నీవని నావని విడివడని క్షణాలు కొన్నైనాఉంటే
భాషరాని మౌనం మనసువిప్పి మాట్లాడుతుంటే
రేయి పగటిని రానీక ద్వారపాలికై కాపుకాస్తుంటే
చిలిపితగువుతో నేనలిగి మూతి ముడుచుకుంటే
నా కాలి బొటనవేలిని ముద్దాడి నీవు లాలిస్తుంటే
చాలించమని సుతారంగా మిమ్మల్ని నెడుతుంటే
జోక్యమేలని గాలికూడా మన నుండి జారుకుంటే
మరింకేదో కావాలంటూ మరింత మారాం చేస్తుంటే
పెదవులమధ్య మెరిసేముత్యాలు రెచ్చగొడుతుంటే
కోరికలు ఎన్నో అలజడిచేస్తూ అదుపుతప్పుతుంటే
తప్పైనా కాదని సమర్ధింపునే ఆసరాగాచేసుకుంటే
తనువుల మధ్య జరిగే యుద్ధంలో గెలుపెవరిదంటే
నీవు గెలిచి నేనోడినా నేనోడి నీవు గెలిచినా ఒకటే!!!
రేయి పగటిని రానీక ద్వారపాలికై కాపుకాస్తుంటే
చిలిపితగువుతో నేనలిగి మూతి ముడుచుకుంటే
నా కాలి బొటనవేలిని ముద్దాడి నీవు లాలిస్తుంటే
చాలించమని సుతారంగా మిమ్మల్ని నెడుతుంటే
జోక్యమేలని గాలికూడా మన నుండి జారుకుంటే
మరింకేదో కావాలంటూ మరింత మారాం చేస్తుంటే
పెదవులమధ్య మెరిసేముత్యాలు రెచ్చగొడుతుంటే
కోరికలు ఎన్నో అలజడిచేస్తూ అదుపుతప్పుతుంటే
తప్పైనా కాదని సమర్ధింపునే ఆసరాగాచేసుకుంటే
తనువుల మధ్య జరిగే యుద్ధంలో గెలుపెవరిదంటే
నీవు గెలిచి నేనోడినా నేనోడి నీవు గెలిచినా ఒకటే!!!
ఏకమేవా అద్వితీయం బ్రహ్మ.
ReplyDeleteమీకు నా ధన్యవాదం!
Deleteayyabaaboy chaala bagundi andi... super & simple...
ReplyDeleteHammayya intalaa nachinanduku ....yama santosham:-)
Deleteమీ కలం నుండి వెలువడిన ప్రేమామృతపు జల్లు ఈ కవిత.
ReplyDeleteచాలాబాగుంది...
ఓహ్...థ్యాంక్యూ
Deleteనీవని నావని విడివడని క్షణాలు కొన్నైనాఉంటే
ReplyDeleteభాషరాని మౌనం మనసువిప్పి మాట్లాడుతుంటే
మంచి కవితా వాక్యం.చక్కని కవిత.
మీరు మెచ్చిన పదాలు మీకు చేస్తున్నవి సలాం.:-)
DeleteThank Q.
గెలుపోటములు లేని శృంగార యుద్ధాన్ని
ReplyDeleteకలంతో చేసారు పద్మ గారూ!
@శ్రీ
అయితే కలందే విజయం శ్రీగారు:-) ధన్యవాదాలండి!
Deletevery nice feeling
ReplyDeleteThankQ very much.
Deleteఅలాంటి సమయాన రాకూదనుకొంటే.
ReplyDeleteభావాన్ని మెచ్చుకోమని మనసు మారాం చేస్తుంటే.
గెలుపెవరిదో మీరే చెప్పండి చెప్పాలనుకొంటే:-):-)
(బాగుంది డియర్ మీ కవిత )
ఆ రెడీ రిజల్స్ మీకు తెలుసును కదండీ:-)
Deleteనచ్చినందుకు నెనర్లండి.
పద్మగారూ బలేవారే ప్రతి విద్యార్ది రిజల్సు మా చేతిలో ఉంటుందా??
