అవి అక్షర రూపాలై అందరినీ అలరించమనికామోసు.
భావాలు నాతో ఎందుకు అనుబంధం పెంచుకున్నాయో?
కష్ట సుఖాలని పంచుకునే బంధాల అన్వేషణిదికామోసు.
చిత్రాలు రంగులకుంచెతో చేతుల్నెందుకు వణికిస్తున్నాయో?
విచిత్రజీవితాన్ని రంగులతో అందంగా మలచమనికామోసు.
కొందరి మాటలు మనసుని ఎందుకు గాయపరుస్తున్నాయో?
గాయపువేదన తెలిసి వేరొకరిని భాధించరాదనికామోసు.
గెలుపోటముల చెలిమికై నవ్వులేల ప్రాకులాడుతున్నాయో?
జయాపజయాల్ని నవ్వుతోనే రాణించగలమనికామోసు.
సమస్యలతో సరదాలు సంప్రదింపులేల జరుపుతున్నాయో?
అన్నీమరచి హాయిగా గడపడమే అధికమించేశక్తికామోసు.
ఇలా మీతో పంచుకోనినాడు నాలో ఆకలి దప్పికలు ఏమైపోతున్నాయో???
ఈ-బంధం ఏర్పడ్డ ఇన్నాళ్ళకిదేం ప్రశ్నంటూ మీ ఛీవాట్లు తినమనికామోసు:-)
ఆలోచనలే అంతర్ లోచనాల రెప్పలిప్పేవి
ReplyDeleteఅందుకే అక్షర రూపాలై కళ్ళకు కడతాయి.
భావాలే అనుభవాల వాకిలి లో రంగవల్లులు.
బంధాల అందాలను ఆవిష్కరించేహరివిల్లులు
చిత్రాలు ఆలోచనానుభవభావాల లోగిళ్ళు
చీకటివెలుగుల జీవితాన్ని వెలిగించే నెగళ్ళు
మాటలు మనసుని గాయపరిస్తే..
సున్నితత్వపు విలువను గుర్తుచేయడానికే
నవ్వులు గెలుపోటములతో దోబూచులాడితే..
ఫలితమేదైనా విచలితమవ్వరాదని
సమస్యల ముళ్ళమధ్య పరిష్కారపు పువ్వుల్ని
సరదాగ ఆందుకుని హాయిగ నవ్వమని కాబోలు..
పద్మార్పిత చేత దివ్వెని చూపిస్తుంది వేలు..
పెంజీకటిని చీల్చే వెలుగునవ్వమని కామోసు
ఆకలిదప్పుల తిప్పలను మరిపించే ఊసు.
సతీష్ గారు....నా రాత కన్నా మీ కమెంట్ కవిత అమోఘం.
Deleteఅంతబాగా రాయలేకపోయినా మీ అభిప్రాయం అందంగా అమిరింది.
థ్యాంక్సండి.
హమ్మమ్మా. వేలు నాపై చూపిస్తారనుకున్నా. :)
Deleteమీ టపా సిగలో నా టీక (కామెంట్) ఓ ఈక. :)
chaala chaala bagundi.
ReplyDeletethank you.
Deleteఅన్నీ నిజాలే కదా????మరి కామోసు ఎందుకు?:)
ReplyDeleteఏమో!! నేను రాసినదానిపై నాకే కాంఫిడెన్స్ లేకకామోసు:-)
Deleteకొందరి మాటలు మనసుని ఎందుకు గాయపరుస్తున్నాయో?
ReplyDeleteగాయపువేదన తెలిసి వేరొకరిని భాధించరాదనికామోసు.
ఇవి నాకు చాలా నచ్చాయండి.
నచ్చినందుకు నెనర్లు.
Deletevery very nice padmarpita garu :-)
ReplyDeleteThank you very much.
Deletehmm.....
ReplyDeleteనాకు నచ్చింది .
ReplyDeleteనచ్చినందుకు థ్యాంక్యూ.
Deleteమీ ఆలోచనల ,మీ భావాల ,మీ చిత్రాలలోని సృజనాత్మకత అందరికి తెలిస్తేనే కదండీ వాటికి అందం.
ReplyDeleteఅవుననుకోండి! కానీ ఇలా అప్పుడప్పుడూ సందేహనివుర్తండి:-)
Deleteమీ అభిప్రాయన్ని తెలిపినందుకు నెనర్లండి.
To be honest, I liked Satish's views more. ;).
ReplyDelete[.......running away to hide somewhere faster! ]
To be frank......same feeling!
DeleteI appreciate your honest comment!
Thank you my friend:-)
@ chaatakaM:
Deleteనాది అనుకరణే..చాతకం గారూ.. కామోసు నుండి పుట్టిన కామెంట్ మాతృక కన్నాముచ్చట కలిగిస్తే అది పద్మార్పిత భావ పరిమళమే..
