దాగనీ...

రా...ఎదలోయల్లో దాగనీ మన ప్రేమని
నలుగురి కంట పడనీకు అనురాగాన్ని
నరుడి దృష్టికి పగులును నల్లరాయైనా
ప్రేమకి నిర్వచనమననీ చూసినాఎవరైనా!

రా...చిక్కుముడులు పడనీ మనసులని
అల్లుకోనీ ఎవరు విడదీయలేని బంధాన్ని
కంటనీరు చూడాలనుకోకు కారణమేదైనా
తరగనీయకు ప్రేమ సాంధ్రతను ఏదేమైనా!

రా...నేసేద్దాం కలకాని రంగుల జీవితవలని
చేజిక్కనీ నాది నీదైన వలపు సామ్రాజ్యాన్ని
ఏలాలి దాన్ని ఒడిదుడుకులెన్ని ఎదురైనా
ఎదలు ఒకటై విరబూయాలి ఎన్నిజన్మలైనా!

రా...చాటించిప్పుడది అసలైన పరిపూర్ణప్రేమని
నలుగురు మెచ్చి ఆశీర్వధించనీ ఆ జీవితాన్ని

44 comments:

  1. రా రమ్మని పిలిచి చక్కాని ప్రేమ సందేశమిచ్చారు:)

    ReplyDelete
    Replies
    1. రాకపోయినా పర్వాలేదు....సందేశమందుకోండి :-)

      Delete
  2. Beautiful poem Padma garu

    ReplyDelete
  3. స్వఛ్ఛమైన నిఃస్వార్థ ప్రేమ కు తలమానికం లా ఉంది, మీ కావ్యాన్ని చదువుతుంటే. ఎన్నడు ఏమెదురొచ్చినా ఎప్పటికి నిలిచుండే మధురానుభుతి కి మంచి నిర్వచనాన్ని తెలిపారు. మీ ఆలొచనల ఔన్యత ఇందులొ ప్రస్ఫుటంగ బహిర్గతమయ్యింది అర్పిత గారు.

    ReplyDelete
    Replies
    1. మీ పరిశీలనాదృష్టికి అభివందనం.

      Delete
  4. కంటనీరు చూడాలనుకోకు కారణమేదైనా
    తరగనీయకు ప్రేమ సాంధ్రతను ఏదేమైనా!

    హృదయాన్ని హత్తుకునే కవితనందించినందుకు ప్రేమార్పితకు వందనాలు..

    ReplyDelete
    Replies
    1. ఆస్వాధించిన మనసుకు అభివందనం.

      Delete
  5. రా...చాటించిప్పుడది అసలైన పరిపూర్ణ ప్రేమాని
    పలువురు మెచ్చి ఆశిర్వదించనీ ఆ జీవితాన్ని

    దూరాలు మన మధ్య అడ్డంకులైనా
    వెలుగులు నింపని ఆప్యాయతను ఈ శుభ తరుణానా!

    తప్పు ఏదైన ఉంటే క్షంతవ్యుణ్ణి

    సరిచుసుకొండి... లాస్ట్ స్టాంజా, సెకండ్ లైన్ లొ: ఆశిర్వధించు అని రాదు.. అర్థం ఆ తలను నరుకు అని వస్తుంది: వధ అంతె నరకమని/చంపమని అర్ధం."ఆశిర్వదించు" సరైనది వదం అంటె పలుకు.
    కవిత యావథ్థు చాలా రమణియంగా ఉంది, అందులొ ఎటువంటి సందేహము లేదు.తప్పును ఎంచినందుకు క్షమించండి పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. ఇందులో అనుకోవడానికి ఏముందండి....నాకు నేను రాసింది కరెక్ట్ అన్నభావం. చిన్ని చిన్ని టైపింగ్ మిస్టెక్స్ ఉన్నా......చెప్పాలనుకున్న భావం అందరికీ అర్థం అయితే చాలు అని భావిస్తానండి. మీ ఆప్యాయతతో కూడిన సవరింపుకు అభివందనం.

      Delete
  6. This poem was written in hopeful tone!Your painting dominated your poem again Padmarpita gaaru!

    ReplyDelete
    Replies
    1. Thank you very much. Eye catchy paintings always dominate the Alphabets(aksharaalu)I am help less sir :-)

      Delete
  7. మీ బ్రాండ్ మార్క్ కవిత.....బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. బ్రాండ్ మార్కంటూ లేబుల్ వేయకండి తెలుగమ్మాయిగారు :-) thank Q!

