లోకంతో పనిలేదు పద పారిపోదాం
కారుచీకట్లో ఇరువురం లేచిపోదాం!
వద్దని వారించేవారికి దూరమైపోదాం
ఒకరిలోఒకరిగా ఏకమై కలసిపోదాం!
కాలమా నీ పనిలేదంటూ వెలివేద్దాం
శృంగారంలో శిఖరాగ్రాన్ని తాకివద్దాం!
మరో తాజ్ మహల్ మనకై కట్టేసుకుందాం
ప్రేమైక జీవులమని ఎలుగెత్తి చాటుదాం!
అలుకతీర్చగ ఇచ్చే వజ్రాల బహుమానం
కనకం అంటేనే కలిగె నాలో విరక్తి భావం!
రెక్కల గుర్రమెక్కి ఊహల్లో విహరించేద్దాం
కాసులతో పనిలేని లోకమొకటి నిర్మించేద్దాం!
కాలయాపన ఏల గాలిలో తేలుతూ వేగిరం రా
కళ్యాణమెందుకు కలలోనేకదా ఎగరేసుకుపోరా
కలలకౌగిలిలో కోరికలు ఎన్నున్నా తీర్చేసుకోరా
కళ్ళు తెరిచాక వాదులాడి ప్రయోజనం లేదురా
కలలయామినైతే చుక్కాని నీవై రేయి గడిపేద్దాం
కరిగిన కలలని కలవరింతలుగా సమాధి చేద్దాం!
కారుచీకట్లో ఇరువురం లేచిపోదాం!
వద్దని వారించేవారికి దూరమైపోదాం
ఒకరిలోఒకరిగా ఏకమై కలసిపోదాం!
కాలమా నీ పనిలేదంటూ వెలివేద్దాం
శృంగారంలో శిఖరాగ్రాన్ని తాకివద్దాం!
మరో తాజ్ మహల్ మనకై కట్టేసుకుందాం
ప్రేమైక జీవులమని ఎలుగెత్తి చాటుదాం!
అలుకతీర్చగ ఇచ్చే వజ్రాల బహుమానం
కనకం అంటేనే కలిగె నాలో విరక్తి భావం!
రెక్కల గుర్రమెక్కి ఊహల్లో విహరించేద్దాం
కాసులతో పనిలేని లోకమొకటి నిర్మించేద్దాం!
కాలయాపన ఏల గాలిలో తేలుతూ వేగిరం రా
కళ్యాణమెందుకు కలలోనేకదా ఎగరేసుకుపోరా
కలలకౌగిలిలో కోరికలు ఎన్నున్నా తీర్చేసుకోరా
కళ్ళు తెరిచాక వాదులాడి ప్రయోజనం లేదురా
కలలయామినైతే చుక్కాని నీవై రేయి గడిపేద్దాం
కరిగిన కలలని కలవరింతలుగా సమాధి చేద్దాం!
మెలకువలో సాధ్యం కాని వాటికి కలలో ఒక అందమైన రూపం ఇచ్చి ఆనందించమని సున్నితంగా చెప్పారండి. అభినందనలు మీకు.
ReplyDeleteమీరన్నది నిజమే....భావధరిద్రం ఎందుకు, హాయిగా కలల్లోనైనా ఆనందిద్దామని:-) థ్యాంక్యూ
Deletekalala prapancham baagundi padma garu.
ReplyDeleteThank you Madam.
Deleteరాతిరేల రాజువై పగలు పారిపోమంటే ఎలాగండి, అలా ఫ్రీగా వస్తే ఫినైల్ అయినా తాగుతాడనే అభాండంవేయాలని కాకపోతే....:)
ReplyDeleteతాగండి...
Deleteకడుపులో పురుగులతో పాటు మనసు క్లీనవుతుంది..:-)
కలలకే ఇలా కలతచెంది కడుపుని క్లీన్ చేసుకుంటే ఇంక సమాజంలో కనపడని కుళ్ళుని క్లీన్ చేయడానికి మనముండం అనానిమస్ గారూ..:)
Deletesmaajamlo kulluni kadigenta teerika naaku ledandi...mee trials meeru cheyandi..kani freega vachindandi phenoil taageyoddu..:-)
Deleteరాత్రివేళ కలగన్నవి తెల్లవారినాక తీరాలంటే కష్టమండి. ఆరోగ్యకరమైన కలలైతే మీరే కష్టపడి నిజంచేసుకుని ఫినైల్ ఎందుకు ఫ్రూట్ జ్యూస్ త్రాగండి:-) అప్పుడు అభాండాలు వేయడంకాదు "నా అనానిమస్ మిత్రుత్రుడు అహా...ఓహో అని గొప్పగా చెప్పుకుంటాను.
