నమ్మేదెలా?

ఉచ్ఛ్వాస నేనుగా మారిపోతానంది నిచ్ఛ్వాస నీవైతే
ఒక నయనం వర్షించే మరోనయనం నిన్ను మరువమంటే
ఒక అధరం మౌనంకోరే మరోఅధరం నీపలుకు కోరితే
ఒక కర్ణం నీ ఉసులే వింటుంది వేరొకటి పేరైనా తలవకుంటే
ఒక మదిభాగం కౌగిలినికోరె మరోభాగం ఎడబాటడిగితే
ఒకవైపు ఉదరం దప్పికేలేదంది మరోవైపు ఆకలి అరుస్తుంటే
ఒక పాదం నీవైపు పయనం వేరొకటి వేరుగా అడుగేస్తే!
ఊహకందని ఈ చీలికలెందుకని నన్ను నేను ప్రశ్నించుకుంటే
రెండు నయనాలు చూసుకోలేమన్నాయి నువ్వునేనులా
రెండు పెదవులుకలిస్తే పలుకెక్కడిది మౌనం రాజ్యమేలుతుంటే
రెండు కర్ణాలకి ఊసులెక్కడివి మోముండగా ఎడబాటులా
రెండైన హృదయాలకి ప్రయోజమేమి విడివడిగా పెనవేసుకుంటే
రెండు కాని ఉదరపు ఆకలితీరినా ప్రేమతృష్ణ తీరునా ఇలా
రెండు పాదాలు కలిసి అడుగేయనిదే పయనం సాగుతుందంటే!
నీలోని నన్ను నే నమ్మేదెలా? నీవులేని నాతో చెప్పేదెలా?

40 comments:

 1. ఈరోజు కవిత పోస్ట్ చేయకపోతే గూగుల్ అకౌంట్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నా, అమ్మయ్య బ్రతికించావు :-)
  కవిత గురించి చెప్పాలంటే....నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలలా పాటని మైమరపించావు
  బొమ్మల ఎంపికలో సరిలేరు సరిరారు నీకెవ్వరు నేస్తం

  ReplyDelete
  Replies
  1. మహీ చాక్లెట్ ఇవ్వకపోతే దోస్త్ కటీఫ్ అన్నట్లుంది :-).....మంచి పాటను గుర్తు తెప్పించానుగా దోస్త్ ఉండు.

   Delete

 2. నీలోని నన్ను నే నమ్మేదెలా? నీవులేని నాతో చెప్పేదెలా
  మనసు భారమైంది....మీ మాటలతో ఇతరుల మనసుని దోచేస్తారు....
  ఎలా చెప్పాలో తెలీడంలా....ప్రేమించిన మనసుకు వేదన తప్పదేమో.....

  ReplyDelete
  Replies
  1. అంతే వేదనలోనే ప్రేమ పరిపక్వత చెందుతుందట :-)

   Delete
 3. రెండు నయనాలు చూసుకోలేమన్నాయి నువ్వునేనులా....అత్యద్భుత పదాల సాలెగూడులో బంధించేసారు అర్పితా

  ReplyDelete
  Replies
  1. అలా అభిమాన పదాలగూడులో బంధీ అయిపొండి :-)

   Delete
 4. భావాల వెల్లువలో ఎడబాటు, విరహం రెండూ ఒకదానికొకటి పోటీ పడ్డాయి పద్మార్పితగారు.

  ReplyDelete
  Replies
  1. ఈ పోటీ ప్రపంచంలో అంతా ప్రేమమయం అనడం కష్టమే లిపి. :-)

   Delete
 5. నాలొ నేనా, నీలొ నేనా; నాలొ నీవా!
  ఎవరి స్థానం ఎక్కడొ, ఎందుకొ ఈవైరాగ్యం!
  ఎవరికొసమో, ఈ నైరాస్యం!
  బాగుంది, పద్మార్పిత గారు..

  ReplyDelete
  Replies
  1. నేను తానైనా. తానే నేనైనా!
   ఏవరికోసం ఎవరున్నా లేకున్నా!
   కావాలి జగమంతా ప్రేమమయం!
   ధన్యవాదాలు తర్కంగారు.

