నా చిత్రాన్ని గీయాలని నేను చేసాను విశ్వప్రయత్నం!
కుంచెకు రంగంటనని మొరాయించింది ఇదేమి విచిత్రం!
కాన్వాసు ముడుచుకుని అద్దినరంగు జారుతూ అంది
నా కళ్ళు చూపే కారుణ్యాన్ని చిత్రంలో నే చూపలేనంది
నుదిటిరాతల్ని ముడతలుగా పిచ్చిపిచ్చిగా గీసేస్తానంది
మంచి మానవత్వపు పరిమళాలని బొమ్మకి అద్దలేనంది
పెదవులని గీయబోతే నవ్వగలవవి కన్నీరు కార్చలేవంది
ముఖ కవళికలన్నీ ఒకేసారి చూపడం నా తరమేకాదంది
వంపులన్నీ సొంపుగా దిద్దబొతే చిత్రాంగివాంటూ నవ్వింది
సహాయం అడగనా చేతినంటే మదితోటిదే దాని చెలిమంది
భావాలకు రూపం గీయలేక అలిగిన నాతో నా మనసంది
స్వఛ్ఛమైన నా శ్వేతహృదయానికి రంగులతో పనిలేదంది
భావుకతకు అక్షరరూపమే అసలైన ఆకారం తెలుకోమంది
అయినా కళ్ళకి కాన్వాసు కరముకి కుంచె అంటే భలేఇష్టం!
ఏదో ఒకటి చిత్రించకుండా ఊపిరిపీల్చడం నాకు బహుకష్టం!
మొత్తానికి గీసేసారు.
ReplyDeleteనా బ్లాగ్ కి స్వాగతమండి......మీరు అభిమానంతో అలా అంటున్నారే కాని, అది అసంపూర్తి చిత్రం కదండి:-) ధన్యవాదాలండి!
Deleteమీలోని భావుకత రంగుల్లో జారుతూ అక్షరాలుగా మారటం మీ విశ్వసనీయ ప్రయత్నానికి నిదర్శనం.
ReplyDeleteబొమ్మలో ఆ రంగులు జా(లువా)రిన వైనం అత్యద్భుతం!
మీ కళాత్మక దృష్టికి....మీ పదునైన కుంచెకే ఎరుక ఆ రంగుల జాలువారుతనం. థ్యాంక్యూ వెరీ మచ్!
Deleteచాలా బాగుంది .
ReplyDeleteస్వఛ్ఛమైన నా శ్వేతహృదయానికి రంగులతో పనిలేదంది
భావుకతకు అక్షరరూపమే అసలైన ఆకారం తెలుకోమంది
మీ అభిమానపు స్పందన నాకు స్ఫూర్తిదాయకం. థ్యాంక్యూ.
Deleteమీ చిత్రానికి ఎదురే లేదు, మీ భావానికి సాటి లేదు, మంచి కవిత.
ReplyDeleteఅభిమానపు వాక్యాలతో మెచ్చిన మీకు నెనర్లు.
Deleteభావాలని చెప్పలేను చూపలేనంటూనే భలే చెప్పేస్తారుగ :)
ReplyDeleteమీరు కనిపెట్టేసారుగా...:-)
Deleteనిజంగా పెయింటింగ్ అద్భుతం .అది మీ కుంచె నుండి జాలువారిన మీరేనా!
ReplyDeleteధన్యవాదాలండి..... ఆ అసంపూర్తి చిత్రంలో నేనున్నా, కానీ కనపడ్డంలేదు కదండి :-)
Deleteఎప్పటిలాగే మనసుని కళ్ళని కూడా రంజింపజేసావు పద్మార్పిత.
ReplyDeleteమీ ఆత్మీయతకు అభివందనాలు.
Deleteసృజన గారి మాటే నాదీను.. మరింక పూర్తి చేయొచ్చుగా..:)
ReplyDeleteభావం చిత్రం అద్భుతంగా అమరాయి పద్మార్పిత గారు.. అభినందనలతో.
వర్మగారు....
