నాతో నీవు

ప్రేమంటూ నిన్ను మోసగించినా
నీ నమ్మకాన్ని వమ్ముచేసినా..
కలవరపడి కుమిలిపోకు నీవు!
నిన్ను గులాబీలతో పోల్చుకో..
తనని త్రుంచినవారిని వేరొకరితో
ప్రేమగా కలుపుతుంది తెలుసుకో!

మనసు నుండి తొలగించాలనుకుంటే
ముందుగా మనసులో ముద్రించుకో..
తప్పులనెంచి నిందించాలనుకుంటే
ముందుగా నీ తప్పుని నీవు సరిచేసుకో!
ప్రాణమెందుకు తీస్తావు నాచేయి విడచి
జీవితాన్ని చూపించు నీచేయి నాకందించి!

31 comments:

 1. తనని త్రుంచినవారిని వేరొకరితో
  ప్రేమగా కలుపుతుంది తెలుసుకో!

  చాలా బాగా చెప్పారండీ!

  ReplyDelete
  Replies
  1. చాన్నాళ్ళకి......ధన్యవాదాలు!

   Delete
 2. చాలా బాగుంది, భావాలు మదిని కదిలించాయి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి!

   Delete
 3. చాలా బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు!

   Delete
 4. మొత్తానికి మీదైన స్టైల్లో మరో కవిత...బాగుంది పద్మార్పిత.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ యోహంత్!

   Delete
 5. చాలా భావాలు చూపారీ కవితలో... బావుంది!
  మనసు నుండి తొలగించాలనుకుంటే
  ముందుగా మనసులో ముద్రించుకో..
  నిజమే, కానీ ఒకసారి మనసులో ముద్రిస్తే అది తొలగించటం సాధ్యపడదే!
  చిన్న సవరణ, నింధించాలనుకుంటే...వత్తు ధ కాదేమో...

  ReplyDelete
  Replies
  1. చూసి సవరించమన్న మీకు ప్రత్యేక వందనాలు. సరిచేసాను. థ్యాంక్సండి.

   Delete
 6. బొమ్మ చాలా అందంగా ఉంది మీరేవేశారా?

  ReplyDelete
  Replies
  1. బొమ్మ నాకు కూడా చాలా నచ్చిందండి. నేను వేయలేదు, గూగులమ్మ చలువ:-)

   Delete
 7. ప్రేమ లో ఓడిన వారికి సైతం కావాలి మనోధైర్యం
  మరో మధురమైన ఆకాంక్ష కొరకు సాగాలి ఆ పయనం
  ప్రేమ ఒక్కటే జీవితం కాదు
  భగ్న హృదయాలకు కూడా జీవితం ఉందని చెప్పినట్లుంది ఈ కవిత

  ReplyDelete
  Replies
  1. భావాన్ని అర్థం చేసుకుని స్పందించిన మీకు అభివందనాలు.

   Delete
 8. ప్రేమలో దాగిన తత్వాన్ని ప్రేమతో చెప్పారు ప్రేమా(పద్మ)ర్పితగారు:)

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ అనికేత్

   Delete
 9. ప్రాణమెందుకు తీస్తావు నాచేయి విడచి
  జీవితాన్ని చూపించు నీచేయి నాకందించి!

  ఇలా మీరే రాయగలరు పద్మార్పిత గారూ... అభినందనలతో..

  ReplyDelete
  Replies
  1. భావగర్భాన్ని చవిచూసి అస్వాధించి స్పందించే మీకు నెనర్లండి.

   Delete
 10. గులాబీల గూరించి కొత్త విషయాలు నేర్చుకున్నాండి మీ దయ వల్ల :-)
  చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. మీకు నేర్పించే శక్తి నా భావాలలో దాగినందుకు బహు ఆనందమయము:-)

   Delete
 11. పద్మార్పిత చిత్రం చాలాబాగుంది. నాకు ఈ పోస్ట్ తో ఒక స్మృతిపధం గుర్తుకొచ్చింది:-) రాసేస్తానుగా!

  ReplyDelete
  Replies
  1. మరింకెందుకు ఆలస్యం.....పోస్ట్ బహుపసందుగా రాసేయండి:-)

   Delete
 12. చక్కగా చెప్పారు.
  చిత్రం చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. స్పందించిన మీకు అభివందనాలు.

   Delete
 13. Chaalaa Baagundi padmarpita gaaru..:)

  ReplyDelete
 14. dhanyavadalu Dhaatrigaru :-)

  ReplyDelete
 15. బాగుందండి.
  అచ్చంగా ఆ బొమ్మని నాకిచ్చేయొచ్చుగా:-)
  ReplyDelete
  Replies
  1. మీకన్నానా:-) తీసుకోండి!

   Delete
 16. గులాబి బాగుంది కదాని ప్రేమగా దగ్గరకు తీసి గుండెళ్ళో పెట్టుకుంటే ఆ ముళ్ళూ గుచ్చుకొన్నాయ్ ప్రేమించాక ఏదైనా బరించాలి తప్పదుకదా,,,,?

  ReplyDelete