ముడిపడని వివాహానికేనా విడాకులు
విచిత్ర స్నేహానికి అక్కర్లేదా ఏ ఆర్జీలు??
విచిత్ర స్నేహానికి అక్కర్లేదా ఏ ఆర్జీలు??
ఆడా మగా అంటూ స్నేహపు లింగబేధాలు
కోరికల్ని నియంత్రించలేక వీడిన నిగ్రహాలు
నలుగురిలో ముసుగు వెనుక దాపరికాలు
ఆకలితీర్చి అక్కరకాని అరటిపండుతొక్కలు
ఇరువురి నమ్మకానికి ఏవేవో సిఫార్సులు
ఆ నిగూఢ స్నేహానికి ఇచ్చేయి విడాకులు
మనసువిప్పి చెప్పలేనిదెందుకీ స్నేహాలు??
మనసులు కలవక కలసిన తనువులు
వివాహబంధంలో వీడితే అది విడాకులు
మనువుకాని తనువుల్ని కలిపే స్నేహాలు
ఎవరూ హర్షించని అక్రమసంబంధ బేడీలు
చీకటిమాటున సాగే రంకు రాచకార్యాలు
ఎదిరించి ఎదగలేనివీ కలుపు మొక్కలు
ఈ స్నేహానికీ అవసరమేకదా విడాకులు??
కోరికల్ని నియంత్రించలేక వీడిన నిగ్రహాలు
నలుగురిలో ముసుగు వెనుక దాపరికాలు
ఆకలితీర్చి అక్కరకాని అరటిపండుతొక్కలు
ఇరువురి నమ్మకానికి ఏవేవో సిఫార్సులు
ఆ నిగూఢ స్నేహానికి ఇచ్చేయి విడాకులు
మనసువిప్పి చెప్పలేనిదెందుకీ స్నేహాలు??
మనసులు కలవక కలసిన తనువులు
వివాహబంధంలో వీడితే అది విడాకులు
మనువుకాని తనువుల్ని కలిపే స్నేహాలు
ఎవరూ హర్షించని అక్రమసంబంధ బేడీలు
చీకటిమాటున సాగే రంకు రాచకార్యాలు
ఎదిరించి ఎదగలేనివీ కలుపు మొక్కలు
ఈ స్నేహానికీ అవసరమేకదా విడాకులు??
పాజిటివ్ అని వచ్చాక ఈ నెగటివ్ థాట్స్ అవసరమా పద్మర్పిత గారు ?
ReplyDeleteపాజిటివ్ అయినా నెగటివ్ అయినా థాట్స్ మాత్రం అందరికీ అవసరమేకదండీ...రవిగారు:-)
Deleteమనువుకాని తనువుల్ని కలిపే స్నేహాలు
ReplyDeleteఎవరూ హర్షించని అక్రమసంబంధ బేడీలు...
మీరన్నది ముమ్మాటికి నజమెనండీ. కొన్ని పరిచయాలు స్నేహాలు క్రమంగా మారి ఇలా కలుపు మొక్కలుగా మీరన్నట్టు మిగిలిపోవచ్చు. ఈ స్నేహాలకు విడాకులు తప్పనిదే అయినా ఆ బంధాలు సామాజిక చట్రంలో కలవని రైలు మార్గంలా మిగిలిపోతూంటాయి. ఏదీ సంపూర్ణత్వం కానీ ఒక తత్వం మనిషిని వెన్నాడుతూనే వుంటుంది.
అంతా ఆలోచించాల్సిన పోస్ట్ తో అలరించారు. అభినందనలతో..
అందరూ ఆలోచించమంటే ఆలోచించి అవలంభిస్తారేమో వర్మగారు.:-)
Deleteమీ ఆలోచల్ని షేర్ చేసి అభినందించిన మీకు ధన్యవాదాలండి.
చాలా చక్కగా చెప్పారండి
ReplyDeleteకలుషిత స్నేహాల గురించి.
మన సంప్రదాయాల్లో ఈ
pubలు valentines దినాలు
అవసరమా?
మెచ్చిన మీకు ధన్యవాదాలండి.
