నచ్చడంలేదు!

నాకు అస్సలు నచ్చడం లేదు
గాలితెమ్మెరై కురులు చెరపడం
చిలిపి ఊహల్ని నామదిన రేపడం
కంటిచూపుతో కట్టివేసాను అనడం
కంటినిండా నీరై సుడులు తిరగడం!

ఇలా చేయడం భావ్యం కాదు
అలలా తాకి అలా వెళ్ళిపోవడం
తలచిన తనువు పులకరించడం
కౌగిలిలో బంధీనని బుకాయించడం
పలుకులకే అది పరిమితం కావడం!

నీకు ప్రేమించడం అస్సలు రాదు
ఉఛ్వాసగా చేరి నిఛ్వాసగారావడం
అలిగినా నీవది గుర్తించలేకపోవడం
నానీడగా ఉంటూ నాతో లేకపోవడం
ఇదేమిటంటే! ప్రేమకిదే పరిభాషనడం!

15 comments:

  1. నాక్కూడా..

    లేచి పోతానన్న ఓ మగువా!!... ఇలా కవితాలోకంలో విహరిస్తూ నీ తలపులిలా మా పై వెదజల్లుతూ అందరాని లోకంలో పులకింతల వెన్నెల కాయిస్తుంటే....నిను మెచ్చేదెలా.. దిగిరా దిగిరా..

    మీ బ్లాగు పుణ్యమా అని నాక్కూడా కవిత్వం వచ్చేసినట్టుంది..

    ReplyDelete
  2. నచ్చడంలేదని అలిగినా ప్రేమించాక తప్పుతుందా ఎన్ని అభాండాలేసినా?

    ReplyDelete
  3. నచ్చలేదంటూనే నచ్చేలా మెప్పించడం మీ స్పెషాలిటీ కదండి :)

    ReplyDelete
  4. ఒపెన్ చేసేటప్పటికి ఎన్నెన్నో వర్ణాలు అంటూ పలకరిస్తూ మంచి కవితలతో చాలా బాగుంటుంది మీ బ్లాగ్ .నాకు చాలా నచ్చింది

    ReplyDelete
  5. "Words mean nothing without actions to back them up"

    Chala bavundi me kavitha....and picture kuda chala bavundi :)

    ReplyDelete
  6. కెవ్వుమనిపించారు మీ ప్రేమ ఫీలింగ్స్ తో పద్మార్పితగారు.:-)

    ReplyDelete
  7. Wow chaala bagundi... super..

    ReplyDelete
  8. మీదైన భావలతో మనసుని అలరించారు. అభినందనలు.

    ReplyDelete
  9. కంటిచూపుతో కట్టివేసాను అనడం
    కంటినిండా నీరై సుడులు తిరగడం!

    ఇంత బాగా చెప్పి నచ్చడం లేదంటే ఎలా పద్మార్పిత గారూ..
    సర్దుకు పోవాలి మరి..:-)
    చాలా నచ్చిందండీ.. అభినందనలతో..

    ReplyDelete
  10. ఇంత చక్కటి భావుకత్వానికి నా అభినందనలు మీకు. అసలు కలల లోకానికి మించింది ఇంకేం ఉంటుందండి....

    ReplyDelete
  11. వాలంటైన్ స్పెషల్ పోస్ట్ తో అదరగొడతారు బ్లాగ్ అనున్నాను....నిరాశే మిగిల్చారు:)

    ReplyDelete
  12. "నానీడగా ఉంటూ నాతో లేకపోవడం"
    Is that possible? ..... I got it now :-)

    బాగుందండి... మీ విరహ, ప్రేమ లవ్ ఇష్క్ related కవిత్వం, నాకు ఎప్పటికి డౌట్ మీరు పద్మార్పిత... పద్మనాభా... ప్రేమార్పిత (genderquestion)? just kidding...

    Good one!

    ReplyDelete
  13. ప్రోత్సాహకులందరికీ ధన్యవాదాలండి.

    ReplyDelete