ఓడిగెలిచాను

పలుకరించబోయి నీ మౌనం ముందు ఓడిపోయాను
కుశలమడి జవాబివ్వని నీనిర్లక్ష్యం ముందు ఓడాను
చూడాలని కలవలేని నీ నిస్సహాయత ముందోడాను
మరువాలి అనుకుని మరింత దగ్గరై ఓడిపోతున్నాను
ఆలోచనల వలలో చిక్కుకుని ఒంటరినై ఓడిపోయాను


                                 ****
కాని....ఎప్పటికైనా నేనోడి నీవు గెలిచిన గెలుపు నాదే
నన్ను నేనోడి నిన్ను గెలిచే ప్రయత్నంలో ఓటమి నీదే


                                 ****
చదువగలను మౌనంతో నీవు భావాలకి కళ్ళెంవేసినా
మనసులో కొలువైనావు కనులకు కనబడకపోయినా
కాలేవు నా తలపులకి దూరం నిన్ను నీవు మరచినా
తనువును వీడిన మనసు గెలిచిందని జీవించగలనా
గెలుపు నాదే నేను ఓడి నువ్వు గెలిచి ఆనందించినా

41 comments:

  1. This is Padmarpita....Extraordinary Pic with excellent words. Claps Claps

    ReplyDelete
  2. కాలేవు నా తలపులకి దూరం నిన్ను నీవు మరచినా
    తనువును వీడిన మనసు గెలిచిందని జీవించగలనా
    Ur writings r amazing!

    ReplyDelete
  3. మన దగ్గర లేని మనసుతో......ఎంతకాలమని జీవిస్తున్నామనుకుంటూ....ఇలా మరణిస్తూ ఉండగలము....ప్రతీ క్షణం మరింత దూరమవుతూంటే....

    ReplyDelete
    Replies
    1. అభిమానంతో స్పందించే మీకు వందనం.

      Delete
  4. మీ కవితల్లో మీరు చివర్లో ఇచ్చే కంక్లూజన్ ఎంతో మెచ్యూరిటీగా ఉంటాయి. నాకు తెలిసి చాలా మంది కవులు సగం చెప్పి వదిలేస్తుంటారు. మీరు అలా కాకుండా ఒక ఎండ్ ఇవ్వడం అనే ప్రక్రియ ప్రశంసనీయం.Keep writing.

    ReplyDelete
    Replies
    1. Thanks for your brief analytical comments Anony.

      Delete
  5. ఓడి గెలవడం లోనే అందం ఆనందం, అది తెలుసుకుంటే బ్రహ్మానందం....good pic

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  6. ప్రేమకు ఓటమే లేదని గెలుపోటములతో మనసుకు సంబంధం లేదని నిర్మలమైన నిష్కలంక భావ రూపమే ప్రేమని అది మీ సొంతమని కత్తిపట్టి రాణీ రుద్రమలా మీరే చెప్పగలరు ప్రేమార్పిత గారూ.. మరో మారు వందనం అభివందనం.. ......

    ReplyDelete
    Replies
    1. నన్ను వీర వనితను చేసిన మీకు అభివందనం.

      Delete
  7. గెలుపు , ఓటములు భార్యాభర్తల మధ్య , ప్రేయసీ ప్రియుల నడుమ తేడా కనపఱచ(లే)వు . ఆనందాన్ని అందిస్తాయి అలుపూ , సొలుపులతో .

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పాక కాదనే సాహసమెవరికి శర్మగారు :-)

      Delete
  8. Super Super Super Super Padma. ayya baboy entadi pic chala chala bagundi:-))

    ReplyDelete
  9. పోస్ట్ పిక్ రెండు అదిరాయి పద్మ:-)

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ లిపి

      Delete
  10. Ayyo.. Achchanga Warangal lo putti Vizag lo perigina vanni.. Aa pic choosi Rani Rudrama Devi gurthuku vachchindi.. chebudaamante ninna Net Connection leka raayalekapoya.. Kpower3 varma gaaru cheppesaaru..:(

    Anyway.. It was a nice feel..Padma gaaru.. Kudos :)
    "Orpunanta Kalagalipi neggina odinaa gelavanganela nenu
    Premalolakincha Bhaavaalu palakanela naa hrudyamandiramu nedu
    Chentana Nee Prema undaga gelupu otamilato paniledu naaku.. :P
    "

    Sridhar Bukya
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. ఆలస్యంగా అయితేనేమి వీరవనితగా గుర్తించారుగా ధన్యవాదాలు.

