అచ్చుల్లో అగుపించని అతడు...


నంతపూర్ అబ్బాయి అందగాడనుకున్నా, అందనంత ఎత్తులో ఉన్నాడని కాదన్నా.
త్మకూరు కుర్రోడికి ఆత్మవిశ్వాసంకన్నా, ఆస్తిమీదే అతని కన్నుందని తెలుసుకున్నా.
బ్రహీంపట్నం పోరడు పట్నం పోరికి పొగరెక్కువని అంటే, నేను కూడా కాదు పొమ్మన్నా.
స్ట్ గోదావరివోడు ఈస్ట్ మన్ కలర్ లైఫ్ అనుకున్నా, ఈలేసి గోలచేస్తే ఈసడించుకున్నా.
య్యూరు చిన్నోడు ఉత్తముడనుకున్నా, ఉత్తుత్తిమాటల ఉలిపిరిగాడని ఉదాసీనంగున్నా.
త్నూర్(అదిలాబాద్) ఊరోడు అణిగిమణిగి ఉంటాడని ఊహలెన్నో ఊహించుకుంటున్నా.
షికేష్ నుండి వచ్చిన మహానుభావుడితో మనువెందుకులే వద్దనుకుని మానుకున్నా.
తో ఊరే లేనప్పుడు పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడుంటాయని, ఆ మాటే మాట్లాడనన్నా.
లమంచిలి ఎర్రోడు ఎదురు చెప్పడనుకున్నా, ఎకసెక్కాలు ఎక్కువైనాయని ఎడంగాఉన్నా.
లూరు దొర నాకేం తక్కువని ఎగిసిపడ్డా, ఏడువారాల నగలు తెమ్మని ఏడిపిస్తారని విన్నా.
లవరం మాన్ ఐరావతమంత మనసనుకున్నా, దానికన్నంత కూడా కానక కిమ్మనకున్నా.
ఒంగోలు బాబుతో ఒడిదుడుకులులేని కాపురం అని ఖుషీగున్నా, ఒట్టిమాటలే అని కాదన్నా.
డరేవు పక్కనున్న వాల్టేర్ వీరుడని ఓకే అన్నా, ఒట్టిచేపల కంపే తప్ప ఇంపు కానరాకున్నా.
రంగాబాద్ పిల్లోడి మదిలో అంజంతా శిల్పమవ్వాలని, వాడుకాదని అన్నా నేను అవునన్నా.
అంతర్వేది హీరో అతడు అందలమెక్కిస్తాడనుకున్నా, చెప్పకుండా అమెరికా చెక్కేస్తే సరికాదన్నా.
అః తో ఏ ఊరనడిగే మీతో.....ఆంధ్రప్రదేశ్ అచ్చుల్లో లేనివాడిని ఏ ఊళ్ళో వెదకనని అడుగుతున్నా.


(ఇది కేవలం సరదాగా నవ్వుకోడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తారని మనవి)

27 comments:

  1. భలే బాగుంది... ఇంతకీ ఎవరికైనా సరే అని చెప్పారా లేదా? :))

    ReplyDelete
  2. అనంతపురం అబ్బాయిని ok చేసి ఉంటే పెళ్ళికొచ్చేవాళ్ళం :)

    ReplyDelete
  3. ఔరంగాబాద్ పిల్లోడికి ఔనని చెప్పినట్టేనాండి ఐతే..అచ్చుల్లో దొరకలేదు కాబట్టి హల్లుల్లో ప్రయత్నిస్తే సరి..ఖర్మ కాలితే ఎవడో ఒకడు వస్తాడండి(సరదాకేనండోయ్)..ప్రయత్నిద్దాం!

    ReplyDelete
  4. అచ్చుల్లో ఎక్కడ ? బాగా రాసారండి.

