కావాలనికోరే వ్యసనం
చేయాలనుకునే నేరం!
అంతుచిక్కని ప్రశ్నవి
అందమైన జవాబువి
అర్థం కాని బంధానివి!
తలపుల తనువుకి అల్లికవై
వాస్తవంలో కంటికి దూరమై
పొమ్మంటే మరింతగా దగ్గరై!
ఆనందపు ఆటుపోట్ల అలగా
తట్టుకోలేని వేదనకి రూపంగా
కాదు-అవును మధ్య మదిగా!
లోలోనే జరిగే సంగ్రామం నీవు
ద్వి ప్రవర్తనల సంఘర్షణ నీవు
నా పరావర్తనం విశ్లేషణం నీవు!
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మొదటి కమెంట్ పెట్టే చాన్స్, ఇలా అర్థరాత్రుళ్ళు మేలుకోవాలన్నమాట. కవితపై చివరి కమెంట్ నేనే రాస్తాను :) పెయింటింగ్ లో మొత్తం కవితా వేదన కనపడుతుంది.
ReplyDeleteలోలోనే జరిగే సంగ్రామం నీవు
ReplyDeleteద్వి ప్రవర్తనల సంఘర్షణ నీవు
నా పరావర్తనం విశ్లేషణం నీవు!
ఈ లైన్స్ చాలా చాలా బాగున్నాయి....simply superb...
అందమైన (అనంతమైన )
ఆటు పోట్లు ( భావమే ఒక )
మధ్య (సందిగ్ధాన ) గా నాకు స్ఫురించిన పదవినియోగం .... ;-)
తలపుల తనువుకి అల్లికవై
ReplyDeleteవాస్తవంలో కంటికి దూరమై
పొమ్మంటే మరింతగా దగ్గరై!
Its so painful feel
అప్పుడే నవ్వించి అంతలోనే ఏడిపించడం ఎందుకు అర్పితా?మొన్ననే మాపై ధ్వజమెత్తి ఊరటచెందావు అనుకుంటే అంతలోనే ఇంత వేదనా?
ReplyDeleteజీవితమింతేలే మానవ జీవితమింతేలే.....
ReplyDeleteపగలుని చూడని కల కోసం ఎందుకీ ఆరాటం
ReplyDeleteఅందరాని చంద్రుడని తెలిసి ఏలా నీకి తాపత్రయం
కమ్మని బంధమై అల్లుకోని అనురాగానికి ఇంత ఆవేదన
కరుడుగట్టిన మనసుకేన ఈ అనంతమైన భావ వేదన
ఇంతకన్నా చెప్పడానికి మాటలు రావటం లేదు అర్పిత గారు. ఆ అమాయకపు కన్నుల్లో ఇంత ఆర్ద్రత నిండి ఉందని చెప్పకనే చెబుతున్న ఆ చిత్రం చాల ఆలోచనాత్మకం.
శ్రీధర్ భుక్య
వద్దనుకునే జీవితం
ReplyDeleteకావాలనికోరే వ్యసనం
కాదు-అవును మధ్య మదిగా!
ద్వి ప్రవర్తనల సంఘర్షణ నీవు
ఎంత చక్కని భావన....
మది ఎప్పుడూ కాదు అవునుల మధ్యనే ఊగిసలాడవలసిందేనా......ఐనా ఇదీ బావుంది....మనలోనె మన మదిగా మిగలడం....అంతకన్నా ఏమాశించగలం
A beautiful feel...
కాదు-అవును మధ్య మదిగా!
ReplyDeleteనా పరావర్తనం విశ్లేషణం నీవు!
హృదయాన్ని ఆవిష్కరించిన పద పాద ముద్రలు పద్మార్పిత గారు..
No more words.. Just feel it feel it feel it.. _/\_ (పుష్పాంజలి)
chaala chaala bagundi:-)) meeru raase padaalaku velakattalemu padma garu.. anta andanga special ga untay:-)) verma gaaru annatu meeku pushpanjali..
ReplyDeleteచిన్ని చిన్ని పదాలతో అల్లిన
ReplyDeleteపెద్ద పెద్ద మనసు(లోని) భావాలు
మీ కవిత బాగుంది.
పెయింటింగ్ అద్భుతం!
చక్కని పెయింటింగ్ మరియు చక్కని భావిష్కరణ అభినందనలు పద్మర్పిత గారు
ReplyDeletekavita good painting maree over reacted expressions
ReplyDeleteవేదనపాళ్ళు కాస్త ఎక్కువ కనిపిస్తున్నాయి.
ReplyDeleteayya baaboy, enta chakkati chittaruvulu, vaatine choostoo undi poyaa, kavitalanu chadivi mallee vraastaanu,
ReplyDeleteఇంత అమితమైన సంఘర్షణలతో ఆ చిత్రంలో చిన్నది ఎంతో పెద్దదానిలా అగుపిస్తోంది .
ReplyDeleteనాకు నీవు , నీకు నేను అనుకోవటం ( ఒక వైపు నుంచే అవటం )వలననే ఈ సంఘర్షణ .
ఈ ద్వంద ప్రవ్యక్త భావాలని వ్యక్తపరచడంలో అందెవేసిన చేయి మీది :-)
ReplyDeleteనాకు నీవు అంటే.....ప్రేమ వర్షపు జల్లులనుకుని, ఆదివారం ఆటవిడుపనుకున్నా. ఇంత నిరాశానిసృహలు వద్దు పద్మార్పితా నీకు. చిత్రం కడు ధీనంగా ఉంది. చక్కగా ఒక అహ్లాదకరమైన పోస్ట్ తో అలరించు-హరినాధ్
ReplyDeleteనా మనస్పందనలకు ప్రతిస్పందిస్తున్న ప్రతి హృదయానికి నమస్సులు.
ReplyDeleteవిడివిడిగా జవాబులు ఇవ్వలేదని అలుగక ఈసారికి మన్నించేయండి.......ఇంకనుండి విడి విడిగా జవాబులతో మిమ్మల్ని విసిగిస్తానుగా :-)
ReplyDeleteఈ కవితకు సరిపాటిగా కామెంటు రాయడానికి పదాలు దొరకడంలేదు ఎవరైనా కాస్త సహాయం చేయరూ ప్లీజ్
ReplyDelete