ఆలోచిస్తున్నా!

నిర్ణయాలలో తప్పెక్కడో సమయందొరికితే ఆలోచించాలని
రహదారిలో ముళ్ళని చూసుకుని జాగ్రత్తగా అడుగేయాలని
వాస్తుమార్చి మసలినట్లు మన వాస్తవాలని మార్చలేమని
హస్తరేఖల్ని చీల్చి అదృష్టాన్ని నుదుట తిరిగి రాయలేనని
తెలివైనదాన్ని అనుకుంటూనే అన్నీ చేసి ఆలోచిస్తున్నా!!!

నాకిష్టమైనట్లు జాతకాన్ని తిరగరాయమని జగడమాడాలని
గమ్యం చేరడానికి మార్గం మార్చి మలుపులెన్నో తిరగాలని
శ్రమపడకుండా సమస్యలన్నీ సాఫీగా పరిష్కారమైపోవాలని
సమయానికంటే ముందే నచ్చినఫలం చేతికంది రుచించాలని
సులభంగా సాధించబోయి బోనులోపడి బోరుబోరుమంటున్నా!!

జగమెరిగినసత్యాలని సాహసంతో ఎదిరించక అనుసరించాలని
అనుకున్నామని ఆశయాలేవీ అంత సులభంగా చేతికందవని
భావాల సాగరంలో మునగడమెలాగైనా తేలడం బహుకష్టమని
ఈ అనంత జీవనపయనంలో పడిలేస్తూ ఇంకెన్ని గాయాలోనని
సరిదిద్దుకునే సంకల్పంతో తప్పులెవరు చేయరు అనుకుంటున్నా!

17 comments:

  1. బాగాచెప్పారు, నేను ఇలాగే అనుకుంటాను చేయవలసినపనులు చేసేసాక పద్మగారు:)

    ReplyDelete

  2. తెలివైనదాన్ని అనుకుంటూనే అన్నీ చేసి ఆలోచిస్తున్నా!!!
    సులభంగా సాధించబోయి బోనులోపడి బోరుబోరుమంటున్నా!!

    ఈ పై రెండు లైన్లు ప్రతి మానవుని పరిస్థితికి తార్కాణం .


    ఇక ఈ దిగువ ఆఖరి లైను మాత్రం మీ మనసులోని మాణిక్యం .

    సరిదిద్దుకునే సంకల్పంతో తప్పులెవరు కావాలని చేయరు అనుకుంటున్నా!

    ReplyDelete
  3. అందరూ మనలాగే అని అనుకుంటూ మనసుని సరిపుచ్చుకుంటూ సాగిపోవడమే

    ReplyDelete
  4. This is only applicable to women but not men? ;)

    ReplyDelete
  5. చాలా బాగా చెప్పారు . తప్పులందరూ చేస్తారు సరిద్దుకునే సంకల్పం గొప్పది.

    ReplyDelete
  6. మీ అంతర్మధనం బాగుంది.

    ReplyDelete
  7. వాస్తుమార్చి మసలినట్లు మన వాస్తవాలని మార్చలేమని
    హస్తరేఖల్ని చీల్చి అదృష్టాన్ని నుదుట తిరిగి రాయలేనని.......భావుకత + గంభీరత = పద్మార్పిత

    ReplyDelete
  8. మీరిలా ప్రతీది ఫీల్ అయి రాసేస్తే ఎలాగండి.

    ReplyDelete
  9. జగమెరిగినసత్యాలని సాహసంతో ఎదిరించక అనుసరించాలని
    అనుకున్నామని ఆశయాలేవీ అంత సులభంగా చేతికందవని
    భావాల సాగరంలో మునగడమెలాగైనా తేలడం బహుకష్టమని
    ఈ అనంత జీవనపయనంలో పడిలేస్తూ ఇంకెన్ని గాయాలోనని
    సరిదిద్దుకునే సంకల్పంతో తప్పులెవరు చేయరు అనుకుంటున్నా!......... ఈ పదాలను పదే పదే చదువుకున్నాను, ఎంత వేదాంత ధోరణి ఉందో..., జీవితాన్ని ఎన్ని కోణాలనుండి చూశారో ఎంత అనుభవగ్నులో.. అనుకుంటే పొరపాటు ముప్పై వసంతాలు చూసి ఉంటారు, అభినందనలు పద్మ గారూ. మంచి కవిత.

    ReplyDelete
  10. నిర్ణయాలలో తప్పెక్కడో సమయందొరికితే ఆలోచించాలని
    రహదారిలో ముళ్ళని చూసుకుని జాగ్రత్తగా అడుగేయాలని
    వాస్తుమార్చి మసలినట్లు మన వాస్తవాలని మార్చలేమని
    హస్తరేఖల్ని చీల్చి అదృష్టాన్ని నుదుట తిరిగి రాయలేనని
    తెలివైనదాన్ని అనుకుంటూనే అన్నీ చేసి ఆలోచిస్తున్నా...exlent padmagaru ...ela rayadam Meku mere sati super andi

    ReplyDelete
  11. as usually simply super:))

    ReplyDelete
  12. స్పందించిన ప్రతి మనసుకి నమస్సుమాంజలి.

    ReplyDelete
  13. పద్మ గారు ... మీ బ్లాగ్ చాల బాగుందండి.మీరు రాసిన ప్రతి పోస్టు గుండెకి హత్తుకునేల ఉన్నాయ్. మీ బ్లాగ్ ని ఇవ్వలే మొదటి సరి చూస్తున్న.. ఇందులోని చిత్రాలు కూడా మీరు గీసినవేనా? సింప్లీ సూపర్బ్ అండి :)

    ReplyDelete
  14. super and excellent madam.

    ReplyDelete
  15. జీవన సత్యాలను కాచి వడబోసారు పద్మగారు. అభినందనలతో..

    ReplyDelete
  16. padmagaru naa madhi loni maatalu mee kalam lonchi jaari akshra roopam daalchayi.

    ReplyDelete