మెదడుదారి మళ్ళించి ప్రేమించరాదనుకున్నా
చూపుద్వారం ద్వారా మనసుని చేరింది ప్రేమ
మనసుబాటగా పయనించి మెదడుమాట విన్నా
భావోధ్వేగాల నడుమ కొట్టుమిట్టాడుతుంది ప్రేమ
ప్రేమ మత్తులో మునిగి తేలుతూ తెలుసుకున్నా
ఈ వ్యసనానికి నేను కూడా బానిసనైనానే ప్రేమ
ఇంత కఠినత్వమెందుకో దీనికి తెలుసుకోలేకున్నా
ప్రేమికుల వేదనతో అభిషేకించినా కటాక్షించని ప్రేమ
నన్నునేను ధ్వేషించుకుంటూ దూరమవ్వాలనుకున్నా
నాలోని ద్వేషాన్ని తొలగించే శక్తి కూడా నీకున్నదే ప్రేమ
ఇలా మనిషిలో మారుతున్న మనస్తత్వాన్ని చూస్తున్నా
ఇంక లోకమంతా నీ మయమేనని ఏమనుకోను ప్రేమ!

ReplyDeleteనాలోని ద్వేషాన్ని తొలగించే శక్తి కూడా నీకున్నదే ప్రేమ...
ఎంత చక్కటి భావవ్యక్తీకరణ...
బాగుందండి.
ప్రతి పలుకూ భావగర్భితం... ప్రతి మాటా అక్షర సత్యం.... ఎంతో ఉన్నతమైన కవిత....
ReplyDeleteSimply Superb...no one can express like this, claps claps
ReplyDeletevery very nice & super Padma:))- Your toooooo goooood..........
ReplyDeleteప్రేమామృతపు గుళిక :-)
ReplyDeleteప్రేమపై ఎన్ని కవితలు రాసినా మీకు తనివి తీరదా...
ReplyDeleteఇంత కఠినత్వమెందుకో దీనికి తెలుసుకోలేకున్నా
ReplyDeleteప్రేమికుల వేదనతో అభిషేకించినా కటాక్షించని ప్రేమ
నన్నునేను ధ్వేషించుకుంటూ దూరమవ్వాలనుకున్నా
నాలోని ద్వేషాన్ని తొలగించే శక్తి కూడా నీకున్నదే ప్రేమ
these lines excellent
wow
ReplyDeleteమీ జగమంతా ప్రేమమయమే పద్మార్పితగారు.....మీకు మేం చెప్పగలం :)
ReplyDeleteనన్నునేను ధ్వేషించుకుంటూ దూరమవ్వాలనుకున్నా
ReplyDeleteనాలోని ద్వేషాన్ని తొలగించే శక్తి కూడా నీకున్నదే ప్రేమ....
ఈ శక్తి ద్విగుణీకృతం కావాలనీ మనసులో ప్రేమ నిలవాలనీ కోరుకుంటూ..
అద్భుతమైన భావ చిత్రణ.. అభినందనలతో...
ద్వేషాన్ని తొలగించే శక్తి కూడా ఉన్నదే ప్రేమ... ప్రేమ భావాలు బాగా పలికించారు కవితలో. ఒక ద్వేషం కి వత్తు పొరబాటేమో చూడండి.
ReplyDeleteస్పందించి వ్యాఖ్యలతో ప్రోత్సహిస్తున్న ప్రతిఒక్కరికీ ప్రణామం!
ReplyDeleteఅమ్మకంటే అమ్మమ్మ మీద ప్రేమెక్కువైంది మీకు..తెలుగు కవిత రాసి ప్రణామం చెప్తారా.. ధనియాలు చెప్తే సరిపోతుందేమో!!
ReplyDeleteప్రేమికుల వారం పొరపాటున కాలుపెట్టానేమో..హ హా
ReplyDelete