నా స్వర్గం


ఎడబాటు ఎంతకాలమని ఆగలేక
చేరువవ్వాలని నీవు నడిచొస్తుంటే
మది పాదసవ్వడి వినిపిస్తుంది...
ఒంటరితనము ఏడ్వలేక నవ్వుతూ
రేయి సూర్యకాంతిని కావాలని కోరితే
ఆశ అమావాస్యలో వెన్నెలై కాస్తుంది...
గడిపిన క్షణాలు తీయని జ్ఞాపకాలై
నెమరు వేసుకుని నే కూర్చుంటే
దూరంగా సన్నాయి మ్రోగుతుంది...
ఒక్కోబొట్టులా కురుస్తున్న ఆకాశం
నిరీక్షణలన్నీ నదిలా ప్రవహిస్తుంటే
జీవితం జీవించమని పిలుస్తుంది...
నీవెచ్చని కౌగిలిలో సర్వం కోల్పోయి
నీ కనుసన్నల్లో కలకాలం కొలువుంటే 

ఇదే నా స్వర్గం అని చెప్పాలనుంది...
             అందని అతనికి అర్పితం!!

37 comments:

  1. ఒంటరితనము ఏడ్వలేక నవ్వుతూ
    రేయి సూర్యకాంతిని కావాలని కోరితే
    ఆశ అమావాస్యలో వెన్నెలై కాస్తుంది...
    వేదనను దానిలోని బాధను ఇంతకంటే బాగా వ్యక్తీకరించగలమా...
    అభినందనలు పద్మార్పిత గారూ..

    ReplyDelete
    Replies
    1. ఆస్వాధించిన మీకు అభివందనాలు.

      Delete
  2. గడిపిన క్షణాలు తీయని జ్ఞాపకాలై
    నెమరు వేసుకుని నే కూర్చుంటే
    దూరంగా సన్నాయి మ్రోగుతుంది..

    చాల చాల బాగుంది పద్మార్పితగారు:))

    ReplyDelete
    Replies
    1. మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  3. మార్వలస్ ఫీలింగ్ పద్మగారు....అందుకే అంత అభిమానం మీపై.

    ReplyDelete
    Replies
    1. సదా మీ అభిమానానికి పాత్రురాలినికావాలని కోరుకుంటూ....

      Delete
  4. ఎప్పటిలాగే బాగుందండి...
    ఇక్కడ ఇలా మీరింత తపించిపోతుంటే అక్కడ వాడి విరహ వేదన ఇంకెలా ఉండిఉంటుందో మరి.?

    ReplyDelete
    Replies
    1. ఇదేదో అడి తెలుసుకోవాల్సిన విషయమే:-)

      Delete
  5. ఇలా అందమైన ఊహల్లోని భావాలని రాసి అందరినీ సదా మెప్పించండి.

    ReplyDelete
    Replies
    1. తప్పక ప్రయత్నిస్తానండి.

      Delete
  6. పద్మప్పా సొర్గం అని సెప్పినాక మరి నేనేటంతాను..
    ఇంతందమైన కలల మారాజు నాకూ దొరికితే బాగుండునని మనసు లాగేత్తంది...

    ఏమైనా నీ ముందు నేనెంతలే..
    అతగాడిదదృష్టం...

    ReplyDelete
    Replies
    1. అదేమంత సోద్యమే సెల్లి...మాదొడ్డ మారాజే దొరుకుతాడులే:-)

      Delete
  7. అందమైన భావాలని మీతో రాయించిన అతడికి కూడా సగం అభినందనలు అందించండి అర్పితగారు:)

    ReplyDelete
    Replies
    1. సగమేంటి.....సాంతం అతడి సొంతం:-)

      Delete
  8. Padmagaru, virahavedana chalaa baaga raasaru.

    ReplyDelete
    Replies
    1. మీరాజ్ గారు ధన్యవాదాలండి.

      Delete
  9. అందని ఆకాశం కై ఎదురుచూసే నిరీక్షణా ఇది...కాదేమో...
    ఎంత దూరానున్నా మది భావాలు చేరకపోవునా...చేరేనేమో...
    భావం బాగుంది.
    బొమ్మ వడ్డాది గారి శైలి ని చూపించింది.

    ReplyDelete
    Replies
    1. భావగర్భాన్ని......ఆశావాదంగా మలచి మెచ్చిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  10. ఎవరో అతగాడు..మహా అదృష్టవంతుడు:-)

    ReplyDelete
    Replies
    1. నా మానసచోరుడు......మీ అభిమానం చూరగొన్నవాడు ఒకరే:-)

      Delete
  11. As usual chaalaa bagundhi padmagaaru..very nice :)

    ReplyDelete
  12. అమ్మో ఇంత భావాల తాకిడిని తట్టుకోవడం నాలాంటివారికి కష్టమే:-)

    ReplyDelete
  13. కష్టమైనా ఇష్టమనుకుని ఆస్వాధించండి:-)

    ReplyDelete
  14. Replies
    1. Thanks for your compliments Vasudevgaru

      Delete
  15. oye nenu koncham tedaga unna padaamarpitagaarini choostunnanu

    ReplyDelete
    Replies
    1. eppudu okela undadam kuda ontiki manchidi kaadulendi....kaasta appudappudu ilaa tedaga chudandi.

      Delete
  16. ఒంటరితనము ఏడ్వలేక నవ్వుతూ
    రేయి సూర్యకాంతిని కావాలని కోరితే
    ఆశ అమావాస్యలో వెన్నెలై కాస్తుంది...superb lines padma gaaroo!

    ReplyDelete
    Replies
    1. మీకు అంతలా ఆ లైన్స్ నచ్చాయని పెట్టిన వ్యాఖ్య మరో కవితరాయమని ప్రేరేపిస్తుందండి. థ్యాంక్యు!

      Delete
  17. చాలా భాగా రాసారండి.బొమ్మలు ఎక్కడ నుండి డౌన్ లోడ్ చేస్తున్నారు.బావున్నాయి మీ కవితల లాగే .......

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.
      చిత్రలేఖనం నా హాబీ...అక్కడ ఇక్కడా అనిలేదు ఎక్కడ కనిపించినా, చివరికి చిత్తుకాగితంపైన ఉన్నాసరే:-)

      Delete
  18. నీవెచ్చని కౌగిలిలో సర్వం కోల్పోయి
    నీ కనుసన్నల్లో కలకాలం కొలువుంటే
    ఇదే నా స్వర్గం అని చెప్పాలనుంది...
    -------------------------
    సున్నితమైన భావాన్ని మృదువుగా సులువుగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చిన విధంగా సున్నితంగా చెప్పగలిగానని సంతోషంగా ఉందండి. మెచ్చిన మీకు నెనర్లు.

      Delete
  19. >>రేయి సూర్యకాంతిని కావాలని కోరితే
    ఆశ అమావాస్యలో వెన్నెలై కాస్తుంది...>>
    అద్భుతమైన భావం...

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయిగారు....నచ్చిమెచ్చిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  20. Padmarpita garu,

    This poem has a great structural beauty. Every three lines conveyed a fine emotion in equally fine words.

    This painting resembles Vaddaadi Papayya's.

    But where do you get the pictures for your poems? Are they all your own? They are amazingly beautiful.

    Congrat

    ReplyDelete