నా చిత్రం!

నా చిత్రాన్ని గీయాలని నేను చేసాను విశ్వప్రయత్నం!
కుంచెకు రంగంటనని మొరాయించింది ఇదేమి విచిత్రం!

కాన్వాసు ముడుచుకుని అద్దినరంగు జారుతూ అంది
నా కళ్ళు చూపే కారుణ్యాన్ని చిత్రంలో నే చూపలేనంది
నుదిటిరాతల్ని ముడతలుగా పిచ్చిపిచ్చిగా గీసేస్తానంది
మంచి మానవత్వపు పరిమళాలని బొమ్మకి అద్దలేనంది
పెదవులని గీయబోతే నవ్వగలవవి కన్నీరు కార్చలేవంది
ముఖ కవళికలన్నీ ఒకేసారి చూపడం నా తరమేకాదంది
వంపులన్నీ సొంపుగా దిద్దబొతే చిత్రాంగివాంటూ నవ్వింది
సహాయం అడగనా చేతినంటే మదితోటిదే దాని చెలిమంది
భావాలకు రూపం గీయలేక అలిగిన నాతో నా మనసంది
స్వఛ్ఛమైన నా శ్వేతహృదయానికి రంగులతో పనిలేదంది
భావుకతకు అక్షరరూపమే అసలైన ఆకారం తెలుకోమంది

అయినా కళ్ళకి కాన్వాసు కరముకి కుంచె అంటే భలేఇష్టం!
ఏదో ఒకటి చిత్రించకుండా ఊపిరిపీల్చడం నాకు బహుకష్టం!

37 comments:

  1. మొత్తానికి గీసేసారు.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి స్వాగతమండి......మీరు అభిమానంతో అలా అంటున్నారే కాని, అది అసంపూర్తి చిత్రం కదండి:-) ధన్యవాదాలండి!

      Delete
  2. మీలోని భావుకత రంగుల్లో జారుతూ అక్షరాలుగా మారటం మీ విశ్వసనీయ ప్రయత్నానికి నిదర్శనం.
    బొమ్మలో ఆ రంగులు జా(లువా)రిన వైనం అత్యద్భుతం!

    ReplyDelete
    Replies
    1. మీ కళాత్మక దృష్టికి....మీ పదునైన కుంచెకే ఎరుక ఆ రంగుల జాలువారుతనం. థ్యాంక్యూ వెరీ మచ్!

      Delete
  3. చాలా బాగుంది .
    స్వఛ్ఛమైన నా శ్వేతహృదయానికి రంగులతో పనిలేదంది
    భావుకతకు అక్షరరూపమే అసలైన ఆకారం తెలుకోమంది

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానపు స్పందన నాకు స్ఫూర్తిదాయకం. థ్యాంక్యూ.

      Delete
  4. మీ చిత్రానికి ఎదురే లేదు, మీ భావానికి సాటి లేదు, మంచి కవిత.

    ReplyDelete
    Replies
    1. అభిమానపు వాక్యాలతో మెచ్చిన మీకు నెనర్లు.

      Delete
  5. భావాలని చెప్పలేను చూపలేనంటూనే భలే చెప్పేస్తారుగ :)

    ReplyDelete
    Replies
    1. మీరు కనిపెట్టేసారుగా...:-)

      Delete
  6. నిజంగా పెయింటింగ్ అద్భుతం .అది మీ కుంచె నుండి జాలువారిన మీరేనా!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి..... ఆ అసంపూర్తి చిత్రంలో నేనున్నా, కానీ కనపడ్డంలేదు కదండి :-)

      Delete
  7. ఎప్పటిలాగే మనసుని కళ్ళని కూడా రంజింపజేసావు పద్మార్పిత.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయతకు అభివందనాలు.

      Delete
  8. సృజన గారి మాటే నాదీను.. మరింక పూర్తి చేయొచ్చుగా..:)

    భావం చిత్రం అద్భుతంగా అమరాయి పద్మార్పిత గారు.. అభినందనలతో.

