నా ప్రియుడు

నేనే తన ప్రాణమంట నేనంటే పడిచస్తాడు
నలుగురిలో అలుసు చేయకన్నా వినడు
నన్ను ప్రేమించానంటూ నా వెంటపడతాడు
నన్ను వీడమన్నా పోని జగమొండివాడు


గాయమైన నా మనసుకి లేపనం రాస్తాడు
పిల్లగాలులు అల్లరిచేస్తే మందలించే తోడువాడు
నా కళ్ళలో తనువులో శ్వాసలో కౌగిలిలో వాడు
పాటై ఓమారు కవితై మరోమారు నను తాకినాడు


కోపంలో పరుషమాటలాడనీయని మౌనమౌతాడు
అలవికానిచోట అధిక్యత ఏలంటూ అణచివేస్తాడు 
స్నేహితుడిలా పోట్లాడి శత్రువన్నా దూరంకాడు
పగలు దూరమైనా రేయంతా నన్నంటి ఉంటాడు


ఇంతలా నన్ను అల్లుకుని నాకే సొంతమైనోడు!!!!
ఏవరో కాదు "ఒంటరితనం" వాడే నా ప్రియుడు:-)

37 comments:

  1. wow something is there in your poetry which attracts people like me who are least intrested in poetry. A Bow to your style

    ReplyDelete
    Replies
    1. Oh....your comments are secret(boost) for my poetry:-)thank you.

      Delete
  2. నిజమే... నా ప్రేయసి కూడా

    ReplyDelete
    Replies
    1. ఔనా... ఇద్దరూ కలిస్తే "ఒంటరితనమే" మళ్ళీ:-)

      Delete
  3. అనుకున్నా ఇలాంటి మనసుకి హత్తుకునే సరికొత్త స్టైల్ తో ఈరోజు కవిత రాస్తారని....కుడోస్

    ReplyDelete
    Replies
    1. ఓహో....ఎంత అభిమానంతో కూడిన నమ్మకమో! :-)

      Delete
  4. ఏమండి ఒంటరితనం గారు పద్మగారికి కూసింత వినోదాన్ని పంచవచ్చు కదా...

    ReplyDelete
    Replies
    1. వినోదాన్ని పంచడానికి వినోద్ లాంటి మిత్రులుండగా పద్మ ఒంటరితనాన్ని పట్టించుకోదండి...

      Delete
  5. Simply Super...:).Very Touching..

    ReplyDelete
  6. కవితలా తాకిన ,,ఓ 'ఒంతరితనమా' పద్మ గారు దగ్గర ' బందీ' ఐపోకేం..

    ReplyDelete
    Replies
    1. ఏంటో! నా ప్రియుడ్ని దోచుకుపోవాలన్న కుట్రలో ఉన్నట్లున్నారు....:-)

      Delete
  7. అర్పితగారు ప్రస్తుతానికి మీ ప్రియుడు నాతోనే ఉన్నాడు:-)

    ReplyDelete
    Replies
    1. ఇలా ఎంతమందితో ఆడుకుంటాడో మరి:-)

      Delete

  8. ఒంటరి తుంటరి కొంటరి చేతపోటరి
    జూటరి పద్మార్పిత తూటరి !
    దిట్టరి , నీటరి నెరయొంటరి !
    పాటరి పోటరి బంటరి
    ఈ మీనమునకు మేటరి మీలవేటరి !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. తిట్టారో
      మొట్టరో
      మెచ్చారో
      తెలీదు...కానీ
      మీరు మాత్రం
      మహాతుంటరి :-)

      Delete
  9. "కోపంలో పరుషమాటలాడనీయని మౌనమౌతాడు " ఇదొక్కటీ చాలు మీ కవిత్వాన్ని అభిమానందా చదవడానికి.

    ReplyDelete
    Replies
    1. మీ అందరి అభిమానమే అలా రాయిస్తుందండి....ధన్యవాదాలు.

      Delete
  10. super padma, ekkadinundi vastayandi inni padaalu, mee kavitalu chaduvutunnapudalla telugu inka special gaa anipistundi, kevvu keka:-))

    ReplyDelete
    Replies
    1. thank q శృతిరుద్రాక్ష్ :-)

      Delete
  11. మీ ప్రియుడిగా ఒంటరితనం జన్మ ధన్యం :-)

    ReplyDelete
    Replies
    1. వాడి జన్మధన్యమో...లేక నా పూర్వజన్మ....:-)

      Delete
  12. స్నేహితుడిలా పోట్లాడి శత్రువన్నా దూరంకాడు
    పగలు దూరమైనా రేయంతా నన్నంటి ఉంటాడు...

    ఇంత బాగా ఎలా రాసేస్తారో?? అనిర్వచనీయం పద్మ గారూ... అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. ఇలా పొగిడితే!!! కూసింత గర్వం పెరిగి ఒంటతితనాన్ని మరింత ప్రేమిస్తానేమోనండి వర్మగారు :-)

      Delete
  13. పద్మార్పిత...ఇది అన్యాయం "ఒంటరితనం" కూడా నీవెంటేనంటే ఎలాగమ్మడూ :-)

    ReplyDelete
    Replies
    1. అభియోగమా లేక అభిమానమా సృజనగారు :-)

      Delete
  14. ఒంటరి తనం గురించి కవితాత్మకంగా చాలా బాగా చెప్పారు ,అయినా మీ కవిత్వాన్ని పొగిడేంత తెలివితేటలు నాకు లేవనుకోండి.అయినా కొంచం ఆస్వాదించగలను.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి.....తెలివితేటలతో పొగడాలా ఏంటండి!
      మీ ఆస్వాదనలోని అభిమానాన్ని గమనించానండి.

      Delete
  15. ఒంటరితనం లో ఎన్నెన్ని వర్ణాలో !

    ReplyDelete