నేనే తన ప్రాణమంట నేనంటే పడిచస్తాడు
నలుగురిలో అలుసు చేయకన్నా వినడు
నన్ను ప్రేమించానంటూ నా వెంటపడతాడు
నన్ను వీడమన్నా పోని జగమొండివాడు
గాయమైన నా మనసుకి లేపనం రాస్తాడు
పిల్లగాలులు అల్లరిచేస్తే మందలించే తోడువాడు
నా కళ్ళలో తనువులో శ్వాసలో కౌగిలిలో వాడు
పాటై ఓమారు కవితై మరోమారు నను తాకినాడు
కోపంలో పరుషమాటలాడనీయని మౌనమౌతాడు
అలవికానిచోట అధిక్యత ఏలంటూ అణచివేస్తాడు
స్నేహితుడిలా పోట్లాడి శత్రువన్నా దూరంకాడు
పగలు దూరమైనా రేయంతా నన్నంటి ఉంటాడు
ఇంతలా నన్ను అల్లుకుని నాకే సొంతమైనోడు!!!!
ఏవరో కాదు "ఒంటరితనం" వాడే నా ప్రియుడు:-)
నలుగురిలో అలుసు చేయకన్నా వినడు
నన్ను ప్రేమించానంటూ నా వెంటపడతాడు
నన్ను వీడమన్నా పోని జగమొండివాడు
గాయమైన నా మనసుకి లేపనం రాస్తాడు
పిల్లగాలులు అల్లరిచేస్తే మందలించే తోడువాడు
నా కళ్ళలో తనువులో శ్వాసలో కౌగిలిలో వాడు
పాటై ఓమారు కవితై మరోమారు నను తాకినాడు
కోపంలో పరుషమాటలాడనీయని మౌనమౌతాడు
అలవికానిచోట అధిక్యత ఏలంటూ అణచివేస్తాడు
స్నేహితుడిలా పోట్లాడి శత్రువన్నా దూరంకాడు
పగలు దూరమైనా రేయంతా నన్నంటి ఉంటాడు
ఇంతలా నన్ను అల్లుకుని నాకే సొంతమైనోడు!!!!
ఏవరో కాదు "ఒంటరితనం" వాడే నా ప్రియుడు:-)
wow something is there in your poetry which attracts people like me who are least intrested in poetry. A Bow to your style
ReplyDeleteOh....your comments are secret(boost) for my poetry:-)thank you.
Deleteనిజమే... నా ప్రేయసి కూడా
ReplyDeleteఔనా... ఇద్దరూ కలిస్తే "ఒంటరితనమే" మళ్ళీ:-)
Delete+1
ReplyDelete-1 ani yeppudu ankandi please
Deleteఅనుకున్నా ఇలాంటి మనసుకి హత్తుకునే సరికొత్త స్టైల్ తో ఈరోజు కవిత రాస్తారని....కుడోస్
ReplyDeleteఓహో....ఎంత అభిమానంతో కూడిన నమ్మకమో! :-)
Delete:) :) nice Expression.
ReplyDelete:-) thanks a lot.
Deleteఏమండి ఒంటరితనం గారు పద్మగారికి కూసింత వినోదాన్ని పంచవచ్చు కదా...
ReplyDeleteవినోదాన్ని పంచడానికి వినోద్ లాంటి మిత్రులుండగా పద్మ ఒంటరితనాన్ని పట్టించుకోదండి...
Deletebaavundi madam
ReplyDeleteThank you sir.
DeleteSimply Super...:).Very Touching..
ReplyDeleteకవితలా తాకిన ,,ఓ 'ఒంతరితనమా' పద్మ గారు దగ్గర ' బందీ' ఐపోకేం..
ReplyDeleteఏంటో! నా ప్రియుడ్ని దోచుకుపోవాలన్న కుట్రలో ఉన్నట్లున్నారు....:-)
Deletevery very nice
ReplyDeletethanks a lot.
Deleteఅర్పితగారు ప్రస్తుతానికి మీ ప్రియుడు నాతోనే ఉన్నాడు:-)
ReplyDeleteఇలా ఎంతమందితో ఆడుకుంటాడో మరి:-)
Delete
ReplyDeleteఒంటరి తుంటరి కొంటరి చేతపోటరి
జూటరి పద్మార్పిత తూటరి !
దిట్టరి , నీటరి నెరయొంటరి !
పాటరి పోటరి బంటరి
ఈ మీనమునకు మేటరి మీలవేటరి !
చీర్స్
జిలేబి.
తిట్టారో
Deleteమొట్టరో
మెచ్చారో
తెలీదు...కానీ
మీరు మాత్రం
మహాతుంటరి :-)
"కోపంలో పరుషమాటలాడనీయని మౌనమౌతాడు " ఇదొక్కటీ చాలు మీ కవిత్వాన్ని అభిమానందా చదవడానికి.
ReplyDeleteమీ అందరి అభిమానమే అలా రాయిస్తుందండి....ధన్యవాదాలు.
Deletesuper padma, ekkadinundi vastayandi inni padaalu, mee kavitalu chaduvutunnapudalla telugu inka special gaa anipistundi, kevvu keka:-))
ReplyDeletethank q శృతిరుద్రాక్ష్ :-)
Deleteమీ ప్రియుడిగా ఒంటరితనం జన్మ ధన్యం :-)
ReplyDeleteవాడి జన్మధన్యమో...లేక నా పూర్వజన్మ....:-)
Deleteస్నేహితుడిలా పోట్లాడి శత్రువన్నా దూరంకాడు
ReplyDeleteపగలు దూరమైనా రేయంతా నన్నంటి ఉంటాడు...
ఇంత బాగా ఎలా రాసేస్తారో?? అనిర్వచనీయం పద్మ గారూ... అభినందనలతో...
ఇలా పొగిడితే!!! కూసింత గర్వం పెరిగి ఒంటతితనాన్ని మరింత ప్రేమిస్తానేమోనండి వర్మగారు :-)
Deleteపద్మార్పిత...ఇది అన్యాయం "ఒంటరితనం" కూడా నీవెంటేనంటే ఎలాగమ్మడూ :-)
ReplyDeleteఅభియోగమా లేక అభిమానమా సృజనగారు :-)
Deleteఒంటరి తనం గురించి కవితాత్మకంగా చాలా బాగా చెప్పారు ,అయినా మీ కవిత్వాన్ని పొగిడేంత తెలివితేటలు నాకు లేవనుకోండి.అయినా కొంచం ఆస్వాదించగలను.
ReplyDeleteథ్యాంక్సండి.....తెలివితేటలతో పొగడాలా ఏంటండి!
Deleteమీ ఆస్వాదనలోని అభిమానాన్ని గమనించానండి.
ఒంటరితనం లో ఎన్నెన్ని వర్ణాలో !
ReplyDeleteaunandi ,:-)
ReplyDelete