బ్లాగర్స్ కి భలే విందు:-)

పద్మార్పితా....ఎప్పుడూ ఏవో ప్రశ్నలతో, నీ రాతలతో ఇబ్బంది పెట్టకపోతే చక్కగా వంటచేసి విందు భోజనం పెట్టమని ఒక బ్లాగ్ మిత్రుడు అడిగితే...... ఒక్కరికి కాదు వందమందికి పెట్టేస్తానని పేట్రేగిపోయి పార్టీ కోసం పొయ్యి మీద  హైదరాబాదీ బిరియానీని దమ్ముకు పెట్టి, ఖుర్బానీ కా మీటా చేయనా లేక డబుల్ కా మీటా కావాలా అని అడుగుదామని  నా మొట్టమొదటి బ్లాగ్ మెంబర్ గా చేరిన Prakashగారిని పలుకరించబోతే పత్తాయేలేకుండా పోయారు:-( సరే కానీయండి ఒక్కరికోసం తొంభైతొమ్మిది మందిని పస్తులుంచడం సబబు కాదని ఈ రెండింటికన్నా  సులువుగా అయిపోయే పాయసం చేసి మీ అందరికీ ప్రీతిపాత్రురాలిని కావాలని శ్రమపడి స్యేమియా నేతిలో వేపి చేసి అందరికీ ఇస్తాను అనుకుంటే పొరపాటేనండోయ్!!!! ( మనలోమాట బాంబినో ఇన్స్టంట్ ఖీర్ మిక్స్ ప్యాకెట్స్ తో పని కానిస్తున్నా;-) పాలు మరిగించి అందులో ఈ పాకెట్స్ కట్ చేసి వేసి కలిపితే రెడీ, ఇదో పనా ఎగస్ట్రాలు కాకపోతే అని పాకప్రావ్యీణులు నన్ను ఆడిపోసుకుంటే అతి చెత్త కవిత రాసి ఒకటి పోస్ట్ చేయగలనే కానీ వారిలా ప్రావీణ్యంతో పంచబక్షపరమాన్నాలు కాదు పాయసం కూడా ఇవ్వలేననేది కొందరికే తెలుసు ఈ పార్టీ ముగిసేలోపు అందరికీ తెలుస్తుందిలెండి......కబుర్లు తరువాత ముందు వంటకానీయమని అంటున్న మాటలు చెవి విన్నంత మాత్రాన్న నా మెదడుకి అది చేరవేయలేదులెండి.....ఎందుకని అడిగితే ఏమి చెప్పను అన్నీ చెత్త ప్రశ్నలు ఆలోచనలతో హౌస్ ఫుల్ అయిపోయి ఇలా పనికొచ్చే సంకేతాలని త్రోసివేస్తుందని చెప్పుకుంటే చీప్ అయిపోతాను కదా!
అమ్మో! ఇలా నా వీక్ పాయింట్స్ చెప్పుకుంటూపోతే ఈ బక్రీద్ నాడు ఇవ్వాల్సిన పార్టీని న్యూ ఇయర్ నాటికి ఇస్తానని నాకు మాత్రమే తెలుసు. అందుకే చకచకా తొంభైతొమ్మిది మంది మెంబర్స్ ని మదిలో స్మరించుకుని అందరినీ పలుకరించే టైం లేక పార్టీలో పలుకరింపుతో పాటు పద్యమొకటి పద్మ అర్పించక పోదా....అది విని బ్లాగ్ మిత్రులంతా పరవశించి పోరా అన్న ధీమాలో పార్టీ లుక్ కోసం నేనే రంగులద్ది మీకు కన్నులపండుగ గావించాలని కుంచెని, కాగితాన్ని కిచెన్ లోకి తీసుకుని వెళ్ళి ఎడమ చేత్తో ఖీర్ మిక్స్ ని కలిపేస్తూ కుడి చేత్తో కుంచెని రంగులో అద్ది తిప్పేస్తుంటే.......చిత్రం అబ్బో అదిరిపోద్ది, నా పాయసం టేస్ట్ పడిపోద్దనుకున్న పాలు పొయ్యిమంట సహాయంతో పొంగిపొర్లి పేపర్ నంతా తడిపి తరించాయి. పాలులేని పాయసం పేస్ట్ లా మారింది, పేట్రేగి పోయి పార్టీ ఇస్తాను, స్వయంపాకం చేస్తానని ప్రేలాపనలకి పోయి ప్యారడైజ్ హోటల్ నుండి బిరియానీ ఫ్యామిలీ ప్యాకెట్స్ తెప్పించి గిన్నెలో బోర్లించి దమ్ముకెట్టి మీ ముందు నేనే చేసిన ఫోజు కొడదామనుకున్నా.......
పాయసమేనా పేస్ట్ లా మారేది మేము అంతకు మించి అదరగొట్టగలం అంటూ గిన్నెలోపలా అడుగునా కూడా అడుగంటి బిరియాని ఒక గిన్నె అచ్చులా(మోల్డ్) తయారై తిక్క కుదిరిందా అంది....
ఈ గోడు ఎవరికైనా వెళ్ళబోసుకుంటేనే కాని తీరదని నా నూరవ బ్లాగ్ మెంబర్ కి చెప్పుకుందామంటే పేరునే "తర్కం" అని పెట్టుకుని నన్ను భయపెడితే తికమక పడి దానికన్నా మీ అందరితో తిట్టించుకుంటే జ్ఞానమైనా వస్తుందని ఇలా మీ ముందు మోకరిల్లాను.

