నలుపు/తెలుపు

తెలుపు స్వచ్ఛతకి చిహ్నమైనప్పుడు...
దాన్ని చూపే కనుగుడ్డు నలుపెందుకు?
కనుముక్కు తీరు చక్కగున్నప్పుడు...
నల్లగా ఉందంటూ ఆ విముఖతెందుకు?
మనసంతా మసిపులుకున్నప్పుడు...
పాలరాతి బొమ్మంటూ బిరుదులెందుకు?
ఎర్రగున్న ఎర్రిదాన్ని చూసినప్పుడు...
కుంటిగుర్రం సైతం రంకెలేయడమెందుకు?
కళ్ళతో మనసు చూసే కర్రెబండోడు...
ఎర్రతోలున్నదే కావాలని కోరడమెందుకు?
రంగుదేముంది ఏదైనా ఒకటనుకున్నప్పుడు...
తనకైతే తెల్లపిల్లనెంచుకునే ప్రభుధ్ధులెందుకు?
కనడానికి కారణమైనిరువురు నల్లగున్నప్పుడు...
తెల్లసంతతికై  కుంకుమపువ్వు మెక్కడమెందుకు?
నిగారింపు నాణ్యత నలుపులో ఉన్నప్పుడు...
అందమంతా తెలుపుదేనంటూ ఆధిపత్యమెందుకు?
తెలుపునుచూసి నల్లనిగుడ్డే చొంగకారుస్తున్నప్పుడు...
తెలుపు నలుపుల తారతమ్యమేలంటూ వాదనలెందుకు?

(సాధారణంగా తెల్లగున్న అమ్మాయి చీమకళ్ళు, చప్పిడిముక్కు, లావుపెదవులు ఉన్నా వాటిని మరచి అమ్మాయి తెల్లగా లేదా ఎర్రగా బాగుంది అంటాము. అదే అందమైన కళ్ళు, అవయవసౌష్టవం చక్కగా ఉన్నా నల్లని పిల్లైతే......ముందుగా వచ్చేమాట అమ్మాయి నల్లగా ఉందనే. మీరంతా కాదని పైకి అన్నా మనసు మాత్రం తెలుపువైపే మొగ్గుతుందనేది మాత్రం జగమెరిగిన సత్యం)
దానికి రూపకల్పమే నా ఈ తెలుపు/నలుపు:-)
కాదనో, అవుననో తిట్టండి.....ఆలస్యమెందుకు? 

96 comments:

 1. నలుపే నాణ్యం అని తెలువదేందుకు? నలుపంటే ఎందుకంత చిన్న చూపు అంటూ.. భలే..చురకలు వేసారు. రాతిరి నలుపు,కోయిల నలుపు,తల వెంట్రుకలు నలుపు.. .ఇలా ఎన్నో.. వాటిని త్యజించ లేం!
  ఆలోచనా విధానంలో మార్పు రావాలి. well said!

  ReplyDelete
  Replies
  1. మార్పుకై ఆశిద్దామండి....Thank you.

   Delete
 2. పద్మ గారూ!
  మంచి ప్రశ్నే వేసారు..:-)
  అసలు నలుపంటే రంగు కానే కాదు...
  అన్ని రంగుల మిశ్రమం 'తెలుపు' అయితే...
  రంగు ఏమీ లేకపోవటమే 'నలుపు'...
  కాంతిని ప్రతిఫలించేది 'తెలుపు' అయితే...
  కాంతిని తనలో కలిపేసుకునేది 'నలుపు'...
  మనస్తత్వ శాస్త్రంలో కూడా తెలుపు ధనాత్మకమైతే
  నలుపు ఋణాత్మకం...
  మొదట చూసేది కన్ను తర్వాత చూసేది మనసు...
  అందుకే తెలుపుకి ఓటు ఎక్కువ వేస్తారేమో!...:-)
  ఇంకా వ్రాస్తే...నా కవిత కంటే పెద్ద వ్యాఖ్య వ్రాసారేమిటి?...
  అంటారని ముగిస్తున్నా...
  "काले है तो तो क्या हुआ...दिलवाले होना चाहिए."...:-)
  అంతేనంటారా?...:-)
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పేవన్నీ నిజాలే....కానీ చూసారా నలుపు ఋణాత్మకం....అంటూ -ve మైనస్ మార్క్ ఇచ్చారుగా;-(
   అదే కదా పాపం నలుపుకి అన్యాయం జరిగిందని చెప్పేది:-)
   మీ వ్యాఖ్యల్ని మనసారా ఆహ్వానిస్తూ....ధన్యవాదాలు!
   काले है तो क्या हुआ...दिलवाले होना चाहिए:-)
   दिलवालॊ के नजर मे हम दी दारे यार होना चाहिए!

   Delete
 3. mee bomalu, writing style baguntundi. nice

  ReplyDelete
  Replies
  1. meeku nachinanduku dhanyavaadamulu.