DeleteThanks for your sense of humor Anonymous garu.
Anonymous గారి కలకి సమాజంలో కుళ్ళుని క్లీన్ చేసేంత కంపారిజన్ చేస్తూ కమెంట్ అవసరమా చెప్పండి:-)
Deleteకలవరమా ? కలవ తరమా ?
ReplyDeleteకలే ఒక వరమేమో:-)
Deleteకలలయామినైతే చుక్కాని నీవై రేయి గడిపేద్దాం
ReplyDeleteకరిగిన కలలని కలవరింతలుగా సమాధి చేద్దాం!
సాధ్యమా యిలా...
ఏమో పద్మ గారు చెపితే అవుననే అనాలనిపిస్తుది...:-)
beautiful feel....
అవునని అనడమెందుకండి మీ కవితాపదాల్లో సాధ్యమే:-)Thanks for feeling it.
Deleteనిజాల వర్తమానంలో బతికే ధైర్యం చాలక -
ReplyDeleteజీవిత మంతా బ్రమల కలలలో బతికే పిరికి సన్నాసులను -
సునిసిత కవితా శూలంతో-
పొడిచి పొడిచి మరీ చంపేస్తుందీ కవిత .
పద్మార్పిత కలం కడు పదునైంది !
-----సుజన-సృజన
నిజాలను తలచుకుంటూ జరగవని తెలిసి లబలబమనేకన్నా కలలో కాసేపు హాయిగా బ్రతికేయడం మిన్న -లక్కాకులగారు
Deleteఅందరూ కలల ప్రపంచంలోనే కావలసిన మనస్సాంతిని పొందుతారు కాని బయటికి మేకపోతు గాంభీరం చూపుతారు.
వెంకట రాజారావుగారు....మీరన్నది అక్షరాలా నిజమండి. కలం పదునైనదంటూ.... కవితలతో పొడిచి చంపేస్తానంటూ భయపడకండి...... అభిమానపు వ్యాక్యలతో అరెస్ట్ చేయండి:-)
Deleteమీ అమూల్యమైన స్పందనకు నెనర్లండి.
Anonymousగారూ.... అందరూ మీ అంత ధైర్యవంతులుకారు కదండి ఇలా అనానిమస్ గా చెప్పడానికి:-)
Deleteకలలేకదండీ కాణీ ఖర్చులేనివి....
ReplyDeleteఎన్నైనా ఎలాగైనా కనొచ్చు ఇతరులకి ఇబ్బంది కలిగించనంతవరకు....
అందులో మీ కలల గురించైతే ఆలోచించవలసిందే:-)
మరింకేం....హాయిగా కలలు కనండి:-)
Deleteకల కంటే వాస్తవం ఎపుడూ చేదుగానే ఉంటుంది...
ReplyDeleteకల మన చేతిలో ఉండేది...
వాస్తవం ఇతరుల స్వభావంతో ముడిపడి ఉండేది...
బాగుంది పద్మ గారూ!...@శ్రీ
నిజమే.....థ్యాంక్యూ 'శ్రీ' గారు.
Deleteఎవరి కలలు వారివి, మనకలల్ని వేరొకరిని కనమనడం కానిది కుదరినిది. ఎప్పటిలాగే ఆలోచించేవిధంగా రాసారు.
ReplyDeleteఅందుకే ఎవరి అభిరుచులకి తగ్గ కలల్ని కని నేరవేర్చుకోవడానికి కృషిచేస్తే బాగుంటుందండి. ధన్యవాదాలు.
Deleteకల కాబట్టే యిల లోనే వున్నారు
ReplyDeleteవాస్తవం లో అయితే మోజు తీర గానే నేల కూలేరు
మన వుహే మన కల
నిజానికి ఎప్పటికి జరగదు అలా
తీరం దాటినా అల
మున్చేయ్యదా జల జలా
వాస్తవం లో అవసరమా ఆ సునామి
కలలోనే పరిమిత మయినందుకు నమో నమామి
రవిగారు....ఎన్నాళ్ళకెన్నాళకి ఇటువైపురాక
Deleteఇది కలయా! నిజమా!....:-) ధన్యోస్మి!!!
