పంజరాన్న బంధించిన భావాలనేమి వ్రాయను
మూగనోము పట్టిన ఊసులను ఎలా తెలుపను
వెన్నెలే దాగుడుమూతలాడితే పదం పలుకలేను
కలబోసిన రంగులు విడదీసి ఏబొమ్మ నే గీయను
కవితా నేడు ఏమని అడగను? దేనిపై చర్చించను?
మూగనోము పట్టిన ఊసులను ఎలా తెలుపను
వెన్నెలే దాగుడుమూతలాడితే పదం పలుకలేను
కలబోసిన రంగులు విడదీసి ఏబొమ్మ నే గీయను
కవితా నేడు ఏమని అడగను? దేనిపై చర్చించను?
వర్ణాలే తెలియని నేను వర్ణించేదా ప్రకృతి అందాలని
ప్రేమే ఎరుగని నేనేమి వివరించేది ప్రేమరాహిత్యాన్ని
ఆకలన్నదేలేని నే తెలపనా పేదవాని ఆకలిఘోషని
నీతిలేని రాజకీయాలపై రాయ నేను ఎంతటి దానని
కవితా నేడు ఏమని అడగను? దేనిపై చర్చించను?
నా కనులు తెరిచి చుట్టూ చీకటినే చూస్తున్నాయి
నగ్నసత్యాలు సంకెళ్ళను తెంచుకు రాలేనన్నాయి
చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి
కలమా.......నేడు నీవే కదిలే కాలంగా మారిపోయి
నీ స్థాయి కవితేదో లిఖించి పద్మార్పితవై విరబూయి!
ప్రేమే ఎరుగని నేనేమి వివరించేది ప్రేమరాహిత్యాన్ని
ఆకలన్నదేలేని నే తెలపనా పేదవాని ఆకలిఘోషని
నీతిలేని రాజకీయాలపై రాయ నేను ఎంతటి దానని
కవితా నేడు ఏమని అడగను? దేనిపై చర్చించను?
నా కనులు తెరిచి చుట్టూ చీకటినే చూస్తున్నాయి
నగ్నసత్యాలు సంకెళ్ళను తెంచుకు రాలేనన్నాయి
చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి
కలమా.......నేడు నీవే కదిలే కాలంగా మారిపోయి
నీ స్థాయి కవితేదో లిఖించి పద్మార్పితవై విరబూయి!
చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి
ReplyDeleteకలమా.......నేడు నీవే కదిలే కాలంగా మారిపోయి
నీ స్థాయి కవితేదో లిఖించి పద్మార్పితవై విరబూయి!....
కవిలోని అంతఃసంఘర్షణను వెలికి తీస్తూ ఆత్మ స్థైర్యాన్ని చివరిగా చూపుతూ ముగించడం మీ శైలిలో ఇదో ఆణిముత్యం పద్మార్పిత గారు...హార్థిక అభినందనలతో...
నా మది భావఘర్షణనెరిగి,
Deleteనా శైలిని మెచ్చిన మీకు అభివందనములు...
chaala chaala bagundi andi.. u r someting special padmarpita garu...
ReplyDeleteOh! thanks for your special comment:-)
Deletemadam beautiful.
ReplyDeleteThank Q!
DeleteVery thought provoking. Thanks for sharing.
ReplyDeleteThanks a lot....I think this is your first direct graceful comment to me:-)
DeleteCongrats Padmarpita garu..:-)
DeleteThank Q.
Deleteచివరి నాలుగులైన్లు చాలా చాలా బాగున్నాయి.
ReplyDeleteనచ్చినందుకు ఫీలింగ్ హ్యాపీ:-)
Deleteచాలా మంచి కవితండి.
ReplyDeleteనాకోసం ఒక సరదా కవిత చెప్పరూ..ప్లీజ్
తప్పకుండా....అయినా నేను రాసేవాటికి మీరు నవ్వుకోవాలనే నా ఆశ.
Deleteచాన్నాళ్ళకి ఇలా విచ్చేసారు జయగారు thank you!
