నీ ఊహల్లో...

నీలాగే నేనున్నాను, వేరే తలపులతో నీకేం దూరంకాను...
ఊసుపోక నీవు తలిస్తే, నీ ఊహల్లో వేరే ఊసెత్తకున్నాను!

నీ ఎడబాటులో కన్నీటిని ఆశ్రయం కోరాను
గతినేనని నవ్విన కన్నీటికేం బదులీయను!

నీ శ్వాసలో, తనువులోని అణువణువులో నేనే ఉన్నాను...
అయినా నుదుటిరాతలో లేని నీకై అత్యాశ పడుతున్నాను!

రేయంతా నీతో ఊసుల్లెన్నో నేను చెప్పాను
ఈ ఊహలతోనే నేను తన్మయం చెందాను!

వేయి భాధాకెరటాల తాకిడికైనా నేను ముక్కలుకాను...
నీకు దూరమైనానన్న నిజాన్ని అబధ్ధంగా ఎలామార్చను!

నాలో ఉన్న నిన్ను బయట వెతుకుతున్నాను
అలసిన నేను నీ ఊహల్లో సేదతీరుతున్నాను!

నా లోకమే నీవైనా మనసుని పంజరంలో బంధించాను...
కోరికల గుర్రాలకే రెక్కలు వస్తే నేను కళ్ళెంవేసి ఆపలేను!

17 comments:

  1. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

    http://www.logili.com/

    ReplyDelete
  2. నీలాగే నేనున్నాను, వేరే తలపులతో నీకేం దూరంకాను...
    ఎంత బాగా రాస్తారో, మీరు.

    ReplyDelete
  3. నాలో ఉన్న నిన్ను బయట వెతుకుతున్నాను....
    ఊహల్లో వెతికే మనసుకి ఇది బాగ తెలుసు...అయినా వెతక్క మానదు...
    ఎప్పటిలానే కవితలో భావం చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  4. నాలో ఉన్న నిన్ను బయట వెతుకుతున్నాను
    అలసిన నేను నీ ఊహల్లో సేదతీరుతున్నాను!
    ----------------------------
    very realistic. అందరం చేసేది అదే.

    ReplyDelete
  5. నా లోకమే నీవైనా మనసుని పంజరంలో బంధించాను...
    కోరికల గుర్రాలకే రెక్కలు వస్తే నేను కళ్ళెంవేసి ఆపలేను!
    అందమైన భావాలకు...అందమైన ముగింపు వాక్యాలు
    పద్మ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  6. నాలో ఉన్న నిన్ను బయట వెతుకుతున్నాను
    అలసిన నేను నీ ఊహల్లో సేదతీరుతున్నాను

    ఇంతందంగా పద్మార్పితగారే రాయగలరు...

    ReplyDelete
  7. పద్మ గారూ, చాలా అందమైన భావన (వేదన) పలికారు.
    ప్రతి ప్రేమికా తనలోనే ఉన్న ప్రేమని ఊహే అనుకుంటుంది.
    ఎంత అందమైన కవిత చాలా బాగా రాసారు. ప్రతి అక్షరమూ తనవంతు న్యాయమై నిలిచింది మీ కవితలో...మెరాజ్

    ReplyDelete
  8. మీ కవిత చిత్రము రెండూ కూడా చాలా అందంగా ఉన్నాయి పద్మార్పిత గారు

    ReplyDelete
  9. your poetry and pics are rocking yaar

    ReplyDelete
  10. మీ కవిత చిత్రము రెండూ కూడా చాలా అందంగా ఉన్నాయి పద్మార్పిత గారు

    ReplyDelete
  11. భావం, ఛిత్రం రెండూ బాగున్నాయండి.

    ReplyDelete
  12. ప్రేమ సఫలం కాకపోతే మనసు పడే వేదనను మీ కవితలో అద్బుతంగా పలికించారు.

    ReplyDelete
  13. ఊహల్లోని అందాలని చిత్రంలోని నయనాలు పలికాయండి.....బాగుంది!

    ReplyDelete
  14. ఎప్పటిలానే అందమైన చిత్రంతోడుగా ప్రేమలోని వేదనను కవిత్వీకరించారు.. అభినందనలు పద్మార్పిత గారూ...

    ReplyDelete
  15. పని ఒత్తిడి వలన కాస్త ఆలస్యంగా చూసాను....చదివి చిత్రం చూస్తూ అలసటని మరిచాను.

    ReplyDelete
  16. మీ అమూల్యమైన ప్రతిస్పందనలకు ప్రతి ఒక్కరికి నెనర్లు.

    ReplyDelete