నాకు తెలిసినదేదో!!

                                                 ఈ లోకంలో నటించనివారు ఎవరు??
లేనిది చూపే ప్రయత్నమే నటించడం
ప్రేమించలేనివాడు ప్రేమని నటిస్తే
నిజం చెప్పలేనివాడు అబధ్ధమాడతాడు!
ఆకర్షించలేనివాడు అందాన్ని అరువడితే
నిజాయితీలేనోడు అన్యాయాన్ని ఆశ్రయిస్తాడు!
ఈ రంగులుమార్చే లోకంలో ఎవరికెవరు??
ఒకరి కోసం ఒకరని మోసగించుకోవడం
స్వార్థమెరిగినవాడు ఇతరులని మోసగిస్తే
అసూయాపరుడు ఆదర్శాలని వదిలేస్తాడు!
తనవద్ద లేనిది ఇతరుల్లో చూసి కొందరేడిస్తే
తత్వమెరుగనోడు తర్కించి గెలవాలనుకుంటాడు!
ఈ జీవన రణరంగంలో చివరికి మిగిలేదెవరు??
తెలుకోవాలన్న ప్రయాసతో తోలుబొమ్మలై ఆడడం
విజయాన్ని కోరువాడు విశ్వప్రయత్నంతో గెలిస్తే
దొంగలా దోచుకునేవాడు దొడ్డిదారిలో పరుగిడతాడు!
కౄరత్వంతో కఠినంగా మసలువాడు మృగంలా జీవిస్తే
మంచిమనుగడ కలవాడు అందరి మదిలో జీవిస్తాడు!

ఈ నీతిసూక్తులు నీకేల పద్మార్పిత అని ప్రశ్నించువారు!
వారికి తెలిసిన విషయాన్ని వ్యాఖ్యగా వివరిస్తారిక్కడ
ప్రశ్నించనివారు చదివి కిమ్మనక పలాయనమై చిత్తగిస్తే
చూసిన బ్లాగ్మిత్రులు కొందరైన అవుననో కాదనో అంటారు!
ఎవరు ఏమనుకున్నా మీరంతా తిలకించి ఆనందిస్తే
నా రాతలకి ఏదో కూసింత సార్థకత అని మురిసిపోతా!!

49 comments:

  1. ఇన్ని యక్షప్రశ్నలా,. మొదట ప్రశ్నించకుండా పలాయనం చిత్తగిస్తుంది,నేనేనండి,.

    ReplyDelete
    Replies
    1. ఇలా మొదటొచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలాగండి:-)

      Delete
  2. కాస్త కష్టమేనండి కామెంట్ పెట్టడం.

    ReplyDelete
    Replies
    1. అలా కష్టమని కిమ్మనకుండా జారుకుంటారా:-)

      Delete
  3. ఇలా అన్నీ మంచి బుధ్ధులు మీరే చెప్పేస్తే...మాకేం మిగిలాయని చెప్పడానికి? పాటించడం తప్ప:-)

    ReplyDelete
    Replies
    1. ఓ...గుడ్ గుడ్ నేను చెప్పేవి కూడా పాటించేవాళ్ళున్నారన్నమాట:-)

      Delete
  4. మనుసుల స్వభావాన్ని బలే చెప్పారు అండి...

    ReplyDelete
    Replies
    1. మనుషుల స్వభావాలే కదండి వారి మనుగడకి తార్కాణం...థ్యాంక్యూ!

      Delete
  5. పుచ్చకాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు చేసారీ పోస్టుతో....
    always u r rocking with awesome thoughts Padmarpitha garu..how do u get these trendy ones....congrats....

    ReplyDelete
    Replies
    1. vamaajee gummadikaaayalu kaadaa :-))

      Delete
    2. @పుచ్చకాయో, గుమ్మడికాయో పెట్టి కొట్టాలన్నంత విసుగు తెప్పించకపోతే చాల్లెండి....
      Thanks for your affectionate compliments Varmagaru....these all thoughts are blessed by friends like you sir:-)

      @ Merajgaru nenu interfere kaaledanukunte.....adi bahusa varmagaru variety ga undalani ala annaremo:-) just for change.

      Delete
    3. Meru interfere kaledu nene anavasaramgaa annaanu. itarula blogs lo emaina raaseppudu aalochinchaalemo kaada.. aayana gaarini kinchapariche uddesyam kaadu naadi, anyway inde first and last padma garu

      Delete
  6. ibbandigaa undi andi... nenu meelaanti vaadine andi....