   Delete
 4. మన జాతి రంగు నలుపు.అందుకే మన దేవుళ్లు విష్ణువు,పార్వతీదేవి నల్లటి వాళ్లే.పరాయి వస్తువుల మీద మోజున్నట్లే పరాయి జాతుల వారి రంగు మీద కూడా మోజు పెంచు కున్నారు మన వాళ్లు.మనసు స్వఛ్ఛతను కాకుండా తెల్లతొక్కకి ప్రాధాన్యం ఇవ్వడమే అనర్థాలకి మూలం.కానివ్వండి.ఎవరికేం చెప్పగలం?

  ReplyDelete
  Replies
  1. ఇంత చక్కగా వివరిస్తూ....ఎవరికేం చెప్పగలం? అంటారెందుకండి:-)
   మీ అమూల్యమైన స్పందనను తెలియజేసినందుకు ధన్యవాదములండి.

   Delete
 5. కరుపుదీ ఇనక్కు పుడిచె కలరు, అని అరవపాటలో హీరోయిన్ అలానే అంటుంది.
  నల్లకారు, సాక్స్, షూ, కురులు, రాత్రి, ఏనుగు, గేదె ఇవన్నీ నల్లవే ఇష్టం.

  /దేవుళ్లు విష్ణువు,పార్వతీదేవి నల్లటి వాళ్లే/
  అవునా?! నేనెప్పుడూ చూడలేదు లేండి. మీరెక్కడ ఎక్కడ చూశారు?! :))

  ReplyDelete
  Replies
  1. ఇనక్కుం కరుపుదా పుడిచె కలరు:-)
   నల్లవస్తువుల నాకిష్టమైన లిస్ట్ చూసి తెలుపు పాలిపోయి పరుగు పెడుతుందేమోనండి:-)
   అతీతమైన వాటిగురించి చర్చ మనకెందుకండీ...అందుబాటులోని వాటినిగాంచి ఆనందిద్దాం:-)
   Thanks for response.

   Delete
 6. పద్మార్పితగారు మీరన్నది అక్షరాలా నిజం, నల్లగున్నా మనసు మంచిదైతే చాలంటారే కానీ తీరా కోరుకునేది తెలుపునేనండి.

  ReplyDelete
  Replies
  1. మాటలకి చేతలకీ చాలా వ్యత్యాసముంటుందండి.... మీ వ్యాఖ్యకు థ్యాంక్సండి!

   Delete
 7. నిజంగా నలుపే నాణ్యం అనుకుంటే మనిషి నలుపైతేనేమి మనసు తెలుపని ఆధిక్యం తెలుపుకి ఇచ్చేవారుకాదు కదండి(మనసు నల్లగా భలే బాగుందనేవారు కాదాండి) ఏదో చూడని దేవుళ్ళు నలుపని మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నామేమో?

  ReplyDelete
  Replies
  1. నిజమేనండి....నల్లగా భలే బాగుందంటే, కాకిపిల్ల కాకికి ముద్దని మన కళ్ళకి మసంటుకుని మసగబారినాయంటారేమో!!:-) ఏదేమైనా తెల్లని లోకంలో నలుపు విలువ శూన్యం.
   మీ స్పందనకు వందనములు.

   Delete
 8. Meeku bhale thoughts vastayandi..meeru cheppedi aksharala nijam.....Manam first aakarshitulu aiyyedi rangu roopam choose....taravatha manasuni pariseelistam....

  ReplyDelete
  Replies
  1. spandinchea blog friends indarunnappudu naa thoughts ki doubts ki kodavaa cheppandi:-)
   First ranguchusi paddaka...inka manasuneam pariseelistam cheppanDi:-)
   Thanks for your comment.

   Delete
 9. ఒక అవథానం లో ..... అవథాని గారిని -
  "అమ్మాయిలు కుర్రాళ్ళలో నలుపు వాళ్ళని ఇష్ట పడతారా ? తెలుపు వాళ్ళని ఇష్ట పడతారా ? అని ప్రశ్నిస్తే ....
  సమాథానంగా .... అవథాని -
  నలుపు వాళ్ళనే - అని చమత్కరించాడు మరి !

  ReplyDelete
  Replies
  1. నలుపువాళ్ళనే ఇష్టపడతారని చమత్కరించారంటే.....ఆడవారిమాటలకు అర్థాలేవేరని విరించేవారేమో వివరణ అడిగితే మరి! మీ స్పందనకు నెనర్లండి!

   Delete
 10. SNKR గారికి,"నేనేక్కడా చూళ్ళేదు మీరెక్కడ చూశా"రని అడగడం-ఈవిడ మా అమ్మ గారని మీరంటే కనడం నువ్వు చూశావా అని అడిగినట్లుంది.ఇది నాకు అభ్యంతరకరం కాదు గాని అది జిజ్ఞాసువులు అడగవలసిన తీరు మాత్రం కాదు.
  " నల్లని వాడు పద్మ నయనంబుల వాడు" అని కృష్ణుని చూసే వ్రాసేడేమో పోతన్నని కనుక్కుందామా?విష్ణువును నల్లవేలుపు అంటారనీ, పార్వతీదేవిని శ్యామలా అని ఎందుకంటారో తెలుసుకుంటే మీ సందేహ నివృత్తి అవుతుంది.