Deleteఅదీ ఇలాంటి తెలివైన విద్యార్ది అయితే కష్టమే.:-)
ఓహ్....తెలివైన అన్నారు కాబట్టి "మీ దయ మా ప్రాప్తి" అని కూడా అనలేను:-) ఏదో ఇలా సాగిపోనివ్వండి! Once again thanks for your compliments.
Deleteపద్మార్పితా....కాస్తంత శృంగారం పాళ్ళు ఎక్కువైనా, ఆడవాళ్ళుకూడా అందంగా శృంగారాన్ని పండించగలరి కవితద్వారా తెలియచెప్పావు. అభినందనలు!
ReplyDeleteఅవునాండి కూసింత ఎక్కువైదంటారా???
Deleteఆడవాళ్ళ మనసు కూడా అందమైనదే కదండి:-)
అభివందనములు.
తనువుల మధ్య జరిగే యుద్ధంలో గెలుపెవరిదంటే
ReplyDeleteనీవు గెలిచి నేనోడినా నేనోడి నీవు గెలిచినా ఒకటే!!!
-----------------------------
వావ్
కవిత చదివి స్పందించిన మీకు ధన్యవాదములు.
Deleteశృంగారం రసరాజమని నిరూపించారు.
ReplyDeleteఅద్భుతంగా ఉంది మీ కవిత పద్మగారు!
"తప్పైనా కాదని సమర్ధింపునే ఆసరాగాచేసుకుంటే" అన్న వాక్యం పెడర్థాన్ని ఇస్తుందేమో ... ఆ ఒక్క వాక్యాన్ని మాత్రం మార్చండి.
మీకు నా అభినందనలు!
చాన్నాళ్ళకి మా బ్లాగ్ వైపు మీ రాక మరియు మీ ప్రశంస మమ్ము ఆనందపరచిందండి. ధన్యవాదములు.
Deleteపెళ్ళికాని ప్రేమికుల దృష్టిలో అది తప్పే అన్నభావంతో అలా రాసానండి.
అందమైన మీ భావాన్ని తెలిపితే జతచేరుస్తానండి.
Wow..! Chaala chakkagaa raasaaru. Especially "చిలిపితగువుతో నేనలిగి మూతి ముడుచుకుంటే
ReplyDeleteనా కాలి బొటనవేలిని ముద్దాడి నీవు లాలిస్తుంటే
చాలించమని సుతారంగా మిమ్మల్ని నెడుతుంటే.." ee lines maree maree nachhesaayi :)
Thank Q Priyagaru....aa lines loni feel atuvantidemo mari:-)
Deleteప్రతి క్షణం మీవే అయి ఒకరిలోకొకరు ఐక్యమై జీవన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వెలుగొందాలని మనసారా కోరుకుంటూ గెలుపోటముల తూనికకు చిక్కని మీ రసాస్వాదనకు నీరాజనాలర్పిస్తూన్నా....
ReplyDeleteవర్మగారు వరించి ఇచ్చిన దీవెనలు వ్యర్థం కావులెండి:-)
Deleteనా కవితని ఆస్వాధించి అభినంధించిన మీకు నమస్సుమాంజలి.
ఊహల్లోని ఊసులు కమ్మగా ఉంటాయనే కదండీ....మీరు ఇలా జరిగుంటే అని అనుకుంటున్నారు:)
ReplyDeleteJust kidding....good one from your heart feel emotions.
ఊహల్లో బ్రతికేస్తే పర్వాలేదేమో కానీ వాటికి రెక్కలువచ్చి ఎగరలేకపోతేనే భాధ....
Deleteఅందుకే ఇలా:-)..థ్యాంక్యూ.
Chala romantic ga chala bavundi me poem....
ReplyDeleteThank you very much Sri Valli...
Deleteఏమైనా మీ కలం నవరస సమ్మిళిత సప్త వర్ణ శోభితమండీ...బహుత్ ఖూషీ యార్...
ReplyDeleteమీ నుండి వెలువడిన ఈ ఉస్తేజితోల్లాసభరితమై ప్రశంస నన్ను ఆనందిపజేసినదండి. ధన్యోస్మి! ఆప్ కో భీ బహుత్ సారా ప్యార్:-)
Deleteఏమి చెప్పను
ReplyDeleteఎలాగ చెప్పను
ఎంతబాగుందో ఈ కవిత:)
మీలా కమ్మని కవితలల్లలేక ఇలా పాటల పేరడీ పద్మార్పితా.