@padmaarpita:
బేలతనం ఛాయల్లో కామోసు కరిగించినా..
అమ్మా!.. నీకన్నీ నా బుద్దులే అని బిడ్డ అంటున్నట్టు.. అతిశయాన్ని వొలికించి ఆరిందాలా చెప్పిన మాటలు ఆత్మీయత లో పొంగుకొచ్చినవి. నా బ్లాగు విడిచి సాము చేసానని భావించక ఆటలో అరటిపండు లా అపేక్షించండి. మీ బ్లాగులో నా భావాలకు ఆలంబన మీరే.. మీ బొమ్మలూ-భావాలూ.
నీవు నేర్పిన విద్యయే .. నీరజాక్షీ అని పాడాలని ఉంది. అల్లరి ఎక్కువవుతుందని.. ఆగిపోయా
మీ ప్రోత్సాహం తోనే.. వెలుగులోకి వస్తున్నా పద్మార్పిత గారూ! మీ మితృలే నా బ్లాగు లోకి చూసేదీ. . మరి కృతజ్నతలు ఎలా చెప్పాలీ!
నా కున్న అక్షరాలతో నే అక్షతలు చల్లాననుకోండి. మీరు చల్లినా సరే..!! :(
मैं पल दो पल का शायर हूँ .. पल दो पल मेरी कहानी है
पद्मार्पिता तो यही पर रहती है.. उनके दिवानेतो हज़ारें है..
:)
పద్మార్పితగారు...నిజానికి ఈ కవితలో ఏదో అసంపూర్తి గోచరిస్తుందండి.
ReplyDeleteఈ అసంపూర్తినే ఆసరాచేసుకుని మిమ్మల్నందరినీ అలరించే అందమైన రాతలు రాయ ప్రయత్నిస్తానండి!
ReplyDelete"చిత్రాలు రంగులకుంచెతో చేతుల్నెందుకు వణికిస్తున్నాయో?
ReplyDeleteవిచిత్రజీవితాన్ని రంగులతో అందంగా మలచమనికామోసు." మీ ఆత్మపరిశోధన అక్షరరూపం దాల్చి మా అందరినీ అలరించింది..భావాలకి రంగులేసి గాలిపటాలుచేసి ఆ దారం మాచేతికిచ్చారు...బావుందండీ
చాన్నాళ్ళకి విచ్చేసి ఇలా పొగిడేస్తుంటే ఆనందంగా ఉందండి. థ్యాంక్యూ వాసుదేవ్ గారు.
Deleteకామోసు, భలేగా వుందండి ఈ పదం.
ReplyDeleteఆలోచనలన్ని అక్షరాలైతే,
భావాలన్నీ బంధాలైతే,
చిత్రాలే జీవితమైతే,
గాయలే గమనపు గీతాలైతే,
ఈ-బంధానికి ఇంతకంటే రాయలేనేమో కామోసు...హి...
ఊహు, ఇంకా బాగా రాయాలండి మీరు..హ,హ...
(ఈ-బంధం ఏర్పడ్డ ఇన్నాళ్ళకిదేం కామెంటని మీ ఛీవాట్లు తినమనికామోసు:-))
కదా...కామోసు అనే పదం నాకు భలేనచ్చింది.
Deleteభాస్కర్ గారూ... మంచి కవితతో కమెంట్ కొట్టిన
ఈ-బంధానికి చీవాట్లేంటి!!! క్లాప్స్ కొడుతున్నాను:-)
అక్షరాలలో ఆర్తిని రగిలించి ఆవేదనను పలికించి అంతే సమపాళ్ళలో ఆనందాన్ని, ఆర్థ్రతను, వర్ణాన్ని అద్దే మీ కలం కుంచే దేనికవే సాటి పద్మార్పిత గారూ...మీకెందుకు ఈ కామోసు భావం....
ReplyDeleteఏ భావాన్నైనా మీరు పలికించగలరని ఇలా నిరూపించడానికైతే ఓకే...:))
అభినందనలతో...
వర్మగారు...అలా అతిగా పొగిడి అందలమెక్కిస్తున్నారేమో.
Deleteఅక్షరాలతో మీలా ఆడుకోవడం నాకు రాదుకామోసు:-)
"కొందరి మాటలు మనసుని ఎందుకు గాయపరుస్తున్నాయో?
ReplyDeleteగాయపువేదన తెలిసి వేరొకరిని భాధించరాదనికామోసు"
ఎంతటి పాజిటివ్ థింకింగ్ 'చిన్నా'? కళ్ళలో నీళ్ళు తొణికిసలాడాయి.అందరూ ఈ నిజం తెలుసుకుంటే బాగుండు కదా. ఎవరో ఏదో అన్నారని, మనసును గాయం చేసుకుని మరలి రాని లోకాలకు వెళుతున్నారెందరో..
మీ అభిమానపు స్పందనకు నెనర్లండి!
ReplyDelete