  ReplyDelete
  Replies
  1. సర్దాగా అన్నాలేండి, 'జిజ్ఞాస' లాంటి దేమీ లేదు. వర్ణ విచక్షణ దేవుళ్ళకు ఆపాదించడం అంత సబబు కాదు.
   బ్రహ్మ, గాయత్రి, సరస్వతి తెల్లని వారంటారు, శివుడు ఎర్రని వాడు, పార్వతి తెల్లనిది, కాళిక నల్లగా, చండి రక్తవర్ణణ్గా వుంటారంటారు. మా వూర్లో రామాలయంలో రాముడే కాదు, లక్ష్మన, సీతా హనుమంతులను కూడా నల్ల రాతి విగ్రహాలుగానే మలిచారు. బిర్లా మందిర్లో చలువరాతి విగ్రహాలుంటాయ్. రావణుడు తెల్లగా వుంటాడట, ఎంతైనా బ్రహ్మ మునిమనముడాయె.

   Delete
  2. మీ ఇరువురి చర్చా మాలాంటివారికి చక్కని జ్ఞానవేదిక.....బాగు బాగు:-)

   Delete
 11. లక్కాకుల వారు చెప్పిన ముచ్చటలోని అవధానిగారి శ్లేషాచమత్కృతి నాకు మరో ముచ్చట గుర్తుకు తెస్తోంది.శ్రీ నారాయణదాసుగారు నృత్యాభినయం చేస్తూ హరికథ చెబుతూ ఉంటే ఆనాటి నాట్య కళాకారిణి విదుషీమణి కళావర్ రింగు (సరిదె లక్ష్మీ నరసమ్మ గారు)పాడువారు ఆడువారు అని శ్లేషించిందట.ఆ తరువాత ఒక సందర్భంలో ఆమె గానం చేస్తూ నృత్యం చేస్తుంటే దాసుగారు ఆడువారు పాడువారు కూడాను అని చమత్కరించారట.ఈ ఇద్దరి వైదుష్యానికి ఇది మచ్చుతునక కాదా? దాసు గారిని చూడలేక పోయినా కళావరు రింగు గారి నృత్యం నా చిన్నతనంలో చూసే భాగ్యం నాకు కలిగింది.

  ReplyDelete
  Replies
  1. మాతో పంచుకున్న మీకు ధన్యవాదములు.

   Delete
 12. నే పుట్టినప్పుడు నలుపే,
  పెరిగినప్పుడు నలుపే
  ఎండలో నలుపే,
  భయపడ్డా నలుపే,
  నలతైనా నలుపే
  నే చనిపోయినా నలుపై ఉంటా.

  తెల్లపిల్లా!! మరి నువ్వో..

  పుట్టీనప్పుడు గులాబీ
  పెరిగాకా తెల్లమల్లెవి
  ఎండల్లో ఎర్ర మందారం
  భయపడ్డవేళ ముద్దబంతివి
  నలతగావుంటే పచ్చబడతావు్
  పోయినప్పుడు బూడిద రంగై పోతావు
  మరి నువ్వు నన్న "రంగు" అని ఎలా అంటావ్!!
  This poem was nominated poem of 2005 for the best poem, written by an African kid, amazing thought!!!
  నాకు చూసిన వెంటనే గుర్తొచ్చిందిదే/
  thanks.

  ReplyDelete
  Replies
  1. నేను కూడా చదివానండి ఈ మెసేజ్ ని . మంచి కనువిప్పు కలిగిచే మెసేజ్. మాతో పంచుకున్న మీకు ధన్యవాదములు!

   Delete
  2. nijamga kanuvippu kaliginda hahhahahahahaha

   Delete
 13. ఇప్పుడు నలుపు , తెలుపు కుచ్ నహి!
  సన్నగా , గడ్డ కర్రలా , జీరో సైజ్ అయితే చాలండోయి పద్మ గారు...రోజులు మారాయి.. :))

  ReplyDelete
  Replies
  1. నలుపు, తెలుపులో కుచ్ నహీ అంటూనే తెలుపుని చూసి కుచ్ కుచ్ హోతా హై అంటారండి:-)
   జీరో సైజ్ నల్లమ్మాయి, తెల్లమ్మాయిల్లో సెలెక్ట్ అవ్వబడేది మాత్రం తెల్లమ్మాయేనండోయ్:-)
   బహుకాలానికి దర్శనమిడి వ్యాక్యిడిన మీకు అభివందనములు!

   Delete
 14. నా ఉద్దేశంలో తెల్లగా అమ్మాయి ఉండాలనే కోరిక, తనకోసం కాకుండా పుట్టే పిల్లలు తెల్లగా ఉండాలని అనుకుంటా. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత పెళ్ళాము ముందర కూర్చుని జపం చేసే సమయం చాలా తక్కువ.

  ReplyDelete
  Replies
  1. పుట్టేపిల్లలు తెల్లగా పుట్టడం కోసం అలా కోరుకోవడం ఇంకో మూర్ఖత్వమేమోనండి!
   ఏ వంకలూ లేకుండా ఆరోగ్యంగా పుట్టాలనుకుంటే దానికో అర్థముంటుంది కదండి!
   మీ స్పందనకు ధన్యవాదములు.