Deleteఅలా అసంపూర్తిగా వదిలేసిన చిత్రం
విరిసివిరియని మొగ్గలోని సుగంధం
కూడా అందమే కదండి :-)
ధన్యవాదాలండి.....
ReplyDeleteyonath annatu భావాలని చెప్పలేను చూపలేనంటూనే భలే చెప్పేస్తారుగ :) super...
ReplyDeleteథ్యాంక్యూ శృతి.
Deleteస్వస్వరూప చిత్రాన్ని సెల్ఫ్ పోర్ట్రైట్ ని చిత్రిన్చుకోవాలని పద్మార్పిత గారి ప్రయత్నం ఫలించక అసంపూర్తిగా మిగిలిపోయింది కారణం ఎవరికివారు పూర్తిగా అర్థమౌతారని ఘంటాపథంగా చెప్పలేము ఆత్మకథ వ్రాయడం వంటిదే self పోర్ట్రైట్ గీయడమూనూ!సృజనకారులు ఎప్పుడూ ఏదో ఒక సృజన చేయకుండా ఊరికే ఉండడం కష్టం!పూర్తిచేయని చిత్రాలు కూడా కళాఖండాలుగా వినుతికెక్కిన ఉదంతాలు కళా చరిత్రలో ఉన్నాయి!
ReplyDeleteనన్ను నేను అర్థం చేసుకుంటూ అన్వేషించుకోడానికి ఈ జీవితకాలం సరిపోదేమోనండి....అంటే ఎప్పటికీ నా చిత్రాన్ని నేను పూర్తిగా చిత్రించుకోలేనేమో :-)... మీ అభిమాన ఆత్మీయ స్పందనకు నెనర్లండి!
Deleteఆ కళ్లు ఏ భావాన్ని చెప్తున్నాయి... ఏదో బాధని వ్యక్తం చేస్తున్నాయి. ఎవరినో వెదుకుతున్నాయి. దేనికోసమో
ReplyDeleteనిరీక్షిస్తున్నాయి. మీ కుంచె కన్నీరు చిలికించిందేమో గానీ.. ఆ కళ్లలో నీరు ఎండిపోయింది. పాపం మీ కుంచెకు ఆ విషయం
తెలియదేమో. తడి ఆరిపోయిన ఆ పెదవుల మధ్య ఏదో మాట బయటపడలేక నలిగిపోతోంది. హోళీ అంతా అయిపోయాక
చెదురుమదురుగా మిగిలి పోయిన రంగులు చిలికించి మీ కుంచె ఎందుకు నిస్సహాయంగా ఉండిపోయిందో.. చిత్రించిన మీకే
తెలియాలి. నేను మీరు రాసిన కవిత చదవలేదు. ఇది అంసపూర్ణ చిత్రంలా కనిపించేలా భ్రమింప చేశారు గానీ.. ఇది సంపూర్ణ చిత్రమే. తెల్లటి ముసుగు వెనుక దాగిన మీ వదనంలో... నాకు ఆనందం కనిపించలేదు. అక్షరాలను అనుభవించారు.. ఇప్పుడు రంగులతో ఆడుకుంటున్నారు. మీ చిత్రానికి ఇదే నా అక్షరకల్పన. ఇది ఊహాత్మకం మాత్రమే. అంచనా తప్పైతే... క్షంతవ్యుడను.
సతీష్ గారు నాకు తెలిసినంత వరకు ఆనందమైనా, భాధైనా, అందమైనా ఇంకేదైనా మనం ఆలోచించే స్థితిపై ఆధారపడి ఉంటుందనుకుంటాను. ఒకే చిత్రంలో కొందరు కళ్ళ అందాన్ని చూస్తే మరికొందరు ఆ కంటిలో నీటిని వెతుకుతారు. కలర్ కాంబినేషన్స్ కొందరు చూస్తే తెల్లని ఖాళీలలో ప్రశాంతాన్ని మరికొందరు చూస్తారు. ఇది నా అభిప్రాయము మాత్రమే.