ఇంతకీ పార్టీ ఎందుకని మీరు అడకపోయినా చెప్తానండి.....ప్యార్ సే పార్టీ అంటే మీరు రీసన్ అడగరనుకోండి అయినా మిమ్మల్ని అందరినీ కలవాలన్న కోరిక దానికి రీసన్ వెతికితే దొరికింది నా "బ్లాగ్ మెంబర్స్ 100" కి చేరారని..... 

 తెలిసింది కదాండి.....ఇంక ఆగకండి, దీని మూలంగా నీకు అర్థమైంది ఏమిటి పద్మార్పితా.... ఎవరు చేసే పని వారు చేయాలనో లేక వందమందిలో కనీసం 100% అయినా సంప్రదించాలనో, నాన్ వెజ్ తినని వాళ్ళు సంతోషంగా, తినేవాళ్ళు అంతంది ఇంతంది ఆఖరికి ఆకలితో మాడ్చిందనో నన్ను నాలుగు దులిపి మీతో పాటు ఇంకో 900 మందిని మెంబర్స్ గా చేర్చి వాళ్ళతో కూడా అంక్షింతలు వేయించుకోవాలని చిన్ని చిట్టి ఆశ అంతే:-)

76 comments:

 1. Hahhaha.. congrats Padma gaaru :) :) :)

  ReplyDelete
 2. శుభాబినందనలు పద్మార్పిత గారు...

  ReplyDelete
  Replies
  1. మీరిలా విందుకు పిలిచినట్టే పిలిచి వంట మాడి పోయిందని సెలవిస్తే ఎలా పద్మగారు....
   ఏమైనా మీ శైలి నవ నవోన్మేషంం.ం....

   Delete
  2. ధన్యవాదము వర్మగారు....ఏదో ఈసారికి సర్దుకోండి ప్లీజ్:-)


   Delete
 3. అభినందనలు. బ్లాగు మెంబర్ ని కాకపోయినా నేను కూడా మీ బ్లాగ్ ఫాలో అవుతాను.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.....నేను మాత్రం మీ అభిమానిని!

   Delete
 4. congrats padma garu.. keep going on... give us another party when u reach 200...

  ReplyDelete
 5. మీ పొయ్యిమంట కుట్ర చేసి కాగితానికి పాలు తాగించిందీ అంటారు.
  ఇంతకన్నా ప్యార్ సే పార్టీ ఏమిటంటా!!
  రేపట్నించి పాయసం పాలు తాగించిన కాగితం పై
  పంచదార పలుకులద్దీ..
  సుగంధ ద్రవ్యాల్లాంటి బొమ్మలతో ఘుమఘుమలాడించండి..
  అంక్షింతలు వేయించుకోవాలని చిన్ని చిట్టి ఆశ ... కదా!!
  దీవెనలు-అక్షతలూ విడదీయకుండా అందిస్తున్నాం..
  శతమానం భవతి శత శతాయు బ్లాగ్... ప్రతి దిష్థతి

  ReplyDelete
  Replies
  1. ఓహో....మీ ఆశీర్వచనాలతో అహ్లాదమొందితి, ధన్యవాదములు.
   పంచదార పలుకులద్దితే చీమలు పడతాయేమో..
   సుగంధపు పరిమళాలద్దిన బొమ్మలు వెగటుపుట్టిస్తాయేమో..
   ఏమైనా మీ ఆదరాభిమానాలతో ముందుకి సాగిపోతా..కదా!!

