సమ్మర్ రొమాన్స్

నాజూకు శరీరం వేడెక్కిపోతుంది
కరెంటుకోతతో ఫ్యాను తిరగనంది
గొంతెండి నాలుక తడారిపోయింది
ఒంటికంటిన వస్త్రం నిలవనంటుంది
ఏ.సి లేక చల్లగాలి చెమటగ మారింది
తలకి నీళ్ళోసినా తాపం చల్లారకుంది

ఒంటరిగా శృంగారం నర్తించ చూస్తుంది
దరిచేరిన ప్రియుడ్ని పొమ్మని కసిరింది
 
ఎగసిపడే హృదయం స్పందించలేనంది
రేయైనా కునుకీయంటు కాళ్ళట్టుకుంది
ఆరుబయట పడకంటే యవ్వనం వద్దంది
ఈ వేడి చల్లారే మార్గం ఏదైనా చూపమంది
చిగురాకు గాలికై అంతస్తులవైపు చూసింది
ఎండాకాలం పళ్ళికిలిస్తూ బిగ్గరగా వచ్చానంది
వేసవిలో ప్రతి ఒక్కరికీ ఇదే మాయరోగమంది
సెన్సార్ కట్ అంటూ ఏవేవో ఊహించకండి.....
సమ్మర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రమేనండిది:-)

20 comments:

  1. ఔరా కరెంట్ కోతా!!! నీ మీద కూడా ఒక కవిత అల్లేసారు పద్మ గారు..తన దైన ప్రత్యేక శైలిలో...:)

    ReplyDelete
  2. welcome to summer.. :-) bagundandi medaina styllo..

    ReplyDelete
  3. Arpitagaru....hot thoughts ki cool pic petti suppress chesaru, yemaina meeke chellunandi:)

    ReplyDelete
  4. telugu velugu lo mee gurinchi chadivi fallow avuthunna ... mee bhavalaki mee bhasha ki dasoham...

    ReplyDelete
  5. ఎండవేడిని తాళలలేకపోతే ఎవరుమాత్రం ఏంచేస్తారండి...ఇలా కాసేపు పిక్ చూసి పరవశించడం తప్ప:)

    ReplyDelete
  6. సమ్మర్ రోమాన్స్,

    సమ రోమాన్సండోయ్!


    జిలేబి.

    ReplyDelete
  7. శివ శివా.... సమ్మర్ లో.... మాన్స్ !!!
    పదాల అల్లిక ఎటో తీసుకెళ్లినా! వేసవి దాహ భాదలకి నిలువుటద్దం మీ Hot Poetry (ఉక్కపోత కవిత)..... Great and Sweet....

    ReplyDelete
  8. కరెంటుకోతతో ఫ్యాను తిరగనంది

    Summer ayina..winter/rainy season ayina..మనకు ఈ కరెంటు కోత ఎప్పుడు ఉండేదే...:(
    Summer shines are coming..Chala baga rasaru andi..

    ReplyDelete
  9. మీ కవితల్లో climax is very twisty , ఈమధ్య సినిమాలు తిస్తున్నవారు మీ దగ్గర coaching and training తీసుకుంటే మంచిది...

    anyway coming to your romantic poetry...hmmmm... వద్దులెండి... బాగుంది అని సరిపెడితే మంచిది. (just kidding, it's really good).

    - Ramesh

    ReplyDelete
  10. ఏదో చెప్పాలనుంది చెప్పలేక పోతున్నా గొంతు తడారిపోయింది సారి కరెంటు పోయినట్టుంది సూపర్ పద్మాగారు

    ReplyDelete
  11. వేసవి తాపం, ప్రేమకు శాపం, ఎదవాంఛ చెప్పలేని అపురూపం
    వేసారిన చిత్తం, చిత్తడి కాయం, మనసుపడె మోహన స్వరూపం
    రవిక చిత్తడి,చీర ఒత్తిడిల మధ్య ఎద నిలిచిన కోరిక గాలిలో దీపం
    తలపులతో వలపు పండించుకుని పులుపును చవిచూసే ప్రాయం
    మదిలో ప్రణయకోతను పట్టించుకోక గదిలో ఎదురైన విద్యుత్ కోత
    శీతలీకరణ యంత్రాన్నితడిసిమోపు చేసే డిస్కం చార్జీల భారి మోత
    ఈ ప్రకృతి వికృతుల మధ్య మీ ప్రేమ ఆకృతికి తప్పదు విరహ వాత!

    ReplyDelete
  12. హహహ.. బాగుందండీ ;)

    ReplyDelete
  13. సాయంకాలం పిల్లతెమ్మెర స్పర్శలోనూ
    తడారిపోయింది గదండీ...ఎంత బాగా రాశారండి... బాగుంది...

    ReplyDelete
  14. పద్మార్పితా.....అరిపించావు....కెవ్వువ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక! you are rocking.

    ReplyDelete
  15. వేసవి తాపం మీద సెటైర్ లా ఉంది మీ కవిత్వం.అయినా బాగుంది ..గమ్మత్తుగా ఉంది.

    ReplyDelete
  16. summer paatlu cheppaaru హ్యుమరస్గా
    current koatalapai baagundi mee IRONY

    ReplyDelete
  17. స్పందనలతో ప్రోత్సయించి రాయిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

    ReplyDelete