"నా కనులు తెరిచి చుట్టూ చీకటినే చూస్తున్నాయి
ReplyDeleteనగ్నసత్యాలు సంకెళ్ళను తెంచుకు రాలేనన్నాయి
చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి"
ఈ ఆశాభావమే ప్రేమను బ్రతికిస్తుంది..బాగా రాసారు పద్మ గారు.
ధన్యవాదాలు ఫాతీమాగారూ....ఆశావాద దృక్పధంతో ముందుకుసాగడమే కదాండి అందరూ చేసేది!
Deleteపద్మార్పిత.....నీలోని ఏయే భావాలకి అభిమానిననను:-) అభిమానంతో హత్తుకోవాలనుంది:)
ReplyDeleteమీ అభిమానానికి సదా విధేయురాలను....థ్యాంక్యూ!
Deletenaaku parichyam ayinaa appati padmaarpita gaaru ippudu padmaarpitagaaru... okkarenaa... modata meeru kavitalu vrastaraa annnaanu.... hmm.. ivi meere vrayagalaru anipistundi... andi.. reply iste debbalu padutaai andi...
ReplyDeletethanks for your compliments.....maarpu evarikaina sahajam kadandi:-)
Deleteకవితకు భావం పదిలమైన మనసున ప్రశ్నావళే కవితాకేళిగ మారి కవితార్పితమైనావు పద్మార్పితా!
ReplyDeleteఉమాదేవిగారు.... నా బ్లాగ్ కి విచ్చేసి వ్యాఖ్యతో ఆనందింపజేసిన మీకు నెనర్లండి.
Deleteబొమ్మలు కూడా మీరే వేస్తారా అండీ చాలా చాలా బాగున్నాయి మీ కవితల్లాగే
ReplyDelete--
Rama
నేను కూడా మిమ్మల్ని ఇదే అడుగుదాం అనుకున్నాను పద్మ గారు..
Deleteramaగారు వెల్ కం టు మై బ్లాగ్....ధన్యవాదాలండి!
Deleteఅన్నీ కాదండి కొన్ని మాత్రమే నేను చూసివేసినవి...
Priyagaru అభిమానిగా అనుకోవడమెందుకు.....అడిగేయండి!:-)
Deleteనన్ను మానసికోల్లాసపరిచేవే పెయింటింగ్స్ అండి...
మీ అభిమానానికి కృతజ్ఞతలు!
చాలా ..చాలా బాగుందండి
ReplyDeleteమెచ్చిన మీకు ధన్యవాదాలండి!
Deleteఅద్భుతమైన భావకవిత. చాలా చాలా బాగా వ్రాశారండి.
ReplyDeleteభారతిగారు నా భావకవితను మెచ్చిన మీకు ధన్యవాదాలండి!
Deleteభావాలు బంధితాలైనవేళ ప్రపంచాన్నే నీ పంజరం చేసి రాయి
ReplyDeleteఊసులు మూగబోయిన వేళ నీ విరిమోము తెలిపేనులే నీ తలంపులు
కరిమబ్బు కరిగించలేవా నీ కరుణతో నీ వన్నె వెన్నెలై దివిచేర
వడబోతకై వగపేల బాలా!! అన్నిరంగుల కలబోత నీ మనసు తెలుపు
మంచు బిందువులకు రుచిపంచిన నీ కరుణని ఏమి కోరేది!
తన చూపులతో బంధించిన లోకపంజరాన్ని ఎలా వేడేది!!
నీకు తెలియని వర్ణం వివర్ణం
నీవు ఎరుగని ప్రేమ లౌకికం
కలలవనరాణి దయ కానని పేద ఎక్కడ! లేదే నాకు ఆకలి జాడ
నీ నిర్మలవిజయాలపై రాయి రాజనీతి దిద్దుబాట పడుతుంది
కవితను నువ్వమను ..నీ నవ్వులను లోకం పైకి రువ్వమను.
ఇక ఎవ్వరి కనులైనా చూసేది వెలుగు చినుకులనే
సంకెలలెలేవన్న సత్యం పరివ్యాప్త మై నిలుస్తుంది
అనాడు నిజంగా
చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి
కలమా.......నేడు నీవే కదిలే కాలంగా మారిపోయి
పద్మార్పితవై విరబూయి! రస సింధువు పొంగుతుంది
కవితను నువ్వవ్వమను..
