అలుగకే అక్షరమా!...... నేనేం రాయలేకపోతున్నానని
ఆవేశాన్ని అణచి అందమైన పదాలని దొంగిలించానని
వ్యధకి ముసుగేసి నవ్వుని పెదవులపై పులుముకుని
జీవన్నాటకంలో నన్నునేనే మోసగించుకుంటున్నానని!
అలుసుగా చూడకే ఓ! భావమా...... నువ్వు నేను కానని
నగ్నసత్యాలకి బూటకపు వస్త్రాలని కుట్టి తొడిగిన దర్జీనని
కాల్చనికుండకి మసిపూసి మోసగించిన కుమ్మరిని నేనని
ఆదర్శవంతమైన మాటలే కాని చేతల్లో చూపించడంలేదని!
అసువులుబాయకే ఓ నా అంతరంగమా!.... అవిటితనమని
అజ్ఞానపు ఇసుకరేణువుల బొమ్మని చెక్కుతున్న శిల్పినని

ఆశాంధినై గిల్టునగలకు మెరుపులు అద్దుతున్న కంసాలినని
అవసరాలనే పెట్టుబడిచేసుకున్న అసలుసిసలు వ్యాపారినని!
అబాసుపాలుగాకే నా కవిత్వమా!....అలరించలేకపోయానని
సమాజానికి నీతిసూక్తులు చెప్పి ఎవరిని రంజింపజేయాలని
అన్ని కోణాల్లో ఆలోచించాను నన్ను నేనే సరిచేసుకోవాలని
ప్రేమని పంచుతూ చిరునవ్వుతో సాగదీస్తున్నా జీవితనౌకని!

అక్షరాలతో అంతరంగంలోని భావాలను కవిత్వం గా రాసే మీలో సంఘర్షణ ...బాగుంది పద్మార్పిత గారు
ReplyDeleteనా అంతర్భావ సంఘర్షనలకి మొదటి వ్యాఖ్యిడినందుకు నెనర్లండి.
Deleteభావ కల్పితాలు అందముగా ప్రెజెంట్ చేయాలంటే ఇటీవల కాలంలో నే చూసిన వారిలో మీరే బెస్ట్ అండి....
ReplyDeleteyour way of presentation and expressions are always inspiring me alot !!
very good.
మీ అభిమాన స్పందనలతో మెరుగుదుద్దుతున్న మీకు వందనం.
Deleteఅంతరంగ భావాల సంఘర్షణ ప్రశంసనీయమే.
ReplyDeleteఎవరికి వారు ఈ ఒక్క లైనుని తలచి తలచి సరిచేసుకొంటే
అంతరంగం కదనరంగం కాని ,
మధనరంగం కాదని చక్కగా సెలవిచ్చారు.
"అన్ని కోణాల్లో ఆలోచించాను నన్ను నేనే సరిచేసుకోవాలని "
http://naalochanalaparampara.blogspot.in/
నాలొచనలపరంపర
శర్మ జీ ఎస్
ప్రశంసించిన మీకు ప్రతినమస్కారం.
Deleteమదిభావాల ప్రకంపనాలజడి అదిరిందండి.
ReplyDeleteమీ కవితలు చదువితుంటే నాలోను పదాలిలా పొంగిపొర్లుతున్నాయండి.
పదాలు పొంగిపొర్లడం ఏవిటి....పదకవితలే అల్లేయగలవు అనికేత్ :-)
Deletenamaste madam. ee padyam baagundi
ReplyDeleteNamaskaaramandi....thanks for comment.
Deletemanasuni enta andam gaa aaviksharinaru chaalaa baavundi
ReplyDeletenaa bhavaalani mechchina meeku thank you.
Deleteఆదర్శవంతమైన కవిత
ReplyDeleteధన్యవాదాలు ప్రిన్స్...
Deleteఅజ్ఞానపు ఇసుకరేణువుల బొమ్మని చెక్కుతున్న శిల్పినని
ReplyDeleteఆశాంధినై గిల్టునగలకు మెరుపులు అద్దుతున్న కంసాలినని
మంచి కవితా వాక్యం .
ఎవరిని వారు సరిచేసుకోవటం, ప్రేమను పంచుతూ, ఆనందంగా జీవించటం అదే కదా జీవిత పరమార్థం.
బహుకాలానికి విచ్చేసి స్పందించిన మీకు ధన్యవాదములు.
Deleteజీవిత సత్యాన్ని కవితలో ఆవిష్కరించారు పద్మార్పిత గారూ...
ReplyDeleteజీవిత నౌక - అది పయనించే వైపే మన దారి, మన దారిన అది ఎన్నడూ పయనించదు. ఈ సత్యం తెలుసుకునే సరికి నౌక దాని గమ్యం అది చేరుకుని తీరుతుంది.
మీ అభిమాన ఆదరణాత్మక స్పందనలతో హాయిగా సాగిపోతుందండి ఈ జీవితనౌక...థ్యాంక్యూ.
Deleteఅయ్ లవ్ యూ అండీ పద్దూ గారు.
ReplyDeleteకాయ గారు.....అందరినీ ఇలాగే ప్రేమిస్తూ పరిపక్వతచెందిన ఫలమవ్వాలని కోరుతూ...థ్యాంక్యూ.
Deleteమీ అభిమానిగా మీ అధ్బుతమైన రచనలన్నీ చదువుతున్నాను, ఎప్పటికైనా ఒక్కటైనా ఇలా రాయగలనంటారా పద్మార్పితగారు.
ReplyDeleteఇలా ఏంటి! ఇంతకన్నా బాగా రాయగలవు...యోహంత్.
Deletechaala bagundi andi...
ReplyDeleteThanks for your comment.
Deleteపద్మగారు......అందమైన అద్భుతభావాక్షర సుమమాల.
ReplyDeleteతెలుగమ్మాయిగారు....తెగ పొగిడేస్తున్నారు :-) థ్యాంక్యూ
Deleteమనిషి తత్వం ఓ పెద్ద ఫిలాసఫీ. భావోద్వేగాలు, కష్టశుఖాలు, జయాపజయాల కెరటాల్లో చిక్కుకున్న నౌక లాంటి జీవితానికి ఎవరివారే కెప్టెన్. ఒడ్డుకు చేర్చుకోడమో.. మునిగి ముక్కలవడమో అంతా ఆ కెప్టెన్ చేతులోనే ఉంటుంది. నిజంగా ఈ తత్వాన్ని
ReplyDeleteఅక్షరాల్లో బంధించడం ఆ అక్షరాన్ని బంధించడమూ, బాధించడమే. ఆ బాధ, ఆ వేదన, జీవితాన్ని సుఖమయం చేసుకోడానికి
నిజాయతీ ఉండాలన్న భావనను ఇంత చక్కగా అక్షరాల ఉలితో చెక్కిన మీకు... అభినందనలు.
మీ అభిమానాక్షర స్పందనలకు నెనర్లండి.
Deleteఅలుగకే అక్షరమా!...నేనేం రాయలేకపోతున్నానని
ReplyDeleteఆవేశాన్ని అణచి అందమైన పదాలని దొంగిలించానని
వ్యధకి ముసుగేసి నవ్వుని పెదవులపై పులుముకుని
జీవన్నాటకంలో నన్నునేనే మోసగించుకుంటున్నానని!
అద్భుతంగా అదరగొట్టావ్...అభినందనల హగ్ :)
ఓహో.....సో స్వీట్ ఆఫ్ యు సృజనగారు, థ్యాంక్యూ!
Delete