Deleteఎంతో అభిమానంతో మీ భావాలని తెలియజేసి ఆ చివర్లో...."క్షంతవ్యుడను" ఎందుకండి? సదా మీ అభిప్రాయాలని అశ్శిస్తూ...
మీ చక్కని విశ్లేషనాత్మక స్పందనకు ధన్యవాదాలండి!
మీ కుంచె బొమ్మలేస్తుందా ? లేక... కుంచె తన అంచు నుంచి జాలువారే రంగులను అక్షరాలను చేసి ఇలా మీ బావాలను లిఖింపచేస్తుందా ??? :) ... మీరు మీ చిత్రాన్ని రంగులతో సగం లో ఆపేసి మిగిలిన సగ బాగం మీ అక్షరాలతో పూర్తి చేసినట్లుంది ... !!!
ReplyDeleteNice బ్లాగ్ ...
ధన్యవాదాలు ,
http://techwaves4u.blogspot.in/
తెలుగు లో టెక్నికల్ బ్లాగు
వెల్ కం టు మై బ్లాగ్.
DeleteThanks for your comments.
చిత్రం అసంపూర్తి అయితేనేం కళ్ళలోనే అన్ని భావాలని చెప్పారుగా
ReplyDeleteఅన్ని భావాలనీ ఆ కళ్ళలోనే చూసిన మీకు అభివందములండి :-)
Deleteఅసలు ఎలా రాస్తారు ఈ కవితలు..నేను రాస్తే అది తవిక అవుతుంది...కవితతో మీ మిగితా చిత్రాన్ని కంప్లీట్ చేసారు..కవితని మరియు చిత్రాన్ని కలిపి మొత్తానికి కవిచిత్రం ని evolve చేసారు..:) :)..Chala Bagundi mee kavitha mariyu chitram kuda....
ReplyDeleteనేను రాసిన కవితల్ని/తవికల్ని సహృదయంతో స్పందించి ప్రేరేపించే మీ అందరి ప్రోత్సాహమే ఈ వ్రాతలకి కారణం. ధన్యవాదాలండి.
Deleteతెగబాగా నచ్చేసారు ఇలా అసంపూర్తిగానే అద్భుతంగా ఉన్నారు :)
ReplyDeleteఅసంపూర్తి కళని మెచ్చే మీ అందమైన మనసుకి వందనం.
Deleteఅర్పిత గారు అద్భుతంగా రాస్తారండి .. లలితకళల్లో మీకెన్ని కళల్లో ప్రవేశముందండి ?
ReplyDeleteకళలలో ప్రవేశమే కానీ పండితురాలిని కానండి:-)Thank you.
Deleteపెదవులని గీయబోతే నవ్వగలవవి కన్నీరు కార్చలేవంది
ReplyDeleteముఖ కవళికలన్నీ ఒకేసారి చూపడం నా తరమేకాదంది
వంపులన్నీ సొంపుగా దిద్దబొతే చిత్రాంగివాంటూ నవ్వింది
సహాయం అడగనా చేతినంటే మదితోటిదే దాని చెలిమంది
భావాలకు రూపం గీయలేక అలిగిన నాతో నా మనసంది
స్వఛ్ఛమైన నా శ్వేతహృదయానికి రంగులతో పనిలేదంది....ela Nenu enduku ryaleenu
ఇంతకన్నా బాగా ఎప్పుడో రాసేసారు కదా మీరు.
Deleteఅక్షరాలని అందమైన రంగులుగా చేర్చి,కలాన్ని కుంచెగా మార్చి చిత్తాన్ని , చిత్రంగా చిత్రించారు ...అభినందనలు..
ReplyDeleteYou are not only expressing your feelings in the form of poems but also giving them a life-like touch with your paintings. Really touched by the way you express yourself in your poems and in your paintings. Moththaniki meeku abhinandanalu telapakunda undalenu. Hats off to you Padma for your multi-faceted nature. I am sure I cannot express like you.
ReplyDeletePadmagaaru Chaala Baagundandi.. :)