పనికిమాలిన ప్రేమ

ఉదయాన్నే కలిసి ఉడాయిద్దామంటే "ఊ" అన్నాను
కట్టుబట్టలతో పాటు 50కేజీల బంగారం నీదన్నాను..
పాక్కుంటూ వచ్చి పిలవకుండానే పరిగెత్తిపోయావు
ఫోన్ కాల్ చేసి ప్రశ్నిస్తే బిజీగున్నానని కట్ చేసావు..
నీవంటావు పరికిణీపైట పారిపోవడానికి అనువుకాదని
నాకు తెలిసింది టామీగాడి అరుపులు బెదగొట్టాయని!

మధ్యాహ్నం ముహూర్తమంటే "హ్మ్" అనుకున్నాను
మండుటెండలో మారుతీకారైనా తెస్తాడని ఆశపడ్డాను..
దాహమని మినరల్ నీళ్ళుతాగి మరీ మూర్చపోయావు
సేదతీర్చి సంగతేందంటే సడిచేయకని కనుసైగ చేసావు..
నీవన్నావు వేడికి మిడ్డీ స్కర్ట్ లో నా కాళ్ళు కందేనని
నే కనిపెట్టాను నీ పిరికితనాన్ని కప్పడానికి ఇదో వంకని!

సాయంకాలం సరదాగా షికారుకు అంటే "సై" అన్నాను
విజిలేసి రమ్మంటావని కిటికీలు బార్లా తెరచి ఉంచాను..
బైక్ పై జివ్వునవచ్చి రయ్ రయ్యంటూ వెళ్ళిపోయావు
కారణం అడిగితే కిమ్మనకుండా 'కీ'ని కొరుకుతున్నావు..
నీవు చెప్పే కారణం నేవేసుకున్న జీన్స్ ప్యాంట్ 'టీ'షర్టని
నాకు తెలుసు గుమ్మం దగ్గర మానాన్న నిల్చున్నాడని!

రా......రా......అంటూ రాత్రివేళ నేనే రమ్మని పిలిచాను
నా చేత్తోనే అద్దాలని రాతిగంధం తీసి రెడీగా ఉంచాను..
దొంగచాటుగా గోడదూకి వచ్చి హీరోలా ఫోజ్ ఇచ్చావు
పగటివేళ పిరికివాడివై రేయిమాత్రం నీ బుద్ధి చూపావు..
నీవు చూస్తున్నది నా షిఫాన్ చీరలో దాగిన అందాలని
నాకు తెలిసింది పిరికి హృదయమెన్నడూ ప్రేమించలేదని!

54 comments:

  1. వావ్...మీ కవితా శైలి ప్రశంశనీయం!

    ReplyDelete
    Replies
    1. మీ ప్రసంశా వ్యాఖ్యలే నాకు ప్రియం.

      Delete
  2. పద్మా ,

    ఈ సారి కవితా వస్తువు ,ధోరణి రొటీన్ కి భిన్నంగా వుండి మారింది . బాగుంది . మగబుధ్ధి ఏ రకంగా చూసినా అంతేనని ఎంత బాగా చెప్పావ్ .


    దొంగచాటుగా గోడదూకి వచ్చి హీరోలా ఫోజ్ ఇచ్చావు
    పగటివేళ పిరికివాడివై రేయిమాత్రం నీ బుద్ధి చూపావు..
    నీవు చూస్తున్నది నా షిఫాన్ చీరలో దాగిన అందాలని
    నాకు తెలిసింది పిరికి హృదయమెన్నడూ ప్రేమించలేదని!

    ఇలా మగవాళ్ళను కవ్వించేది ఆడవాళ్ళే నని కూడా బాగా చెప్పావ్ .