   Delete
 6. మీ కవితలోని భావుకత గూర్చి కొత్తగా చెపేది ఏమీ లేదు ఒకే ఒక్క మాట తప్ప ... అద్భుతము అద్బుతః ....

  కొన్నిటిలో "భావానికి పదానికి" అనునిత్యము యుద్దము జరుగుతూనే వుంటుంది
  ఏ ఒక్కటీ తగ్గవు ..... మేము ఆస్వాదించి మా దాహాన్ని తీర్చుకొంతునే ఉంటాము ....

  ఒక అధరం మౌనంకోరే మరోఅధరం నీపలుకు కోరితే
  రెండు పెదవులుకలిస్తే పలుకెక్కడిది మౌనం రాజ్యమేలుతుంటే

  ఒక మదిభాగం కౌగిలినికోరె మరోభాగం ఎడబాటడిగితే
  రెండైన హృదయాలకి ప్రయోజమేమి విడివడిగా పెనవేసుకుంటే

  ఒక కర్ణం నీ ఉసులే వింటుంది వేరొకటి పేరైనా తలవకుంటే
  రెండు కర్ణాలకి ఊసులెక్కడివి మోముండగా ఎడబాటులా

  మొదటి అర్ధభాగములోని కొన్ని భావాలకి రెండవ అర్ధ భాగములో కొంత భావ భేదం కనిపించింది ... అలా కనిపించిన వాటిలో కొన్ని ...

  ఒక నయనం వర్షించే మరోనయనం నిన్ను మరువమంటే ( చాలా బాగుంది )
  రెండు నయనాలు చూసుకోలేమన్నాయి నువ్వునేనులా ( నాకు పోలిక అర్ధం కాలేదు )

  ఒక పాదం నీవైపు పయనం వేరొకటి వేరుగా అడుగేస్తే! ( little bit of negative shade)
  రెండు పాదాలు కలిసి అడుగేయనిదే పయనం సాగుతుందంటే! ( justification is in postive shade , i didn't get this)

  ReplyDelete
  Replies
  1. భావుకతానుభూతికి, మీ విశ్లేష్ణాత్మక స్పందనకు వందనాలు.
   ఒకే మనసులోని ద్వంధాలోచనల ప్రవృత్తిని చూపాలనుకున్నాను. అలా రెండు విధాలుగా తర్జన భర్జనల మధ్య పాసిటీవ్ నెగటీవ్ షేడ్స్ తప్పవు కదండీ....రెండూ ఏకీభవిస్తే ఇంక ద్వందప్రవృత్తి ఎలాగౌతుంది!

   Delete
 7. పద్మా ,

  ఈ ప్రపంచం ద్వైతం అని మన శరీర నిర్మాణం తెలుపుతోందన్న నగ్న సత్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకొమ్మని , అందుకే మనలో పలు రకాల ద్వైత భావాలని ఎంచక్కా వెల్లడి చేశావ్ . చాలా చాలా బాగుందీ ద్వైతకవితం .

  ReplyDelete
  Replies
  1. మీ ఈ ప్రశంసాత్మక స్పందన నాకు ప్రేరణనిచ్చింది. ధన్యవాదాలండి.

   Delete
 8. దేహం ఆత్మ వేరు వేరుగా వసించలేవన్నది సత్యమే కదా?? అదే ఇరు మనసులు దేహాలు వేరు వేరుగా వున్నా వాటిలోని ఏక రూప భావుకత అంతిమంగా ప్రేమైక స్వరూపాన్ని ప్రతిష్టిస్తాయన్నది మీ ఈ భావ పొందికైన అనురాగ చరణాలతో ఆవిష్కరించారు పద్మార్పిత గారూ. మీ ఈ కవితా ఝరి సనాతన ఆధునిక కావ్యాలలో దేనికీ తీసిపోదు. ఎప్పట్లానే ఈ చిత్ర రాజం మది దోచుకున్నది. మీ కవితావల్లరికి దాసోహమనడమే శరణ్యం కాదా!