   Delete
  2. /పుట్టేపిల్లలు తెల్లగా పుట్టడం కోసం అలా కోరుకోవడం ఇంకో మూర్ఖత్వమేమోనండి!/
   ఇక్కడ మూర్ఖత్వం అనేమాట వాడటం బాగోలేదు, సరికాదు, ఖడిస్తున్నా.

   ఓ నల్ల అమ్మాయి, బాబూమోహన్ లాంటి అబ్బాయిని, ఖత్రినా ఖైఫ్ లాంటి పిల్లలు కలగాలని వరిస్తానంటే, అది మూర్ఖమైన అమాయకత్వం అవుతుంది.

   Delete
  3. నల్లగా వున్నవాళ్ళకి నలుపు రంగే అందం అన్న 'అందని ద్రాక్ష పుల్లన' అన్న రాజీ ధోరణి ఎందుకు? :)
   ఒకరు తెల్లగా వున్నా పుట్టే పిల్లలు తెల్లగా వుండటానికి 50% చాన్స్ వుంటుంది. ఇద్దరూ నల్లగా వుంటే ఆ చాన్స్ 10%లోపున పడిపోతుంది.
   తారతమ్యలా?! ఎక్కడ?! మీకు నలు పుడిచె కలరు అన్నారు కాబట్టి ఎవరికి నచ్చిన కలరు వాళ్ళు చెప్పేశారు.

   Delete
  4. బహుశా తెల్లగా ఉన్నవాళ్ళకి తామే గొప్ప, అదే అందం అనుకునే భావం నుండి బయటపడలేక నల్లగా ఉన్నవాళ్ళే ఇలా వాధిస్తారు 'అందని ద్రాక్ష పుల్లనా అనుకుంటారని పిచ్చిభ్రమ కాబోలును:)
   పద్మార్పితగారు మీరన్న ప్రతి అక్షరంలోను నిజమున్నదండి. క్షమించాలి ఇక్కడ ఈ చర్చలో మిమ్మల్ని నొప్పిస్తే.
   చాలా మంచి ప్రశ్నల్ని సూటిగా అడిగారు-- అభినందనలు.
   అంత 50% చాన్స్ వుంటే తెల్లగాఉన్న అబ్బాయిలు ఎందుకని బ్లాక్ బ్యూటీలే కావాలనికోరుకోరు. నేను తెలుపు నాకు తెల్లగున్నపిల్లే కావాలంటారు.
   నిజంచెప్పాలంటే నల్లగాఉన్నవారు సున్నిత మనస్కులై మంచిస్నేహశీలులై ఉంటారని మనస్తత్వనిపుణులు చెప్పారు. మరి మంచి మనసుని కోరుకునే ఎంతమంది తెల్లవాళ్ళు వీళ్ళని ఆమోధిస్తున్నారో? ఇలా చెప్పుకుంటూపోతే వితండవాదనౌతుందే తప్ప అంతం ఉండదు.
   ---నీలిమ

   Delete
  5. @SNKR మీరన్నదే రైట్ అయితే......ఓ నల్లగా ఉన్న అబ్బాయి మీ సో కాల్డ్ తెల్లని అందమైన పిల్లని పెళ్ళాడితే తెల్లరంగుతోనే పిల్లలు పుడతారని గ్యారంటీ ఉందాండి?
   ఇక్కడ తెలుపు/నలుపు అన్న తారతమ్యమెందుకు
   తెలుపురంగే అందమని, మక్కువ ఆకర్షణ ఎందుకు?
   ఈ కమెంట్ మిమ్మల్ని ఏవిధంగానైనా నొప్పిస్తే మన్నించాలి...సరదాగా చర్చసాగితే బాగుంటుందని నా అభిప్రాయం.

   Delete
  6. @1.Anonymousగారు.....నల్లగా ఉన్నవారే నలుపుని ఇష్టపడి తెలుపుపై అయిష్టం పెంచుకుంటారని భావిస్తే పప్పులోకాలేసినట్లే:-)
   విరహగీతమైతే భగ్నప్రేమికురాలినని
   వృద్ధాప్యంపై పోస్ట్ రాస్తే వృద్ధురాలినని
   ప్రేమకవితలల్లితే పరువపుపడుచునని
   ...........అనుకుంటే ఎలాగండి???:-)
   నిజమేలెండి మీరన్నట్లు 50% చాన్స్ కోసం ఎగబడడమే సబబేమో!
   తారతమ్యాలా?! ఎక్కడ?! అని అది అనుభవించిన వారిని అడిగితే బాగా చెప్పగలరేమో నాకన్నా!
   నలుపేమో నాకిష్టం మీ మనసు మీ అభిరుచులు మీకిష్టం....ఇదెవరికీ కలిగించదు కష్టం:-)
   Thanks for being a part of this discussion.

   Delete
  7. @2.Anonymousగారు.....బహుశా ఇది మీ ఫీలింగ్ అయి ఉండవచ్చును.
   ఈ చర్చ సరదాగా సాగుతూ కాసేపు హాయిగా అందరినీ ఆనందపరచాలనే ఉద్ధేశమే కానీ క్షమించడాలు, సీరియస్ గా వాధించడాలంత మ్యాటర్ లేదండి:-)
   మీరు స్పందించి మీ భావాలని వెల్లడించినందుకు సంతోషమండి.