    ReplyDelete
    Replies
    1. naalaanti vaarekada inka ibbandendukandi....mee abhipraayam cheppadaaniki:-)

      Delete
  7. ఈ నీతిసూక్తులు నీకేల పద్మార్పిత అని ప్రశ్నించువారు!
    వారికి తెలిసిన విషయాన్ని వ్యాఖ్యగా వివరిస్తారిక్కడ
    ప్రశ్నించనివారు చదివి కిమ్మనక పలాయనమై చిత్తగిస్తే
    చూసిన బ్లాగ్మిత్రులు కొందరైన అవుననో కాదనో అంటారు!
    ఎవరు ఏమనుకున్నా మీరంతా తిలకించి ఆనందిస్తే
    నా రాతలకి ఏదో కూసింత సార్థకత అని మురిసిపోతా!!...
    ఇలా అన్నాక తిలకించేసి వెళి పోతాం లెండి...:-)...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. నేను మురిసిపోవాలని అలా తిలకించి వెళ్ళిపోయారేల??
      పండితులు ప్రశ్నించి నాలుగు పలుకులు పలికితే పదిమంది ప్రశంసించేవారు కదా:-)

      Delete
  8. Meeru cheppindi nijame anukondi!!!
    kani emani comment cheyalo ardham kavadam ledhu :)
    anduke tilakinchi veltunnam :)

    ReplyDelete
    Replies
    1. naaku telisi na nijaalu konne...inka chala unnaayi kada comment pettadaaniki:-) ante ila tappinchukunnaarannamaata!:-)

      Delete
  9. బాబోయ్ ! నిజాలు చెప్పేస్తే ఎలాగండీ !?

    కామెంట్ పెట్టకుండా ఎలా వెళ్ళేది?

    భలే ఇరికించి వేసారు!!! :)

    ReplyDelete
    Replies
    1. భయపడకండి....
      ఇరికించలేదు:-)
      నేను ఇరుక్కున్నానేమో!

      Delete
  10. చూసి చదివి ఆనందించడంతోపాటు కొన్నైనా ఆచరించ ప్రయత్నిస్తే అభ్యంతరమాండి?

    ReplyDelete
    Replies
    1. ఆచరణయోగ్యమైన వాటిని అడిగి ఆచరించాలా?? అనికేత్:-)

      Delete
  11. కామెంట్ పెట్టలేని వారు చదివి ఆనందిస్తారు అని ఎందుకనుకోకూడదండీ? పలాయనం చిత్తగిస్తారంటే ఎలా?
    ఐనా మీకీ మధ్య జీవిత సత్యాలు బాగ తెలిసిపోతున్నాయండోయ్.. ఇలాగే మీరు కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు మీ శిష్యురాలినైపోయేలాగున్నాను ;)

    ReplyDelete
    Replies
    1. జీవిత సత్యాలు తెలుసుకోబోతూ బోలెడన్ని డౌట్లు....అందుకే ఇన్ని ప్రశ్నలు. నా దగ్గర శిష్యరికమైతే ఇద్దరం కలిసి విసిగిస్తామేమోనండి బ్లాగ్మిత్రుల్ని:-) అందుకే అభిమానించండి!

      Delete
  12. మన మంతా నటన లో జీవించడమే<< దైవ ఘటన
    కనిపించనిది తెలియజెప్పడమే<< నటన
    ప్రేమించలేనివాడు ప్రేమని నటిస్తే << అది స్వచ్చంగా ఉండలేని తనపు లోటు భర్తీ
    నిజం చెప్పలేనివాడు అబధ్ధమాడతాడు! <<ఎవరినీ నొప్పించరాదనే..
    ఆకర్షించలేనివాడు అందాన్ని అరువడితే <<మన సొమ్మేంపోయింది!!
    నిజాయితీలేనోడు అన్యాయాన్ని ఆశ్రయిస్తాడు!<< ఎలాగైనా బతకాలి కదా!!
    ఈ రంగులుమార్చే లోకంతో పాటు నడవాలికదా <<అందుకే ఊసరవల్లి బతుకులు
    ఒకరి కోసం ఒకరని మోసగించుకోవడం << "మన"కోస మనడానికే
    స్వార్థమెరిగినవాడు ఇతరులని మోసగిస్తే << ఇలాగ రా బతకాలి అని చెప్పడానికే
    అసూయాపరుడు ఆదర్శాలని వదిలేస్తాడు!<< అవి కూడెట్టవని తెలుసు
    తనవద్ద లేనిది ఇతరుల్లో చూసి కొందరేడిస్తే << గెలిచేతత్వం అలవడుతుంది
    తత్వమెరుగనోడు తర్కించి గెలవాలనుకుంటాడు!<< ఎలాగైనా గెలవడం ముఖ్యం కదా..
    ఈ జీవన రణరంగంలో చివరికి మిగిలేదెవరు?? << గెలిచినోడేకదా
    తెలుకోవాలన్న ప్రయాసతో తోలుబొమ్మలై ఆడడం<< బతుకుతెరువు
    విజయాన్ని కోరువాడు విశ్వప్రయత్నంతో గెలిస్తే << అది మనిషి సామర్థ్యం
    దొంగలా దోచుకునేవాడు దొడ్డిదారిలో పరుగిడతాడు! << దొరలా దోచేవాడి కళ్ళల్లో పడరాదని
    కౄరత్వంతో కఠినంగా మసలువాడు మృగంలా జీవిస్తే ..<< అంతదృష్టమా.. ఆకలి తీరడానికే మృగయా"వినోదం".. ఇన్ని తప్పులు జరగవ్
    మంచిమనుగడ కలవాడు అందరి మదిలో జీవిస్తాడు! << తిన్నగా ఎదిగే చెట్టునే దేవుడూ మొదట నరికిస్తాడు.