    ReplyDelete
    Replies
    1. మగబుధ్ధి ఇంతేనని సమర్ధించారో, కవ్వించేది ఆడవాళ్ళేనని నిందవేసారో అర్థం కాలేదండి ;-)

      Delete
    2. kavithani baga artham chesukunnaru meeru :)

      Delete
  3. Replies
    1. నా :-) కూడా జత కలిసింది

      Delete
  4. అబ్బబ్బ..........విరహపు వేదనలో వేడెక్కిన బుర్రకి కాస్త ఆటవిడుపు అర్పితా. చక్కగా చాన్నాళ్ళకి నవ్వించావు. అయినా మనలోమాట చీరకట్టు ముందు జీన్స్ ప్యాంట్లు, మిడ్డి స్కర్టులు బలాదూర్ అంతే:-)

    ReplyDelete
    Replies
    1. మీ హాస్యపుస్మృతుల గుళికెల ముందు ఇదెంత:-)

      Delete
  5. సిల్కు చీరకట్టి అలా వయ్యారాలుపోతూ రారమ్మని పిలిస్తే బ్రహ్మకైనా పుట్టకుండా ఉంటుందా రిమ్మతెగులు :-)

    ReplyDelete
    Replies
    1. బ్రహ్మకి చావుపుట్టుకలు లేవుకాని, మనకి తెగులొస్తేనే కష్టమేమో కదండీ :-)

      Delete
  6. రోమియో జూలియట్ ని చూడ్డానికి వెనుకవైపుగా తాడుపట్టుకుని ఎక్కివస్తే ఆహా ఓహో అని పొగడగా లేదుకాని పాపం మన పిరికి హీరో ఏదో ఫీట్లు చేస్తే ఇలా అనడం తగునా?

    ReplyDelete
    Replies
    1. తాడుపట్టుకుని ఫీట్లు వేసి ఇంప్రెస్ చేసినా పడేదేమో....మూర్ఛవచ్చి పడ్డాడు కదా మన హీరో అనికేత్:-)

      Delete
    2. మాట పడరు.....మాటలగారడిలో మాస్టర్ డిగ్రీ మీది :)

      Delete
  7. మగాళ్ళింత చేతకాని వాళ్ళా? 50 కె.జి ల బంగారానికి భయపడి ఉంటాడు :)

    ReplyDelete
    Replies
    1. అన్నీ చేతనై ధైర్యంలేనివారేమో:-)
      అంతేలెండి 50కేజీల బంగారం ఈ ధరాభారంలో ఎక్కడమోయగలడు :-)

      Delete
  8. చాల బాగుందండి మీ కవిత ఆద్యంతము అలరించింది

    వాలిన రెప్పలతోనే రాసుకున్న కన్నీటి సిరా తో నా ప్రేమని
    కుమిలోనింబస్ మబ్బులకంటే నీ ప్రేమవిరహం ఇంకా ఎక్కువ నీటిని దాచింది
    వెన్నెల అందాలు, మరిపించిన క్షణాలు అన్ని సినిమా రీల్ లాగ 30 fps తో కళ్ళ ముందు కదలాడితే, నీకు అవి గుర్తున్నాయ అనడిగితే వెటకారం ఆడావు 35mm గేజ్ ఆ 70 mm గేజ్ ఆ అని.
    నీ ప్రేమకోసం నేను ప్రతిక్షణం తపిస్తున్నాను అంటే కొలిచి మిల్లి సెకండ్స్ లో చెప్పమన్నా నీ అమాయకత్వం నన్ను నివ్వెరబొయెల అగుపిస్తుంది
    ఇంత నీకు చెప్పిన ఓ తింగరి ప్రేమ విననని పెడచెవిన పెడితివ

    ReplyDelete
    Replies
    1. http://kaavyaanjali.blogspot.in/

      Delete
    2. లోకంలో తింగరి ప్రేమికులు చాలా మంది ఉన్నారన్నమాట :-)

      Delete
  9. పుటపుటకు తనకు తెలిసిన జిత్తులన్నీ ఉపయోగించాడు పాపం
    చివరికి చిత్తూ చిత్తూ అయ్యి బొక్కబోర్ల పడ్డాడు అయ్యో పాపం . హ.. హ.. హ.. :) చాల అద్భుతంగా మలిచారు ఈ కవితని
    వ్యంగ్యం తో పాటు హాస్యం తో పాటు వేదన కలగలిపి వడ్డించారు పద్మ గారు

    హాట్స్ ఆఫ్ అండి మీ కవిత స్ఫూర్తి కి.

