మారింది...

కాలమే మారింది...
నీవు కాదు నేను కాదు!
గాలితెమ్మెరే దిశను మార్చింది...
నీవు మారలేదు నేనూ మారలేదు!
మనదనుకున్న సమయం మారింది...
నీదైన నా ప్రేమలో లోపమన్నదేలేదు!
నీకున్న భావాలోచనాసరళి కుంటుపడింది...
మధురస్మృతులేవి ఇరువురం మరచిపోలేదు!
మసకెక్కిన హృదయ తాత్పర్యమే తారుమారైంది...
ఆనాడు ప్రేమలో రగిలిన జ్వాలలు ఇంకా ఆరలేదు!
నీ దృష్టి మరలి బంధీ అయిన మది పట్టుతప్పింది...
ఘనీభవించిన జ్ఞాపకాలు కరిగి కన్నీరుగా మారలేదు!
ప్రేమసామ్రాజ్యము వారసత్వముకాదంటూ కుప్పకూలింది...
గతాన్నితలుస్తూ మదికవాటాన్ని తెరచిచూడు ఏం మారలేదు!
ప్రేమించిన నువ్వు-నేను కాదు ప్రేమించలేని ఈ లోకమే మారింది.

16 comments:

  1. మారలేదు అంటారు మారింది అంటారు,
    అవునంటారు కాదంటారు,
    ఉందంటారు లేదంటారు,

    బాగుందండి మీ వరస !!

    ReplyDelete
  2. చిత్రం చాలా బాగుంది పద్మార్పిత గారు.
    కవిత మాత్రం నన్ను సందిగ్ధం లో పడేసింది
    భావం అర్ధమయ్యి, అర్ధమవ్వనట్టు ఉంది. :)
    ఏమైయితేనేమి,ఎప్పటిలా అందంగా ఉంది మీరు ప్రెసెంట్ చేసిన తీరు.

    ReplyDelete

  3. మనలో గాని ,ఇంకెక్కడైనా గాని , ఏదైనా మార్పు కనపడితే అది మన లోపమని అనుకోకండి, దానికి సవా ( సౌ / లక్ష కారణాలుండి తీర్తాయని ( ఆలోచించి చూస్తే )చక్కగా అక్షరబధ్ధం చేశారు .

    చాలా బాగుంది అర్ధం చేసుకొంటే.

    శర్మ జీ ఎస్
    నా ఆలోచనల పరంపర బ్లాగ్
    http://naalochanalaparampara.blogspot.in/

    ReplyDelete
  4. మధురస్మృతులేవి ఇరువురం మరచిపోలేదు!
    మసకెక్కిన హృదయ తాత్పర్యమే తారుమారైంది...

    ప్రేమించిన నువ్వు-నేను కాదు ప్రేమించలేని ఈ లోకమే మారింది.

    మారని మారలేని మనసుల మధ్యనున్న ప్రేమతత్వాన్ని చిక్కగా కవిత్వీకరించారు ప్రేమార్పిత గారు.. అభినందనలతో...

    ReplyDelete
  5. పద్మార్పితగారు.....నీవు మారలేదు నేను మారలేదంటూనే అతనిలోని మార్పుని సుతారంగా గిల్లి జోలపాడినట్లుందండి ;) ఏమైనా మీకే చెల్లు.

    ReplyDelete
  6. చాలా సంక్లిష్టంగా ఉందండీ ఈ భావన. ప్రేమ పదిలమే.. భావనలోనే మార్పు అంటున్నారు.
    హృదయంలో జ్ఞాపకాల దొంతరలకు మీరిచ్చే విలువ... విలువ కట్టలేనిది.
    పిరమిడ్ ఆకృతిలో మీ అక్షర కల్పన... కథన శిల్పం... విరహంలోనూ
    ప్రేమను పండిస్తోంది. సంక్లిష్టం అన్నది అందుకే. బాగుంది.

    ReplyDelete
  7. పదాలకూర్పు పొందుపరిచే విధానం మీకు కొట్టినపిండండి పద్మగారు

    ReplyDelete
  8. padmarpitha garu chithramu, kavitha rendu chala chala bavunnayi

    ReplyDelete
  9. మంచి పిక్ తో మరో అందమైన కవితని ప్రెజెంట్ చేసారు.

    ReplyDelete
  10. చిత్రం బాగుంది , కవిత బాగుందi

    ReplyDelete
  11. నిజాయితీ ఉన్న ప్రేమలో ఎప్పటికీ మార్పు ..నిజాయితీ లోపించినప్పుడే...మార్పులొస్తాయి,,,, ప్రేమామృతం చేదుగా మార్డు చెంతనున్నవారు చెడ్డవారై ఎవ రెవరో మంచిగా కనిపిస్తారు అప్పుడు కళ్ళకు పచ్చకామెర్లు వస్తాయి అంతా పచ్చగా కనిపిస్తుంది ఎవ్వరు ఎప్పిన వినలేరు ఎందుకంటే తన మనసులోంచి ప్రేమ దూరం అయిందిగా ...Mee Kavita bagudi padma garu

    ReplyDelete
  12. ఈ మధ్య మీ బ్లాగ్ లో కమెంట్స్ పెట్టాలంతే పదాలకోసం వెతుక్కోవలసి వస్తుందండి.

    ReplyDelete
  13. మీ హృదయపూర్వక స్పందనలకు నా ధన్యవాదాలు.

    ReplyDelete
  14. correct andi aniketh garu cheppinattu padalu vetukkovalsi vastundi. bagundi..

    ReplyDelete
  15. పదాలకూర్పు పొందుపరిచే విధానం మీకు కొట్టినపిండండి పద్మార్పితగారు.....

    1116 telugu free e books---WWW.GRANTHANIDHI.COM

    ReplyDelete
  16. Akula Ramachandra Rao · Proprietor at Mohan Publications
    ---------అవసరానికి ఉపయోగపడనివి-------------

    పుస్తకస్థా తు యా విద్యా పరహస్తగతం ధనం.
    కార్యకాలే సముత్పన్నే న సా విద్యా న తత్ ధనం.

    పుస్తకం లోనే ఉండిపోయిన విద్యా (చదువూ), పరహస్తగతమైన ధనమూ, అవసరానికి ఉపయోగపడనివి; అటువంటి విద్య విద్యా కాదు, ధనం ధనమూ కాదు.

    pustakasthA tu yA vidyA parahastagataM dhanaM.
    kAryakAlE samutpannE na sA vidyA na tat dhanam.

    Knowledge that remains in the book, Money that is handed over to some one else, are not useful at the time of need; Such knowledge is not knowledge, such money is not money!

    www.granthanidhi.com

    ReplyDelete