అడిగానని అనుకోవద్దు... చెప్పకుండా దాటేయొద్దు!

నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుధ్ధం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయంలాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుషునడిగా, ఆనందాశృవులకు ఆశిస్సు అడిగా
మది నొప్పించని మాటలు అడిగా, ఎద మెప్పించే యవ్వనం అడిగా....

పిడుగులు రాల్చని  మేఘం అడిగా, జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా
వరించు తరించు వలపే అడిగా, ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచు ముథ్యాలడిగా, పువ్వుల ఒడిలో పడకే అడిగా
తనువును ఓదార్చే ఓర్పుని అడిగా, తలనే నిమిరే వేళ్ళను అడిగా
నెమలి ఆటకి పాదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా
గడిలో గుక్కెడు నీళ్ళే అడిగా, మదిలో జానెడు చోతే అడిగా
వద్దంతు లేని జాబిలిని అడిగా, నక్ష్రకాంతి నట్టింటడిగా
యుధం వధించు అస్త్రం అడిగా, అస్త్రం పలించు యోగం అడిగా
చీకటిని ఊడ్చే చీపుర్ని అడిగా, పూలకు నూరేళ్ళ ఆమని అడిగా 
మానవజాతికి ఒక నీతిని అడిగా, వేతలరాసి వేకువ అడిగా 
ఒకటే వర్ణం సబబని అడిగా, ఒకటే అనురాగం గుడిలో అడిగా
వారధి వంతున నెలవంకనడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా 
న్యాయం ధర్మం  ఇలలో అడిగా, ఎద రగిలించే కవితే అడిగా 
కన్నీలెరుగని  కవితే అడిగా, క్షామం నశించు కాలం అడిగా 
చుక్కలు దాటే స్వతంత్రమడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా 
తొలకరి మెరుపుల నిలకడని అడిగా, ఎండమావిలో ఏరుని అడిగా 
మూగ మాటకు చరణం అడిగా, మౌన భాషకు వ్యాకరణం అడిగా
శాంతిని పెంచే సంపదని అడిగా, వస్తే వెళ్ళని వసంతమడిగా
ఏడేడు జన్మలకు ఒక తోడడిగా, ఎన్నడు ఆగని చిరునవ్వు అడిగా
ముసిరే మంచులముత్యాలడిగా, ముసిముసి నవ్వుల ముగ్గులనడిగా
ఆశల మెరుపు జగమే అడిగా, అంధకారమా పొమ్మని అడిగా 
అందరి ఎదలో హరివిల్లడిగా, మరుగైపోని మమతను అడిగా 
కరువైపోని సమతను అడిగా, రాయలంటి కవిరాజుని అడిగా
భమ్మెరపోతన భక్తిని అడిగా, భారతి మెచ్చిన తెలుగే అడిగా
మోహన క్రిష్ణుడి మురళే అడిగా, మధుర మీనాక్షి  చిలకే అడిగా.
ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, ఒడ్డెకించే గమ్యం అడిగా 
మల్లెలు పూచే వలపే అడిగా, పిడుగుని పట్టే ఉరుమే అడిగా
ద్రోహం అణిచే సత్తా అడిగా, చస్తే మిగిలే చరిత్రని అడిగా
విధిని జయించే ఓరిమినడిగా, ఓరిమిలో ఒక కూరిమినడిగా
సహనానికి హద్దేదని అడిగా, దహనానికి అంతేదని అడిగా
కాలం వేదం కాంతులనడిగా, చిన్నా చితక జగడాలడిగా
తియ్యగా ఉండే గాయం అడిగా, గాయానికి ఒక ధ్యేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా, ఒడిలో శిశువై చనుబాలే అడిగా
కంటికి రెప్ప తల్లిని అడిగా, ఐదో ఏట బడినే అడిగా
ఆరోవేలుగ పెన్నే అడిగా, ఖరీదు కట్టని చదువే అడిగా...

ఎన్నడడిగిన దొరకనిది, ఎంతనడిగిన దొరుకనిది, ఎవ్వరినడుగను నా గతిని
కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్ళకు గమ్యం కాదంటూ
భగవత్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా

చదివి అలసిపోయారా???? పాటా విని సేదతీరుతూ......కాస్త ఆలోచించండి
అడిగినవాటిలో ఏమివ్వగలరో!!!!!!!!
http://www.dhingana.com/nityam-ekanta-kshaname-adiga-song-adhputham-telugu-oldies-2a62631
అక్షరమక్షరం....."అద్భుతం" ఈ పాటలో
 పాటని పదీకరించడంలో తప్పులు దొర్లితే మన్నించి స్పందిస్తారని ఆశిస్తూ.....
                                                                                                  ......మీ
                                                                                                  !పద్మార్పిత!

40 comments:

  1. మనల్ని మనం తెలుసుకుంటే అంటే మన అంతరంగాన్ని ,మనలో ఉన్న మన అంతర్వాణిని మనం వింటే
    ఎవర్నీ ఏమీ అడగనవసరం లేదు.అన్నింటికీ అదే సమాధాన మిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు వ్యాఖ్యకి ధన్యవాదాలండి......మీరన్నది అక్షరాలా నిజమే, మీ మనసులోని (మనస్సాక్షి) మాటని చెప్తారని అడిగా :-)

      Delete
  2. Replies
    1. చాన్నాళ్ళకి ఇటువైపు మీరాక.....ధన్యవాదాలండి.

      Delete
  3. పాట రాసినదెవరండి పద్మార్పిత గారు?
    నిజంగానే,మీరన్నట్టు అద్భుతమైన లిరిక్స్.
    Thanks for sharing.

