మదిలో లేని తలపును, పెదవులతో పలుకనేల?
రంగుటద్దాలలో చూస్తూ వావివరుసలు అననేల?
చుట్టరికాలంటూ మనచుట్టూ మనం గిరిగీసుకున్నా
అంతర్మధన సంఘర్షణలకి అవి అడ్డుగోడలు అగునా?
మూడు ముళ్ళతో బంధించి భార్యభర్తల బంధమన్నా
ప్రేమకరువైతే అది పాశమై ఊపిరాడనీయక అపునా
భాధ్యతలు ఎరిగినవాడు బంధంలేని బావే అయినా
కామాంధుడై కోరిక తీర్చమని అడుగడు తెలుసునా!
అక్కా అన్న అతిచనువు ఆమె అందాలను వెతకినా
అన్నా అని పిలచినంత అతనిలో కోరిక అణగారేనా
వదినా అన్నవాడు ప్రేమవచనాలు వల్లించకుండునా
బాబాయ్ అని అంటే ఆమెలో రగిలిన సెగ చల్లారునా?
వావివరుసలని మనిషి ఈ పిలుపులను నిర్ధేశించినా
పుర్రెలో పుట్టిన బుధ్ధుల్ని పిలుపులు మార్చేయునా
మనసు మలినమై పిలిచే పిలుపులో పవిత్రత ఏల?
మనం పవిత్రంగా ఉంటే ఏమని పిలచినా తప్పేల!!?
రంగుటద్దాలలో చూస్తూ వావివరుసలు అననేల?
చుట్టరికాలంటూ మనచుట్టూ మనం గిరిగీసుకున్నా
అంతర్మధన సంఘర్షణలకి అవి అడ్డుగోడలు అగునా?
మూడు ముళ్ళతో బంధించి భార్యభర్తల బంధమన్నా
ప్రేమకరువైతే అది పాశమై ఊపిరాడనీయక అపునా
భాధ్యతలు ఎరిగినవాడు బంధంలేని బావే అయినా
కామాంధుడై కోరిక తీర్చమని అడుగడు తెలుసునా!
అక్కా అన్న అతిచనువు ఆమె అందాలను వెతకినా
అన్నా అని పిలచినంత అతనిలో కోరిక అణగారేనా
వదినా అన్నవాడు ప్రేమవచనాలు వల్లించకుండునా
బాబాయ్ అని అంటే ఆమెలో రగిలిన సెగ చల్లారునా?
వావివరుసలని మనిషి ఈ పిలుపులను నిర్ధేశించినా
పుర్రెలో పుట్టిన బుధ్ధుల్ని పిలుపులు మార్చేయునా
మనసు మలినమై పిలిచే పిలుపులో పవిత్రత ఏల?
మనం పవిత్రంగా ఉంటే ఏమని పిలచినా తప్పేల!!?
పద్మార్పిత గారు, మీరు మొత్తానికి ఓ సాహసం చేసారన్నమాట...
ReplyDeleteసాహసం కాదేమోనండి.....సందేహనివృత్తికై చెప్పిన సత్యాలనుకుంటాను:-)
Deleteవినోద్ గారు....మీతో ఏకీభవిస్తూ......I am taking my words return.
Deleteసందేహం లేదు సత్తుబండాలేదు:-)
మనిషి అంతర్ముఖం గురించి చాలా చక్కగా వివరించారు.
ReplyDeleteహమ్మయ్యా! అర్థం చేసుకున్నారు కదా...తిట్టలేదు అంతే చాలండి:-)
Deleteభలేవారే, ఉన్నది చెప్పారు. ఎందుకు తిడతాం అండి :)
Deletenice but
ReplyDeletelady lo ilanti bavalu vundava..?
andentandi!!!feelings ki ladies gents ane bedhamledu...paina iddaru unnaaru. bhaavamlonu bommalonu chudandi.
Deleteమనసు మలినమై పిలిచే పిలుపులో పవిత్రత ఏల?
ReplyDeleteమనం పవిత్రంగా ఉంటే ఏమని పిలచినా తప్పేల!!?
పద్మార్పిత గారు బాగుంది మీ కవిత....
నా భావం నచ్చినందుకు నెనర్లండి!
Deleteఅసలే మనిషి అంతరాత్మ సంఘర్షణలో ఉంటే, మీరిలా సూటిగా కవితాబాణాలు ఎక్కుపెట్టనేల?
ReplyDeleteమీ కవిత బాణంలా వాడిగా ఉంది. బొమ్మ బాగుంది.
అంతరాత్మ సంఘర్షణలో పనిలోపనిగా దీనిగురించి కూడా కూసింత ఆలోచిద్దురూ.....బాణం వాడిదైనా హాని చేయదులెండి:-)
ReplyDeleteచాలా చక్కగా చెప్పారు పద్మార్పిత గారు...
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteపద్మార్పితగారు......యు ఆర్ యూనిక్!