   Delete
  8. నీలిమ గారు, మీరు లోతుగా, అందంగా అనలైజ్ చేశారు. మాయావతి, కనిమొళిలు సున్నిత మనస్కులనినేనంటే నా ఫ్రెండ్స్ నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు, తింగరి అంటున్నారు. మీ మేధోపరమైన మీ వాక్యం వారికి కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తాను.

   Delete
 15. SNKR గారికి,నేనూ సరదాగానే అన్నానులెండి.నాకభ్యంతరకరం కాదని అందుకే చెప్పాను.వర్ణ వివక్షను దేవుళ్లకు ఆపాదించడం సబబు కాదని అన్నారు కదా? ఇదే కాదు మనిషి తనకున్న సమస్తదుర్గుణాలనూ వికారాలనూ దేవుళ్లకు కూడా అంటగట్టాడు.లేకపోతే భజన చేస్తే పొంగి పోయి వరాలివ్వడం,లంచాలు ముడుపులూ స్వీకరించడం, అమ్మవార్లు భర్తల మీద అలిగి వెళ్లిపోవడాలూ.నిస్సంగుడికి ఏటేటా పెళ్లిళ్లు చేయడం..ఒకటేమిటి?అందుకే అన్నాడు కుందుర్తి--"తెలుగు నాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది.డ్రయినేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది" అని.పద్మార్పిత గారి బ్లాగులో మనం విషయాంతరాలను చర్చించడం బాగోదు కనుక ముగిద్దాం.

  ReplyDelete
  Replies
  1. మీరు ఇలా చర్చించడం వలన మేము కూడా తెలుసుకుంటున్నాం కదండీ....మీ ఈ చర్చాగోష్ఠి మాకు జ్ఞానోఆనందదాయకం.

   Delete
 16. నలుపు తెలుపుల సంగమం జీవితం కదా... ఏమైనా ఎవరి కనుల కింపైనది వారి కనులతో చూస్తేనే తెలుస్తుందంటారు...:-)
  ఆలోచనాత్మక పోస్టులతో ఎప్పటికప్పుడు క్రొంగొత్తగా కనులతో పాటు మనసుకు ఆహ్లాదాన్నివ్వడం పద్మార్పిత గారికి వెన్నతో పెట్టిన విద్య...అభినందనలతో.

  ReplyDelete
  Replies
  1. నలుపు తెలుపుల సంగమమని
   అందాలరంగులమయం జీవితమని
   ఎవరి కనులకు ఇంపైనది వారిష్టమని
   మీరు తెలివిగా తికమక పెట్టడమెందుకని:-)
   ఎప్పటికప్పుడు అభిమానంతో అభినందించి ప్రోత్సాహపరిచే మీకు ధన్యవాదములు.

   Delete
 17. అందరిచే ఆలోచింపచేసి అలరించి మెప్పించడంలో అందెవేసిన పద్మార్పితా మీకు అభినందనలు.
  విషయానికి వస్తే నా ఓటు మీకేనండోయ్:)

  ReplyDelete
  Replies
  1. సదా సమర్ధిస్తూ స్పందించి సమాధానమిచ్చే మీకు ధన్యవాదములు.

   Delete
 18. nalaguna manasu bagundali, bahya sowndrayam chustare kani anthar soudaryam chudaru. vishayanikosthe na votu mikenandi

  ReplyDelete
  Replies
  1. Oh!mana perlekadu thoughts kuda same to same annamaata:-) thank Q!

   Delete
 19. Hmm.. Nijame! Chaala mandiki paiki kanipinche Nalupu/Thelupulu maatrame mukhyam. Lopali sangathi pattinchhukune vaarini vrella meedhe lekka petteyochhanukunta!

  ReplyDelete
 20. Thanks for your comment and support.

  ReplyDelete
 21. అవును పద్మర్పిత గారు.....నాకు పాప పుట్టింది అని ఎవరైనా చెబితే వెంటనే కలర్ (తెలుపు/నలుపు) ఎవరిది వచ్చింది అని అడిగే మూర్ఖులు ఎంతో మంది ఉన్నారు... మీ పోస్ట్ చాలా నచ్చింది.....

  ReplyDelete
  Replies
  1. నిజమేనండి పిల్లలు పుట్టారని చెప్పగానే ఆరోగ్యంగా పుట్టారా అని అడిగేవాళ్ళు తక్కువ, ఒకవేళ అడిగినా దానికి ఆన్సర్.... ఓ! తెల్లగా దబ్బపండనో నిమ్మపండనో అంటారే కానీ నల్లగా అందంగా మెరిసిపోతున్నారు అనరెందుకో. మీ వ్యాఖ్యాప్రసంశకి ధన్యవాదాలు.

   Delete
 22. చాలా బాగా రాశారు పద్మార్పిత గారు.
  మామిడి హరికృష్ణ గారు రాసిన కింది ఆర్టికల్ లో కూడా మంచి సమాచారం ఉంది.

  http://harikrishnamango.blogspot.in/2011/12/blog-post.html

  ReplyDelete
  Replies
  1. మెచ్చిన మీకు నెనర్లండి.....చదివానండి "నల్లతోలు-తెల్లతోలు" కదా చాలా బాగుంది.

