పగిలిన హృదయం

నేడు బురదలో నిజాలు లిఖించాలనే తపన నీలో ఎందుకు
పొడారిన ఇసుకను గుప్పిట బంధించే ప్రయత్నం చేయకు
అద్దంలో నీ ప్రతిబింబంలో ఖననమైన నన్ను అన్వేషించకు
నేడు అలజడితో అణచివేయబడ్డ నా భావాల్ని వెలికితీయకు!

నేడు రెప్పలార్పినప్పుడు నా జ్ఞాపకాలని నీకళ్ళలో మూసేయి
ఆకాశాన్ని తాకిన కలల పర్వతం పై నుండి నన్ను జారనీయి
నీ హృదిపంజరంలో రెక్కలు తెగిపడిన నన్ను విముక్తిని చేయి
నేడు నీ ఊపిరిలో దాగిన నన్ను నన్నుగా బ్రతకమని వెలివేయి!

నేడు నేనులేని నీ చీకటి ఎదలో వెలుగుకై కొవ్వొత్తిని వెలిగించుకో
మండే నీ గుండెలో కరిగిపోతున్న నా గుండె మంటను చూసుకో
కాలి బూడిదౌతూ సెగలోడే గుండె పొగ నీ ఆకారమైనది ఎందుకో
ముక్కలైన హృదయ ఘోషను మనసనేది మిగిలుంటే తెలుసుకో!

48 comments:

  1. కాలి బూడిదౌతూ సెగలోడే

    సెగలోడవు, ఎగుస్తాయి, బాగుంది.

    ReplyDelete
    Replies
    1. సరైన పదాన్ని తెలియజెప్పి, మెచ్చిన మీకు నెనర్లండి.

      Delete
  2. బాబోయ్! మీలాంటి చిన్నవారు ఇలాంటి కవిత్వం వ్రాయడం నాకు భయం కల్గిస్తుంది.

    గాడానుభూతి ఉంటేనే ఇంత చిక్కని కవిత్వం తన్నుకుని వస్తుంది.

    అనుభవాలు,ఆలోచనలు ,స్పందనలు ,అనుభూతులు ఇవే కవిత్వంలో దొర్లుతుంటాయి.

    మీ శైలికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. బాబోయ్ అని, ఇంకేవో అన్నీ తెలుసును నాకని చెప్పి, నన్ను భయపెట్టేస్తున్నారు;-)

      Delete
  3. పగిలిన హృదయం అతకదంటారు...
    కానీ ఘోషిస్తే ఇలానేనా ఉంటుంది అనిపించేలా ఉంది మీ కవిత్వం.
    బొమ్మా ఎంతో బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నిజమే అతికినా ఆ అతుకు అలాగే ఉంటుంది.
      మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  4. నేడు రెప్పలార్పినప్పుడు నా జ్ఞాపకాలని నీకళ్ళలో మూసేయి
    ఆకాశాన్ని తాకిన కలల పర్వతం పై నుండి నన్ను జారనీయి>>
    పద్మార్పిత గారు ఇదే మొదటిసారి మీ బ్లాగ్ చదవడం ,చాల బాగా రాస్తునారు ......
    పెట్టిన చిత్రం కూడా బాగా కనెక్ట్ అయ్యింది ...హాట్స్ ఆఫ్
    -Harsha Modhukuri

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి విచ్చేసి ప్రశంసలిడిన మీకు ధన్యవాదములు.

      Delete
  5. వాణి మీ గుండెలో కొలువయ్యెనేమొ -
    ప్రతి కవిత సహస్ర సుదళ 'పద్మ'మయ్యె!
    తరుణ నవనవారుణ కవితా మతల్లి -
    'పద్మ'గారికి సుహృదాభివందనములు!

    ReplyDelete
    Replies
    1. ఫణీంద్రగారు....బహుకాలానికి నా బ్లాగ్ వైపు మీరాక పుష్పపు వన్నెలా తోచింది, దానికి మీ పద్య ప్రశంస పరిమళాన్ని అద్దినట్లున్నదండి. ధన్యవాదాలండి!

      Delete
  6. అద్దంలో నీ ప్రతిబింబంలో ఖననమైన నన్ను అన్వేషించకు
    నేడు అలజడితో అణచివేయబడ్డ నా భావాల్ని వెలికితీయకు!
    chakkani chikkani bhaavaalu....abhinandnalu padma gaaroo!...@sri

    ReplyDelete
    Replies
    1. భావాల నిగూఢార్థాన్ని ఆస్వాధించి మెచ్చిన మీకు ధన్యవాదాలండి!

