ఎప్పటికీ ఇలాగే...

నీ ఊపిరిలో నన్నుండిపోనీ, గుండెమూల నన్నొదిగిపోనీ
ఎడబాటులో ప్రేమలోతుని చూడనీ, ఊహలు ఊసులవనీ
ప్రేమున్నా లేకపోయినా, నీ ప్రతితలపులో నన్నుండిపోనీ
వీలుకాదని వదిలెళ్ళిపోతే వేదనే వర్షమై నినుతడిపేయనీ!

వదిలేయాలనుకుంటే నవ్వుతూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపో
ఆశల కెరటాలకి గమ్యమార్గమేదైనా చూపించి దారిమళ్ళిపో
సృహలో ఉంటే  జీవించలేని నన్ను పిచ్చిదానిగా మార్చిపో
మమతలగూళ్ళైన నా ప్రేమ మర్మమేమిటో తెలుసుకునిపో!

నన్ను మరచిన మైమరపుకే ఆనందమంతా సొంతమవనీ
పలుకనిభావమేదో లిపిలేనిభాషై నీ పెదవులపై విరబూయనీ
కలకాలం ఆ నవ్వేదో నిన్ను వీడని నీడలా నిన్నంటుండిపోనీ
ప్రాణం వీడి నా దేహం దహిస్తున్నవేళ కూడా అలాగే నవ్వనీ!

50 comments:

 1. ఊసులు చెప్పినంత అలవోకగా అందమైన కవితలు రాయగలగడం.. నాకు పరిచయమైన వ్యక్తుల్లో మీరొక్కరే!
  ఇక ఈ కవిత విషయానికొస్తే, ఎప్పటి మాములుగా మీదైన స్టైల్లో మంచి ఫీల్ తో రాసారు.

  ReplyDelete
  Replies
  1. ఓ! థ్యాంక్యూ అందమైన కాంప్లిమెంట్ కి:-)

   Delete
 2. నన్ను మరచిన నిన్ను నేను మరవలేనని నా మనసాక్షిగా ..
  ప్రాణం వీడి నా దేహం దహిస్తున్న వేళ నీ చిరునవ్వుకై ఎదురుచూస్తూ..

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ మీ స్పందనకు.

   Delete
 3. అదృశ్య సవాళ్ళకు...అదృశ్య అభ్యర్ధనలకు
  సమాధానంలా సాగింది మీ కవితా ధార...
  అభినందనలు...!@శ్రీ

  ReplyDelete
  Replies
  1. అన్నీ తెలిసిన మీరు అభినందించడం ఆనందదాయకం:-)

   Delete
 4. so nice andi. priya garu cheppinattu u r some thing special...

  ReplyDelete
  Replies
  1. Thank you శృతిరుద్రాక్ష్:-)

   Delete
 5. చాలా బాగుందండీ

  ReplyDelete
  Replies
  1. మెచ్చిన మీకు నెనర్లండి!

   Delete
 6. హాయిగా రిలీఫ్ గా ఉంది ఈ కవిత చదివాక.
  పెయింటింగ్ చాలా బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. మీకు రిలీప్ ఇచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది:-)

   Delete
 7. పెయింటింగ్ చూస్తుంటే ఓ కొంటె కవిత రాయాలని ఉంది
  వద్దులెండి ఎవరి పని వారు చేస్తేనే బాగుంటుంది.....:-)
  పద్మార్పితా......మనసులో మాటచెప్పేయాలనుంది
  ఏదో యుద్దం తరువాత్ రిలాక్స్ అయి రొమాన్స్ కురిపించినట్లుంది
  ఈ కవిత దానికి తగ్గట్టుగా పెయింటింగ్ లో కమలనయని సంధి:-)

  ReplyDelete
  Replies
  1. కొంటె కామెంట్స్ తో అలరిస్తారుగా కవితకేం బ్రహ్మాండంగా రాసేయండి. థ్యాంక్యూ:-)

   Delete
 8. ఒక్కో వాక్యాన్ని ఉదహరిస్తూ రాయాలని వున్నా
  వాటి మద్యనున్న తడి విడదీయరానిదై
  యిలా మరల మరల చదువుతూ నిశ్శబ్ధంగా
  నాలో నేను యిరిగిపోతూ .....
  మీ భావుకతకు కైమోడ్పులర్పిస్తూ....

