ఉషోదయకిరణాల చురకల్ని
నీ వాడితలపులుగా తలచి
అకారణంగా తడిపేసిన వానని
నీ కొంటె అల్లరిగా సరిపుచ్చి
మధ్యాహ్నం చెమట ఉక్కపోతని
నీ విరహ తాపంగా నెంచి
సంధ్యవేళ చిరుగాలి తెమ్మెరల్ని
నీ కరస్పర్శానుభూతిగా మెచ్చి
మాపటేల మబ్బుల్లోదాగిన జాబిలిని
నీవాడు దాగుడుమూతలుగా మార్చి
తారలన్ని మెరుస్తూ ముసిగా నవ్వ
నీవు నాకై దాచిన మల్లెలనిపించి
నడిరేయిలో కీచురాళ్ళ సవ్వడిని
నీ ఊసుల భాషగా ముచ్చటించి
కనుమూయ కలలో మాయమౌతావని
కనులు తెరచి నిదురలో నిను జపించి
ఒక రోజంతటిని ఒక యుగముగా గడప
తెలవారగనే మనసు మరల ప్రశ్నించె...
నువ్వే కావాలంటూ మనసు మారాం చేసె
నీవొక కరిగిన కలవని సర్దిచెప్ప బోతే...
విన్నట్టేవిని మాటవినకుందె "మొండిమనసు"
mondimanasuku johaarlu..
ReplyDeletechaalaa hrudyamaina prema kaavyam Padmagaru.. abhinandanalato..
మాపటేల మబ్బుల్లోదాగిన జాబిలిని
ReplyDeleteనీవాడు దాగుడుమూతలుగా మార్చి
తారలన్ని మెరుస్తూ ముసిగా నవ్వ
నీవు నాకై దాచిన మల్లెలనిపించి
నడిరేయిలో కీచురాళ్ళ సవ్వడిని
నీ ఊసుల భాషగా ముచ్చటించి
కనుమూయ కలలో మాయమౌతావని
కనులు తెరచి నిదురలో నిను జపించి..>ఏన్నో జన్మలగా ఎదురు చూస్తున్న నా ఈ విరహ వేదనతో తపిస్తున్నా పరితపిస్తున్న మనస్సు ...మధిభాష్యింగా నీముందుంచినా ఇంకా ఆలోచిస్తున్నావెందుకో..వేయియుగాలైనా ...తడికన్నులతో నిన్నిలా ఆరాదిస్తూనే ఉంటా... Chala chala super andi Ela chappalo ardam avvvadamleedu
mee mondimanassu... chaalaa baavundi... meeru ilaage raastu kavithala samrajyamloo maharanigaa avvandi..-:)
ReplyDelete
ReplyDeleteవిన్నట్టేవిని మాటవినకుందే "మొండిమనసు" .
నిజానికి మనసు లక్షణమే అదే కదా!.
పసితనపు పోకడలని అంటిపెట్టుకొంటూ ,
పేద్ద పేద్ద పనులు చే(యి)స్తుంటుంది .
అందుకే ఆ " మొండి మనసు " ని ఎవరూ వదిలిపెట్టలేరు ,
ఈ కవిత లాగా .
mind blowing art with heart touching words.
ReplyDelete"మాట వినని ఈ మనసునేం చేయను" అని నేనొక కవిత వ్రాసాను.అలాగే ప్రేమ లో పడ్డప్పుడు మొండి మనసు మాట వినదు మరి.కొత్తగా వ్రాసారు.
ReplyDeleteనీ భావాలకి తగ్గ కవిత & చిత్రం.
ReplyDeleteమొండిమనసును గుండె దిటవు చేసుకుని
ReplyDeleteమండే హృదయానికి లేపనం పూసుకుని
భాద్యతల భంధాల్ని గుర్తు చేసుకుని
బట్టి విక్రమార్కుడిలా నీ జ్ఞాపకాల్నిభుజాన వేసుకుని
నీ అందాల ఖజానా మూసేసుకుని
నన్ను ఎప్పటికి నీ జీవితం లోంచి వెళ్ళి పోనీ .
mee mondi manasu chala bagundi
ReplyDeleteతెలుగులో ఇంకా కవితలు రాసేవారున్నారని బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకే తెలిసింది. అంటే ఇంత "అద్భుతం" గా రాసేవారని. I felt the FEEL:) continue ur style.
ReplyDeletePic Pichi ye-kistundi Padma Garu ;)
ReplyDeleteKada..?
Deleteస్వప్నాల జడివానలో తడిపేశారు. ప్రేమించే క్షణాలను మళ్లీమళ్లీ గుర్తుచేసి.. హృదయాన్ని రమింపచేశారు.
ReplyDeleteఅక్షరమక్షరం ప్రేమించుకుని... విరహావేశ బిగికౌలిలో పదాలుగా రమించి... శృంగార నైషధాన్ని రంగరించి..
మనసు పలికే మౌనరాగాన్ని... స్వప్న వీచికను ప్రణయ నిరీక్షణగా మార్చేసిన మీ ఊహావిన్యాసానికి.... నమస్కారం.
పెయింటింగ్ పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి. కవితకూడా
ReplyDeleteఆ కవిత పైంటింగ్ కే అందాన్నిచ్చింది తెలుగమ్మాయి
Deleteమీదైన శైలిలో ప్రేమను పండించారు...చిత్రంలో కూడా గుప్పించారు :-)
ReplyDeletechala bagundandi kavita as well as picture..
ReplyDeleteవ్యాఖ్యలిడి నా భావాలకి విలువనిచ్చి ప్రేరేపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభివందనాలు.
ReplyDeleteSuper ga nachindi
ReplyDeleteఒక కవి వేదన తన కవిత చదివిన వారికి కూడా కలిగితే, ఆ కవి విజయం సంపూర్ణం. మీరు ఆ సంపూర్ణ విజయం పొందారు దీనితో.
ReplyDelete