విరహగీతం

నేడు నా మది మధుమాసపు విరహాన్ని ఆలపిస్తుంది
కలువలు విరిసినవేళ అలోచనలతో మనసు అలసింది
దూరాన్న వసంతపవన రెపరెపలకి గుండెలయతప్పింది
కోయిల కూడా మధురమైన గానమేదీ ఆలాపించకుంది
సీతాకోకచిలుక రెక్కలు విరహాగ్నితో వేడెక్కి ఎగరలేనంది
తుమ్మెదనిచూసి అరవిరియాల్సిన మొగ్గ ముడుచుకుంది
నిట్టూర్పు శ్వాసలో మదిమువ్వలసవ్వడి మారుమ్రోగింది
తలపుల తలుపుతెరుచుకుని మదిని ఊపిరాడనీయకుంది
ఫల్గుణంలో కురిసిన జల్లు కోర్కెల విరహాగ్నిని ఆర్పలేనంది
చేసినబాసలు ఎండాకులై నేలరాలి కొత్త చిగురులకై వేచింది
మది వసంతమాసపు మధుర కలయికకై ఎదురుచూస్తుంది

18 comments:

  1. మధురమైన విరహ భావాన్ని కవితలోనూ అందంగా రంగుల్లోనూ పొదిగారు.
    బ్యూటిఫుల్!

    ReplyDelete
  2. కోయిల కూడా మధురమైన గానమేదీ ఆలాపించకుంది
    సీతాకోకచిలుక రెక్కలు విరహాగ్నితో వేడెక్కి ఎగరలేనంది
    తుమ్మెదనిచూసి అరవిరియాల్సిన మొగ్గ ముడుచుకుంది
    నిట్టూర్పు శ్వాసలో మదిమువ్వలసవ్వడి మారుమ్రోగింది
    తలపుల తలుపుతెరుచుకుని మదిని ఊపిరాడనీయకుంది..

    Lovely feel Padmarpita గారు. చిత్రం కూడా మీ కవితలానే చాలా బాగుంది. అభినందనలతో..

    ReplyDelete
  3. Anonymous07 May, 2013

    విరహాగ్ని తో గుండె లయ తప్పడం అనాది గా రివాజుగా పరిపాటిగా జరుగుతూనే ఉంది!పద్మార్పితగారికి అభినందనలు!

    ReplyDelete
  4. పద్మార్పితగారు.....చూసారా మీ విరహానికి ప్రతిజీవి తోడు :) బాగుందండి

    ReplyDelete
  5. అంత త్వరగా ఆరిపోయే అగ్ని కాదు విరహాగ్ని.. వసంతమాసం ఎప్పుడొస్తుందో కదా ! ... excellent Arpita garu

    ReplyDelete
  6. ఈ విరహతాపం గీతాలతోను, కవితలతోను తీరేనా??? :-)

    ReplyDelete
  7. haye haye image is super as well as your kavitha.. simply super..

    ReplyDelete
  8. ఎప్పటిలాగానే అన్నీ అందంగా అమర్చారు

    ReplyDelete

  9. "ఫల్గుణంలో కురిసిన జల్లు కోర్కెల విరహాగ్నిని ఆర్పలేనంది
    చేసినబాసలు ఎండాకులై నేలరాలి కొత్త చిగురులకై వేచింది
    మది వసంతమాసపు మధుర కలయికకై ఎదురుచూస్తుంది".

    వసంతమాసపు విరహాగ్ని చాలా చాలా బాగుంది .
    మీ ఈ కవిత ద్వారా " విరహాగ్ని " కూడా మా అందరిచేత బాగుందనిపించే
    మీ రచ్నా పటిమ వావ్ !

    ReplyDelete
  10. మీ కవితతో ఇన్స్పైరై నేను ఒక కవిత రాసేస్తానుగా "మాఘమాసం ఎప్పుడొస్తుందో " అని :-)

    ReplyDelete
  11. చాలా బాగుంది.

    ReplyDelete
  12. విరహం విరిజాజి వాసనలు వెదజల్లుతూ మరింత అందంగా కవితలో ఒదిగింది.

    ReplyDelete
  13. నేడు నా మది మధుమాసపు విరహాన్ని ఆలపిస్తుంది
    కలువలు విరిసినవేళ అలోచనలతో మనసు అలసింది
    దూరాన్న వసంతపవన రెపరెపలకి గుండెలయతప్పింది
    కోయిల కూడా మధురమైన గానమేదీ ఆలాపించకుంది
    సీతాకోకచిలుక రెక్కలు విరహాగ్నితో వేడెక్కి ఎగరలేనంది
    తుమ్మెదనిచూసి అరవిరియాల్సిన మొగ్గ ముడుచుకుంది....manasunu mee kavitato Rajesaaru ...akSharalato agnini puttincharu chalabagudni andi

    ReplyDelete
  14. బాగుందండీ...;)
    మీ బ్లాగ్ కి వస్తే ఐదు నిమిషాలు అలా ఉంచేస్తాను పోస్ట్ అయిపోయాక కూడా... పాత వినడానికి ;)

    ReplyDelete
  15. మీ ప్రతిస్పందనలకు నా వందనములు.

    ReplyDelete
  16. "Kannulu kooda ika kalala kotalo praveshinchalemandi
    Nee Gnaapakaalanu penavesukuni ninne choodaalani paritapinche kannulu nidurakooda polemandi
    Edaarilo kurise vaanalaa nee kosam vechi choose vela kalata nidralo vinta kalalu evo kanuchoopuku andananta dooram lo nannu vekkiristu undi"

    Bhaavam lo Bhaavukata lekunte Manninchandi
    Edaina porapaataite Kshaminchandi...!!

    ReplyDelete