      Delete
  8. కంటనీరు చూడాలనుకోకు కారణమేదైనా
    తరగనీయకు ప్రేమ సాంధ్రతను ఏదేమైనా!

    కొత్త ఒరవడికి చేసిన ప్రయత్నం బాగుంది ...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సాగర్ గారు.

      Delete
  9. అద్భుతం అనలేను ఇంకా ఏదో అసంపూర్తి అగుపిస్తుంది అర్పితా, ఆలోచిస్తే ఇంకా బాగారాయగల ప్రతిభ నీలోఉంది. బహునా నా ఆస్వాధలోపమో లేక ప్రస్తుత పరిస్థితుల ప్రభావమో తెలియదు. చెప్పాలనిపించింది చెప్పాను. ఆశీర్వచనంతో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. అన్ని భావాలు అందరికీ అద్భుతంగా అందించాలన్న ప్రయత్నం అయితే చేయగలను కాని అందించడం చాలా కష్టమండి. హరినాధ్ గారు....ఎప్పుడూ మీ ఆశ్శీస్సులతో పాటు సలహాలను కూడా కోరుకుంటూ.... ప్రణామం.

      Delete
  10. OKA ANDAMAINA KAVITA.. BEAUTIFUL

    ReplyDelete
  11. అందమైన ప్రేమకావ్యం. బాగుంది.

    ReplyDelete
  12. మీ కవితలు చదివినప్పుడంతా ఆలోచిస్తాను ఆడవాళ్ళలో నిజంగా ఇంతల ప్రేమించే మనసుంటుందా, ఉంటే మరెందుకు వారిపై అభియోగాలు వేస్తారు అని. ఉండరు అని నిశ్చయించుకునేలోపే ప్రేమ కవితతో కట్టిపడేస్తారు మీరు.

    ReplyDelete
    Replies
    1. అసలు అందమైన మనసుండేది ఆడవారికే అనానిమస్ గారు. కానీ ఆలోచించి అడుగువేస్తారుకదా అందుకే అభియోగాలు. :-). థ్యాంక్యూ.

      Delete
  13. cAlA cAlA bAguMdi
    నరుడి దృష్టికి పగులును నల్లరాయైనా ,
    ప్రేమించటమే కాదు , ఆ ప్రేమను పది కాలాలపాటు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎంత బాగా చెప్పావు పద్మా . చిత్రం గురించి ప్రతిసారి అమోఘం అంటం నీకు చిత్రంగా వుండవచ్చు . కాని మరోదారి నాకు కనపడలేదు మరి .

    రా...ఎదలోయల్లో దాగనీ మన ప్రేమని ( ఎద లోయల్లో దాగిన మన ప్రేమని అలాగే దాగనీ )
    నలుగురి కంట పడనీకు అనురాగాన్ని ( నలుగురి కంట పడనీకు మన / ఆ అనురాగాన్ని )

    ప్రేమకి నిర్వచనమననీ చూసినాఎవరైనా! ( ప్రేమకి నిర్వచనమననీ చూసినవారి నెవ్వరైనా !)

    రా...చిక్కుముడులు పడనీ మనసులని ( చిక్కుముడులు పడనీ మన మనసులని )
    అల్లుకోనీ ఎవరు విడదీయలేని బంధాన్ని ( అల్లుకోనీ ఎవరు విడదీయలేని ఈ బంధాన్ని )
    కంటనీరు చూడాలనుకోకు కారణమేదైనా
    తరగనీయకు ప్రేమ సాంధ్రతను ఏదేమైనా!( తరగనీయకు ప్రేమ సాంధ్రతను ఎన్నటికైనా!)

    రా...నేసేద్దాం కలకాని ఈ రంగుల జీవిత వలని ( రా.. కలసి నేసేద్దాం కలకాని , కల్లకాని ఈ రంగుల జీవిత వలని )
    చేజిక్కనీ నాది నీదైన వలపు సామ్రాజ్యాన్ని ( చేజిక్కనీ నీదైన నా వలపు సామ్రాజ్యాన్ని)
    ఏలాలి దాన్ని ఒడిదుడుకులెన్ని ఎదురైనా ( ఏలాలి ఎన్ని ఒడిదుడుకులెదురైనా )
    ఎదలు ఒకటై విరబూయాలి ఎన్నిజన్మలైనా!( ఎదలు ఒకటై విరబూయాలి ఎన్ని జన్మలెత్తినా )