    ReplyDelete
    Replies
    1. వర్మగారు....
      అలా అసంపూర్తిగా వదిలేసిన చిత్రం
      విరిసివిరియని మొగ్గలోని సుగంధం
      కూడా అందమే కదండి :-)

      Delete
  9. ధన్యవాదాలండి.....

    ReplyDelete
  10. yonath annatu భావాలని చెప్పలేను చూపలేనంటూనే భలే చెప్పేస్తారుగ :) super...

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ శృతి.

      Delete
  11. Anonymous16 May, 2013

    స్వస్వరూప చిత్రాన్ని సెల్ఫ్ పోర్ట్రైట్ ని చిత్రిన్చుకోవాలని పద్మార్పిత గారి ప్రయత్నం ఫలించక అసంపూర్తిగా మిగిలిపోయింది కారణం ఎవరికివారు పూర్తిగా అర్థమౌతారని ఘంటాపథంగా చెప్పలేము ఆత్మకథ వ్రాయడం వంటిదే self పోర్ట్రైట్ గీయడమూనూ!సృజనకారులు ఎప్పుడూ ఏదో ఒక సృజన చేయకుండా ఊరికే ఉండడం కష్టం!పూర్తిచేయని చిత్రాలు కూడా కళాఖండాలుగా వినుతికెక్కిన ఉదంతాలు కళా చరిత్రలో ఉన్నాయి!

    ReplyDelete
    Replies
    1. నన్ను నేను అర్థం చేసుకుంటూ అన్వేషించుకోడానికి ఈ జీవితకాలం సరిపోదేమోనండి....అంటే ఎప్పటికీ నా చిత్రాన్ని నేను పూర్తిగా చిత్రించుకోలేనేమో :-)... మీ అభిమాన ఆత్మీయ స్పందనకు నెనర్లండి!

      Delete
  12. ఆ కళ్లు ఏ భావాన్ని చెప్తున్నాయి... ఏదో బాధని వ్యక్తం చేస్తున్నాయి. ఎవరినో వెదుకుతున్నాయి. దేనికోసమో
    నిరీక్షిస్తున్నాయి. మీ కుంచె కన్నీరు చిలికించిందేమో గానీ.. ఆ కళ్లలో నీరు ఎండిపోయింది. పాపం మీ కుంచెకు ఆ విషయం
    తెలియదేమో. తడి ఆరిపోయిన ఆ పెదవుల మధ్య ఏదో మాట బయటపడలేక నలిగిపోతోంది. హోళీ అంతా అయిపోయాక
    చెదురుమదురుగా మిగిలి పోయిన రంగులు చిలికించి మీ కుంచె ఎందుకు నిస్సహాయంగా ఉండిపోయిందో.. చిత్రించిన మీకే
    తెలియాలి. నేను మీరు రాసిన కవిత చదవలేదు. ఇది అంసపూర్ణ చిత్రంలా కనిపించేలా భ్రమింప చేశారు గానీ.. ఇది సంపూర్ణ చిత్రమే. తెల్లటి ముసుగు వెనుక దాగిన మీ వదనంలో... నాకు ఆనందం కనిపించలేదు. అక్షరాలను అనుభవించారు.. ఇప్పుడు రంగులతో ఆడుకుంటున్నారు. మీ చిత్రానికి ఇదే నా అక్షరకల్పన. ఇది ఊహాత్మకం మాత్రమే. అంచనా తప్పైతే... క్షంతవ్యుడను.

    ReplyDelete
    Replies
    1. సతీష్ గారు నాకు తెలిసినంత వరకు ఆనందమైనా, భాధైనా, అందమైనా ఇంకేదైనా మనం ఆలోచించే స్థితిపై ఆధారపడి ఉంటుందనుకుంటాను. ఒకే చిత్రంలో కొందరు కళ్ళ అందాన్ని చూస్తే మరికొందరు ఆ కంటిలో నీటిని వెతుకుతారు. కలర్ కాంబినేషన్స్ కొందరు చూస్తే తెల్లని ఖాళీలలో ప్రశాంతాన్ని మరికొందరు చూస్తారు. ఇది నా అభిప్రాయము మాత్రమే.
      ఎంతో అభిమానంతో మీ భావాలని తెలియజేసి ఆ చివర్లో...."క్షంతవ్యుడను" ఎందుకండి? సదా మీ అభిప్రాయాలని అశ్శిస్తూ...
      మీ చక్కని విశ్లేషనాత్మక స్పందనకు ధన్యవాదాలండి!

