బ్రతికున్న చావు...

కాలచక్రానికి బానిసలై తిరుగుతూ
అందని ఆశలకు నిచ్చనలువేస్తూ...
వేరొకరికై కాలాన్ని వెచ్చించనివారు
వారుపోతే చుట్టూ చేరి రోధిస్తారెందుకు?

స్వార్ధపు మేడమిద్దెల్లో బ్రతుకుతూ
పలికితే గడియ వ్యర్థమని తలుస్తూ...
పలుకరించి నవ్వుల పూలీయనెరుగరు
నిర్జీవైతే పూలదండలతో పరామర్శలెందుకు?

వివిధ రుచులన్వేషణలో గడుపుతూ
ఆకలితీర్చుకోక తినడంకోసమే జీవిస్తూ...
ఏనాడూ తనవారితో కలసి భోంచేయనివారు
చచ్చాక సంతర్పణ సంవత్సరీకాలు చేస్తారెందుకు?

అన్నీ తమసొంతం కావాలని మ్రొక్కుతూ
అశాశ్విత విజయపు వెలుగులో మురుస్తూ...
చీకటివేళన చిగురాశల చమురు దీపమెట్టరు
ప్రాణంపోయాక దీపమెట్టి దేవుడిలోకలిపేస్తారెందుకు?


కనులుమూసుకున్న శవమనుకుంది నవ్వుతూ
అందరూ మూడుగంటల జీవన్నాటకంలో నటిస్తూ...
తమబ్రతునే ప్రేమించే స్వార్ధపరులు రోజూ చస్తుంటారు
చావుని ప్రేమించి సహాయపడితే రోజూ బ్రతికుంటారని!

65 comments:

  1. కాలమహిమలో కాలునిలువని మానవవేగానికి మానవతను తాకట్టుపెట్టిన మనిషిని హెచ్చరిస్తూ మరణం కలిగించే ఉలికిపాటో,గగుర్పాటో జీవచ్ఛవాలకు ఊపిరిపోస్తుంది.నిర్వేదనలో జనియించిన వేదనా కవిత మనిషి మనసు చేసే గారడీకి ప్రతీక!మీ కవితలలో భావజాలం మనిషిని కుదుపుతుంది.

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణ కషాయంలా వగరుగా ఉన్నా ఆలోజించేసేలా ఉందండి. నా భావాలకి స్పందించే మీకు వందనాలు.

      Delete
  2. మనిషిలోని మనిషిని తట్టిలేపే భావోద్వేగమిది...
    మరచిపోతున్న మనిషితనాన్ని తాత్కాలిక ఆశలకు బందీ అవుతున్న పరాయితనాన్ని ప్రశ్నించిన తీరు నచ్చింది...
    పద్మార్పితలోని ఋషితనానికి నమస్సుమాంజలులు...

    ReplyDelete
    Replies
    1. మనిషిలోని మంచితనాన్ని వెతికే ప్రయత్నమే తప్ప ఋషిగానో, యోగినిగానో ఆలోచించేంత జ్ఞానమాచెప్పండి నాది?
      మీ నమస్సుమాంజలులకు...నమస్కారాలు.

      Delete
    2. Priyaగారు :)నవ్వమంటారా!

      Delete
  3. ?1: ఆ రోదనంతా తమకోసమే
    ?2: నిత్య విచారుల పోడ గిట్టని నిర్జీవి ప్రసన్నతను చూడలేకే పూలదాపు
    ?3: ఆస్తుల భోక్తల ఎంగిలి విదిలిపులేగా అవి!!
    ?4: చింత చెట్టెక్కినట్టు చెప్పలేదు.. పాపం నోరులెని దీపం
    !5: సమాధానమొచ్చిందికదా!! భేతాళుడు చెట్టెక్కేశాడు ;)



    ReplyDelete
    Replies
    1. ప్రశ్నలు బేతాళుడి లెవెల్లో వేయలేదేమో కాని జవాబులు మాత్రం విక్రమార్కుడిలా ఇచ్చారుగా:-)Thank Q!

      Delete
  4. కనులుమూసుకున్న శవమనుకుంది నవ్వుతూ
    అందరూ మూడుగంటల జీవన్నాటకంలో నటిస్తూ...
    తమబ్రతునే ప్రేమించే స్వార్ధపరులు రోజూ చస్తుంటారు
    చావుని ప్రేమించి సహాయపడితే రోజూ బ్రతికుంటారని!

    naaku baaga nachindi andi...