      Delete
  7. పద్మార్పిత పదజాలంలోని పట్టులన్నీ ఈ కవితలో ప్రతిఫలించాయి.
    ప్రతి ఫీల్ కి న్యాయాన్ని చేకూరుస్తారు,,,,అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. అమ్మో ఏంటో న్యాయం శిక్షా అంటున్నారు....తిట్టుకోవడం లేదుకదా మనసులో:-)

      Delete
  8. నీ కవిత ఎంతో హృద్యమం చిన్నా.. దీపావళి శుభాకాంక్షలు చెప్పేస్తున్నా..

    ReplyDelete
  9. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా ....
    ఎందుకో మరి, ఈ పాట గుర్తొచ్చింది.
    కవిత్వానికి హృదయాన్నర్పిస్తే గానీ ఇలాంటి కవిత పుట్టదనుకుంటానండి..
    దీనిగురించి చెప్పడానికి నాకర్హత లేదనిపిస్తోంది పద్మార్పిత గారు..

    ReplyDelete
    Replies
    1. ఓ! ఒక మంచి పాటను గుర్తొచ్చేలా చేసిందని అందమైన వ్యాఖ్యతో ఉత్తేజపరిచిన మీరు అర్హత లేదంటూ అలా అనుకోవడం బాలేదండి. ఆస్వాధించే మనసున్న ప్రతొక్కరూ అర్హులే! థ్యాంక్యూ..

      Delete
  10. అద్దంలో నీ ప్రతిబింబంలో ఖననమైన నన్ను అన్వేషించకు
    నేడు రెప్పలార్పినప్పుడు నా జ్ఞాపకాలని నీకళ్ళలో మూసేయి
    నేడు నేనులేని నీ చీకటి ఎదలో వెలుగుకై కొవ్వొత్తిని వెలిగించుకో
    ....

    కాలి బూడిదౌతూ సెగలోడే గుండె పొగ నీ ఆకారమైనది ఎందుకో (ఈ వాక్యం విరహాగ్నిలోని తాదాత్మయతను అత్యున్నతంగా తెలియజేస్తోంది)

    నా జీవితంలో యింత వరకు యింతటి గుండె నెత్తురద్దిన అక్షర తూణీరాలను చదవలేదు పద్మార్పిత గారు. హృదయాగ్ని జ్వాలలోంచి ఉద్భవించిన వేదనామయ గీతమిది...
    మీ కలానికి గుండెనద్దిన కావ్యగానమిది...
    మీకు అక్షర సుమాంజలులు...

    ముక్కలైన హృదయ ఘోషను మనసనేది మిగిలుంటే తెలుసుకో!
    ఈ వాక్యం చదివాక మనసనేది మిగిలి లేని జీవితం వ్యర్థం...అది జీవశ్చవమె...
    యింక రాయలేక పోతున్నా...

    ReplyDelete
    Replies
    1. వర్మగారు....మిమ్మల్ని ఇంతలా నా కవిత కదిలించినందుకు సంతోషము.
      మీరు నా కలాన్ని మెచ్చి అందించిన అక్షర సుమాంజలులకు అభివందనము.
      హృదయ ఘోషను సున్నిత మనసుతో అనుభూతి పొంది చలించిన మీ హృదయావేదనకు మరొక్కమారు నమఃసుమాంజలి!

      Delete
  11. పద్మగారూ మీ ప్రతికవితని, వ్యాఖ్యలకి మీరిచ్చే జవాబుల్ని చదివితే ఎక్కడో ఒకచోట పెదవిపై నవ్వువిరబూసేది....కానీ ఇలా ప్రతి వాక్యం చదువుతుంటే తెలియకుండానే కన్నీళ్ళు, ఇంతలా ప్రేమిస్తారా ఎవరైనా అని.నాకు అభినంధించేంత అందమైన మాటలు తెలియవు అందుకే _________________ మౌనం మీకు బాగాతెలిసిన భాషని.

    ReplyDelete
    Replies
    1. ఏం మాటలు రావంటూనే అందంగా అభినందించిన మీకు అభివందనములు.

      Delete
  12. खो जाओ मुझमें तो मालूम हो, कि दर्द क्या है,
    ये वो किस्सा है जो, जुबान से बयाँ नही होता......

    ReplyDelete
    Replies
    1. चोटिसी दिल में अर्मान कोई रखना...
      दुनिया कि भीड में पेह्चान कोई रखना
      आपके होटो पे उम्मीदों के मुस्खा रखना

      Delete
    2. सुबह शाम इन्होने हमें सीने से लगाया होता,
      सोते वक़्त भी हमें तकिया के पास सजाया होता,
      ऐ खुदा तेरा बड़ा करम होता अगर तुने हमें,
      इनका दुपट्टा बनाया होता !!!!!

