అమ్మకానికో నవ్వు

అందరూ నవ్వుతుంటే లోకం ఎందుకు చింతిస్తుంది?
కొందరు గాయపడి నవ్వితే, నిరీక్షణలో నవ్వేది కొందరు
కలలసౌధాలలో ఖుషీగుంటే, నిజం జీర్ణించుకోక కొందరు
కొందరు కష్టాల్లో నవ్వెతికితే, మత్తులో నవ్వేది కొందరు
ప్రకృతి అందాల్లో ఆనందంగుంటే, విధికి బలై ఇంకొందరు
కొందరు మౌనంగా కళ్ళతో నవ్వితే, పైకి నవ్వేదింకొందరు
ఇన్నివిధాలుగా నవ్వుతున్నా తృప్తిలేదు ఎందుకని?
పలకరింపుగా నవ్వి పనులు చేయించుకునేది కొందరు
పనిలేనిదే పళ్ళికిలిస్తే పిచ్చివాడనుకునేది మరికొందరు
ఎదుటివారిని చూసి ఓర్వక ఏడవలేక నవ్వేది కొందరు
సుఖఃధుఃఖాలను ఒకటేనని తలచి నవ్వేది అతికొందరు
ధీనమైన పేదనవ్వుని సొమ్ము చేసుకునేవారు కొందరు
భావాలకి అద్దమైన నవ్వు, నిజాల్ని కప్పే ముసుగైనది
మంచో చెడో కానీ నవ్వు నేడొక వ్యాపార సాధనమైనది!

40 comments:

  1. Very well written. Totally agree! Nice one padmarpita garu.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for your inspiring words mam.

      Delete
  2. నిజమో కాదో తెలీదు కానీ పద్మార్పిత నవ్వు మాత్రం కల్తీలేనిదనే అనుకుంటాను మీ రాతలు మీ కళాహృదయాన్ని చూసి...:-) నా నవ్వు కూడా అంతే.





    ReplyDelete
    Replies
    1. సృజనగారు....మనిద్దరం ఒకగూటి పక్షులమే....హాయిగా నవ్వేద్దాం రండి :-)

      Delete
  3. చాలా బావుంది... మీకు ధన్యవాదాలు...

    మీకు సమయం దొరికినపుడు మా బ్లాగ్ ను కూడా ఒక చూపు చూడండి. :)

    ధన్యవాదాలు,
    తరుణ్,
    www.techwaves4u.blogspot.com (తెలుగు లో టెక్నికల్ బ్లాగు )

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు....నా బ్లాగ్కు విచ్చేసినందుకు మనస్పూర్తిగా నాలుగు నవ్వులు :-)

      Delete

  4. పద్మార్పిత గారు,

    "నవ్వు నేడొక వ్యాపార సాధనమైనది" !

    హమ్మ, 'కాణీ' కో నవ్వు అంటారు ! సరే నండీ !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారికి నా నవ్వులు మాత్రం ఫ్రీగానే.....అమ్మితే ఇంకేమైనా ఉందా! :-)

      Delete
  5. నవ యుగంలో నవ్వు అలానే ఉంది. తిట్టడానికి,ఒర్వలేనితనానికి అన్నిటికి ఇప్పుడు నవ్వు అనే అస్త్రం వాడుతున్నారు. బహుశ మన లోకం Laugh More to be healthy అనే సైకలాజికల్ థీమ్ ని follow అవుతున్నారు. Navvu gurinchi chala baga rasaru...

    ReplyDelete
    Replies
    1. రాను రాను ఇంకా కృత్రిమత్వం ఎక్కువై అవసరమైనప్పుడు నవ్వుని అడుక్కోవలసి వస్తుందేమో అనిపిస్తుందండి......
      అవి ఆలోచిస్తూ ఇప్పుడు మనం నవ్వడం మానేయడమెందుకు?
      అందుకే హాయిగా నవ్వేస్తే....భలేగుంది :-)

      Delete
  6. Srujana garu meerannadi nijame Padmarpitagaari navvulaa kaltee leni kalmashamleni navvu viriyaalani aasistu....

    ReplyDelete
    Replies
    1. వర్మగారు మీ అభిమానానికి కృతజ్ఞతలండి.....ఎవరైనా నిస్వార్ధంగా మనస్ఫూర్తిగా నవ్వితే భలే బాగుంటారుకదా!

      Delete
    2. మీరన్నది అక్షరాల నిజం వర్మగారు. అలా నవ్వడం అందరికీ రాదు.

      Delete
  7. చాలా బావుంది...

    ReplyDelete
    Replies
    1. శృతి....మీకో బిగ్ స్మైల్ :-)

      Delete
    2. thank u:-)) super ga undi mee smile...

      Delete
  8. మీరు ఏడుపుకి కూడా నవ్వులు నేర్పగల సమర్ధులు పద్మార్పితగారు.

    ReplyDelete
    Replies
    1. ఏడ్చేవాళ్ళని నవ్విస్తే....అంతా నవ్వులే కదా :-)

      Delete
  9. Very true..
    "ఎదుటివారిని చూసి ఓర్వక ఏడవలేక నవ్వేది కొందరు"
    ఇలాంటివారెందరోనండి..
    ఎప్పటిలాగే క్రియాత్మకం..:)

    ReplyDelete
    Replies
    1. లెక్కకు మించే ఉన్నారనేది వాస్తవం.....వారిని నవ్వించే ప్రయత్నం చేద్దాం :-)

      Delete
  10. తర్కానికి చిక్కనిది ఈ నవ్వొటే పద్మగారు.:)

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య....తర్కించకుండా నవ్వేయండి :-)

      Delete
  11. చాలా బాగా వ్రాసారండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలతో ఒక స్మైల్:-)

      Delete
  12. నువ్వు కాక వేరెవరు నవ్వలేరు వెన్నెల లాగా
    నువ్వులేక పున్నమి కూడా నవ్వలేదు వెన్నెల వేళ
    అని ఎక్కడో చదివిన గుర్తు.
    మీ కవిత ఒక వాస్తవం.

