కాదిలా....



సాగరంతో ఒడ్డెన్నడు స్నేహం చేయదు
నా మనసు నిన్నెన్నడు మోసగించదు
దూరమైనా నీపై నాకింకా ఆశ చావలేదు
ఏరై పొంగు కన్నీరు నీపై నిందమోపదు.

ఉప్పునీరు కాదు కన్నీటి సాగరకెరటమది
నావనునడిపే చుక్కానై సాగుతుంది మది
తీరం చేరాలన్న నీఆశను తీర్చే కోరికనాది
అందుకే నా కంటనీరిలా ప్రవహిస్తున్నది.

ప్రతిమౌనానికి అర్థం వ్యతిరేక భావంకాదు
అలాగే ప్రతిచర్య ఓటమికి ప్రతిరూపమవదు
నాకు దక్కని నీపై ద్వేషంతో కోపమేం రాదు
దక్కితేనే ప్రేమని అంటే నామది ఒప్పుకోదు.

మంచువంటి మనసు మంటలురేపుతుంది
చెప్పుకుంటే తీరదని తెలిసినా భరించలేనిది
నా హృది వ్యధకాదు నీ జ్ఞాపకాల దొంతరది
నీ జ్ఞాపకాలే భాధిస్తే నిందను ఎవరిపై వేసేది.

42 comments:

  1. ప్రతిమౌనానికి అర్థం వ్యతిరేక భావంకాదు
    అలాగే ప్రతిచర్య ఓటమికి ప్రతిరూపమవదు..
    touching lines Padma Arpita garu... melancholy of a lovely heart...

    ReplyDelete
  2. mottam antaa baavundi chaalaa abhinandanalu

    ReplyDelete
  3. నిజమైన ప్రేమకు ప్రేమే తప్ప ద్వేషం తెలియదేమో చాలా బావుంది పద్మర్పిత గారు

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరన్నది....థ్యాంక్యూ

      Delete
  4. కవిత చాలా బాగుంది ఆ కవితలోని భావాన్ని ప్రతిబింబించేలా ఉంది చిత్రం

    ReplyDelete
  5. Replies
    1. welcome and thanks for visiting my blog

      Delete
  6. న్యూ స్టైల్లో బాగుందండి.

    ReplyDelete
  7. కవితాద్భుతం!
    బొమ్మ ఈసారి అర్ధం కాలేదు.

    ReplyDelete
    Replies
    1. ఒకే మనిషి రెండువిధాలుగా అలోచిస్తున్నట్లు చెప్పాలన్న నా ప్రయత్నం ఎక్కడో లోపించి ఉంటుంది అందుకే మీకు అర్థంకాలేదనుకుంటాను, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  8. Replies
    1. బాలేదా?:-)

      Delete
    2. ఐదారేడెనిమిది పంక్తుల్లో మీరు పలికించిన భావం నాకు చాలా బాగా నచ్చింది.

      Delete
    3. అహో....థాంకులు థాంకులు:-)

      Delete
  9. నవ్విస్తారు:).....ఏడిపిస్తారు:(

    ReplyDelete
  10. పద్మార్పితా బాక్ టు పెవీలియన్ లా ఉంది:-)

    ReplyDelete
    Replies
    1. నేనెప్పుడూ అక్కడే ఉన్నానండి:-)

      Delete
  11. మీ బాధలను భరించేందుకు మేము ఉన్నాము కదండి! మాపై మీ నిందలను వేసేయండి:)

    ReplyDelete
    Replies
    1. ఏదో అభిమానంతో అంటారుగాని నిందిస్తే తర్కిస్తారుగా:-)

      Delete
  12. Kadila Kadalila undi.. good one..! :)

    ReplyDelete
    Replies
    1. కదిలే కడలిలా అన్నారా....థ్యాంక్యూ:-)

      Delete
    2. no.. just kadalila annanu :)
      (Kadhila* kadalila..)
      but yeah kadhiley kadali laga kooda undi..

      Delete
  13. కవిత చాలా చాలా బాగుందండి ...

    ReplyDelete
  14. పద్మ ప్రియ నీ ప్రతి పెదవులతోను పదములతోను భావాలను పలికించగలిగిన వారు అతి కొద్ది మంది ఉంటారు, అందులో మీరు ఒకరు, మీరు రాసే ప్రతి పదం ఎంతో ఫీల్ తో రాస్తున్నారు అని నేను ఫీల్ అవుతున్నాను, మీకు తెలియకుండానే మీ చాల కవితలని నేను వాడుకుంటున్నాను

    ReplyDelete
    Replies
    1. సుస్వాగతం...నా బ్లాగ్ కి
      మీ అభిమాన స్పందనకు నెనర్లు

      Delete
  15. బాగుందండి ...

    ReplyDelete
  16. చిత్రం కొంచెం తికమక పెట్టినా కవితలోని ఒకే వ్యక్తిలోరెండు భావాలని వ్యక్తపరచిన విధానం ప్రసంశనీయం:-)

    ReplyDelete
    Replies
    1. తికమక పెట్టిదంటూనే తెలిపారుగా చిత్రంలోని భావాన్ని:-) థ్యాంక్యూ

      Delete
  17. The compulsory dichotomy in every individual is clearly portrayed here in well composed verse...Kudos

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for your complimentary comments.

      Delete
  18. భాధాకరమైన నిజాలు బాగున్నాయండి.

    ReplyDelete
    Replies
    1. భాధల్ని కూడా మెచ్చిన మీకు ధన్యవాదాలు.:-)

      Delete