    రా...చాటించిప్పుడది అసలైన పరిపూర్ణప్రేమని ( రా...చాటించు యిప్పుడది అసలైన పరిపూర్ణప్రేమ అని )
    నలుగురు మెచ్చి ఆశీర్వధించనీ ఆ జీవితాన్ని ( నలుగురు మెచ్చి ఆశీర్వదించనీ ఈ జీవితాన్ని )

    ReplyDelete
    Replies
    1. అయ్యబాబోయ్.....ఇది శర్మగారి ప్రశంసా కమెంట్ అంటే నమ్మకుంది మనసు.... :-) ఎందుకంటే ఇంత వివరంగా నా బ్లాగ్ లో విశధీకరించడం ఇదే మొదటిసారనుకుంటా. నమోవందనాలు.

      Delete
  14. ఏం వ్రాయాలో అని ఇప్పటికి పదిసార్లు చదివి ఆలోచించాను. ఆలోచించేలోపునే పదిమంది నేను చెప్పాలనుకున్నది చెప్పేసారు. అందుకే అలా చదువుతూ అస్వాధిస్తూ హాయిగా రిలాక్స్ అవుతున్నాను.Beautiful expression.

    ReplyDelete
  15. ఏమిటొ? "దాగనీ" అంటారు... "రా" అంటారు!
    మొత్తం మీద "ప్రేమ" బాధ అని అర్ధం అయింది.

    ReplyDelete
    Replies
    1. భాధ అని తెలిసి కూడా తర్కించకుండా ప్రేమ అని తేల్చారు :-) ధన్యవాదాలండి.

      Delete
  16. chala bagundi padmarpita garu:-)) meeru edi cheppina super andi:-))

    ReplyDelete
  17. ఎద లోతుల్లో దాచుకుంటే ప్రేమను వ్యక్తపరిచేది ఎలా మిత్రమా? నలుగురి కంటా పడనీకు అనురాగాన్ని అంటూనే అఖరిలో నలుగురు మెచ్చి ఆశీర్వదించనీ ఈ జీవితాన్ని అన్నారు. భావం అర్థం చేసుకోవడానికి కాస్తా సమయం పట్టింది. మంచి పరిణితితో రాస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. సమయం తీసుకుని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలండి.

      Delete
  18. పద్మార్పిత గారూ..ఏమీ అనుకోకండి... భావన, అది ప్రజంట్ చేసే విధానం ఒక్కక్కరి స్టయిల్ ఒకోలా వుంటుంది,ఈ కవితలో ,రా..రా.అనే పదం ,కవిత యొక్క beauty ని dignity ని తగ్గిస్తోంది,నలుగురి కంట పడనీకు ప్రేమనీ, అనురాగాన్ని అంటూనే,నలుగురూ మెచ్చేలా చాటించమంటున్నారే..బాగుందండి..

    ReplyDelete
    Replies
    1. పరిణితి చెందని ప్రేమని పదిమందిలో పెట్టి ప్రయోజనం ఉండదు. పరిపక్వత వచ్చాక చాటాలని నా భావం. మీకు నచ్చిననందుకు సంతోషమండి.
      రా రా...అని కాకుండా నా అనుకున్న ప్రియుడ్ని రండి ప్రేమని, కౌగిలిని అందించండి అంటే ఏం బాగుంటుంది చెప్పండి. అయినా మన అనుకున్న వారినే కదా అలా చనువుగా నువ్వు, రారా, పోరా అని అంటాం.( ఇది కేవలం నా అంతరంగ భావమే కాని ఎవరిని ఉద్ధేశించి కాదని నా మనవి ) సదా మీ సలహాలని కోరుతూ....

      Delete
  19. ఇంత అలవోకగా రా రమ్మంటే.....రాకుండా ఉంటారా:-)

    ReplyDelete
    Replies
    1. :-) అలవోక కూడా ఆడవారికి ఒక ఆభరణమే అని మీకు నేను చెప్పాలా సృజనగారు :-)

      Delete
  20. చిత్రం చాలా బాగుంది పద్మాజి మీ కవితలానే.!

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ వినోద్ గారు.

      Delete
  21. రా...నేసేద్దాం కలకాని రంగుల జీవితవలని
    చేజిక్కనీ నాది నీదైన వలపు సామ్రాజ్యాన్ని
    ఏలాలి దాన్ని ఒడిదుడుకులెన్ని ఎదురైనా
    ఎదలు ఒకటై విరబూయాలి ఎన్నిజన్మలైనా!...ela Rayagalara evvarina oka padmagaru Tappa

    ReplyDelete