   Delete
 23. నలుపు,తెలుపులు మనసుకుండవు కదా! మంచి కవిత.

  ReplyDelete
  Replies
  1. మనసుకి లేని ఈ రంగుల మర్మం ఈ మనుషులకెందుకో మరి. కవితను చదివి కమెంటిడిన మీకు నెనర్లండి.

   Delete
 24. చాలా చాలా బాగా రాశారు పద్మార్పిత గారు

  ReplyDelete
  Replies
  1. మెచ్చిన మీకు థ్యాంక్సండి!

   Delete
 25. పద్మర్పితగారు అనవసరంగా ముందే కమెంట్ పెట్టానేమో...ప్చ్;-(
  వీళ్ళందరి వాదోపవాదాలు చదివిన మీదట నేను కూడా ఏమైనా మాంచి గట్టిగా మసాలా జోడించి రాసుంటే బాగుండేదేమో అనిపిస్తుంది:-) మీకు మనుషుల మనోభావాలతోపాటు నవ్వించే నరాలపట్టుకూడా తెలుసేమోనని డౌట్:-)

  ReplyDelete
  Replies
  1. డౌటెందుకండీ సృజనాజీ...
   నిజమే కదా>>>ః-))

   Delete
 26. అయితే అర్పిత తెల్లని అందమైన అమ్మాయన్నమాట:) ఇలా అంటే చివాట్లు నాకుపెడతారు అందుకే పద్మార్పిత నాణ్యమైన నాజూకు మనసునుదోచే అందాలరాకాసి అనుకుంటా:)CONGRATS

  ReplyDelete
  Replies
  1. పద్మ తెలుపైనా అర్పిత నలుపైనా
   నలుపు-తెలుపుల గోడు మారేనా:-)
   అందాలరాకాసి చర్చ ఇచ్చట తగునా!
   THANK YOU.

   Delete
 27. నీవిచ్చిన conclusion (బ్రాకెట్లో వ్రాసింది)నిజంగా నిజం చిన్నా.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి!

   Delete
 28. నల్లని వాళ్ళనే ద్రావిడులను రాక్షసులుగా ఆర్యులను దేవతలుగా చిత్రీకరించి పురాణాలు సృష్టించి దేవాసుర కథలతో మన మెదళ్ళను కుళ్ళ బొడిచారు. నలుపుదనం ప్రాకృతికంగా సంక్రమించేదే అయినా శ్వేత జాతి వారూ వారిని ఎంత హీనంగా చూస్తూ దౌర్జన్యాలు చేస్తూ వారిని ఎన్నో శతాబ్ధాలుగా బానిస జాతిగా అణగదొక్కారో అందరికీ ఎరుకలోనిదే కదా.. ఇక్కడ ఈ చర్చ ద్వారా అందానికే పరిమితమవుతున్నారు కానీ నల్ల జాతి తెల్ల జాతి అని జాత్యహంకారంతో రగిలిపోయే పాశ్చాత్యులు, మన దేశంలో అగ్ర వర్ణాలు దళితులను ఎంత హీనంగా చూస్తున్నాయో మీ అందరికీ ఎరుకలోని విషయమే. అంతా అందానికే చర్చను పరిమితం చేసి నలుపు పట్ల లేని ప్రేమను ఒలకబోస్తున్నారన్నది చివరిగా అర్థమైంది. ఎంతో మంది మీ హీరోయిన్లు నల్లగా వుండే వారే అయినా తెల్లరంగద్దుకొంటే కానీ మీ మనసును ఆహ్లాద పరచ లేకపోయారు. అలాగే మెరుపు తీగల కదిలి తన గొంతుతో విశ్వాన్నే జయించిన మైఖేల్ జాక్సన్ పాశ్చాత్యుల అనాదరణ నుండి మినహాయింపునకు బ్లీచింగ్ పూసుకొని అనారోగ్యానికి గురికావడం చూసాం. ఏమైనా ఈ దేశపు అసలు రంగు నలుపే...మంచి చర్చను లేవదీసిన పద్మార్పిత గారు అభినందనీయులు...

  ReplyDelete
  Replies
  1. నల్లని వాళ్ళు అసురులని, దుర్మార్గులని, మానసిక వికారాలు కలిగిన ద్రావిడులేనని వడ్రంగిపిట్ట గారు రిలీజియస్ మైథాలజీని పరోక్షంగా అంగీకరించడం గమనించాల్సిన పాయింట్. దేశం అసలు రంగేదో చిటికలో తేల్చేపారేసిన వడ్రంగిపిట్ట గారి కూత అభినందనీయం