    శ్రీధర్ భుక్య
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. నాకన్నా ముందే సినీగేయ రచయితలు పదాలు తిప్పి తిప్పి హిట్ పాటల రూపంలో చెప్పారు కదండి. :-)
      1."प्यार कियातो डरना क्या, प्यार किया कोई चोरी नही की"
      2."प्यार करने वाले प्यार करते है शान से, जीते है शान से मरते है शान से"
      3."हम प्यार करने वाले दुनिया से न डरने वाले"

      అబ్బో ఇలా బోలెడన్ని పాటలు, రాద్దామంటే అవసరాని తెలుగులో ఒక్కటి కూడా గుర్తుకు రావడంలేదు:-(

      Delete
  10. నాకు తెలిసింది పిరికి హృదయమెన్నడూ ప్రేమించలేదని! నిజమే. హాస్యంలోను ఆర్తిని చొప్పించి రాయడంలో మీరు దిట్ట.. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. అభినందించాలని అలా అంటున్నారా లేక నిజమేనంటారా వర్మగారు :-)

      Delete
    2. పిరికివాడు సాధించేదేముందని నిజమే కదా!

      Delete
  11. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంగతులను ధైర్యంగా రాశారు.. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog...అడుగిడ్డంతోటే నా ధైర్యాన్ని మెచ్చేసారే:-)

      Delete
  12. ఈ మధ్య పద్మగారు మగవారి మనస్తత్వం పై Ph D చేస్తున్నట్లున్నారు:-)

    ReplyDelete
    Replies
    1. nakkuda alaane anipisthundi andii :P

      Delete
    2. ఎన్ని Ph Dలు చేసి ఏంలాభం చెప్పండి...ప్రేమ గుడ్డిది ప్రేమిస్తూనే ఉంటాం :-)

      Delete
    3. Anony garu...meeru kuda ala ante ela:-)

      Delete
  13. ఇది చదివి ఎవరు ప్రేమిస్తారు, అసలే అమ్మాయిలు కరువైపోతున్న ఈ కాలంలో ఇలా గుట్టు రట్టు చేయడం తగునా పద్మా? చిత్రంలో చిన్నది చూడ చక్కగున్నది, ఎగిరిపోదాం రమ్మనడానికే ధైర్యం చాలకున్నది.

    ReplyDelete
    Replies
    1. ఆనాటి పాపం నేడు ఇలా ఆడపిల్లలు కరువయ్యేలా చేసింది :-(
      చిన్నది చక్కగున్నది చూసి తరించు మహీ...దగ్గరికెళ్ళావో కరుసైపోతావ్:-)

      Delete
  14. ధైర్యం ఉండి మిగిలిన ఆడంబరాలు ఏంలేవు లేపుకుపోతా రమ్మని అంటే మాత్రం వస్తారా ఏంటండిీ ఆడపిల్లలు :-)

    ReplyDelete
    Replies
    1. అది వారిరువురి మ్యూచువల్ అండర్ స్టాండింగ్ కదా యోహంత్.....అయినా లేపుకుపోవడానికి కాణీ ఖర్చుండదు. మాటనిలబెట్టుకోడానికి జీవించడానికి ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కావాలేమో!

      Delete
  15. కవితలో మంచి హాస్యంతో పాటు పిరికివాడు ప్రేమించలేడని కూడా చెప్పారు. మంచి కార్టూన్ బొమ్మను ఎంచుకున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీరిచిన ప్రేరణ ఆనందాన్నిచ్చింది.

      Delete
  16. ఏంటి ఇలా లేచిపోయే ప్లాన్లు కూడా వేస్తుంటావా అప్పుడప్పుడూ....అయినా అర్పితా అలా పారిపోయే కర్మ నీకేంటమ్మా మనసున్న 50కేజీల మేలిమి బంగారానివి....జాగ్రత్త అసలే బంగారంధర 30వేలు దాటింది.
    కవిత విషయానికి వస్తే.....అబ్బో అదరగొట్టావు :-)
    చిత్రంలో చిన్నదాని అందాన్ని పొగిడితే నీకు కోపం వస్తుందిగా అందుకే వద్దులే ;-)
    సదా నవ్వుతూ నవ్విస్తూ ఉండు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు...ఏదో సరదాకి అలా అంటానే కాని లేచిపోయేంత గాలి (ధైర్యం) ఎక్కడిదండి :-) కోపం నటిస్తానే కాని చిత్రంలో చిన్నిదాన్ని పొగిడితే నన్ను పొగిడినట్లేకదా:-)

      Delete
  17. ఏమిటో మగాళ్ళ తలరాత...

