సరస సల్లాపం..

కందిచేలల్లో కన్నుగీటి కవ్వించబోతే
కస్సుబుస్సులాడి కౌగిలివ్వనన్నావు..

సరస్సులో సరిగంగస్నానమాడదామంటే
సరసమాడ ఇది సమయమే కాదంటావు..

కారుమబ్బుల కాటుకద్ది ఎదురు చూస్తుంటే
కాయలే కాచిన కళ్ళల్లో కన్నీరు తెప్పించావు..

జాజుల్ని జాలువార జడలోతురిమి జాలిగాచూస్తే
జాణనంటూ నా తోడుగా జాబిలిని కాపుంచినావు..

అలవోకగా అలిగి కూర్చుని కురులు విప్పివిరబోస్తే
అందాల ఈర్ష్యాఉసురులు నాకు తగులునంటావు..

వెన్నెల్లో పక్కపరచి వేగిరముగా నిన్ను రమ్మంటే
వగలరాణిని నేనంటూ వెటకారమాడి నవ్వుతావు..

పగలెంత దొరవైనా మాపటేళకి నాకు రాజువంటే
పరువాల పొత్తిళ్ళలో పసిబాలుడిలా వొదిగిపోతావు..

52 comments:

 1. ఇంత సరససల్లాపమా? :)

  ReplyDelete
  Replies
  1. మీరే అలా అడిగితే ఏంచెప్పనండి......థ్యాంక్స్ తప్ప:-)

   Delete
 2. పద్మార్పిత గారు,

  బ్లాగు టపా లో మేటరు సాయించి కామెంట రా మంటే,
  వేగిరమే వచ్చి కామెంటి దోబూచు లాడి పోతావు !


  స, రస 'జల్లున 'ఆలాపనం! సూపర్ డూపర్ !


  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
  Replies
  1. కృతజ్ఞతాభివందనము...

   Delete
 3. modhata amantham chadivesi, priya sakhi gurichi sakhudu chebuthunna sandarbam anukunna. malli chadivi artham chesukunna. enthala kavvinchindo tana chelikadini ani. mee antha andanga undandi kavitha. ela rastarandi బాబు. kevvu keka.

  ReplyDelete
  Replies
  1. మీ కేకకు..........కూతతోపాటుగా వందనము.

   Delete
 4. పగలెంత దొరవైనా మాపటేళకి నాకు రాజువంటే
  పరువాల పొత్తిళ్ళలో పసిబాలుడిలా వొదిగిపోతావు..baagaa nachindandi... cute feel... congrats...

  ReplyDelete
  Replies
  1. ఏంటో ఇలా ముభావంగా చెప్పినా పొగిడినట్లే ఉందండి:-)

   Delete
 5. వార్...సరసమంత అందంగా రాశారు, చాలా బాగుంది భావం కవితలో చెప్పిన పదలయలతో...
  బొమ్మ కరుణాకర్ గారిదా?

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.....ఈ బొమ్మ వెనుకో మిర్చీబజ్జి అంత కధ ఉందండి:-)
   ఈ బొమ్మున్న కాగితంలో నేను మిర్చీబజ్జీని తిని కాగితం విసిరేస్తూ యాధాలాపంగా బాగుందని దాచి గీసిందండి. కాగితానికి నూనె అంటుకుని చిరిగి ఇంకో ఇద్దరు చెలికత్తెలు కూడా ఉన్న ఈ కాగితాన్ని చూసి సరిగ్గా వేయలేక పోయానేమో! ఇంకో ఇద్దరున్నది వేస్తున్నా అది సరిగ్గా వేయగలిగితే ఇంకో పోస్ట్ కి పెడతాను చూసి అభిప్రాయాన్ని చెప్తారని ఆశిస్తూ....

   Delete
 6. ఇలా అయితే ఇంకెక్కడికి పోతాడు.....పదాల పరువాలతో కట్టేస్తే:-)

  ReplyDelete
  Replies
  1. కట్టేస్తే పడుంటాడేంటండి...మీరు మరీ ఇలా నిజాలు చెప్పేస్తే ఎలాగండి:-)

   Delete
 7. హమ్మమ్మా..పదాల మాయ..;)

  ReplyDelete
  Replies
  1. పదాలని కూర్చి మాలల్లితే మాయంటారేంటో:-)

   Delete
  2. పోనీ మాలలేసి చేసే మాయ ;)

   Delete
 8. సమయానికి తగు .. అన్నమాట..

  ReplyDelete
  Replies
  1. ఆ సమయస్ఫూర్తే ఉంటే జాణను, వగలాడినని అనిపించుకుందునా! :-)

   Delete
 9. బాగుందండి మీ సరస సల్లాపం.. నిజంగా పదాల మాయ..

  ReplyDelete
 10. కరుణాకర్ చిత్రమా? అంటే ఈ కైత ఏ భూమిలోనైనా ప్రచురితమా? (దానితో సంబంధం లేకుండా) విరహ కవిత బాగుంది.

  ReplyDelete
  Replies
  1. ఏమో తెలీదండి.....నేను రాసేవి పత్రికల్లో ప్రచురించగలిగినంత పాండిత్యమా? థ్యాంక్యూ

   Delete
 11. నావల్ల కావడంలేదు మీ ఈ రసరాగఝరిని ఆస్వాధించడం :-) ఇలా ఎలా రాసేస్తారు!

  ReplyDelete
  Replies
  1. ఏంటో ఇలా అంటూనే పదాలు అల్లేస్తారేమో:-)

   Delete
 12. ఎంత హృద్యంగా సుమనోరంగా ఉందండి !