చెప్పడం బావ్యం కాదేమోగాని,
ReplyDeleteఎక్కువగా మీ కవితలు ఒకే ఫీల్ తో, ఒకే లాగా అనిపిస్తాయెందుకో...
మంచి పదాలు,భావాలు సంపదను దాచుకున్న మీరు కొంచె కొత్తగా ప్రయత్నిస్తే అద్భుతమైన కవిత్వం రాయగలరినిపిస్తుంది, మీ మనసుని బాధిస్తే క్షమించండి.
చెప్పడం భావ్యం కాదని ఎందుకనుకుంటారు... నిర్మొహమాటంగా చెపితేనే కదండి తెలుస్తుంది...ఎప్పుడూ మూసపోసినట్లు బాగున్నా లేకపోయినా బాగుంది అనేస్తే మీరు నేను రాసే సుత్తిని భరించాల్సివస్తుంది అందుకే ఉన్నది ఉన్నట్లు చెప్పేయండి ఆనందంగా స్వీకరించి ఆలోచించి మార్చుకునే ప్రయత్నం చేస్తాను. మీ అప్యాయతతో కూడిన అభిమానపు సలహాకు, స్పందనకు ధన్యవాదములు!
Deleteమంచిగా రాసినప్పుడు మెచ్చుకుంటారన్న ఆశతో:-)
మీ మంచి మనసుకి ధన్యవాదాలండి. కవితల కొలనులో పద్మమై వెలగాలని.......
Deleteపద్మార్పిత గారూ ! మీ బ్లాగు బాగుందండీ ..అభినందనలు.
ReplyDeleteమీ కవితలు బాగున్నాయ్
ఆ కలరుల బొమ్మలన్ని ఆహా ! ఓహో !
ఏకంగా మీ బ్లాగు త
దేకంగా చూచినాను తన్మయ మగుచున్.
వెల్ కం టు మై బ్లాగ్....చూసి తన్మయం చెంది స్పందించిన మీ అభిమానానికి కృతజ్ఞతలండి.
Deleteపద్మార్పితా.....రాయడం ఒక ఎత్తు వాటికి సమాధానం ఇవ్వడం ఒక ఎత్తు. రెండూ అద్భుతంగా చేయడం నీకే చెల్లు. అభినందనలు.
ReplyDeleteధన్యవాదములు!
Deletemeeru vrasinavi anni prati okkariki nachaalani ledu andi... yevariki tochindi vaallu chepputaaru ade kadaa commets ante.. denike alaa spandistaraa meeru... meeru alaa ante.. seshu laanti vaallu meeku chala mandi unnaru maa kosam ayinaa meeru ilaanti vaati gurnchi alochinchavaddu andi... tittalani undi kaani ikkda bagodu kadaa... hmm... mee nestam seshu...
ReplyDeleteoh! thanks for encouragement and support.yevariki tochindi vaallu rastaru kandani anni chadivesi heart ki teesukokudadani telisindi kada...lite teesukuntanu le nestam:-)
ReplyDeletehi paqdmarpitha garu .you express good felings you know.plese write social problems.this only my suggetion.dont think other wise .thanq madam.
ReplyDeleteThanks for you suggestion. I will try.
ReplyDeleteహ హా...
ReplyDeleteతాజ్ మహల్, రెక్కల గుర్రం, వజ్రాలూ, గాలిలో తేలిపోటం....
ఇవన్నీ కలల తర్వాత, కవితలోనే సాధ్యం అని చెప్పారు.
ఉండండీ...యమర్జెంట్ గా కలల గుర్రమెక్కి వెళ్ళాలి....
కలల గుర్రమెక్కి ఊహల సామ్రాజ్యాన్ని ఊరేగిరండి.
Deleteవచ్చాక ఊసులు చెప్పాలి సుమండి:-)
bagundandi..
ReplyDeleteThank Q:-)
Delete"చాల సమస్యలు-
ReplyDeleteకట్నం, ఉద్యోగం అత్తల కష్టాలు,
ప్రేమ, కోరుకున్న వాడు దొరక్కపోవటం ,
ఇన్ని కష్టాలలో బ్రతకటం కంటే
ఆడపిల్ల కలల్లో బ్రతకటమే మంచిది"
ఇది కూడా ఒక పాయింటే:-) థ్యాంక్యూ...
Deleteకలల్లో అయినా అనుకున్నవి జరుగుతాయి అంటారా!
ReplyDelete