    ReplyDelete
    Replies
    1. నన్ అదర్ దాన్ వేటూరిగారు.....పాడినవారు...చిత్ర & బాలుగారు!
      Thanks for affectionate comments

      Delete
  4. hi. typographical errors, three sentences weren't typed and a good effort to transcribe.

    ReplyDelete
    Replies
    1. Hi...Thanks for your compliments and for respond to my post.
      May be I couldn't catch those sentences....
      I am very much thankful to you, if you can!!

      Delete
  5. బావుందండి. ఎప్పుడో విన్న గుర్తే.
    టైటిల్ తాలూకూ "బాలరాజు కథ"లో పాట కూడా బావుంటుంది. ఆ సినిమా కూడా బావుంటుంది.

    ReplyDelete
    Replies
    1. తృష్ణగారు......ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మీ స్పందన, ధన్యవాదాలండి. అవునండి మీరన్న "బాలరాజుకధ" లోని పాట సినిమా కూడా బావుంటుంది.

      Delete
  6. బ్రహ్మాండమైన పాట పదాలని ప్రెజెంట్ చేసి అందరికీ అర్థమైయ్యేలా విశదీకరించిన మీ ఓపికకు మీకు అభినందనలు. ఈ పాట మొదటిసారి వింటున్నా, అల్లా ఇప్పటికి 5 సార్లు విన్నా. చాలా చాలా నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. తర్కంగారి మనసుని మెప్పించడం అంటే కష్టమే.... అయిన్నా మెప్పించాను కదా...:-) ధన్యవాదాలండి.

      Delete
  7. చదవడానికే కష్టపడుతున్నా, చదివినందుకు ఫలితం దక్కినట్లైంది. చాలా ప్రయాసతో చక్కగా రాసారండి.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ లిపిగారు.

      Delete
  8. అద్భుతంగానే ఉంది.మొదట మీరు వ్రాసిన కవితేమోనని అనుకున్నా.పాటలో అడగకుండా మిగిలినవేమున్నాయి ఎవరైనా ఇవ్వడానికి.ధన్యవాదాలు తప్ప.

    ReplyDelete
    Replies
    1. ఎంకేమివ్వను అంటూ తప్పించుకుంటే ఎలాగండి.....ఇంకా బాగా రాయమని ఆశీర్వధించండి.

      Delete
  9. టైటిల్ చూసి , టైటిల్ బాగుందని చెప్దామని వచ్చేనండి.పూర్తిగా చదివేకా చెప్పకుండా దాటేస్తే ఏం బాగుంటుంది? చెప్పండి. పాట చాలా బాగుంది. కష్టపడి రాసిన పద్దతీ బాగుంది.

    ReplyDelete
    Replies
    1. వెల్ కం టు బ్లాగ్......ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  10. Replies
    1. paataku okati tapaaku comment pettinanduku marikati...thankulu :-)

      Delete
  11. chaala chaala bagundi. super padma garu..

    ReplyDelete
  12. Song Super...
    Post Super Duper
    U are Multi talented:)

    ReplyDelete
  13. Yohanth ninna "Baadsha" cinema choosaaraa ? :-) ila super duper antenu.........

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. "మోహన క్రిష్ణుడి మురళే అడిగా, మధుర మీనాక్షి పుడకే అడిగా"
      ఇందులో తప్పు ఏముందో నాకు అర్థం కాలేదు.
      మహోన్నత సినీకవులురాసిన వాటిని నేను పదీకరించడంలో చాలా తప్పులు దొర్లాయని ముందే తెల్పాను ( ఇన్ని లైన్లని పాటవింటూ టైప్ చేయడానికి ఆరు గంటలు పట్టింది. అందునా రివైండ్ పాస్ట్ ఫార్వాడ్ చేస్తూ ఇలా నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించాను. తప్పులు సరిచేస్తే సంతోషమేకాని కోపం రాదులెండి. :-)

      Delete
    2. సారీ ! Padmarpita గారు. నేను ఏమని వ్రాయాలనుకున్నానంటే ..మధుర మీనాక్షి చిలకే అడిగా...అని ఉన్నట్లుందని.

      Delete
    3. సారీ ఎందుకండి!... మీరన్న చిలకే కరెక్ట్, పాట పదే పదే వినేకొద్దీ ఎన్నో పదదోషాలు ప్చ్:-(

      Delete
  15. ఇప్పుడే వింటున్నా....ఇలా ప్రత్యేకమైన పాటలు వినడంలో కూడా ప్రావీణ్యం ఉందని తెలిసింది. వందనములు మీ చతుర కళలకు. :-)

    ReplyDelete
    Replies
    1. ఏ కళైనా అంతా మీ అభిమానమండి.

      Delete
  16. మీ ఓర్పుకి నా జోహార్లు !!

    బాగుంది!

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  17. WOW!
    థాంక్స్ పద్మార్పిత గారు :)

    ReplyDelete
  18. naaku ee paata ante bale estam, breathless song from balu. lyric kosam edi varaku vedika netlo dorakaledu. telugu lo post chesinanduku thanks andi. recentga kuda taluchukunna song vindamani. bahusha naa gosha mee daaka cherindemo. thank you madam.

    ReplyDelete
  19. aunanadi paatalo prati padam baaguntundi.Thanks for your respond.

    ReplyDelete
  20. అమ్మో....ఎంత కష్టమో ఇలా పదీకరించడం
    చక్కని పాటను పరిచయం చేసారు...అభినందనలు!

    ReplyDelete
  21. This comment has been removed by the author.

    ReplyDelete