  ReplyDelete
 13. సరససల్లాపంలో తర్కానికి తావులేదులెండి.

  ReplyDelete
  Replies
  1. ఉంటే ఊరుకునేవారు కాదుగా:-)

   Delete
 14. superb! chala bagundi.. :)loved the last lines..
  Art by whoever was great too.. :) though the left foot wasnt placed right, I think it shouldnt be ther..

  ReplyDelete
  Replies
  1. Thanks a lot......may be i didn't justified:-(

   Delete
 15. చాలా చాలా చాలా నచ్చేసింది పద్మా.

  ReplyDelete
  Replies
  1. మీ మెచ్చుకోలు నాకూ నచ్చేసింది:-)

   Delete
 16. పదాలలో మెరుపులు నింపి చేసిన ఒక మాయ ఈ కవిత లో ఉంది ..నండూరి వారి సాహిత్యం ఏమైనా చదువుతున్నారా ఈ కాలం లో ..

  ReplyDelete
  Replies
  1. మాయ చేసానని అన్నా.....నండూరిగారిని గుర్తుచేసారుగా:-) ధన్యవాదాలండి!

   Delete
 17. "పగలెంత దొరవైనా మాపటేళకి నాకు రాజువంటే
  పరువాల పొత్తిళ్ళలో పసిబాలుడిలా వొదిగిపోతావు"...... Wow.... Cute feeling... Very Nice Padma gaaru...

  ReplyDelete
  Replies
  1. శోభగారు.....ధన్యవాదాలండి!

   Delete
 18. అక్కో ఇలా కవితలల్లేసి కథల్జెప్పి బావను కట్టేసావన్నమాట...
  కూసింతా నాకూ నేర్పరాదా...
  అసలే సలికాలం...

  ReplyDelete
  Replies
  1. ఓలమ్మోలమ్మో....నీ ఓర సూపే సాలుగదేటి! :-)

   Delete
 19. చాలా బాగుంది పద్మ గారూ!...

  కారుమబ్బుల కాటుకద్ది ఎదురు చూస్తుంటే
  కాయలే కాచిన కళ్ళల్లో కన్నీరు తెప్పించావు..

  పగలెంత దొరవైనా మాపటేళకి నాకు రాజువంటే
  పరువాల పొత్తిళ్ళలో పసిబాలుడిలా వొదిగిపోతావు....సరదాగా...సరసంగా...నడిచింది....@శ్రీ ...:-)

  ReplyDelete
  Replies
  1. మిమ్మల్ని మెప్పించానుగా....:-) ధన్యవాదాలండి.

   Delete
 20. "జాజుల్ని జాలువార జడలోతురిమి జాలిగాచూస్తే
  జాణనంటూ నా తోడుగా జాబిలిని కాపుంచినావు..

  అలవోకగా అలిగి కూర్చుని కురులు విప్పివిరబోస్తే
  అందాల ఈర్ష్యాఉసురులు నాకు తగులునంటావు..

  పగలెంత దొరవైనా మాపటేళకి నాకు రాజువంటే
  పరువాల పొత్తిళ్ళలో పసిబాలుడిలా వొదిగిపోతావు.."

  అసలెన్ని వాక్యాలు ఉటంకించాలో పద్మాక్షి పదాల జాణతనానికి.... సరసాన్నింత సౌమ్యంగా గుంభనంగా చెప్పడం మీ కలానికే చేతైన అరుదైన విద్యేమో...పద్మాజీ మీ భావాల ఒయారానికి కాదా పదదాసులెంత వారలైనా....

  ReplyDelete
  Replies
  1. అహో....ఏమి భాగ్యము! ఇలా అడుగిడి ప్రశంసా వ్యాఖ్యలతో నన్ను పరవశింపజేసిన మీకు నమఃసుమాంజలులు!

   Delete
 21. అందమైన చిత్రానికి అంతకంటే సరసమైన కవిత్వం....బాగుంది.

  ReplyDelete
 22. ముందరి వరుసలన్నిటిలో ఎంత సరసాన్ని నింపారో ఈ రెండు వాక్యాల్లో అంతటి ప్రేమను నింపి సరసాన్ని రెండో స్థానానికి నెట్టేసారు.

  "పగలెంత దొరవైనా మాపటేళకి నాకు రాజువంటే
  పరువాల పొత్తిళ్ళలో పసిబాలుడిలా వొదిగిపోతావు.."

  These lines creating the great impression on all other lines. Too good :)

  ReplyDelete
  Replies
  1. మకు మీరిచ్చే ప్రాముఖ్యత మీతో అలా అనిపించింది.
   ఎంతైనా సరసానిది రెండవ స్థానమేనండి:-)
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 23. ముద్దుమురిపాల పతాకస్థాయి సరస సల్లాపాలు. సల సల కాగే పాలపైన మీగడ కట్టినట్లు, వయసు పాలబడిన మనసు ఒకోసారి మరొక మనసు పాలబడితే తనువుల సరసాలతో మనసులను సలపరింపచేసేది కమ్మని అనుభూతి. సరస సల్లాపాలకు అనుభూతుల ఆస్వాదనలు తప్ప వచన నివేదనలుండవు. ఎందుకంటే స్పందనకు అదను,పదును తప్ప పోలికుండదు.

  ReplyDelete
 24. మీ విశ్లేషణా విధానం బాగుందండి....ధన్యవాదాలు.

  ReplyDelete