   Delete
 6. నాకు డబల్ కా మీటా కావాలండి,,ఇలా తలుచుకుంటారని తెలిస్తే నేనే వందో మెంబర్ అయ్యేవాడ్ని కదా.....హ,హ..ఇంతకీ నేనున్నానా మీ బ్లాగు కుటుంబంలో...

  ReplyDelete
  Replies
  1. అదేంటండీ మీఠా కావాలంటూ....నేను ఉన్నానా అని అడిగితే ఊరుకుంటానా:-)

   Delete
 7. బావుంది.. పద్మార్పిత గారు. నేను మీ ఫాలోయెర్ ని కాకపోయినా.. మీ బ్లాగ్ క్రమం తప్పక చూస్తుంటాను.

  మీ అభిలాష తప్పక నెరవేరుతుంది. కీప్ బ్లాగింగ్ !!

  ReplyDelete
  Replies
  1. క్రమంతప్పకుండా చూసి స్పందించడం కన్నా ఇంకేం ఫాలో కావాలి చెప్పండి. మీ అభిమానానికి నెనర్లండి!

   Delete
 8. ఏదండీ విందు అని ఊరించారు....
  కవితా లేదూ, బొమ్మా లేదు.
  మీ చిన్ని చిట్టి ఆశ తప్పక తీరాలని ఆశిస్తూ... ;)
  Congratulations అండీ!

  ReplyDelete
  Replies
  1. చూసారా!!! కవితా, బొమ్మా లేదు కాబట్టే ఇలా ఊరించగలిగాను....
   thank you....

   Delete
 9. అభీష్టసిద్దిరస్తు :-)
  శుభాభినందనలు అందుకోండి...

  ReplyDelete
  Replies
  1. మీ ఆదరాభిమానాలని సదా ఆశిస్తూ...వందనాలు.

   Delete
 10. congratulations padmarpita. mee aasha tappaka neraveralani korukuntunna..

  ReplyDelete
 11. హృదయపూర్వక అభినందనలు పద్మర్పిత గారు. మీ ప్రతి కవితనీ నవకాయ పిండి వంటలంత ఆనందంగా ఆరగించే వారిలో నేను కూడా ఒకదాన్ని.బయటనుంచి మద్దతు ప్రకటించే వారు వేలల్లో ఉన్నారు చూడండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. (నా బ్లాగ్ లో ఫాలోవర్ గాడ్జెట్ లేదు. అందుకని ఆ ధ్యాస నాకు కొంచెం తక్కువే:)

  ReplyDelete
  Replies
  1. నా కవితల్ని పిండి వంటలంత ఇష్టంగా ఆరగించి ఆస్వాధించే మీ అభిమానానికి కృతజ్ఞతలండి! ఇది చాలు:-)

   Delete
 12. హ హ నో నేను ఒప్పుకోను , మాడింది పొంగింది లాంటి రీజన్స్ , right now I want Biryani :D
  Congrats and good luck !

  ReplyDelete
  Replies
  1. అలాగని మారాం చేస్తే తప్పుతుందా...పదండి ప్యారడైజ్ కి:-)thank Q!

   Delete
 13. "బ్లాగ్ మెంబర్స్ 100" కి చేరినందుకు అభినందనలు పద్మార్పిత గారు!
  మరోవిషయంలో కూడా నా అభినందనలు అందుకోండి పద్మార్పిత గారు!
  బ్లాగ్ లోకం లో 'ఉత్తమ టపాగా 'నా వయసెంత' అన్న మీ టపా ఎన్నికయినందుకు.
  కానీ, ఈసారి
  "బ్లాగ్ మెంబర్స్ 100" కి చేరిన సందర్భంలో మీరిచ్చిన భలే విందు మాదిరిగా కాకుండా మంచి విందుని ఇవ్వండి. మీ విందు ఆహ్వానంకై ఎదురుచూస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. భారతిగారు...నేను డబల్ కా మీఠా పెట్టకపోయినా, డబుల్ ధమాకా లాంటి కమ్మని వార్తని తెలిపిన మీ అభిమానానికి సదా విధేయురాలిని....మరి ఆలస్యమెందుకు రండి విందారగించ:-)