    ReplyDelete
  5. chavuni bratikinchi palikinche padmarpita namonamaha

    ReplyDelete
    Replies
    1. mee peru telistea peruthoe pilachi maree pratinamaskaaram chesadannandi:-)andukondi naa vandanam.

      Delete
  6. చాలా బాగా రాసారు పద్మర్పిత గారు...."స్వార్థపరులు, నిర్జీవైతే పూలదండలతో పరామర్శలెందుకు?..వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తారెందుకు???" ఇలాంటి డౌట్స్ నాకు కూడా చాల సార్లు వస్తాయండి...

    ReplyDelete
    Replies
    1. మెచ్చిన మీకు నెనర్లండి....అందరి ఆలోచనా సరళీ ఒకటే కదండీ!

      Delete
  7. ilanti thoughts neeku elavastayi kanna, prati word lonu pariniti chendina padma kanipistundi...challaga undaraa

    ReplyDelete
    Replies
    1. mee abhimaana aatmeeyataku dhanyuraalinandi. Thank you.

      Delete
  8. బ్రతకడంకన్నా చావడం మిన్న అన్న సొసైటీలో బ్రతుకుతున్నామండి.

    ReplyDelete
    Replies
    1. ఓ రెండు ముక్కల్లో భలే చెప్పారే....థ్యాంక్యూ

      Delete
  9. ఒకేఒక సత్యాన్ని చుట్టుకునే
    అబద్ధపు తీగలు
    మన జీవితాలు.
    ********
    పద్మార్పిత గారు చాలా బాగా వ్రాసారు

    ReplyDelete
    Replies
    1. ఆ తీగల ఉచ్చుల్లో మనకి మనమే బిగుసుకు పోతున్నామేమో! ధన్యవాదాలండి మీ స్పందనకు.

      Delete
  10. బాగుందండి.

    ReplyDelete
  11. మీ ప్రశ్నలన్నీ ఆలోచింప జేసేవే?వర్తమానం లో జరుగుతున్నదిదే!మరణాన్ని అర్థం చేసుకునే తీరు మారాలి.

    ReplyDelete
    Replies
    1. ప్రశ్నలకి స్పందించే మీకు వందనాలండి. మరణాన్ని అర్థంచేసుకునేంత పరిపక్వత రావాలంటే కష్టమేనండి!

      Delete
  12. "Think twice before you do" anedi old ippudu "Do something before you leave" follow aithe baguntundanipistundi idi chadivaka.

    ReplyDelete
    Replies
    1. "Do something before you leave" but that something should be true and useful:-)

      Delete
  13. పద్మ గారూ, మీరన్నదానిలో నిజమెంతో ఉంది తమజీవితాన్ని మాత్రమె ప్రేమించే స్వార్ధం ఎక్కువైపోతుంది మనిషిలో.
    పరాయతనాన్ని ఎండగట్టటం బాగుంది. చక్కగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. ఎండగట్టానో లేదో కాని ఇలా ప్రశ్నలతో విసిగిస్తున్నానేమో అనిపిస్తుంది... మెచ్చి గుడ్ అన్నారుగా హ్యాపీ:-)

      Delete
  14. వేదాంతం చెప్పినా వినసొంపుగా చెప్తావు అన్నట్లుంది ఇది చదువుతుంటే.
    అంతుచిక్కని పాత ప్రశ్నలే అయినా అడిగిన తీరు బాగుంది.

    ReplyDelete
    Replies
    1. వేదాంతాలు వల్లించ నేనెంతటిదానను..
      ప్రశ్నించి జ్ఞానమార్జించాలని కుతూహల పడుతున్నాను...
      తిట్టుకున్నా మెచ్చుకున్నా...నేనూ మీలో ఒక దానను:-)

      Delete
  15. మారుతున్న జీవన సరళి లోని వైవిధ్యం మనల్ని మనకు కాకుండా చెస్తున్న తీరును మీ శైలిలో వీపున చరిచి చెపారు పద్మగారు...అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. నా శైలిని నచ్చి మెచ్చిన మీకు నెనర్లండి.

      Delete
  16. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోలేని విధంగా...
    చనిపోయాక మనగురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోని విధంగా..
    మనల్ని పుట్టించింది అందుకేనేమో...
    పోయినోళ్ళందరూ మంచోళ్ళే అనేది అందుకే...
    బ్రతికుండగా గుర్తించనిది తర్వాత గుర్తించి అన్నీ చేస్తాం కనుక...
    వైరాగ్య భావంతో ఉంది మీ పోస్టు ఈసారి...
    అభినందనలు పద్మ గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. వైరాగ్య భావాన్ని కూడా అస్వాధించి సహృదయంతో మెచ్చుకున్న మీకు అభివందనములండి!