    ReplyDelete
  5. హల్లుల్లోనే ఉన్నాడని
    మీకు, మాకు, అందరికీ తెలుసు కదా!:-)
    ఇంకా ఎందుకో ఈ అచ్చుల వెదుకులాట...:-))
    @శ్రీ

    ReplyDelete
  6. వావ్...శభాష్ పద్మార్పితాజీ యు ఆర్ యూనిక్.:-)
    ఎప్పుడూ ఏదో కొత్తదనంతో కట్టిపడేస్తారు .

    ReplyDelete
  7. ఆడపిల్ల కోరుకుంటే అందనంత ఎత్తులో ఎవ్వరూ ఉండలేరు.
    ఆదిలోనే ఆగిపోవాలి, అన్నిమెట్లు తనే దిగివస్తాడు....కవిత సరదాగా ఉంది.
    పద్మగారూ, బాగా రాసారు.....మెరాజ్

    ReplyDelete
  8. " Alisha Chinoy " Made in India song

    గుర్తొచ్చిందండీ మీ కవిత చదివితే..
    బాగుంది...

    ReplyDelete
  9. పద్మార్పితా....ఆంధ్రాలో కాకపోతే ఆలిండియాలో వెదుకుదాం, అర్జంటేంలేదుగా?

    ReplyDelete
  10. కాపిటల్ సిటీ అయిన హైదరాబాదీనే మీకు సరైన జోడీ అండి:)

    ReplyDelete
  11. ROFL. This makes a good item song. Hope no one copies it without paying you first ;)

    ReplyDelete
  12. పోనీ కర్నూల్, ఖమ్మ౦, గౌరవరం....ఇలా హల్లుల్లో మమ్మల్ని వెతకమంటారా.....

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. haahaaaaaaaa....very cute & nice padma gaaru

    ReplyDelete
  15. mee alochanalaku antham ledu kadandi

    ReplyDelete
  16. (ఇది కేవలం సరదాగా నవ్వుకోడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తారని మనవి)


    nakenduko edi chaala serious gaa tesukovalani pisthundani naa manavi hahhahahahaha

    ReplyDelete
  17. మొత్తానికి గూగుల్ నొదిలి సొంత సెర్చింగ్ చేసారన్న మాట!
    అచ్చులు హల్లులు ఎందుకండీ??
    హాయిగా స్వయంవరం ప్రకటించి రిలాక్సవ్వండి...
    మీ మది విల్లు విరిచే రాముడొస్తాడు...:-)

    ReplyDelete
  18. మది విల్లు ఎక్కుపెట్టె రాముడొస్తే better ఎమో కాని, విరిచివాడితో కష్టం కాదటండీ

    ReplyDelete
  19. హల్లుల్లో కూడా వెతికి అక్కడా లేకపోతే ABCDల్లో చూద్దాం.....అంతేకానీ కంగారుపడకండేం!:)

    ReplyDelete
  20. హ హా...అచ్చు ఊర్లల్లో, ప్రాంతీయం జోడించి భలే తమాషాగా రాశారు, బాగుంది.

    ReplyDelete
  21. అమూల్యమైన అభిప్రాయాలని వెల్లడిస్తున్న మీకు ప్రణామములు.

    ReplyDelete
  22. wow very very nice padmarpita....

    ReplyDelete
  23. ఈలేసి , గోల చేయకూడదన్న మాట.
    హి హి హి..బాగుంది.మీ కవిత.

    ReplyDelete
  24. విభిన్నమైన ప్రయోగం.

    ReplyDelete
  25. నవ్వటం మరచిపోయి చాలా రోజులయ్యింది చిన్నా.ఎప్పుడూ ముఖం ఇంత లావు చేసుకుని కొంపలేవో మునిగి పోయినట్లుండే నన్ను సైతం నవ్వించిన "పద్మార్పిత" పద సృష్టికి 'నిండు నూరేళ్ళు'
    http://tellenglish.blogspot.in/

    ReplyDelete
  26. Hearty welcome to my blog Pratapgaru...
    అప్పుడప్పుడూ వచ్చి హాయిగా నవ్వేసుకోండిక:-)

    ReplyDelete