Deleteమీరన్నట్లు ఈరోజుల్లో బూటకపు స్నేహాలే అధికం, వీళ్ళతో స్వచ్చమైన స్నేహం కూడా బూటకమైపోయింది. చాలా బాగాచెప్పారు
ReplyDeleteమీరన్నది నిజమే Yohanth
Deleteపద్మార్పితగారు ఈ మధ్య కొత్త కొత్తగా ఉన్నారు:-)
ReplyDeleteకొత్త కొత్తగా బాలేనా:-)
Deleteభావం అత్యధ్బుతంగా వుంది....
ReplyDeleteమొదటి భాగం లో విడాకులు అని వాడకుండా , ఇలా అంటే ఎలా వుంటుంది
"ఆ నిగూఢ స్నేహానికి వచ్చాయి తలవంపులు"
...చివర మాత్రమె 'విడాకులు' అనే మాట వాడి వుంటే బలం పెరిగేదేమో...
రెండవ భాగం లో "ఎదిరించి ఎదగలేనివీ కలుపు మొక్కలు" భావం ని
"పచ్చదనం కరువయిన ఎండుటాకులు ..." అంటే ఎలా వుంటుంది ...
చీకటిమాటున అని అనేసారు కాబట్టి 'రంకు' అనే పదం నివారించ వలసినది.
"చీకటిమాటున సాగే 'అ'రాచకార్యాలు" అంటే సాత్వికత ఎలివెట్ అయి వుండేది..
(నా అభిప్రాయం మాత్రమె ఇది ...... గుర్రుగా చూసి గద్దించరు కదా !!)
చాలా చాలా బాగుంది మీ భావం.....
నా బ్లాగ్ కి విచ్చేసిన మీకు సుస్వాగతం.....
Delete...బలాబలాలేమో కానీ నాకు మాత్రం ప్రాసపై కూసింత అధికమైన ప్రేమండి.
...ఎండుటాకులైతే రాలి అవే ఎగిరిపోతాయి, కలుపు మొక్కల్ని మనమే పీకి పారేస్తాం పొలం పాడైపోతుందని.....ఆ భావం రావాలని నా ప్రయాస.
...రోడ్డు మీద వెళుతున్నప్పుడు అక్కడక్కడా కంకరాళ్ళ కుదుపులుంటేనే కాస్త మజా కదా... సాఫీగా రాస్తే సాత్వికత ఎలివేట్ అయ్యేది కాని గుచ్చుకునేలా చెప్తే కాస్త తొందరగా నాటుకుంటుందనే నా పిచ్చి భ్రమలో మీ అభిప్రాయాన్ని త్రోసిపుచ్చి గుర్రుగా గద్దించనండి!!
థ్యాంక్యూ సోమచ్......
namaste madam.
ReplyDeleteare you trying to be a lyricist. if not, why to rhyme consciously in free verse/prose poetry. you are a poet with great sensibilities. aren't you madam.
Namaskaaram Sir,
DeleteThanks for your compliments and visiting my blog.
I am not at all trying to be an lyricist.....but every one as there own style of writing I thing. I concentrate more on rhythmic words and give preference to those words, I will try to over come from that.
namaste madam.
Deletethank you for your prompt response. please don't over come from what you like. pls overcome from what appears to be rhetoric. a small suggestion only.
Sure....thank q :-)
Deleteస్పష్టతుంటేనే బంధం
ReplyDeleteప్రేముమ్నంత వరకే ప్రేమికులు
స్నేహమున్నంతవరకే స్నేహితులు
మీరు వివరించే పరిస్తితిని అసలు స్నేహమనే అనరు... !! ఇక విడాకులా?
:(
స్పష్టంగా చెప్పి ఏబంధం లేనివారు లేరా?
Deleteప్రేమను చూపించే వాళ్ళంతా ప్రేమికులేనా?
స్నేహంలో బేధాభిప్రాయాలొస్తే మిత్రులనరా?
స్నేహమంటూ ఫ్రెండ్స్ అంటూ ముసుగులో గుద్దులాటలెన్నో!
:-)
ఇక్కడ స్పష్టత చాలా అవసరం
Deleteబంధం లో స్పష్టత వచ్చిన తరువాత విడిపోవ్డమనేదే వుండదు..