    దాచుకున్న అందాలు దోచుకుంటే కానీ ఈ ఆడోళ్ళకి తత్త్వం బోధపడదో ? లేక
    తత్త్వం ముందే బోధపడ్డా అందాలు దోచుకునే దాక ఆగుతారో ?
    అర్ధం అవ్వదు .... ప్చ్ ప్చ్ ....

    ('పనికిమాలిన ప్రేమ' కదండీ అందుకే ఇలా రాస్తున్నా ఒక పనికిమాలిన కామెంట్ )

    ;-) ;-)

    ReplyDelete
    Replies
    1. దోచుకున్నాక ఇంక దాచుకోడానికి ఏముంటుందని....ఈ తత్వమేంటో నాకూ బోధపడలేదు....ప్చ్ ప్చ్ :-)
      (అయినా ఈ "పనికిమాలిన ప్రేమ" పోస్ట్ కి ఒక నవ్వు నవ్వేస్తే పోలా:-)

      Delete
  18. Replies
    1. శృతి....కెవ్వు కెవ్వు మనడం నా పోస్ట్ కి ఇదే మొదటిసారి కామోసు.:-)

      Delete
  19. ఈ "పనికి మాలిన ప్రేమ" పోస్ట్ కి హాస్యంగా జవాబులివ్వాలన్న ధ్యాసలో ఎవరినైనా తెలిసో తెలియకో నొప్పిస్తే మన్నిస్తారని ఆశిస్తూ....స్పందించిన ప్రతిఒక్కరికీ పేరు పేరునా అంజలిఘటిస్తున్నాను _/\_

    ReplyDelete
  20. పద్మార్పితా నీ సమయస్పూర్తికి, వాక్చాతుర్యానికి ఆశ్చర్యము అబ్బురం కన్నా భలే ముచ్చటవేస్తుంది. నా దిష్టే తగులునేమో. అయినా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నా-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు నన్ను ఇన్వాల్ చేయకండి ఇందులోకి :-)

      Delete
  21. పిరికితనం ఎందుకనుకుంటారు, వినవిధేయతలనుకుని ప్రేమిస్తే ఒక పనైపోతుందికదా

    ReplyDelete
    Replies
    1. ఒక పనిలా ప్రేమించే ధైర్యం మీలా అందరికీ ఉండాలికదా:-)

      Delete
  22. కవ్వించావో .. కసురుకున్నావో..
    మగాల్లతో మనసుపంచుకుంటే
    ఏంజరుగుతుందో నని మగల్లాళ్ళను
    మడతేసి ఆరేశారేమో అనిపిస్తుంది
    వాస్తవలు..వర్నిచినా నిజాలు నిఖార్సుగా చెప్పారులే
    మొత్తానికి మగువ మాచాలమ్మ మనసులో మాట ఇదన్నమాట
    అయినా పిర్కివాన్ని అవునోకాదో పరికించి చుడు తెలుస్తుందేమో కదా
    అయినా "పగటివేళ పిరికివాడివై రేయిమాత్రం నీ బుద్ధి చూపావు..
    నీవు చూస్తున్నది నా షిఫాన్ చీరలో దాగిన అందాలని
    నాకు తెలిసింది పిరికి హృదయమెన్నడూ ప్రేమించలేదని" కత్తిలాంటి పదాలతొ గుచ్చేశారు
    పద్మా గారు మొత్తానికి కధ కంచికి చేర్చారు ఇది సంగతి

    ReplyDelete
    Replies
    1. తిట్టారో మెచ్చుకున్నారో తెలీదుకానీ...మొత్తానికి కమెంట్ పెట్టారు... ధన్యవాదాలండి :-)

      Delete
  23. meeru ammoe ammayo teliyadugani adbhutamga rastaru:-)

    ReplyDelete
  24. As a man,i can say mee kavitha lo inka improvements vundacchu ani .....
    ....to deny my Cowardice

    ReplyDelete