుకుంటాము లేకపోతే మీలాగే:-)

      Delete
  28. ఇది అపవాదు అని అనుకోకండి, చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది.

    ReplyDelete
    Replies
    1. సహృదయంతో.......తెలుసుకోవాలనే ఇలా!

      Delete
    2. అవునోర్నాయినా..నువ్ సెప్పకపోతే మాకు తెల్దుమరి..

      Delete
  29. "నీ ఎదపైవాలి నేను నీలో కలిసిపోవాలని
    అన్నీ మరచి నీ ప్రేమలో కనుమూయాలని!!! "
    ee korika chala bavundandi.....Beautiful poem!

    ReplyDelete
    Replies
    1. కవితలోని కమ్మదనాన్ని
      కనులతో చూసి.....
      మనసుతో మెచ్చిన మీకు
      వందనములు.....

      Delete
  30. పద్మార్పిత; నేను జీవితంలొ ఈ పేరు వినడం ఇదే మొదటిసారి...
    చాలా అందమైన పేరు, నన్ను ఎంతగానో ఆకట్టుకుంది...
    దేనికోసమో, ఎందుకోసమో ఎక్కడెక్కడో వెతుకుతుంటే, మీ బ్లాగ్లోకి వచ్చిపడ్డాను.
    పడింది బ్లాగ్ లో కాదు ఒక ఊబిలో అని మొదట నేను గ్రహించలేకపోయాను.
    చదువుతున్నకొద్దీ ఏదొ కొత్తదనం, ఎన్నో భావాలు, వైవిధ్యాలు నన్ను ఈ ఊబిలొ ముంచేసాయి.
    మీ బ్లాగ్ వెంట వడి వడిగా నడిచే సడిచెయ్యని మువ్వనై మురిసిపోతాను...

    ReplyDelete
    Replies
    1. అమ్మోలమ్మో...
      ఊబిలో పడిపోనావా??
      గబాల్న బయటకొచ్చేయి నాయినా..
      ఊపిరాడక ఏటో ఐపోతే ఇంట్లో పెద్ద కట్టమొచ్చేద్ది...(సరదాకేనేం)

      Delete
    2. సుస్వాగతం.......
      మీ బ్లాగ్ పేరు కూడా విభిన్నంగా బాగుంటుందండి.....
      నా రాతలు చదివాక మీరు ఊబిలోకి కూరుకుపోకుండా కాసింత ఉల్లాసవంతమై ఊరట చెందుతారని ఆశిస్తున్నానండి!:-)

      Delete