      Delete
  13. మీ కుంచె బొమ్మలేస్తుందా ? లేక... కుంచె తన అంచు నుంచి జాలువారే రంగులను అక్షరాలను చేసి ఇలా మీ బావాలను లిఖింపచేస్తుందా ??? :) ... మీరు మీ చిత్రాన్ని రంగులతో సగం లో ఆపేసి మిగిలిన సగ బాగం మీ అక్షరాలతో పూర్తి చేసినట్లుంది ... !!!


    Nice బ్లాగ్ ...

    ధన్యవాదాలు ,
    http://techwaves4u.blogspot.in/
    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete
    Replies
    1. వెల్ కం టు మై బ్లాగ్.
      Thanks for your comments.

      Delete
  14. చిత్రం అసంపూర్తి అయితేనేం కళ్ళలోనే అన్ని భావాలని చెప్పారుగా

    ReplyDelete
    Replies
    1. అన్ని భావాలనీ ఆ కళ్ళలోనే చూసిన మీకు అభివందములండి :-)

      Delete
  15. అసలు ఎలా రాస్తారు ఈ కవితలు..నేను రాస్తే అది తవిక అవుతుంది...కవితతో మీ మిగితా చిత్రాన్ని కంప్లీట్ చేసారు..కవితని మరియు చిత్రాన్ని కలిపి మొత్తానికి కవిచిత్రం ని evolve చేసారు..:) :)..Chala Bagundi mee kavitha mariyu chitram kuda....

    ReplyDelete
    Replies
    1. నేను రాసిన కవితల్ని/తవికల్ని సహృదయంతో స్పందించి ప్రేరేపించే మీ అందరి ప్రోత్సాహమే ఈ వ్రాతలకి కారణం. ధన్యవాదాలండి.

      Delete
  16. తెగబాగా నచ్చేసారు ఇలా అసంపూర్తిగానే అద్భుతంగా ఉన్నారు :)

    ReplyDelete
    Replies
    1. అసంపూర్తి కళని మెచ్చే మీ అందమైన మనసుకి వందనం.

      Delete
  17. అర్పిత గారు అద్భుతంగా రాస్తారండి .. లలితకళల్లో మీకెన్ని కళల్లో ప్రవేశముందండి ?

    ReplyDelete
    Replies
    1. కళలలో ప్రవేశమే కానీ పండితురాలిని కానండి:-)Thank you.

      Delete
  18. పెదవులని గీయబోతే నవ్వగలవవి కన్నీరు కార్చలేవంది
    ముఖ కవళికలన్నీ ఒకేసారి చూపడం నా తరమేకాదంది
    వంపులన్నీ సొంపుగా దిద్దబొతే చిత్రాంగివాంటూ నవ్వింది
    సహాయం అడగనా చేతినంటే మదితోటిదే దాని చెలిమంది
    భావాలకు రూపం గీయలేక అలిగిన నాతో నా మనసంది
    స్వఛ్ఛమైన నా శ్వేతహృదయానికి రంగులతో పనిలేదంది....ela Nenu enduku ryaleenu

    ReplyDelete
    Replies
    1. ఇంతకన్నా బాగా ఎప్పుడో రాసేసారు కదా మీరు.

      Delete
  19. అక్షరాలని అందమైన రంగులుగా చేర్చి,కలాన్ని కుంచెగా మార్చి చిత్తాన్ని , చిత్రంగా చిత్రించారు ...అభినందనలు..

    ReplyDelete
  20. You are not only expressing your feelings in the form of poems but also giving them a life-like touch with your paintings. Really touched by the way you express yourself in your poems and in your paintings. Moththaniki meeku abhinandanalu telapakunda undalenu. Hats off to you Padma for your multi-faceted nature. I am sure I cannot express like you.

    Padmagaaru Chaala Baagundandi.. :)

    ReplyDelete