This is Padmarpita(Jhalak dikhlaaja lo Remo stylo)
నేను మాత్రం "పొగడమాకు అతిగా చేసేయమాకు పొగడపూల లతగా" అననులెండి, మీ కమెంట్ నచ్చిందిగా.Thank you.
Delete"PERFECT"(Jhalak dikhlaaja lo Madhuri Dixit Style lo:-)
వినాయక చవితి శుభాకాంక్షలు!
ReplyDeleteమీకు కూడా శుభాకాంక్షలు!
Deletehammo hammo hammo meeku guts ekkuvay
ReplyDeleteనాకేం తక్కువండి....మీరంతా ఉన్నారన్న ధీమా:-)
DeleteThank you. మీకు కూడా శుభాకాంక్షలు!
ReplyDelete"రేయి పగటిని రానీక ద్వారపాలికై కాపుకాస్తుంటే
ReplyDeleteచిలిపితగువుతో నేనలిగి మూతి ముడుచుకుంటే"..... :) Nice one పద్మగారు.. మీకు, మీకుటుంబ సభ్యులకు కాస్త ఆలస్యంగా చవితి శుభాకాంక్షలు...!
నచ్చి మెచ్చిన మీకు నేనర్లండి.
DeleteThanks and wish you the same.
simply superb..!
ReplyDeleteనీవు గెలిచి నేనోడినా నేనోడి నీవు గెలిచినా ఒకటే!!!చాలా చక్కని బావన.ఎందుకో కాని, పడక గదిలో ఈ సూత్రాన్ని పాటిస్తున్న దంపతలు,సంసారం సాగించడంలో పాటించడం లేదు.
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలండి.
Deletechaala bagundi mee kavitha.
ReplyDelete:venkat
Thank Q verymuch.
Deleteనమస్తే..పద్మగారు..పై 46 స్పందనలకు మీ ప్రతి స్పందనలను చదివాను. దేనికదే ప్రత్యేకం.అభినందనలు. మీకు చిన్న సలహా ఇవ్వవచ్చా.. మీ బ్లాగ్ ఓపెన్ అయిన వెంటనే "ఎన్నెన్నో వర్ణాలు" పాట వస్తుంది.అలా 'ఆటో'గా కాక మనం వినాలనుకున్నప్పుడే వచ్చేలా కోడ్ మారిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. ఎందుకంటే మీ పోస్టులు అన్నీ బాగున్నాయి. వాటిని విడివిడిగా ఓపెన్ చేసిన ప్రతిసారీ ఆ పాట పునరావృతమవుతుంది కదా. అఫ్కోర్స్ .. ఆడియో క్లోజ్ చేయవచ్చనుకోండి.ప్రతాప్
ReplyDeleteతప్పక మీ సలహాను పాటించే ప్రయత్నం చేస్తానండి!
ReplyDeleteహల్లో నేస్తం,
ReplyDeleteచాలా కాలం తరువాత పింగ్ చేస్తున్నా..మన్నించండి...
మీ బ్లాగు లో కవితలని నేను నా Status Messeges గా, SMS ల గా, కాస్త మార్చి వాడుకుంటూవుంటా..కాని, అది నా స్వంత కవిత్వం అని మాత్రం ఎప్పుడు చెప్పుకోను..ఇది గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నదే..
ఇప్పుడు నేను మిమ్మల్ని అభ్యర్దించేది ఏమిటంటే, మీ ప్రతి పోస్ట్ కి Facebook మరియు Twitter కి షేర్ బటన్ ని add చెయ్యండి.
సో, వాటిని అలాగే, విజిటర్స్ షేర్ చెయ్యడానికి వీలుగా వుంటుంది.
ఈ చిన్ని సలహాను సహ్రుదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ, మీ పాత నేస్తం..
చక్రవర్తి..
తప్పక ప్రయత్నిస్తానండి యాడ్ చేయడానికి. మీ అభిమాన స్పందనకి ధన్యవాదాలు.
ReplyDeleteAyya baboi meeru keka andi.. nenu hari andi...
ReplyDelete