ఆలోచించండి!

నమస్కారాన్ని "హాయ్" "హెల్లో" కబళించిందని
సంస్కారాన్ని "షేక్ హ్యాండ్" ఇచ్చి విధిలించకండి!

అమ్మానాన్నల్ని "మమ్మీ" "డాడి" దొంగిలించారని
ఆత్మీయత అనురాగాలని దూరం కానీయకండి!

గురుకులాల్ని "మిషనరీ స్కూల్స్" మింగేసాయని
గురువులని అగౌరవపరిచే బుద్ధిహీనులు కాకండి!

కల్లు "బీర్, బ్రాందీ, విస్కీ, జిన్" ల కన్నా మంచిదని
మత్తులో మునిగి చిత్తుగా మందుకొట్టి చిల్లరకాకండి!

మాటామంచిని "టీ.వీ, టెక్నాలజీలు" కబ్జాచేసాయని
అనుబంధాలని వీడి ఒంటరితనానికి బానిసలవకండి!

అన్నాన్ని అట్టును "నూడిల్స్, బర్గర్" లు మెక్కాయని
ఆరోగ్యకరమైన అహారాన్ని వదలి వాటికలవాటవకండి!

పాలవంటి పరంపరలు "కల్చర్-ఫ్యాషన్" లకి లొంగాయని
మానవత్వాన్ని మరచి మీ అస్తిత్వానికి మీరే మరువకండి!

పద్మార్పితా! "వాట్ ఈజ్ దిస్ లెసన్ " అని నన్ను ప్రశ్నించినా
ఇందులోని మర్మాన్ని గ్రహించి ఆలోచించి నన్ను తిట్టుకోండి!

36 comments:

 1. బాగుంది పద్మ గారు మీ లెసన్, ఇక తిట్టుకోవడానికి ఏముంది.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు డేవిడ్ గారు....పండ్లున్న చెట్టు పైనే రాళ్ళు రువ్వుతారన్న సామెత గుర్తొచ్చి అలా....:-)

   Delete
 2. చాల బాగా రాసారు .... భలేగా వుంది.
  ఇవిగో నా నుంచి రెండు పల్లీలు ...మీ పప్పుండలో ...

  'వార', 'మాస' పత్రికలని బ్లాగులు బాదిన్చేస్తున్న,
  మీ ఆత్మీయ నేస్తమయిన పుస్తకాన్ని వీడకండి..

  ReplyDelete
  Replies
  1. పప్పుండలో రెండు పల్లీలకు థ్యాంకులు....:-)
   నెక్ట్స్....వేడి వేడి సమోసాలు రెండు ఇవ్వండి!

   Delete
 3. total ga marindi. meru manchi chapina veney valu, chadevey valu takuva ga vunaru andi. iam fan of ur blog

  ReplyDelete
  Replies
  1. ఆ తక్కువే కొన్నాళ్ళకి ఎక్కువగా మారుతుందన్న ఆశాభావమండి :-)
   Thanks for it and be forever!

   Delete
 4. బాగా వ్రాసారు పద్మర్పిత గారు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి జ్యోతిర్మయిగారు.

   Delete
 5. మీలో మార్పేదో స్పష్టంగా కనపడుతున్నట్లుందే :)

  ReplyDelete
  Replies
  1. హమ్మయ్య....గుర్తించారన్నమాట:-) ధన్యవాదాలండి.

   Delete
 6. Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. " thank Q " .......

   చూసారా ... ఇక్కడ (క్యు) Q వచ్చి.. మిమ్మల్ని (You ని) మెంగేసింది ... :)

   ఎన్ననుకొన్నా కాలం తో పాటు మనము మారిపోతుంటాము .. మనకు తెలియకుండానే ... కదా ... !!!

   చాలా బాగా రాసారండి

   ధన్యవాదాలు

   తరుణ్ ప్రీతమ్
   http://techwaves4u.blogspot.in/

   తెలుగులో టెక్నికల్ బ్లాగు

   Delete
 7. తేడాలు బాగా వర్ణించారు. ఇంతకీ మీరు ఎటువైపు?

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి....మంచికీ మనుగడకీ మధ్యన ఊగిసలాడుతున్న:-)

   Delete
 8. బాగుంది పద్మ. simply super.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ శృతి.

   Delete
 9. Meeru yem cheppina super mam :-)

  ReplyDelete
  Replies
  1. Thank you Yohanth. Keep on writing.

   Delete
 10. పద్మార్పితా! వాట్ ఈజ్ దిస్ లెసన్? ;) కొంప తీసి సామాజిక స్రుహ పురుగు కుట్టలేదుకదా?
  కల్తీ కల్లు తాగి చనిపోయిన వాళ్ళని చూసాం కానీ వేరే చూడలేదు కదా?
  ఆ పైంటింగ్ కి కవితకి సంబంధం ఇంకా అలోచిస్తూనే ఉన్నా ;)
  Is everything alright? ;)

  ReplyDelete
  Replies
  1. ఇలా రాస్తేనేనన్నా మీరు ఆలోచించి ప్రశ్నిస్తారని :-)
   పురుగు కుడితే పర్వాలేదనుకుంటా....
   లోపల దొలుస్తుంటేనే ప్రాబ్లంకదా :-)
   ఆలోచించండి.....బోలెడన్ని సంబంధాలు సుడులుతిరుగుతాయి!
   అలోచించుకునేవాళ్ళకి అన్నింటిలో అర్థాలు అగుపిస్తాయండి:-)
   I am perfectly alright after reading your comments.
   Thanks for it my friend.

   Delete
 11. పద్మార్పితగారు మిమ్మల్ని తిట్టే సాహసం చేస్తే
  మంచిని గ్రహించిన వాళ్ళు నన్ను తిడతారండి:-)
  మిమ్మల్ని మెచ్చుకునేట్లు రాసే తెలివైనవారు!

  ReplyDelete
  Replies
  1. ఎవరో తిడతారనో ఏదో చేస్తారనో ఎందుకు తెలుగమ్మాయి....మీకు ఏమనిపిస్తే అది అనండి:-)

   Delete
 12. సూక్తులైనా సింపుల్ గా చెప్తావ్ పద్మా....అందుకే ఇలా మదిని దోస్తావు.

  ReplyDelete
  Replies
  1. అంతా మీ అభిమానం :-)

   Delete
 13. పెట్టాల్సిన వాతలు పెట్టి కాలిందా అని అడిగినట్టుందండీ..

  తిట్టుకోవడమెందుకు..
  బాగా చెప్తారుగా..
  అయినా తిట్టినా మీ ఫాన్స్ ఊరుకుంటారా?? :-)

  ReplyDelete
  Replies
  1. వాతలా....మీకా కవివర్మగారూ :-)
   మీరు ఫాన్ కాదన్నమాట :-(

   Delete
 14. Replies
  1. Dhanyavaadaalu

   [thank you kaadu]

   Delete