  ReplyDelete
  Replies
  1. మీ ఈ స్పందన మీలోని సున్నితత్వాన్ని, భావుకత్వాన్ని తెలుపుతుందండి. అభివందనములు మీరు స్పందించిన తీరుకు:-)

   Delete
 9. పద్మ గారూ, మనో భావాలు ఇంతకంటే ఎలా చెప్పగలరు ఎవరైనా చక్కని కవిత.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి మెచ్చిన మీకు:-)

   Delete
 10. chala bagundi mee kavitha

  ReplyDelete
 11. "వదిలేయాలనుకుంటే నవ్వుతూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపో
  ఆశల కెరటాలకి గమ్యమార్గమేదైనా చూపించి దారిమళ్ళిపో
  సృహలో ఉంటే జీవించలేని నన్ను పిచ్చిదానిగా మార్చిపో
  మమతలగూళ్ళైన నా ప్రేమ మర్మమేమిటో తెలుసుకునిపో"
  మాటలతో మాయచేసి మనసుదోచారు,
  చిత్రం తెలుపు -నలుపుల కలగలుపుతో కనులకు ఇంపుగా ఉందండి:)

  ReplyDelete
  Replies
  1. నచ్చి మెచ్చి కామెంటిడిన మీకు ధన్యవాదాలండి:-)

   Delete
 12. mee prema, viraham prakruti elaa bharistunDo!..
  satapatra daLa padmaarpita SalabhamevarO... kadaa!!
  ukkuri bikkiri ai... janmaraahityaM pondiunTaaDu.
  :) dayaleyni daLaakshi .

  ReplyDelete
 13. సృహలో ఉంటే జీవించలేని నన్ను పిచ్చిదానిగా మార్చిపో

  superb mam superb

  ReplyDelete
 14. ఊసులు చెప్పినంత అలవోకగా అందమైన కవితలు రాయగలగడం.. నాకు పరిచయమైన వ్యక్తుల్లో మీరొక్కరే!


  meeku nenika parichayam avvaledanukuntaa hahaha

  ReplyDelete
  Replies
  1. Ippudu parichayam chesukuntaanulendi :)

   Delete
  2. meeku nenu kakapoyinaa naaku meeru parichayame kada.
   Priya garu.....parichayam ainatle:-)

   Delete
  3. padmarpitha garu priya garu aa comment prematho na kosam pettaru meru interefere avvadam em baledu hahah

   Delete
  4. Thanooj gaaru.. leni paruvu theesesaaru kadandi? Mee profile open cheyagane "నవ రస(జ్ఞ) భరితం" ani kanabadindi. Nenu kooda guddeddhulaaga choosukokunda aa blog meedenemo nani aavesapadi comment raasesaanu. రసజ్ఞ gaaremo "meeru porabaddaarandi adi nenu kadu Thanooj gaaru" ani kallu theripinchaaru.

   Ayinaa oosulu cheppinantha alavokagaa kavithalu raase meeru blog raayakapovadam yemi baaledandi. Nenu ee vishayaanni khandisthunnaanu. Meeremantaaru Padmarpitha gaaru?

   Delete
  5. @ Padmarpitha: Meeru naaku parichayam kaakapovadamentandee? Nenu meeku pedda fan ayithenu..?!

   Delete
  6. hahahahah im having funnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn

   Delete
  7. Priyaగారు.......నన్ను ఇన్వాల్ చేయకండి:-) ('ఢీ' సినిమాలో బ్రహ్మానందం స్టైల్ లో:-)
   ఇంక మనిద్దరం ఎప్పుడో ఫ్రెంఢ్స్....అది thanoojగారు పరిచయమయ్యారా అని అడిగాను...

   Delete
 15. ప్రేమిస్తే సినిమాలో పిచ్చి వాడయిన హీరో ను గతం లో ప్రేమించిన అమ్మాయి చూసి తనతో తీసుకెళ్ళిన సన్నివేశం గుర్తొస్తుంది మీ కవిత చదువుతుంటే .ప్రేమ,విరహం,ఆవేదన కవిత నిండా ప్రవహిస్తున్నాయి.

  ReplyDelete
  Replies
  1. అంత సీన్ ఉందంటారా!!!!:-)
   మెచ్చిన మీకు ధన్యవాదాలండి.

   Delete
 16. ఏంటో ఈ విరహవేదన
  ఎటువైపో ఈ పయనం:)
  ఎప్పటిలాగానే బాగుంది అంటే బాగోదని:-)

  ReplyDelete
  Replies
  1. ఓహో....కొత్తవిధంగా పొగిడారా:-) బాగుంది!

   Delete
 17. Chala bagundhi padmarpita gaaru...very nice :)

  ReplyDelete
 18. మెచ్చుకున్న నేస్తానికి నెనర్లు.

  ReplyDelete
 19. నీ ఊపిరిలో నన్నుండిపోనీ, గుండెమూల నన్నొదిగిపోనీ
  నీ గుండేల్లో నన్ను దాచుకో నీతొడుగా వుండనీ
  ఎడబాటులో ప్రేమలోతుని చూడనీ, ఊహలు ఊసులవనీ
  ప్రేమున్నా లేకపోయినా, నీ ప్రతితలపులో నన్నుండిపోనీ


  వదిలేయాలనుకుంటే నవ్వుతూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపో
  ఎప్పటీకీ కదల్లేని శవంగామార్చి అప్పుడు వెళ్ళిపో
  ఆశల కెరటాలకి గమ్యమార్గమేదైనా చూపించి దారిమళ్ళిపో
  సృహలో ఉంటే జీవించలేని నన్ను పిచ్చివాన్నిగా మార్చిపో
  మమతలగూళ్ళైన నా ప్రేమ మర్మమేమిటో తెలుసుకునిపో

  ReplyDelete