   Delete
 14. మీ బ్లాగ్ మెంబెర్స్ వందా

  దానికి మిరేచ్చేది విందా

  అలా ఆశ పడటం ఏవిటి నా బొంద

  మీ పాయసం తింటే వస్తుంది ఆయాసం

  మీ బిరియాని తింటే పరిశాని

  వెయ్యి అయ్యాకే యిద్దురు

  అలాగే కానీ అంతవరకూ హాయ్ గా జీవించని

  ReplyDelete
  Replies
  1. రవిగారూ....ఏదో విందు కోసం వంక, అలా వంద బ్లాగ్ మెంబర్స్ అని, అయినా ఎంత బిరియానీ తినని వారైనవారైనా ఇలా పరేషాన్ అనతగునా......వందమందితో అడ్జస్ట్ కాని వారు రేపు వెయ్యిమందితో విందులో ఏం పాల్గొంటారు చెప్పండి.... నవ్వుతూ ఆనందించేవారు కలకాలం హాయిగా ఉంటారండి:-)
   అభిమానం ఎక్కువైందని కుళ్ళుకోకుండా ఖుషీగా నవ్వేయండి ప్లీజ్;-)

   Delete
 15. mokam choodu yettundoo nooroorinchi aakariki.. yemilekunda chesindi.... naa rakasi...

  ReplyDelete
  Replies
  1. ఏమి ఎందుకు లేవండి....మీ అభినందనలు నాకు నా వందనాలు మీకు ఉన్నాయిగా:-)

   Delete
 16. ఎవరు ఏమనుకున్నా సాగిపో నా అభిమాన ప్రియనేస్తమా మీకు తిరుగులేదు.
  మంచి మనసుంటే మందికేం లోటన్నట్లు-----మీకేంటండి మీ రాతలకు వేలలో అభిమానులుండగా


  ReplyDelete
  Replies
  1. ఆ అభిమానమే నాకు ఇలా రాయడానికి ప్రేరణలు. థ్యాంక్యూ వెరీమచ్!

   Delete
 17. పద్మార్పిత గారూ, అభినందనలు వంద మంది మిత్రులను పొందిన మీ స్నేహమయ హృదయానికి.,చక్కటి మీ కవితలకు,
  మీ కవితల్లో భావుకత్వం, పద సంపద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ....మెరాజ్

  ReplyDelete
  Replies
  1. మీ ఈ అభిమానపు స్పందనలని ఎల్లప్పుడూ కోరుకుంటూ....ధన్యవాదాలండి!

   Delete
 18. నేను మాత్రం మీరు వంటలతో విందులొద్దు కానీ కమ్మని కవితలతో వినోదాన్ని, చిత్రాలతో కనులవిందుని చేయమని కోరుతాను. కంగ్రాట్స్ పద్మార్పితా!!!

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానం సదా నే కోరుకుంటాను....ధన్యవాదాలండి!

   Delete
 19. కనబడే బ్లాగ్ మెంబర్స్ 100 అయినా కనిపించని అభిమానులు కోకొల్లలు.
  అందుకోండి అటువంటి ఒక అభిమాని మా శ్రీవారి నుండి అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. నా ప్రత్యేక ఇన్విసబుల్ అభిమానిగారికి నమోఃవందనములు.

   Delete
 20. ప్చ్....అజ్ఞాతగానే ఆనందంగా మిమ్మల్ని అభినంధిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. మీ సౌలభ్యానందాన్ని కోరుతూ... ధన్యవాదాలండి!

   Delete
 21. ప్రతి పోష్టూ విందేగా !
  పఠితల కడుగడుగున పసందేగా !
  వందేమి ?
  మేమంతా మీ బ్లాగు నందేగా !
  ప్రతిభకు పద్మార్పిత ముందేగా !
  -----సుజన-సృజన

  ReplyDelete
  Replies
  1. నా ప్రతి పోస్ట్ ని విందుగా పసందుగా ఆస్వాదిస్తూ....
   నన్ను ప్రోత్సహిస్తున్న మీ ముందు నేను ప్రణమిల్లుతున్నాగా.
   ధన్యవాదాలండి.

   Delete
 22. పద్మగారూ!
  అనుసరిస్తున్న వారు 100 ఉన్నారని సంబరపడి కూడా
  ఇలాంటి విందు ఇవ్వడం బాగాలేదు...:-)
  అభినందనలు మీకు...@శ్రీ

  ReplyDelete
  Replies
  1. మంచి విందుకై ప్రయత్నించి చేతకాక ఇలా మీ ముందు నిలచినా మీరు అభిమానంతో ఆదరిస్తారన్న సంబరమే కానీ వేరేమీలేదు:-) అభివందనములు మీకు!

   Delete
 23. హృదయపూర్వక అభినందనలు...

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి...