ReplyDeleteమీ ప్రతికవితా ఆలోచించాల్సిన ఒక అమరభాంఢం,(is this word is correct mam?:)
Oh! thank qqqq Yohanth:-)
Deleteఇంతలా ఆలోచించేవారు చాలా అరుదేమో అని నా అభిప్రాయమండి.
ReplyDeleteఏదో ఒకటి పిలచి పబ్బం గడుపుకుందాం అనుకునేవారే చాలా వరకు.
నిజమే అలా అంటే మనం ఒప్పుకునేవారెందరో మరి:-)
Deleteఅంతరంగంలోని భావాన్ని బలవంతంగా అణచిపెట్టుకొని కనురెప్పలకింద క్రీనీడలా దాచుకొని బతికే మనసులోని సంఘర్షణలకు ఓ జవాబుగా మీ కవిత బాగా ప్రశ్నించింది పద్మార్పిత గారు.. అందుకే బ్లాగ్ లోకంలో మీరో Trendsetter అన్నది..
ReplyDeleteనా భావాల ప్రశ్నల్లోని మర్మాన్ని గ్రహించి విశధీకరించిన వర్మగారూ thank Q!.....ఏంటో కొత్తట్రెండ్ అని కొట్టరు కదా:-)
Deleteఅమ్మోలమ్మో మా బాగా సెప్పినవ్..
ReplyDeleteఇలగిలాగ మనసుల్ని కడిగి పారేసే గొప్ప మనిసి వుంటే సాలదా...
గుండెల్లో సూడగానే గుబులు పుట్టించే మనిసిని అక్కో అన్నో పిలుపుతో కట్టి పడేత్తే ఆ మనసు పడే వేదన తెలీని లోకం ఏదైనా జరిగిపోతే పీక్కు తింటాది ఆ మనసుని...
ఎంతైనా నీది దొడ్డ మనసు...
అభినందనలు పద్దక్కో...
మాటలేవో బాగా సెప్పినానని.....గుండె గుబులు పుట్టించే మనిసి అగుపడితే అక్కో అన్నో అనకపోయినా పర్లేదు....అదేదో అనేయబాకే:-) అందరూ కలిసి పీక్కు తింటారే సెల్లి:-)Thank you.
Deleteవారి వారి .. మీ అక్కా చెళ్ళెండ్ర వాద ప్రతివాదనలు భలే గమ్మత్తుగా వుండాయే..రేపటి చీకటిని చీల్చడానికి మీరిలగిలగే ఎదగండి మిత్రులారా...
Deleteమీకు నచ్చిందన్నమాట:-)
Deleteబాగుంది పద్మర్పిత గారు. పిలుపుల వల్లనైనా తలపులను అదుపులో ఉంచగలరనే ప్రయత్నమేమో!!! ఈ పిలుపులనేవి లేక పోతే కుటుంబం బతకదనేమో!!!! సంఘమే మాయమౌతుందనో!!!!!
ReplyDeleteనిజమే...మీరన్నట్లు ఇలాంటి నియమాలతో అయినా కాస్త మనిషిగా నిలబడతామేమో!
Deletenijaanni mee laagaa nirbhayamga cheppe varu chala arudu andi.. manasu chadivinatlu chala chakkaga chepparu..
ReplyDeletenijam maatelaagunna..... ee prasna maatram nannu chaalaa rojulnundi veadhistundandi, andukea evareamanukunnaa adigeayaalanipinchindi. hammayyaa adigesanu:-)
Deleteప్రసూనగారు.....మీరు చెప్పింది నిజమండి, ఇలాంటి టాపిక్స్ గురించి చర్చించడానికి కూడా ఇష్టపడనివారు ఎందరో ఉన్నారు.
DeleteBagundi
ReplyDeletethank you
DeleteCorrect andi, nijaalni nirbhayanga chepparu, bagundandi:))
ReplyDeletenijaalea cheppaanantara nirbhayamgaa:-)???
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteపైకి అక్కా, అన్నా అనిపిలుస్తూ......మనసులోను, మైండ్ లోను మరో విధంగా అనుకోకపోవడమే నేను ఇక్కడ అనుకుంటున్న పవిత్రతండి. మీకు తెలిసిన నిర్వచనం మీరు చెప్పండి!
DeleteThis comment has been removed by the author.
Deletethanooj mee prasnalu chustunte Arpil Ist vidudalalo Rajendra Prasad gurtukostunnaadu..
DeleteThis comment has been removed by the author.
Deletethanooj.....నాకొచ్చే సందేహాలతో నేను వేసే చెత్త ప్రశ్నలకే విసిగి ఉన్న మన బ్లాగ్ మిత్రుల్ని ఇలా మీరు కూడా విసిగించడం భావ్యమా మిత్రమా:-)
DeleteSorry to interrupt in this....I think if we starts discussion on sin it creates a WAR which is a big SIN:-) in our healthy bloggers friendship, shall we end this here please.
DeleteHave a smile dear:-)THANK YOU
Wah kya baat hai Madam....creating it and suppressing it in smooth way:)hahaaaaaaaaaaaaaa
DeleteNo Aniketh its not suppressing the topic. Just i dont want to hurt anyone. Thank Q:-)
DeleteThis comment has been removed by the author.
