కలిసేనా!!!

నీ చేయి నేను నా చేయి నువ్వు
చేతి గీతలు చూస్తూ నేను నువ్వు
నా రాతలో రాసిపెట్టి లేవు నువ్వు
నీరాతల్లో ఉన్నానేమో చూడనివ్వు
నా కలల సామ్రాజ్యాధినేతవి నువ్వు
దేహం నేను దానిలోని ప్రాణం నువ్వు.


                 *******

నిన్నెందుకు ప్రేమించానో తెలీదు
నీ తలపుల్లో నాకు నిదురే రాదు
నీనిదురలో నాతలపు కలైనాకాదు
దీని పర్యవసానం ఏమౌనో తెలీదు
మన మనసులకిదేమీ అర్థం కాదు
నువ్వు-నేను మనసు మాట వినదు!


                   ******* 

ఎడబాటు సెగ క్షణం తలిస్తే రగిలిన
దాన్నార్ప జీవితకాలం సరిపోవునా
గాయమవని మదికెందుకో ఈ వేదన
బహుశా దాని సగభాగం నీదగ్గరుందనా
నువ్వు నేను ఒకటైనా తరగని ఈ తపన
కలసిన మనసులు కలిసైనా కడదేరునా?

18 comments:


  1. "నీ తలపుల్లో నాకు నిదురే రాదు
    నీనిదురలో నాతలపు కలైనాకాదు
    దీని పర్యవసానం ఏమౌనో తెలీదు
    మన మనసులకిదేమీ అర్థం కాదు

    ఎడబాటు సెగ క్షణం తలిస్తే రగిలిన
    దాన్నార్ప జీవితకాలం సరిపోవునా "

    నిజం చాలా చాలా బాగుంది .

    ReplyDelete
  2. "కలసిన మనసులు కలిసైనా కడదేరునా?"
    ఈ ఒక్క లైనులో ప్రేమ భావానికి అద్భుతమైన ముగింపులేని ముగింపు ఇచ్చారు. బావుందండీ కవిత. పెయింటింగ్ కూడా...

    ReplyDelete
  3. బతుకు నవ్వుల పాలు కాకుంటే చాలు.

    ReplyDelete
  4. ఎడబాటు సెగ క్షణం తలిస్తే రగిలిన
    దాన్నార్ప జీవితకాలం సరిపోవునా
    గాయమవని మదికెందుకో ఈ వేదన
    బహుశా దాని సగభాగం నీదగ్గరుందనా

    ఇలా మీరే రాయగలరు పద్మార్పిత గారు . హృదయాన్ని ఆవిష్కరించారు ప్రతి పదంలో .
    అభినందనలుతో.

    ReplyDelete
  5. గాయమవని మదికెందుకో ఈ వేదన
    బహుశా దాని సగభాగం నీదగ్గరుందనా e point chala bagundandi, realy heart touching.. nice:))

    ReplyDelete
  6. claps
    claps
    claps
    none other than you can express this lovely feelings

    ReplyDelete
  7. కవిత్వంతో పజిల్ ఇచ్చినట్టు అనిపించింది నాకు ...

    మొదటి ఆరు వరుసలు : అర్ధమయ్యాయి
    రెండవ ఆరు వరుసలు : అర్ధం కాలేదు
    మూడవ ఆరు వరుసలు : అర్ధం అయి అవనట్టు ఉన్నది

    నాకు ఇంకా కొంచం సమయం పడుతుంది అర్ధం అవ్వడానికి ....నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటాను...

    good one !!

    ReplyDelete
  8. విరహం... ప్రేమికుల ప్రపంచంలో ఇది వెలకట్టలేని క్షణాలు. ఆ విరహం విరచించే ప్రతీ భావనా అసలైన
    ప్రేమకు నిక్కచ్చి నిర్వచనం. విరహ వేదనను భరించడమే మధురమైన కష్టం. కఠినమైన వలపు చెరశాలలో
    బందీ అయ్యే మనసు భాష విరహం. ఆ మధురమైన కష్టాన్ని మీ అక్షరాల్లో బందీగా చేసి.. విరహానికే విరహానుభవం
    కలిగించారు. మీ రచనలు గుండెలోతుల్లోంచి వస్తున్నాయి. అక్షరాలను, అనుభవాలను ప్రేమించి రాస్తున్నారు.


    ReplyDelete
  9. మ్రోగిందివీణ హృదయాల లోన..పాటను గుర్తుకు తెచ్చరు చాలా బాగుంది హృదయాన్ని కదిలించారు

    ReplyDelete
  10. మనసు కవిత బాగుంది.

    ReplyDelete
  11. విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పద్మ గారు!

    ReplyDelete
  12. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

    ReplyDelete
  13. విరహ వేదనను కవిత నిండా నింపారు.

    ReplyDelete
  14. చాలా బాగుంది, చిత్రం కూడా.

    ReplyDelete
  15. బాగారాసారు మీదైన శైలిలో.
    విజయనామ సంవత్సర శుభాభినందనలు.

    ReplyDelete
  16. మీ అభిమాన స్పందలకు అభివందనాలర్పిస్తూ, విజయనామ సంవత్సర శుభాకాంక్షలు మిత్రులందరికీ....

    ReplyDelete