   Delete
  2. అయ్యా Anonymos గారూ వడ్రంగిపిట్ట గారు చెప్పింది మీకంతే అర్థమయిందా.. మానసిక వికారాలు గురించి ఆయనెక్కడా ప్రస్థావించలేదు.. ఈ విషయంలో మీ దేవుళ్ళకే ఎక్కువనుకుంటా..ఆర్యులైన పశువుల కాపర్లు సంచార జీవులు ఈ దేశాన్ని ఆక్రమించుకోనే సరికే ఇక్కడ నగరాలు నిర్మించబడి నాగరికత వర్థిల్లుతుంది. వారు సకల భాగ్యాలతో వుండే వారు అని నేటికీ తవ్వకాలలో బయట పడుతోంది. మీ ఇంద్రాది దేవతలే మునులు ఋషుల భార్యలని కూడా వదల్లేదని, రక రకాల వేషాల్తో లోబరచుకొని శాపగ్రస్తులవుతుంటారని మీ పుక్కిటి పురాణాల్లోనే వుంది. ఆయన పురాణాలను అంగీకరించినట్టుందా వ్యాఖ్య. ఏదో ఒక మాట అనేస్తే పోతుందిలే అని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయడానికి ఇది మీ సొంత బ్లాగు కాదు కదా. చర్చను చర్చలా చేయండి. వ్యక్తిగతంగా హర్టయ్యే వ్యాఖ్యానాలు చేయొద్దు.

   Delete
  3. @వడ్రంగిపిట్ట....
   ఇంత తెలిసిన మీతో ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిదేమో:-)
   అందుకే అభినందించిన మీకు అభివందనములు తెలియచేస్తున్నా!
   Thanks a lot for your share.

   Delete
  4. @Anonymous03 గారు...నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలు అనుకునేంత అమాయకంగా ఉందండి మీరు గమనించమన్న పాయింట్:-)
   చర్చలో భాగమైన మీ కమెంట్ కు మీకు ధన్యవాదములు.

   Delete
  5. @Anonymous 04 గారు....ఎవరి ఆలోచనాధోరణి వారిదండి....ఇక్కడ అంత సీరియస్ గా చరిత్ర పుటల్ని తిరగేసి పురాణాలని తోడేసేంత సీన్ ఉందాండి:-) ఇలా కాకుండా మ్యాటర్ ని హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేద్దామండి!! మీ స్పందనకు థ్యాంక్సండి!

   Delete
  6. Anonymous04 October, 2012
   >>ఆయన పురాణాలను అంగీకరించినట్టుందా వ్యాఖ్య.
   అదే ఆ అజ్ఞాత చెప్పిందీనూ. ఒకవేళ అంగీకరించకుండా వుంటే ఎందుకు అసందర్భంగా, అడ్దగోలుగా ప్రస్తావించవలె? బ్లాగ్ అమ్మాయి వూసెత్తని నల్ల అసురుల వూసైనా ఎత్తారా? లేదుకదా. తెల్లోళ్ళు ఆర్యులు అన్నారా? లేదు కదా? ద్రావిడులు అసురులన్నది పురాణాలా, మీ స్వంత పైత్యమా? నల్లని వాళ్ళు అసురులైతే విష్ణువు అవతారాలన్నీ అసురులయినట్లే కదా. అసురులు వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారంటే నల్లోళ్ళం మనమెందుకు రోదించ వలె? ఇంతకూ పురాణాలు నమ్మాలా, వద్దా నీళ్ళు నమలకుండా తేల్చండి, పొయ్యి మీద పాలు పెట్టి వచ్చాను, నా పిల్ల నల్ల అసురులకు బూస్ట్ కలిపివ్వాలి.

   Delete
  7. పొయ్యి మీద పాలు పెట్టి జాకెట్టు హుక్స్ వేసుకుంటూ చర్చలు చేసే మీ అంత విజ్ఞులం కాదు మేము. కనుక తాపీగా బూస్ట్ తాగి రిలాక్సయి మరల నేను రాసింది వీలయితే ఓ దమ్ము కొట్టి మరీ చదివి ఆర్థం చేసుకొనే ప్రయత్నం చేయండి. అయినా అది మీకెంత బొందుకు లాడా కూర్చినంత. పద్మార్పిత గారికి క్షమాపణలతో,,,

   Delete
 29. పద్మార్పిత గారూ ఈ చర్చోప చర్చలు చదివాక నేను నల్ల కలువలాంటి కనుదోయున్న మంచి మనసున్న ఆత్మీయమైన దేశీయ నల్ల రంగు 'నళ్ళ' పిల్లని అనురాగమూర్తిని ప్రేమించి పెళ్ళీ చేసుకుందామని ఫిక్సయ్యా...
  ఆశీర్వదించండి ఆలశ్యమిడక.....:-)

  ReplyDelete
  Replies
  1. అనికేత్ గారూ.....ఆడపిల్లల క్సేర్సిటీ ఉన్న పీరియడ్లో అమ్మాయి దొరికితే చాలనుకోండి మీ ఈ "నల్ల" పిల్ల. పెద్దకళ్ళు అంటూ పడిగాపులుగాస్తే పండుగానే మిగిలిపోతారేమో:-).
   బెస్ట్ ఆప్ లక్ ఫర్ "నల్లపిల్ల"( ఇక్కడ తమిళం లో నల్ల అంటే మంచిపిల్ల అని)

   Delete
 30. తన దగ్గరెవరైనా నలుపు/తెలుపుల ప్రస్తావన తీసుకొస్తే నా ఫ్రెండొకబ్బాయి అనేవాడు "నీ తెలుపు నా పాదం కింద ఉంది. కాని నా నలుపు నీ నెత్తి మీద ఉంది" అని :)

  ReplyDelete
  Replies
  1. మీ ఫ్రెండ్ కొటేషన్ బాగు బాగు...:-)
   Thanks for sharing with us.