Deletehoooooooooo....njoy friend:-)
Deleteచాలామంది అంతర్లీనంగా అనుకునేది ఇదేనండి పద్మార్పితగారు...మీరు ఇలా అడగబట్టి కొందరైనా కొంచెంసేపు ఆలోచిస్తారు అనుకుంటున్నాను. నాకు తెలిసి చాలా మంది వారి మనసులోని భావానికి ముసుగేసుకుని పక్కింటాయన్ని అన్నయ్యగారు అని పిలవకపోతే వాళ్ళావిడేమనుకుంటుందో అని, అక్కా అనకపో వీళ్ళాయన అనుమానిస్తాడేమో అని పిలుస్తారే తప్ప ఆవరుసల విలువ తెలిసికాదనుకుంటానండి. మంచి టాపిక్ తో ముందుకొచ్చారు:-) కుడోస్!
ReplyDeleteఆలోచిస్తారనే అనుకుంటున్నానండి నేనుకూడా....చూద్దాం ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో!
Deleteఅందుకే నేమో ! అక్కా , అన్నా అనడం మానేసి చాలా కాలమైంది . ఇప్పుడంతా ఆంటీ , అంకుల్ .
ReplyDeleteఅంకుల్, ఆంటీ అంటూ అందాలు వెతుకుతూ వెంటపడేవారు లేరంటారా?
Deleteఏదైనా వరసతో పిలిస్తే ఆ బంధానికి
ReplyDeleteజీవితాంతం కట్టుబడి ఉండాలి...
ఆలోచనలు మారి వరసలు మారకూడదు...
చాలా బాగుంది...పద్మ గారూ!...@శ్రీ
నిజంగా అలా కట్టుబడితే...
Deleteనేను ఈ పోస్ట్ రాసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్నికానేమో:-)
కొంత మంది ---- లను దృష్టిలో పెట్టుకోని, నిజమైన బంధాలను ఇబ్బంది పెట్టే కవిత అవసరమంటారా,.
ReplyDeleteపవిత్రంగా వుంచడానికి సహకరించేవాటిని దెబ్బకొట్టడం బావ్యమా...అంత పవిత్రంగా వుండగలిగితే బట్టలు మాత్రం ఎందుకు చెప్పండి, ఎమనుకోకండి, ప్రతిచోట ఈ ఉపదేశాలు చేయలేను కాని ఒక మిత్రుడిలా ఫీలై ఇలా....పై బొమ్మలాగే కవితా వాక్యాలూ నచ్చలేదు నాకు..
నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్యూ.....నాకు వచ్చే డౌట్స్ & నేను రాసేవి అందరికీ నచ్చాలని కాదుకదా భాస్కర్ గారు.
Deleteఅవసరమా అనుకుంటే అసలు ఏదీ అవసరంలేదనుకుంటా:-)
మీరు నచ్చలేదు అని చేసిన కామెంట్ నాకు నచ్చిందండి!
I vote for Mr.Bhaskar. It is better not raise such unwanted discussions.
DeleteI will take care of it. thanks for you comment sarmaji.
Deleteచిన్నా.. నాదీ అదే ఆలోచన.. కానీ నాకైతే అలా అక్షరాలలో బందించడం మాత్రం చేతకాదు..భలే వ్రాసారు సుమీ.
ReplyDeleteఓ!....నాలా ఆలోచించే వాళ్ళుకూడా ఉన్నారోచ్:-)
Deleteనాకు మాత్రం నిలబెట్టుకోలేని ఆ వరుసలెందుకు, హాయిగా పేర్లతో పిలుచుకుంటే సరి అనిపిస్తుంది:-) ఐడియా మరీ అంత చెత్తగా లేదనుకుంటాను?
ReplyDeleteఅవును ఇదేదో బాగానే ఉందండి:-)
Deleteబాగా రాసారు పద్మగారు... ఎవరిని నమ్మలేని ఈ రోజుల్లో....మనుషుల మనస్తత్వానికి apt అయ్యే పోస్ట్
ReplyDeleteనిజాలని అంగీకరించాలంటే ధైర్యం కావాలేమో అనిపించి ఈ పోస్ట్ రాసాక:-)
Deleteధన్యవాదాలు మీకు నచ్చినందుకు.
మీ బ్లాగులో నన్ను మొట్ట మొదట ఆకర్షించినది మీ అధ్బుతమైన చిత్రాలు. కానీ తర్వాతెందుకో ఈ కవిత నాకు బాగా నచ్చింది.
ReplyDeleteమీ భావ వ్యక్తీకరణ అమోఘం పద్మ గారు.
నా బ్లాగ్ కి విచ్చేసిన మీకు స్వాగతం.
Deleteనా భావాలని మెచ్చి అభినందించిన మీకు ధన్యవాదాలండి.
Thopu .... Chalam style lo undhi
ReplyDelete