    ReplyDelete
  13. రవిశేఖర్ గారూ...చాలా కాలానికి విచ్చేసారు చక్కని వ్యాఖ్యతో...నమస్సులతో నవ్వులు కూడా :-)

    ReplyDelete
  14. మీరు ప్రొఫైల్ పిక్ మార్చినందుకు కించిత్ బాధపడినా....ఇది బాగుందని నవ్వేస్తున్నా మీలాగే :-)
    (మీరు పాత ప్రొఫిల్ పిక్ ని వేరెవరో ఫేస్ బుక్ లో వారి ప్రొఫైల్ పిక్ గా ఉపయోగిస్తుంటే చూసి చాలా భాధగా అనిపించింది,మీకు తెలుసో లేదో అనుకున్నా).

    ReplyDelete
    Replies
    1. అనికేత్...అవునండి నేనుచూసాను,
      అందుకే ఇలా మార్చాను.

      Delete
  15. టైటిల్ చూసి నవ్వుని లిమిట్ గావాడి మంచి బేరమొస్తే అమ్మేద్దాం అనుకున్నా....
    ఈ కవిత చదివాక కల్మషంలేని నవ్వు అందరికీ అబ్బే కళకాదని తెలుసుకున్నా...
    అందుకే ఇంక నుండి నవ్వుతూ నవ్విస్తూ బ్రతికేయాలని నిర్ణయించుకున్నా....
    అమ్మో నాకూ మీలా కవిత్వమొచ్చేస్తుందండోయ్..:-)

    ReplyDelete
    Replies
    1. మా పార్టీయేగా...నవ్వు నవ్వించు పాలసీ బాగుందండి :-)

      Delete
  16. నవ్వు పలు విధాలంటారు. ఇంతకీ మీకే నవ్విష్టం:)

    ReplyDelete
    Replies
    1. నలుగురిని నవ్విస్తూ నేను నవ్వులపాలుకాని నవ్వంటే ఇష్టమండి. అందుకోండి అలాంటిదే ఒక నవ్వు మీకోసం :-)

      Delete
  17. ఒకవేళ "నవ్వు నాలుగు విధాలా చేటు" అనేమో. అదే ఒకరి సంతోషం నలుగురికి దఃఖమే కదా ఈ లోకంలో...
    నేటి నవ్వుపై నిక్కచ్చిగా కవిత రాసి ఇదుగోండి మాకూ తెప్పించారు.
    ;)
    నమ్మకానికేనండోయ్ ఇది అమ్మకానికి మాత్రం కాదు ;)

    ReplyDelete
    Replies
    1. :-) :-) :-)మీకు కూడా ఏ మర్మమెరగని మల్లెలాంటి నవ్వు.

      Delete
  18. నవ్వు లో విభిన్న రకాలు ..అవి వింత వింత భావాలు ..
    చాలా బాగా రచించారు

    నవ్వు సంతోషానికి వేదిక
    నవ్వు ఒక ఆనంద దీపిక
    కల్మషం లేని నవ్వు వెనుక ఎన్నెన్నో కలలు
    కరడుగట్టిన నవ్వు వెనుక ఎన్నెన్నో కథలు

    ఇవి నా భావాలు :)

    మంచి కవిత కు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. అస్వాధించి అభినందించిన మీకో నవ్వు దొంతర :-) :-) :-) :-)

      Delete
  19. నవ్వాల్సి వచ్చి నవ్వేది కొందరు ( boss దగ్గర assistants)
    నవ్వులు ఇవ్వాల్సి వచ్చేది కొందరికి (front desk లో receptionist)
    ఇవన్ని తెలిసి తెలీనట్టుగా నవ్వు లో దాగుండేదే నిర్లిప్తతో కూడిన నవ్వు ....
    నవ్వుని నమ్ముకున్ని అమ్ముకోవాల్సి వచ్చిన వాళ్ళు ఎక్కువే ...

    బాగుందండి !!

    ReplyDelete
    Replies
    1. నవ్వుపై మీ భావాలు బాగున్నాయండి....

      Delete
  20. మనిషిగా బతకగలిగితే నవ్వటం తేలిక.. బతకటానికి మనిషిననే మరిస్తే నవ్వటమే మరచిపోతాం. నేటి సమాజం బతకడానికి జీవిస్తున్నది కాని, మనిషిగా జీవించడానికి, జీవించనీయటానికి కనీస అవసరం అయినటువంటి, "అసలు చదువు" లేదు కదా.. ఆత్మగౌరవంతో నడచే మనుషులకు, ఢిల్లీ నో, హైదరాబాదో.. సొంత మనుషులు, సొంత వూరు కంటే ఎక్కువా ? [I am in US.. :( :( .. ]

    సహజం కానిది ముఖ్యమైతే.. తర్వాత అంతా అసహజమే కదా!! నవ్వో, ఏడుపో రెండూ నటనే..

    ReplyDelete
    Replies
    1. మీ అమూల్యాభిప్రాయానికి చిరునవ్వుతో నెనర్లండి.

      Delete