   Delete
 24. నేను కూడా ఒక మెంబర్ నోచ్....విందు భలే పసందు:-)

  ReplyDelete
  Replies
  1. చిలకల పలుకులు నేగన్నానోచ్:-)

   Delete
 25. పద్మార్పితగారు,హృదయపూర్వక అభినందనలు...ఈ పద్మం సహస్రదళ విరాజితం కావాలని ఆకాంక్ష :)

  ReplyDelete
  Replies
  1. ఓహ్....మీ అభినందన ఆశ్వీర్వచనాలకి నమస్సుమాంజలులు.

   Delete
 26. నాకు డబుల్ కా మీఠా కావాలి.. తయారుచేయడం ఎలాగో నేర్పిస్తారని ఆశగా వచ్చాను.. ఇలా పాయసం పేస్టుతో సరిపెట్టేసారు.. అయినా చాలా బాగా చేసారు..:) మీకు శుభాకాంక్షలు

  ReplyDelete
  Replies
  1. నేను చేసిన పాయసం పేస్ట్ కూడా బాగుందని మెచ్చుకునేంత మీ అభిమానానికి వందనాలండి:-)

   Delete
 27. పద్మప్రియ గారు, శుభాకాంక్షలు. నేను మీ బ్లాగు ఫీడ్ ను గూగుల్ రీడర్ లో చదువుతాను, నా లాగా చదివే వాళ్ళు కూడా చాల మంది ఉండే ఉంటారు, so మిరేప్పుడో 100 దాటేసి ఉంటారు.

  ReplyDelete
  Replies
  1. అందుకే ఈ విందు అందరికీ:-)....ఇలా వందని ఓ వంక మాత్రమే, అలా అనకపోతే మీరు పలుకరించేవారు కాదుగా:-) థ్యాంక్యూ...

   Delete
 28. Ah vandamandilo nenu oka member ni...:) Hearty congratulations andi :)

  ReplyDelete
  Replies
  1. naaku telusugaa....mimmalni taluchukunnaa...thank you friend.

   Delete
 29. అదరగొట్టేసారు పద్మర్పిత గారు.....నేను రోజూ మర్చిపోకుండా ఓపెన్ చేసే బ్లాగ్ మీదేనండి .....ఎందుకో అలా అడిక్ట్ అయిపోయా....మీ బ్లాగులోని బొమ్మలు చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ..ఏదో ప్రశాంతత :).....Congrats అండి :) ఆ 900 మంది కూడా అయ్యాక... పేస్టు,మౌల్డ్ కాకుండా.....మీథా అండ్ బిర్యానీ పెట్టండి ప్లీజ్ :)

  ReplyDelete
  Replies
  1. కామెంట్ ఇంత లేట్ గా పెట్టానని తిట్టకండి.....నిన్న పోస్ట్ చదివి కామెంట్ ఈ రోజూ పెడుతున్నా.....మీకు కామెంట్ పెట్టాలంటే నా మెదడుకి పదును పెట్టాలి...ఏం చెప్పినా తక్కువే....ఈ లోపు నాకు ఆఫీస్ వర్క్ వచ్చేస్తోంది :) అందుకే ఈ ఆలస్యం....క్షమించేసారు కదూ??

   Delete
  2. అమ్మో ఇంత అభిమానం....తబ్బిబైపోతున్నా, మునగచెట్టు ఎక్కించడం లేదుకదా! ఎక్కి కిందపడితే మీరంతా పట్టిలేపండి ప్లీజ్:-)
   తప్పకుండా బిర్యానీ, మెటా & గరం ఇరానీ చాయ్ కూడా గ్రాంటెడ్:-)
   లేట్ గా పెట్టినా లేటెస్ట్ గా ఉందిలెండి....థ్యాంక్యూ వెరీమచ్.

   Delete
 30. memu mee blaagu abhimaanulu gaa meeru elaa vandi pettinaa tinadaniki siddhamu andi.. meeru itlaage panchabakshya paramaannaalu vandeyyagalaru.. modalu pettandi mari.. ;)

  Rajeswari.

  ReplyDelete
  Replies
  1. :-)mee andari abhimaanamto tappakunda...thanksandi

   Delete
 31. అభినందనలు పద్మారిత గారూ...

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ వెరీమచ్.

   Delete
 32. Hearty Congratulations Arpita Mam....i hope the glory of U continues....Be rocking Mam........

  ReplyDelete
 33. Esariki elagola ajust ayipothanu next time matram naku Biryani kavali :D

  ReplyDelete