ఎడబాటు లో స్పష్టత వచ్చిన తరువాత కసిపోవడమనేదే అసలుండదు.
తీపి లేకుండా మిఠాయిలుంటాయా?
తీపున్నంత వరకే మిఠాయి...
స్పర్ధలు రాకూడని కాడు ... కాని అవున్నంత వరకూ స్నేహమైతే ఉండదు... అక్కడ వ్యకులున్నా స్నేహాలుండవు...
కాళ్ళు కడుక్కోకుండా లోనికి రాకూడదంటే... బయటి తిరిగి రావడం తప్పా అన్నట్టుంటుంది...
బయట తిరిగి రావడం తప్పు కాడు ...కాళ్ళు కడుక్కోక పోవడమే తప్పు...
కాళ్ళు కడుక్కోనంత వరకూ లోనికి రాకూడదు...అది అంతే...
స్పర్దలు రావడం సహజం... స్పర్దలున్నతవరకూ స్నేహాలుండవు...
వాటిని మనసులో పెట్టుకున్నంత వరకూ దానిని గుద్దులాట అంటారేమో గాని స్నేహమనరు?
ఇక్కడ స్పష్టత చాలా అవసరం
-satya :):)
baga chepparandi:)) img bagundi.. sneham prema ane bandham lo chatu matu vyavaharala gurinchi nijam chepparu..
ReplyDeletethank you sruthi.....naa bhaavaanni nachchi mechchina meeku.
Deleteకొన్ని సత్యాలని గుప్పిట్లో దాస్తేనే అందరికీ నచ్చుతాయనిపిస్తుంది మీ పోస్ట్ కమెంట్స్ చూస్తుంటే:) నాకు మాత్రం నిగ్గదీసి అడిగారు కదా నచ్చేసింది.
ReplyDeleteనిజమేనేమో.......గుప్పిట్లోనే గుంబనంగా ఉంచాల్సింది :-)
Deleteపద్మార్పితగారూ తర్కించడం మాకువదిలేయొచ్చుగా
ReplyDeleteఆ.....ఏదోలెండి, మీ తర్కం ముందు నేనేపాటి:-)
Deleteఏమిటో నండీ , ఈ మధ్య పద్మార్పిత గారు ఒక్క ముక్కా అర్థం కాకుండా రాస్తున్నారు !
ReplyDeleteజిలేబి.
అన్నీ తెలిసిన అదృష్టవంతులండి మీరు....అందుకే అర్థంకాలేదేమో ఈ అల్పజీవి వ్రాతలు :-)
Deleteకలుపు మొక్క స్నేహాలకి విడాకులేమిటండి చోద్యంగా ;)
ReplyDeleteవీటికి స్నేహం అని పేరు పెట్టీ ఆ పదాన్ని అవమానించకూడదు.
విడాకులకి కూడా ఒక నీతి ఉంది. ఎప్పుడయినా ఒకసారి ఒకరితోనే బంధం ఉంటుంది.
ఆ లెక్క, హద్దులు ఈ అరటి--తొక్కలో 'స్నేహాలకీ ఉండవు కదా?
అవినీతి పనిలో నీతి నిజాయితీ వెదకలేము కదా ;)
మరొక పలాయన వాదమే 'గోయింగ్ స్టెడీ వైల్ డేటింగ్'.
అన్నట్లు ఈసారి పైటింగ్ సరిగా కుదిరింది ;)
ఎంతో శోధించి చెప్పినట్లున్నారు:-) బాగుంది....థ్యాంక్యూ!
Deleterevolutionary padmarpita :-)
ReplyDeleteబాగుందండి పద్మార్పితగారు, ఇటువంటి అక్రమ స్నేహితులు నిజంగా విడిపోతార? దాన్ని స్నేహమానాల?... just doubt it?
different essence of poetry from your pen, i like it.
Thanks,
Ramesh
అక్రమ స్నేహాల బంధం విడిపొక తప్పదెప్పటికైనా...
Deleteఅందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ విడాకులు:-)
Thanks for liking it.....
అలాంటి బంధాల్లో ముడిపడనేకూడదు....పడితే వెంటనే విడాకులిచ్చేయడమే బెస్ట్ :-)
ReplyDeleteThanks for supporting me and commenting too.
Delete