  ReplyDelete
  Replies
  1. వర్మగారు వేదనేకాదు వేదాంతం కూడా వల్లించగలరన్నమాట :)

   Delete
  2. దేహాత్మల కలయికలు, ప్రేమైకజీవన స్వరూపలావణ్య రుచులెరుగని నా మది భావాల ఘోషను సనాతన ఆధునిక కావ్యంతో పోల్చిన మీ కవితాస్వాధాభిమానానికి చేతులెత్తి మ్రొక్కుతున్నా _/\_

   Delete
  3. అనికేత్ అన్నమాట ఏంటి ఉన్నమాటే.....నిండుకుండ తొణకదుగా :-)

   Delete
 9. ela ala rastaru padma? eppudu kottagane anipistu kavvistuntaru.

  ReplyDelete
  Replies
  1. మీ అభిమాన స్పందనల ఆసరాతో అలా రాస్తుంటాను :-) థ్యాంక్యూ

   Delete
 10. u r something special padma:-)) very depth lines in the entire poetry.. its very heart touching:-))

  ReplyDelete
  Replies
  1. Sruthi....always your comments gives me new energy to write, thanks a lot dear.

   Delete
 11. అహో మహాఅద్భుతంగా రాసారు

  ReplyDelete
  Replies
  1. యోహంత్....ఏంటి ఈ కొత్త డైలాగ్ :-)Thank Q

   Delete
 12. :-)

  ఆమె కవయిత్రి రా బుజ్జి

  ఎంత శ్రద్దగా రాసారు .. ఏదో గులాబి మొక్కకు అంట్లు కడుతున్నట్టు
  ఒక మనసు కి ఇంకోమనసుకి మధ్యన రాయబారం పంపినట్టు
  ఒక ప్రాణానికి మరో ప్రాణం కి నడుమ ప్రేమ వంతెన కడుతున్నట్టు
  ఎంతో జాగ్రత గా... ఏకాగ్రత గా...

  (అతడు మూవీ డైలాగ్ నుండి మార్పు చెయ్యబడింది)
  :-)

  ReplyDelete
  Replies
  1. సినిమా డైలాగే అయినా మార్చి మెచ్చేసుకున్నారుగా....:-) బాగుంది బాగుంది :-)Thank You

   Delete
 13. ప్రేమైకజీవుల మనోభావాల సరళిని పొందుపరిచారు చిత్రంలోను కవితలోను.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి ప్రేరణగారు.

   Delete
 14. మనస్సూ, శరీరమూ వేరుకాదు, నిజమిన ప్రేమ భావన ఉంటే, మీ కవితలో అది స్పష్టం గా తెలుస్తుంది, మంచి భావుకత. పద్మ గారూ అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. నా భావుకత నచ్చి మెచ్చిన మీకు ధన్యవాదాలండి

   Delete
 15. అమ్మా పద్మార్పిత కాళిదాసుకి కాళీమాత కటాక్షమున్నట్లు నీకు కళామతల్లి కటాక్షముందమ్మ...కొనసాగిస్తూ మమ్ము ఆనందింపజేయ ప్రార్ధన!> హరినాధ్

  ReplyDelete
  Replies
  1. హరినాధ్ గారు....మీ ఈ అభిమానం నన్ను గాలిలో తేలి మది ఊగిసలాడి కొత్త ఊహలకి ప్రాణం పోస్తుంది. మీరు ప్రార్ధించడం ఏంటండి....మీ అభిమానంకోసం సదా నేను ప్రాకులాడే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.

   Delete
 16. కాస్త మేము అప్పుడప్పుడు బాలేదు అని కమెంట్ చేసేలా కూడా వ్రాయండి పద్మార్పితగారు ;)

  ReplyDelete
  Replies
  1. అనికేత్ నా పై మరీ ఇంత కోపమా.....బాగా రాయలేదన్న వంకతో తిట్టించాలనే ప్రయాసేకదా ఇది :-)

   Delete
 17. ప్రేమకి మారు పేరు పద్మార్పిత అంటే సరిపోతుందేమో.

  ReplyDelete
  Replies
  1. ప్రేమతో నిండిన పద్మనేనండి :-)thank you

   Delete