    you know the art of Living "Padma gaaru" my answers shows your ability to question wisely.

    ReplyDelete
    Replies
    1. సతీశ్ గారు....దీనికి రిప్లై ఇవ్వాల్సి వస్తుందని, అది నాకు చాతకాక పదాలురాక తప్పించుకుందామనుకున్నా....కానీ పట్టుబడిపోయాను:-)
      మీ విశ్లేషణ "అద్భుతం" అనే చిన్ని పదంతో పలాయనమౌతున్నా:-)

      Delete
  13. inta vivarana avasarama satish, last line okati chalada?

    ReplyDelete
    Replies
    1. సతీష్ గారు ఇచ్చినలాంటి వివరణ అవసరమే కదండీ....ఒంటరిగా వారధిని కట్టలేముకదా!!! ఇలాంటి వివిధ మిత్రుల భావవ్యక్తీకరణలతోటే విషయంలోని వ్యాకరణలు నేర్చుకోలేక పోయినా వాక్యాలు కొన్నైనా తెలుసుకుంటామేమో కదండి. మీ అభిమానానికి నెనర్లు.

      Delete
  14. ohhhhhh genious have u read jean paul sartre or what . my god u r jst amazing. yeah padmarpitha its all the fucking acting we do for our existence thats what u mentioned here existentialism and we do have a choice

    ReplyDelete
    Replies
    1. hey....are you praising me or scolding?:-) whatever it may be, i am happy to see you back my dear. Thank Q!

      Delete
  15. మొత్తానికి మీ ధర్మాన్ని తెలుపకనే తెలిపారు....ఏది ఏమైనా స్వధర్మమే పరమాత్ముని తత్వము ....

    ReplyDelete
  16. padma gaaroo, meeru cheppina akshara styaalu tilakinchi veltunnaanu.

    ReplyDelete
  17. పద్మార్పితా......నీవు చెప్పిన వాటికన్నా కొత్తగా ఏమి రాయను
    అన్నీ చదివి శభాష్ అంటాను.

    ReplyDelete
    Replies
    1. మీకు మాటలకి కొదవా....ఏమిరాసైనా నవ్వించగలరు.

      Delete
  18. Thanks a lot to one and all.

    ReplyDelete
    Replies
    1. adentandi meeru ila disappoint chesaru? meeru maa comments ki iche javaabula kosam ento atruthaga eduru chuste ila okka maatalo thanks to all anadam baledu.we are awaiting for you humourous and intelligent replies madam:):)

      Delete
    2. Adento !!!inta abhimaaninche vaaru ila Anonymous la comment pettadam. Anyway I hope you will njoy my replies:-)Thank Q!

      Delete
    3. anonyga aithe mee okkarithone tittlutinochu, ade peru chepithe mee PAB ante Padmarpita Abhimana Bloggers andaritho chivatle:)ha ha ha ha:)
      Thanks for giving replies madamji

      Delete
  19. మీ బ్లాగ్‌ చూడడం ఇదే మొదటిసారి అనుకుంటాను (నాకు గుర్తున్నంత మేరకు..) చాలా బాగుంది. ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకెప్పుడూ అలవాటు లేదండీ. అందుకే పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చేవి. :)

    ReplyDelete
  20. సుస్వాగతం...మార్కులు తక్కువొచ్చిన వాళ్ళే మేధావులండి:-)

    ReplyDelete
  21. విజయాన్ని కోరువాడు విశ్వప్రయత్నంతో గెలిస్తే
    దొంగలా దోచుకునేవాడు దొడ్డిదారిలో పరుగిడతాడు!

    jagamerigina satyanni mee varnanatho kantiki kanipinchela chesaru padmarpita gaaru........

    ReplyDelete
  22. నిజాలను , తర్వాన్ని జోడించి చెప్పారు.

    ReplyDelete