      Delete

  13. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు....మీకు కూడా దీపావళీ శుభాకాంక్షలండి!

      Delete
  14. మనసున్న ప్రతివారిని కదిలించేలా ఉంది కవిత....అయినా ఎందుకని మీకింత వ్యధ:-)

    ReplyDelete
    Replies
    1. కనులున్నప్పుడు కలలు తప్పవు...
      మనసున్నప్పుడు వ్యధలూ తప్పవు:-)

      Delete
  15. పగిలిన హృదయం
    ఎవరు దానికి కారణం?
    ప్రతి ఉదయం నాలో వుదయించెను అనుమానపు కిరణం
    నిజం తెలుసుకుందామంటే మొదలవుతుంది రణం
    అడగలేక కుములు తుంటే మనసే వొక వ్రణం
    అందరిలోవొకన్న్ని నీకు
    అందుకే అందర్నీ వదులుకు మాత్రం రాకు
    అలా అడిగితె నీకెంతో చికాకు
    నాతొ మాట్లాడే టప్పుడు నీ మనసెందుకో పరాకు ?
    హృదయాన్నిస్వార్ధం తో వదిలేసి పోతున్నది నీవు
    గుండె మంటని చూసుకోమని పారి పోతున్నావు
    నీకు అనుక్షణం కావాలి కొత్తదనం
    నీ నిర్దయా పూర్వక నిష్క్రమనే దానికి నిదర్సనం

    ReplyDelete
    Replies
    1. పగిన హృదయాన్ని చదివి పలికింది మీ హృదయం
      ప్రియుడి తరపున రవిగారు లిఖించిన ఈ సందేశం
      ? అనుమానం, దాన్నిక్కడ ప్రచురించడం అప్రస్తుతం
      ఇలా జవాబుకవితలా స్పందించిన మీకు నా వందనం

      Delete
  16. ప్రియుడి పరంగా పగిలిన హృదయం గా గమనించ గలరు పద్మార్పిత గారు

    ReplyDelete
  17. అందని అందమైన భావాలు అవి ప్రేమైనా, వేదనైనా, అల్లరైనా అలరిచడం మీకే సొంతం.

    ReplyDelete
    Replies
    1. అంతేనంటావా అందమైన తెలుగమ్మాయి:-)

      Delete
  18. చిత్తడి నిజాలను, గుప్పిట ఇసుకలా దాచినా..
    అణిగిన భావాలనూ నిండిన నన్నునూ అద్దంలో వెతికినా..
    ఎగిరే కలలు జారేలోపు జ్ఞాపకాలను కళ్ళల్లో నింపినా..
    హృదయం తో విడివడి ఉండలేనన్నా...
    ఊపిరిలా నన్ను బ్రతకనీయన్నా..

    నేను లేకున్నా నా వెలుగు నీలో కరిగేనులే
    ఆరినపొగ నీ రూపు పోలిందేమిటిలా
    ముక్కలైన హృదయ ఘోష ఇది
    మనసనేది మిగిలిందా!

    పద్మ సౌరభమే..అంతా.

    ReplyDelete
    Replies
    1. పన్నగి పదజాలంలో పలుకవలసినవన్నీ పలికి, పద్మ సౌరభమననేల!!!:-)

      Delete
  19. మీకు కూడా దీపావళీ శుభాకాంక్షలండి!

    ReplyDelete
  20. హలో అండీ !!

    ''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

    వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
    ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
    ఒక చిన్న విన్నపము ....!!

    రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

    మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
    మీ అంగీకారము తెలుపగలరు

    http://teluguvariblogs.blogspot.in/

    ReplyDelete
  21. ఓ!....అలాగే చేర్చండి.

    ReplyDelete
  22. హృదయ వేదనని హృద్యంగా చెప్పారు పద్మర్పిత గారు.

    ReplyDelete
    Replies
    1. స్ఫూర్తిదాయకం మీ స్పందన.....థ్యాంక్యూ!

      Delete
  23. ayyo nenu e post ni late ga chusaanu, kani roju rojuki kottaga special ga untay andi mee kavitalu, image super.. Nice:))

    ReplyDelete
    Replies
    1. late ga aina chusaru nice annaru kadandi....Thank you:-)

      Delete
  24. Padma gaaroo, Baaga raasaaru.

    ReplyDelete
    Replies
    1. Fathimagaru nachindi kada...happy andi:-)

      Delete

  25. నేడు నేనులేని నీ చీకటి ఎదలో వెలుగుకై కొవ్వొత్తిని వెలిగించుకో
    మండే నీ గుండెలో కరిగిపోతున్న నా గుండె మంటను చూసుకో.....పద్మ గారు చాలా బాగుంది మీ కవిత్వం.

    ReplyDelete