      Delete
  11. Idi Maa Language Lo..!

    "Katraayiko Yaan Lakichi Padma..
    Aacho cha.. taaro kavita
    Harek panktima himmat cha
    Hanuj lakti ra.. ser aashirvaadam taarumpra racha..
    Tamaaro Sopti
    Sridhar Bukya Pathlawat
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  12. Outstanding post

    ReplyDelete
  13. వెనకటికి ఎవరొ, "క్రింద పడ్డా నాదే పైచేయి", అన్నారంట!
    అయినా! బాగుంది, మీ కవిత మీ ఖడ్గం మరియు
    నీ సుఖమే నే కొరుకున్నా అనే తత్వం.

    ReplyDelete
    Replies
    1. తిప్పి తిప్పి తర్కించక వీడరుగా :-)

      Delete
  14. పద్మార్పితగారి ఓడిగేలిచాను లోని logic తార్కికత,ముగ్ధమోహనత్వం అలరించేదిగా ఉంది!త్వమేవాహం,మమైక్యం,కొసమెరుపు అదిరాయి!

    ReplyDelete
    Replies
    1. మీ అపూర్వ స్పందనకు నెనర్లండి.

      Delete
  15. గెలుపోటముల్లో....నీవోడి తాను గెలిచినా, తానోడి నీవు గెలిచినా....పైచేయి ప్రేమదే, అంటే ప్రేమార్పితదే:-)

    ReplyDelete
  16. తనువును వీడిన మనసు గెలిచిందని జీవించగలనా
    గెలుపు నాదే నేను ఓడి నువ్వు గెలిచి ఆనందించినా
    ఇది మీ ట్రేడ్ మార్క్...:)

    ReplyDelete
  17. meeku meere sati andi...padmarpitha gaaru

    ReplyDelete
  18. కాని....ఎప్పటికైనా నేనోడి నీవు గెలిచిన గెలుపు నాదే
    నన్ను నేనోడి నిన్ను గెలిచే ప్రయత్నంలో ఓటమి నీదే..
    nice lines...

    ReplyDelete
  19. పాపం "ఆలోచనల వలలో చిక్కుకున్నా ఇంకా ఒంటరిగానే ఉండిపోవటం" గొప్ప ఆలోచన!మీకు ఆ ఆలోచనలే మంచి కంపెనీ ఇవ్వాలని మీరెప్ఫూడూ ఓడిపోకూడదని కోరుకుంటున్నా..అభినందనలతో!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానాత్మక స్పందనకు అభివందనాలు

      Delete
  20. పద్మా నీవు ఓడిగెలిచావు...మేము నీ భావ ప్రవాహంలో కొట్టుకు పోతున్నాము. :-) అసలు నీకు ఇన్ని ఆలోచనలు ఎలావస్తాయ్? "ఏమెట్టి పెంచారో మీ అమ్మ" చెబితే మేము మా పిల్లలనైనా అలా పెంచుకుంటాం :-)

    ReplyDelete
    Replies
    1. మహీ....మరీ ఇలా అడిగడిగి పెంచితే ఎలా పిల్లల్ని. విశాల ప్రపంచంలోకి అడుగెట్టాక వృద్ధిలోకి రాకమానరుగా (మనకన్నా గొప్పగా) :-)

      Delete
  21. చాలా బావుంది పద్మార్పిత గారు.... మిగితావి కూడా మెల్లిగా చదువుతాను!!! ఇందులోని భావోద్వేగం నాకు చాలా నచ్చింది.

    ReplyDelete