   Delete
 31. "దయచేసి ఇక్కడ రాసిన ఏ కమెంట్స్/వ్యాఖ్యలని కానీ సీరియస్ గా తీసుకోవద్దని, తప్పులున్నా.....సరదాగా కాసేపు చర్చించుకుని హాయిగా నవ్వేసుకోవాలని బ్లాగ్ మిత్రులందరికీ పద్మార్పిత మనవి"

  ReplyDelete
  Replies
  1. నవ్వేందుకు ఏమైనా వుంటే కదా. ఎంతో శ్రమించి, పురాణాలాను ఆకళింపు చేసుకుని చెప్పిన వడ్రంగి పెట్ట పురాణజ్ఞాన్ని, ఆక్రోశాన్ని నవ్వులపాల్జేయడం సమంజసమేనా? ఆయన చెప్పారు కాబట్టి తెల్లని వాళ్ళు ఆర్యులు, నల్లని వాళ్ళు అసురులు అని తేటతెల్లమైంది. ఆ థియరీ అద్భుతంగా వుంది, ద్రవిడ పార్టీలు, రాహుల్ ద్రవిడ్ అసురులు అని ఆయన పరిశోధనలవల్ల కుండబద్ధలు కొట్టినట్టు తేలింది. ఆయ్న అవిరళ పరిశోధనలను గౌరవించడం మన విధి. నవ్వులాటగా తీసుకోవడం కవులకు శ్రేయస్కరం కాదు. వీటిపై మరిన్ని కవితలు రావాలి.

   Delete
  2. ఆర్యా Anonymous గారూ మా అజ్ఞానాన్ని మన్నించి మీ జ్ఞానాన్ని ప్రదర్శించేందుకు నా బ్లాగులో చర్చకు మీకిదే ఆహ్వానం. పద్మార్పిత గారి మనవిని ఆలకించి నా విన్నపాన్ని మన్నిస్తారని సవినయంగా ఆహ్వానిస్తున్నా. వేరొకరి బ్లాగులో చర్చోప చర్చలు చేసి వారినిబ్బంది పాలుజేయడం నా ఇంగితానికి సరిపడదు. గమనించగలరు విజ్ఞులు.

   Delete
 32. హ హా బాగుందండీ తెలుపు నలుపుల మీద మీ కవిత.
  నలుపు తెలుపు పక్కనున్నపుడేగా ఒక దాని విలువ ఇంకొక దానికి తెలిసేది? పగలు లేకుంటే రేయికి విలువుందా? రేయి లేకుంటే పగలుకి విలువుందా?

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశగారు థ్యాంక్యండి మెచ్చినందుకు. రెండు దేనికవే అని గొప్పగా చెప్పారు!

   Delete
 33. చాలా మంచి విషయం మీద చర్చ..

  ReplyDelete
 34. padmarpitha gaaru good thought

  manam beauty ani cheppadi nthng but health white ane colour mana kallaki ichchina pleasure black ivvadu.manava swabhavam motham healthygaa undatadam kosam niranthara prayatnam chestundi andukane tappakunda white ne like chestaru meeru .i dont think black is great any way in pure objective form.

  internal beauy is a concept invented by fat people-anonymus

  ReplyDelete
 35. oh padmarpitha thank you thank you so much dear your blog is just kindaa heaven .every body is fighting fight fight fight.its really amazing to see lot of intellectuals hanging around here.i miss your blog so much. its a great super pleasure to read ur blog and discussion over here am lovin itttttttttttttttttttttt

  ReplyDelete
 36. మాయావతి, కనిమొళిలు సున్నిత మనస్కులనినేనంటే నా ఫ్రెండ్స్ నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు,


  hahhahhahahahhahahahahahahah...... valla gurinchi teliyadu kaanee meeru bhayakharamina sunnitha manaskulani athi sunnitha manskudanina nenu nammandee nammanu hahhahahahahahahahahahahah

  ReplyDelete
  Replies
  1. Thanooj.....thanks a lot for loving my blog & for your comments.

   Delete
 37. అనాదిగా నలుపంటే చులకన భావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నల్లగున్న మనసు మంచిదైతే చాలు అంటారు తిర సమయానికి తెల్లఅమ్మాయి కావాలంటాడు పెళ్ళికొడుకు. వనజ గారు చెప్పిన్నట్టు ఆలోచన విధానం లో మార్పు రావాలి. అ మార్పు మనలోనే మొదలు కావాలి

  ReplyDelete
 38. ఆ మార్పే కోరుకునేదండి. థ్యాంక్యూ.

  ReplyDelete
 39. నలుపు నాణ్యం అని అంధరి తెలుసండి, కానీ, అప్పుడెప్పుడో ఉండి పారిపోయిన దొరలు విసిరేసిన సిగరెటు పీక ఇంత దాక రగులుతునేవుందిగా మరి, కంపు తప్పదు కదా!

  ReplyDelete
  Replies
  1. తప్పక తర్కించండి....అందులో నిజముండేలా:-) నా బ్లాగ్ కి స్వాగతం.

   Delete