Deleteనవ్వెక్కువొచ్చేసి..వ్వ లేకపొయా..
రా య లేక పోయా..పైనా సవరించి.. ఇది తొలగించ ....
మీరు వ్రాసిన వ్యాక్యకవితా కుసుమావళికి జవాబు ఏమీయగలవు పద్మార్పితా....నీవు ఎన్నిపదాలు కూర్చి జవాబిడినా పరిపక్వతలేని పువ్వై విరబూస్తుందంటూ నా కవిత మీ కవితకు సలామంటుంది:-)
DeleteSKY garu....thank you very much for your wonderful reply.
DeleteSky, That was amazing!
ReplyDeleteYes...Its true!
DeleteIam glad to have that:-)
just a value addition to honour innocent feelings chatakaM garu!!
Deleteకలబోసిన రంగులు విడదీసి ఏబొమ్మ నే గీయను....ఇలాంటి మంచి భావాలతో, ఏం రాయను అంటూనే మంచి కవిత రాసేశారు.
ReplyDeleteబొమ్మ చాలా బాగుంది.
మీ అభిమాన ఆత్మీయమైన స్పందనకు నెనర్లండి!
Deleteఏ భావం పలికినా..పద్మార్పితవై పలకాలి...
ReplyDeleteఏ పదం వ్రాసినా...పద్మార్పితవై వ్రాయాలి...
ఏ చిత్రం గీసినా...పద్మార్పితవై చిత్రించాలి...
అవే అందరికీ పంచాలి...
@శ్రీ
శ్రీ గారూ.....మరీ ఇంత స్వార్థమా :-):-)
Deleteనా రాతల్ని అభిమానంతో అమోదిస్తున్న మీ అందరి ప్రేరణే ఇలా రాయిస్తుందండి!
మీ అభిమానానికి కృతజ్ఞతలండి.
ఏం రాయను? ఏమడగను అంటూనే కమ్మని కవితని విరబూయించారుగా:)
ReplyDeleteవిరబూసింది నచ్చినందుకు థ్యాంక్యూ.
ReplyDeleteమీరు మీలానే రాయండి పద్మార్పిత గారు...
ReplyDeleteమీ అంతరాత్మ ఈ కవితలో ప్రస్ఫుటమయింది...
Go a head..break the silence and get the depth of the Silence...:-)
ఓహో......నన్ను నాలాగే రాయమన్నారు కదా, రిలాక్స్ గా ఉందండి. ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.
Deletebomma kante kavitha baagunda? kavitha kante bomma baagunda? thelchukoleka pothunnanu.Adi bomma leka viraboosina padmaarpithaa?
ReplyDeleteమీకు బొమ్మ మరియు కవిత రెండు నచ్చినందుకు మహదానందంగా ఉందండి.
Deleteమీ ప్రశంసకు ప్రణామాలు:-)
very very nice padmarpitha garu
ReplyDeleteThank Q skvrameshgaru.
Deleteఇన్ని కవితలు ఇంత అద్భుతంగా వ్రాసి ఏమి వ్రాయను అంటూనే ఇంత మంచి కవిత వ్రాసినందుకు ఇందరి ప్రశంసలు పొందినందుకు మీకు అభినందనలు.
ReplyDeleteఇదంతా మీ అందరి అభిమానమండి. మీ స్పందనాస్ఫూర్తిదాయక వ్యాఖ్యకు అభివందనాలు.
Deleteగడుసు కవిత
ReplyDeleteతెలివైన వ్యాఖ్య:-)
Deleteపదాలతోనే కాదు ప్రశ్నలతో కూడా కవిత్వీకరించగలరు మాట...
ReplyDeleteబావుందండి....
Welcome to my blog....ఏదో ఇలా ప్రశ్నలడిగి కూసింత జ్ఞానాన్ని ఆర్జించాలన్న ఆశండి:-)Thank Q!
ReplyDeleteఅద్భుతం...
ReplyDeleteచాన్నాళ్ళకి విచ్చేసి కమెంటిన మీకు నెనర్లండి!
Delete