      Delete
  17. ఎప్పటి నుండో మీ అభిమానిని ఇన్నాళ్ళకి ఇలా కామెంట్ పెట్టగలిగాను.

    ReplyDelete
    Replies
    1. bhavana gaaru nenu mee abhimaanini meeku first comment nene pettanu

      Delete
    2. లిపి వెల్ కం టు మై బ్లాగ్...మీ అభిమానానికి కృతజ్ఞతలు.

      Delete
    3. thanooj garu nenu involve kaaledandi:-)

      Delete
  18. బ్రతికున్న చావు ... ఈ రెండు పదాల్లోనే చాలా అర్ధం ఇమిడి ఉంది.
    ఆలోచింపజేసే కవిత, బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నా చిన్ని ఆలోచనల్లోని పెద్ద భావాన్ని వెదికి మెచ్చిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  19. Chaalaa chaalaa baagundandee :)

    ReplyDelete
  20. మనిషి మానవత్వాన్ని తన తత్వాన్ని మరచిపోయి చాల ఏళ్ళు అయ్యిందండి... కనీసం మీరు ఇలా ప్రశ్నిస్తే ఏమైనా తెలుస్తాయేమో...
    బావుంది మీ భావోద్వేగం...

    ReplyDelete
    Replies
    1. తెలియజెప్పే ప్రయత్నంలో నేను తెలుసుకుంటానేమోనండి...మెచ్చి స్పందించిన మీకు థ్యాంక్సండి.

      Delete
  21. మరణానికీ రూపంకల్పించడం వినూత్న ఆలోచన. నచ్చిందండీ కవిత పద్మగారూ

    ReplyDelete
    Replies
    1. బహుకాలానికి వ్యాఖ్య:-)...నా ఆలోచనా ప్రయత్నాన్ని నచ్చిమెచ్చిన మీకు నెనర్లండి.

      Delete
  22. ee thathvikatha ento merento antha pichichi bramaaaaaaa

    ReplyDelete
    Replies
    1. ento naaku antu chikkakundi:-) entainaa mee friend ni kada:-)

      Delete
  23. కలకాలము జరుగుతున్నదిదే...జరేగబోయేది కూడా ఇదే:(
    ఆ నిజాన్ని మీ కవిత రూపంలో ఎంత బాగా తెలియజేసారండి.

    ReplyDelete
    Replies
    1. జరగబోయేది కూడా ఇదే అంటారా:-( మారుపుకై వేచి చూద్దాం:-) ఆశావాదం ఆరోగ్యదాయకం...
      మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  24. ఆలస్యంగా వచ్చానుగా ఆశ్వాదించడమే తప్ప ఏం చెప్పలేను.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  25. చావుని ప్రేమించి సహాయపడితే రోజూ బ్రతికుంటారని....యెంత చక్కటి వాక్యం

    ReplyDelete
    Replies
    1. స్పందించిన మీకు థ్యాంక్సండి.

      Delete
  26. చావలేక బ్రతుకుతున్నామనేవారు చదివితే, వారికి కూడా బతుకు మీద ఆశ పుడుతుంది. బాగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే అంతకంటే ఈ రాతలకి ఇంకేం సార్థకత కావాలి చెప్పండి. ధన్యవాదాలండి!

      Delete
  27. చాల అద్భుతంగా చెప్పారు. బతికి ఉన్నప్పుడు ముసలి తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టడానికి ఆలోచించే వారు, చని పోయాక లేని భాదని పులుముకుని రోదిస్తున్నట్టు నటిస్తారు, దినాలు, సంవత్సరీకాలు అంటూ ఖర్చు చేశారు. దానికి ఆచారాలు,సంప్రదాయాలు అంటూ ప్రచారం చేశారు. ఈ మనిషి లో మార్పు ఎప్పువస్తుందో?

    ReplyDelete
    Replies
    1. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండి.

      Delete
  28. దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారేమో ! బాగుంది కవిత.

    ReplyDelete
    Replies
    1. ఈ వైరాగ్యం రాతకే పరిమితంలెండి ప్రస్తుతానికి. మెచ్చిన మీకు నెనర్లండి.

      Delete